క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే..!
posted on Nov 27, 2025 9:30AM

క్రమ శిక్షణ ప్రతి వ్యక్తి జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతుంది. క్రమశిక్షణతో ఉన్నవారికి, క్రమశిక్షణ లేనివారికి మధ్య తేడాను గమనిస్తే ఇది ఇట్టే అర్థమైపోతుంది. క్రమశిక్షణ ఉన్న వ్యక్తులు జీవితంలోని ప్రతి విషయంలో ఒక స్పష్టమైన దారిని అనుసరిస్తారు. వీరి ప్రవర్తన, ఆలోచనలు, పనితీరు, ఆచరణ.. all reflect their structured mindset అని చెప్పవచ్చు. క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న వ్యక్తులు బోలెడు మంది ఉంటారు. వీరిలో ఉండే లక్షణాలు స్పష్టంగా తెలుసుకుంటే..
సమయపాలన (Time Management)..
క్రమశిక్షణ గల వ్యక్తులు సమయాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. వారు ఎప్పటికప్పుడు ప్లాన్ ప్రకారమే పనిచేస్తారు. అపాయింట్‌మెంట్లు, డెడ్‌లైన్లు, సమావేశాలు.. ఇవన్నీ సమయానికి ముందుగానే పూర్తి చేస్తారు.
లక్ష్యాలు స్పష్టంగా ఉండటం (Clarity of Goals)..
క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు వారి జీవిత లక్ష్యాలు, దాని చేరుకునే దారులు స్పష్టంగా ఉంటాయి. వీరు చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టి దశల వారీగా సాధించడానికి ప్రయత్నిస్తారు. అంతే తప్ప పెద్ద లక్ష్యాలను ఒకే సారి సాధించాలి అనుకోరు.
ఆత్మ నియంత్రణ (Self-Control)..
క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఇష్టాయిష్టాలు, ప్రలోభాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. పని సమయాల్లో ఫోన్, సోషల్ మీడియా వంటి ధ్యాసలను దూరంగా ఉంచగలుగుతారు. ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద మాత్రమే ఏకాగ్రత నిలపగలుగుతారు.
స్థిరత్వం (Consistency)..
చాలా మంది అదేవిధంగా పని చేయాలంటే ఒత్తిడి లేదా అసహనానికి లోనవుతూ ఉంటారు. కాన క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు మాత్రం ఒకే విధంగా నిరంతరం పని చేయడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇదే వీరిలో ప్రత్యేకత. అదేవిధంగా రోజూ వ్యాయామం, చదువు, పని మొదలైన వాటిని నిరంతరంగా చేస్తూ ఉంటారు.
బాధ్యత (Responsibility)..
క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఏదైనా పనిని ఇతరులు చెప్పేవరకు అలాగే నిరీక్షిస్తూ కూర్చోరు. ఇతరులతో చెప్పించుకోకుండా తమ పని తామే చేసుకుంటారు. తప్పులు జరిగినప్పుడు తప్పును ఒప్పుకుని పరిష్కరించడానికి ముందుంటారు.
శ్రమతో కూడిన జీవితం (Hardworking Nature)..
క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఎక్కువగా కష్టాన్ని నమ్ముకుంటారు. చేయాల్సిన పనులను వెంటనే చేసేతారు తప్ప పనుల్ని వాయిదా వేసే గుణం అస్సలు ఉండదు. శ్రమించడం వల్ల ఎంత సమయం, శక్తి పోతుందన్న భయం ఉండదు.
క్రమబద్ధత (Organization)..
క్రమ శిక్షణ కలిగిన వ్యక్తులు తమ వస్తువులను కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. టేబుల్, గదులు, డాక్యుమెంట్లు ఇలా చాలా అన్ని సమర్థవంతంగా పెట్టుుంటారు. వీరితో ఏవైనా చర్చలు జరిపితే ఆ చర్చల్లోనూ, రచనలలోనూ స్పష్టత, క్రమబద్ధత కనిపిస్తుంది.
ఆరోగ్యపరమైన శ్రద్ధ (Health Discipline)..
ఆహారం, నిద్ర, వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో చక్కగా అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటేనే క్రమశిక్షణగా ఏ పనిని అయినా చేసుకోగలుగుతాం అని వీరు నమ్ముతారు. అందుకే ఎప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరు. చెడు అలవాట్లు అంటే వీరికి అసహ్యం. అదేవిధంగా సోమరితనంగా ఉండేవారు, చెడు అలవాట్లు కలిగిన వారు అంటే వీరికి గిట్టదు. ఇలాంటి వారికి దూరంగా ఉంటారు.
స్వీయ ప్రేరణ (Self-Motivation)..
ఎవరూ చెప్పకుండానే తాము ముందుగా ప్రేరణ పొందడం వీరిలో గొప్ప లక్షణం. ఎవరో వచ్చి వీరిని ఉత్సాహ పరిచి ముందుకు నెట్టాల్సిన అవసరం లేదు. ఒక పని పూర్తి చేయాలనే ఉత్సాహం లోపల నుంచే వస్తుంది.
ఎప్పటికప్పుడు మెరుగుదల (Continuous Improvement)..
క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఎప్పుడూ చేసే పని పట్ల ఉదాసీనంగా ఉండరు. ఈ పనిని ఇంకా బాగా చేయవచ్చా? ఈ పని గురించి ఇంకా విభిన్న కోణాలు ఉన్నాయా? వంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి. తద్వారా వీరు ఎప్పటికప్పుడు తమ పనితీరును, జీవితాన్ని మెరుగుపరుచుకుంటూనే ఉంటారు.
*రూపశ్రీ.