అడ్డంగా దొరికిపోయిన అసదుద్దీన్

 

ముస్లింలను ఉద్ధరించడమే తమ ధ్యేయంగా చెప్పుకునే మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ఎన్నోసార్లు తన రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ఎన్నోసార్లు చట్టానికి దొరికిపోయాడు. అయితే చట్టాలు ఇలాంటివాళ్ళకి చుట్టాలు కాబట్టి కొంతకాలం జైల్లో వున్నా, ఇప్పుడు మళ్ళీ జనాల్లో తిరుగుతూ తమ ధోరణినిని కొనసాగిస్తున్నాడు. అసదుద్దీన్ పార్టీ తీవ్రవాదులకు అనుకూలంగా వుంటుందన్న విమర్శలు మొదటినుంచీ వున్నాయి. అయితే ఆధారాలు లేని ఈ విమర్శలను పట్టించుకోనవసరం లేదని ప్రజాస్వామ్యవాదులు ఇంతకాలం భావిస్తూ వుంటేవారు. అయితే ఈమధ్య వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్ జరిగిన సందర్భంగా అసదుద్దీన్ వ్యవహరించిన తీరు చూస్తే, ఆయన మీద, ఆయన పార్టీ మీద వినిపిస్తున్న విమర్శలు నిజమేనని నమ్మాల్సి వస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే, ఆ ఎన్‌కౌంటర్ని తాను దగ్గరుండి చూసినట్టు ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని స్పందించారాయన. వికారుద్దీన్ బ్యాచ్ చేతిలో ఎంతోమంది పోలీసులు చనిపోయినా ఎప్పుడూ ఒక్క సానుభూతి వాక్యం కూడా పలకని ఆయన తీవ్రవాదులు ఎన్‌కౌంటర్ అయితే మాత్రం నిమిషాల్లో స్పందించేశాడు. అక్కడితో ఆగాడా, కొంతమంది ముస్లిం పెద్దలతో కలసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి ఈ ఎన్‌కౌంటర్ని ఖండించాడు. సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. ఇక వికారుద్దీన్ అంత్యక్రియలయితే ఎంఐఎం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కన్నీరు మున్నీరు అవుతూ దగ్గరుండి జరిపించారు.

సరే, అసదుద్దీన్ అండ్ బ్యాచ్ వికారుద్దీన్ అండ్ బ్యాచ్ మీద సానుభూతి వ్యక్తం చేయడాన్ని మత కోణంలో తీసుకుంటే, వికారుద్దీన్ బ్యాచ్ ముస్లిం మతానికి చెందిన వారు కాబట్టి ముస్లిం మతాన్ని ఉద్ధరించడానికే రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకునే అసదుద్దీన్ బాధపడిపోవడం న్యాయమే. అయితే ఎన్‌కౌంటర్లో మరణించిన వికారుద్దీన్ మాత్రమే కాదు... అంతకుముందు మరో ఇద్దరు ఉగ్రవాదుల చేతిలో కాల్పులకు గురై మరణించిన ఎస్.ఐ. సిద్ధయ్య కూడా ముస్లిమే. ఆయన అసలు పేరు మహ్మద్ సిద్ధిక్. తన విధి నిర్వహణలో భాగంగా ఆయన తీవ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయపడి నాలుగు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే, ఈ అసదుద్దీన్ గానీ, ఆయన పార్టీ వాళ్ళుగాని పరామర్శించిన పాపాన పోలేదు. చివరికి ఆయన మృత్యువుతో పోరాడి మరణిస్తే కనీసం ఆయన మృతికి సంతాపాన్ని కూడా తెలపలేదు. తీవ్రవాదుల అంత్యక్రియలకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపించిన ఎం.ఐ.ఎం. నాయకులు ఎస్.ఐ. సిద్ధిక్ మృతదేహం వున్న ఛాయలకు కూడా రాలేదు. మరి ముస్లింల కోసం పోరాడే అసదుద్దీన్ అండ్ కో సిద్ధిక్‌ని ఎందుకు పట్టించుకోలేదో? ఇవే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అనేకమంది ముస్లింలు అసదుద్దీన్‌ని ప్రశ్నిస్తున్నారు. తాను అడ్డంగా దొరికిపోయిన ఈ విషయంలో అసదుద్దీన్ తన వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆయన ముస్లిం సమాజం ముందు దోషిలా నిలబడాల్సిందే. ముస్లింల కోసం పోరాడుతున్నట్టు తమ ముఖానికి వేసుకున్న మాస్కుని తొలగించాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu