అనంతలో జగన్ పార్టీ గ్రాఫ్ ఎలా ఉందంటే?

 

రాయలసీమ రాజకీయాల్లో అనంతపురం జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన అనంత పేరుచెప్పగానే ముందుగా పరిటాల రవి గుర్తుకువస్తారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన పరిటాల రవి... అనంతపురం జిల్లాలో టీడీపీని తిరుగులేని శక్తిగా మలిచారు, ఇటీవల రాజకీయ సమీకరణాలు మారినా అనంతలో ఇప్పటికీ టీడీపీ ప్రాభవాన్ని చాటుకుంటోంది. 2014 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండు ఎంపీ స్థానాలతోపాటు పన్నెండు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని మరోసారి తన సత్తా చాటింది.

 

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోగా, కొత్తగా పుట్టుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం... అతి విశ్వాసంతో ముందుకెళ్లి కేవలం రెండు ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకుని చతికిలపడింది, అయితే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టిపోటీనిచ్చిన వైసీపీ... ఇప్పుడు మరింత బలహీనపడిందంటున్నారు, మొన్నటి ఎన్నికల్లో రెండు సీట్లే గెలిచి రెక్కలు విరిగిన ఫ్యాన్ లా తయారైతే... వర్గ విభేదాల కారణంగా ఇప్పుడు వైసీపీ అడ్రస్సే గల్లంతయ్యేలా ఉందంటున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో రెండు ఎంపీ, పద్నాలుగు ఎమ్మెల్యే స్థానాల్లో కేవలం రెండంటే రెండే సీట్లకు పరిమితమైన వైసీపీ గ్రాఫ్... గ్రూపు రాజకీయాలతో మరింత దిగజారిపోయిందంటున్నారు.

నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతోపాటు ఎవరికివారు యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో అనంతలో వైసీపీ జెండా ఎగరడం కూడా కష్టమేనంటున్నారు, మరోవైపు అధినేత జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, కేవలం రెడ్డి సామాజికవర్గంపైనే ఫోకస్ పెట్టడంతో అనంత వైసీపీ కష్టాల్లో కూరుకుపోయిందని చెప్పుకుంటున్నారు, పార్టీ గ్రాఫ్ ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్ లో ఇప్పుడున్న ఆ రెండు సీట్లు దక్కవంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu