LATEST NEWS
దేశంలోని అత్యంత శక్తిమంతుల జాబితాలో  టాప్ 100లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. అంతే కాకుండా ఈ ఇరువురూ కూడా ఆ జాబితాలో తొలి పాతిక స్థానాలలో నిలవడం విశేషం. జాతీయ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ 2026 సంవత్సరానికి దేశంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాను ప్రకటించింది. వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.  కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో చూపుతున్న చొరవ చంద్రబాబును టాప్ 100 మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్స్ ఇన్ ఇండియా జాబితాలో 13వ స్థానంలో నిలబెట్టాయి.   అలాగే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఈ జాబితాలో 25వ స్థానాన్ని దక్కించుకున్నారు.  కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తర్వాత అత్యంత ప్రభావశీలుడైన నేతగా రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు దక్కింది.  కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత  ప్రియాంక గాంధీ వాద్రాలను అధిగమించి జాబితాలో రేవంత్ 25వ స్థానాన్ని దక్కిం చుకున్నారు.   ఇక పోతే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ కూడా చోటుదక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆయన  68వ స్థానంలో నిలిచారు.  ఇక యువ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా టాప్ 100లో నిలిచారు. ఈ జాబితాలో ఆయనకు 90వ స్థానం దక్కింది.   
మండు వేసవిలో వరుణులు విజృంభించనున్నాడా? అంటే వాతావరణ శాఖ ఔననే అంటోంది. రాగల రెండు రోజులలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ అకాల వర్షాలకు పంటలు దెబ్బతినకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే పిడుగుపాటుకు అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు అధికార డీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది.  ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఆదివారం (మార్చి 29) చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం  అన్నా అరివళయం లో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోను ఆయన సూపర్ స్టార్ గా అభివర్ణించారు.   మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారు.  ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు  ఇల్లతరసి  పథకం కింద గృహోపకరణాలు కొనుగోలుకు 8వేల రూపాయల విలువైన వన్ టైమ్ కూపన్ ప్రకటించారు.   ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు నెలనెలా ఇస్తున్న  వెయ్యిరూపాయల ఈర్థిక సయాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.  ఇక రైతు సంక్షేమానికి కూడా డీఎంకే మేనిఫెస్టో పెద్ద పీట వేసింది.   వరి  మద్దతు ధరను క్వింటాల్ కు   3,500 రూపాయలకు,   చెరకు మద్దతు ధర టన్నుకురూ. 4,500కు పెంచుతామని హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయానికి మీటర్లు లేని ఆధునిక పంపుసెట్లను ఉచితంగా అందిస్తామని డీఎంకే మేనిఫెస్టో హామీ ఆచ్చింది.  సామాజిక భద్రతలో భాగంగా, వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను నెలకు రెండు వేల రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్‌నురెండువేల ఐదువందల రూపాయలకు పెంచు తామన్న హామీని కూడా డీఎంకే మేనిఫెస్టోలో పొందుపరిచింది.    ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు అమలవుతున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరిస్తామనీ,  ఉన్నత విద్య అభ్యసించే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని డీఎంకే మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం  కవరేజీని  10 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు, పథకానికి అర్హత ఆదాయ పరిమితిని ఏడాదికి ఐదు లక్షలకు పెంచుతామని పేర్కొంది. ఇంకా ఐదేళ్లలో  కలైంజర్ కనవు ఇల్లం  పథకం ద్వారా 1కొత్తగా 0 లక్షల  ఇళ్లు నిర్మిస్తామని పేర్కొంది.  
ALSO ON TELUGUONE N E W S
బిజినెస్ టైకూన్ నుంచి మాస్ హీరోగా  'లీడర్' ట్రైలర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న లెజెండ్ శరవణన్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా 'లీడర్' కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బిజినెస్ మాగ్నెట్ కమ్ యాక్టర్ లెజెండ్ శరవణన్(Legend Saravanan) మళ్ళీ వార్తల్లో నిలిచారు. తన మొదటి సినిమా 'ది లెజెండ్'తో వెండితెరపై సందడి చేసిన ఆయన, ఇప్పుడు 'లీడర్' (Leader) అనే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. భారీ హంగులు, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్ హైలైట్స్ ఇవే.. ఈ 'లీడర్' ట్రైలర్‌ను గమనిస్తే, శరవణన్ మరోసారి ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. సమాజంలో జరిగే అన్యాయాలను ఎదిరించే వ్యక్తిగా ఆయన కనిపిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే విజువల్స్, భారీ తారాగణం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా శరవణన్ తనదైన శైలిలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ కనిపించడం అభిమానులను అలరిస్తోంది. ట్రైలర్ క్వాలిటీ చూస్తుంటే మేకర్స్ ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదని అర్థమవుతోంది. ట్రైన్ లో జరిగే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ యాక్షన్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. 'ఈ ప్రపంచంలో ఏ సహాయం దేవుడు నేరుగా చేయడు, మనుషుల మూలంగానే అన్ని మంచి పనులు జరుగుతాయి, మనం వాళ్లనే నమ్మాలి...' అనే డైలాగ్ కథానాయకుడి ఆలోచనను, దృక్ఫథాన్ని తెలియజేస్తుంది. ట్రైలర్ చివరలో వచ్చిన తండ్రీ, కూతురు ఎమోషనల్ సీన్ హార్ట్ టచింగ్ గా ఉంది. భారీ యాక్షన్, సెంటిమెంట్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో "లీడర్" సినిమా ప్రేక్షకుల్ని థియేటర్స్ లో అలరించనున్నట్లు ఈ యాక్షన్ ట్రైలర్ తో తెలుస్తోంది. లెజెండ్ శరవణన్ సినీ ప్రస్థానం.. దక్షిణాదిలో ప్రముఖ వ్యాపారవేత్తగా సుపరిచితులైన శరవణన్ అరుల్, సినిమాలపై ఉన్న మక్కువతో హీరోగా మారారు. ఆయన తొలి చిత్రం 'ది లెజెండ్' భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ, నిరుత్సాహపడకుండా తన రెండో ప్రయత్నంగా 'లీడర్'ను పట్టాలెక్కించారు. మొదటి సినిమా కంటే ఈసారి మరింత జాగ్రత్తగా, కథాబలం ఉన్న స్క్రిప్ట్‌ను ఎంచుకున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. భారీ తారాగణం.. అదిరిపోయే విజువల్స్ ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. శామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైన్ లో, పోర్ట్ ఏరియాలో, ఫారెస్ట్ లో జరిగే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలోని గ్రాండియర్ మేకింగ్ ను చూపిస్తున్నాయి. యాక్షన్ డైరెక్టర్లు డిజైన్ చేసిన ఫైట్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్‌లా ఉండబోతున్నాయి అనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్.. ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. నెటిజన్లు శరవణన్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆయన డెడికేషన్‌ను మెచ్చుకుంటుంటే, మరికొందరు ఈసారి బాక్సాఫీస్ వద్ద గట్టిగానే కొట్టేలా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా కూడా ఈ సినిమాకు మంచి ప్రచారం లభిస్తోంది. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది. మరి 'లెజెండ్'తో హిట్ అందుకోలేకపోయిన లెజెండ్ శరవణన్.. ఈ 'లీడర్'తో హిట్ అందుకుంటారేమో చూడాలి.
బెంగాలీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం  షూటింగ్ విరామంలో ఊహించని ప్రమాదం ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి ప్రముఖ నటుడు మృతి బెంగాలీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సినీ, టీవీ రంగాలలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (43) ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి మరణించారు. షూటింగ్ కోసం ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని తల్సారి బీచ్‌కు వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయన అకాల మరణంతో బెంగాలీ సినీ, టీవీ రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. (Rahul Arunoday Banerjee) అసలేం జరిగింది? రాహుల్ ప్రస్తుతం 'భోలే బాబా పార్ కరేగా' అనే బెంగాలీ సీరియల్‌లో నటిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే యూనిట్ సభ్యులతో కలిసి తల్సారి బీచ్ సమీపంలో షూటింగ్‌లో పాల్గొన్నారు. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత, ఆయన ఒంటరిగా సముద్ర తీరానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తు నీటిలోకి వెళ్లిన రాహుల్, అలల తాకిడికి బయటకు రాలేకపోయారు. తోటి నటీనటులు, టెక్నీషియన్లు గమనించి వెంటనే స్పందించి ఆయన్ను నీటి నుంచి బయటకు తీశారు. ఆసుపత్రికి తరలించే లోపే.. నీటిలో మునిగిపోయిన రాహుల్‌ను అపస్మారక స్థితిలో గమనించిన యూనిట్ సభ్యులు వెంటనే దిఘా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో ఈ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్క్రిప్ట్ ప్రకారం ఆ సమయంలో నీటిలోకి వెళ్లాల్సిన అవసరం లేదని, ఆయన స్వచ్ఛందంగానే నీటి వైపు వెళ్లారని షూటింగ్ యూనిట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ నేపథ్యం.. 2008లో వచ్చిన 'చిరోదిని తుమి జే అమర్' సినిమాతో రాహుల్ రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. ఆ చిత్రంలో ఆయన సరసన నటించిన ప్రియాంక సర్కార్‌నే ఆయన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 'లవ్ సర్కస్', 'జుల్ఫికర్', 'బ్యోమకేష్ గొత్రో' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. కేవలం సినిమాలే కాకుండా పలు పాపులర్ టీవీ షోలు, వెబ్ సిరీస్‌ల ద్వారా బెంగాలీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు.. రాహుల్ మరణవార్త విన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "రాహుల్ ఒక అద్భుతమైన నటుడు, మంచి వ్యక్తి. ఆయన మరణం బెంగాలీ కళా రంగానికి తీరని లోటు" అని ఆమె సంతాపం తెలిపారు. పలువురు దర్శకులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా రాహుల్ మృతికి నివాళులర్పిస్తున్నారు. రాహుల్‌కు భార్య ప్రియాంక సర్కార్, 13 ఏళ్ల కుమారుడు సహోజ్ ఉన్నారు.  ఈ అనూహ్య ఘటన బెంగాలీ సినీ లోకాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఒక మంచి నటుడిగా, రచయితగా, పాడ్‌కాస్టర్‌గా బహుముఖ ప్రజ్ఞ చాటుకున్న రాహుల్ ఇంత చిన్న వయసులో మరణించడం అభిమానులను కలిచివేస్తోంది.  
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) ఈరోజు (సోమవారం) ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, బెంగళూరులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సువర్ణలత భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం బెంగళూరులో జరగనున్నాయి. ప్రకాశ్ రాజ్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని పలు సందర్భాల్లో పంచుకున్నారు. ఆమె మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ మరియు శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.  
‘పెద్ది’ క్రేజీ అప్‌డేట్  మెగా పవర్ స్టార్ డ్యూయల్ రోల్ తండ్రి కొడుకులుగా చరణ్  బుచ్చిబాబు ప్లాన్ మామూలుగా లేదుగా! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi). ఇటీవల విడుదలైన గ్లింప్స్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని తెలియడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ తండ్రి మరియు కొడుకుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడట. ఒక పాత్ర 1980ల నాటి పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పహిల్వాన్ కాగా, రెండో పాత్ర ప్రస్తుత కాలానికి సంబంధించిన యువకుడిగా ఉంటుందని సమాచారం. గతంలో చరణ్ 'మగధీర', 'నాయక్' వంటి చిత్రాల్లో డ్యూయల్ రోల్స్ చేసి మెప్పించాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా 'ఉప్పెన' చిత్రంతోనే తనలోని ఎమోషనల్ రైటింగ్‌ను నిరూపించుకున్నాడు. ఇప్పుడు 'పెద్ది' చిత్రంలో కూడా తండ్రి-కొడుకుల మధ్య ఉండే ఒక బలమైన సెంటిమెంట్‌ను, క్రీడల నేపథ్యంలో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర మట్టి వాసన ఉట్టిపడేలా సాగే ఈ కథలో, ఒక పాత్ర ఊర మాస్ గెటప్‌లో ఉంటుందని.. చరణ్ బాడీ లాంగ్వేజ్, మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడనే వార్త బయటకు రాగానే మెగా అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే చరణ్ నుండి మాస్ జాతర గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో మెరవనున్నాడు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.  
ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే వార్త 'మహాకాళి' సినిమాలో గెస్ట్ రోల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ గురించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. 'మహాకాళి'(Mahakali) సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) రోజురోజుకూ విస్తరిస్తోంది. ‘హను-మాన్’ విజయం తర్వాత యూనివర్స్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ‘మహాకాళి’ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ వార్త విన్నప్పటి నుంచి రెబల్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫిమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వస్తున్న ‘మహాకాళి’ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా, ప్రశాంత్ వర్మ స్వయంగా కథను అందించాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఇది కేవలం ఒక అతిథి పాత్ర మాత్రమే కాకుండా, ఈ యూనివర్స్ లో రాబోయే పెద్ద సినిమాలకు పునాదిలా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి ప్రభాస్ ఇప్పటికే తన వంతు షూటింగ్‌ను కూడా పూర్తి చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కన్నడ నటి భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 100 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రభాస్ వంటి స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం వల్ల ‘మహాకాళి’కి పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు లభించడం ఖాయమని చెప్పవచ్చు. ప్రభాస్ గతంలో ‘కన్నప్ప’ వంటి చిత్రాల్లో కూడా ఇలాగే స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’ (Fauzi), ‘స్పిరిట్’ (Spirit) వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత నెల ఆఖరున వచ్చే విద్యుత్ బిల్లు ఒక ఎత్తు.  చాలా మంది విత్యుద్ బిల్లుకు భయపడి ఏసీ వినియోగించే విషయంలో వెనకడుగు వేస్తారు.  అయితే ఇలాంటి వాటికి సోలార్ ఏసీ ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఇవి హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయి. పగటిపూట సూర్యరశ్మితో, రాత్రిపూట గ్రిడ్ లేదా బ్యాటరీ బ్యాకప్‌తో నడుస్తాయి. ఇవి ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఎంత ఏసీకి ఎంత సోలార్ సెటప్ ఉండాలి? 1 టన్ను సోలార్ ఏసీని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, అది సరిగ్గా పనిచేయడానికి కనీసం 1.5KW (1500 వాట్స్) సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ అవసరం అవుతుంది. పగటిపూట సూర్యరశ్మి  తీవ్రంగా ఉన్నప్పుడు, ఏసీ పూర్తిగా సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో పనిచేస్తుంది.  ఇది నేరుగా DC పవర్‌పై పనిచేసే మోడళ్లలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పవర్ నష్టాన్ని తగ్గించి, మెరుగైన కూలింగ్  పనితీరును అందిస్తుంది. నైట్ బ్యాకప్ సెలక్షన్.. సోలార్ ఏసీ  అతిపెద్ద ప్రయోజనం దాని సౌలభ్యం. అంటే, ఒకవేళ రాత్రిపూట  బ్యాటరీ బ్యాకప్ అయిపోతే,  దానిని విద్యుత్‌తో నడపవచ్చు. ఈ సాంకేతికత రాత్రిపూట కూడా  ఏసీ పనితీరుకు ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తుంది.  సులభంగా చెప్పాలంటే,  సౌరశక్తితో పాటు విద్యుత్తుతో కూడా ఏసీని నడపవచ్చు. పైన పేర్కొన్న సోలార్ ఏసీ ని ఆన్లైన్ మార్కెట్లో అయినా, ఆఫ్ లైన్ మార్కెట్ లో అయినా కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పు మీద తగినంత స్థలం ఉంటే.. సోలార్ ఏసీ ఎంపిక చాలా మంచిది.                                         *రూపశ్రీ.
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
దేశంలోని అత్యంత శక్తిమంతుల జాబితాలో  టాప్ 100లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. అంతే కాకుండా ఈ ఇరువురూ కూడా ఆ జాబితాలో తొలి పాతిక స్థానాలలో నిలవడం విశేషం. జాతీయ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ 2026 సంవత్సరానికి దేశంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాను ప్రకటించింది. వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.  కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో చూపుతున్న చొరవ చంద్రబాబును టాప్ 100 మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్స్ ఇన్ ఇండియా జాబితాలో 13వ స్థానంలో నిలబెట్టాయి.   అలాగే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఈ జాబితాలో 25వ స్థానాన్ని దక్కించుకున్నారు.  కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తర్వాత అత్యంత ప్రభావశీలుడైన నేతగా రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు దక్కింది.  కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత  ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రాలను అధిగమించి జాబితాలో రేవంత్ 25వ స్థానాన్ని దక్కిం చుకున్నారు.   ఇక పోతే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ కూడా చోటుదక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆయన  68వ స్థానంలో నిలిచారు.  ఇక యువ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా టాప్ 100లో నిలిచారు. ఈ జాబితాలో ఆయనకు 90వ స్థానం దక్కింది.   
మండు వేసవిలో వరుణులు విజృంభించనున్నాడా? అంటే వాతావరణ శాఖ ఔననే అంటోంది. రాగల రెండు రోజులలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ అకాల వర్షాలకు పంటలు దెబ్బతినకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే పిడుగుపాటుకు అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు అధికార డీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది.  ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఆదివారం (మార్చి 29) చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం  అన్నా అరివళయం లో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోను ఆయన సూపర్ స్టార్ గా అభివర్ణించారు.   మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారు.  ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు  ఇల్లతరసి  పథకం కింద గృహోపకరణాలు కొనుగోలుకు 8వేల రూపాయల విలువైన వన్ టైమ్ కూపన్ ప్రకటించారు.   ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు నెలనెలా ఇస్తున్న  వెయ్యిరూపాయల ఈర్థిక సయాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.  ఇక రైతు సంక్షేమానికి కూడా డీఎంకే మేనిఫెస్టో పెద్ద పీట వేసింది.   వరి  మద్దతు ధరను క్వింటాల్ కు   3,500 రూపాయలకు,   చెరకు మద్దతు ధర టన్నుకురూ. 4,500కు పెంచుతామని హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయానికి మీటర్లు లేని ఆధునిక పంపుసెట్లను ఉచితంగా అందిస్తామని డీఎంకే మేనిఫెస్టో హామీ ఆచ్చింది.  సామాజిక భద్రతలో భాగంగా, వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను నెలకు రెండు వేల రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్‌నురెండువేల ఐదువందల రూపాయలకు పెంచు తామన్న హామీని కూడా డీఎంకే మేనిఫెస్టోలో పొందుపరిచింది.    ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు అమలవుతున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరిస్తామనీ,  ఉన్నత విద్య అభ్యసించే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని డీఎంకే మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం  కవరేజీని  10 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు, పథకానికి అర్హత ఆదాయ పరిమితిని ఏడాదికి ఐదు లక్షలకు పెంచుతామని పేర్కొంది. ఇంకా ఐదేళ్లలో  కలైంజర్ కనవు ఇల్లం  పథకం ద్వారా 1కొత్తగా 0 లక్షల  ఇళ్లు నిర్మిస్తామని పేర్కొంది.  
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.  వెల్లుల్లి వాసన, ఘాటైన రుచితో ఆహారానికి రెట్టింపు రుచిని ఇస్తుంది.  అయితే  వెల్లుల్లి తినడం కంటే.. వెల్లుల్లి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.  ఇంతకీ వెల్లుల్లి నీరు ఆరోగ్యానికి  చేసే మలు ఏమిటి? వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేసుకోవాలి?  పూర్తీగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి.. వెల్లుల్లి నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే ఒక పానీయం. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియా మరియు ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి బలాన్ని ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లికి రక్తపోటును తగ్గించే సామర్థ్యం ఉంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు మరియు పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల నుండి వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అజీర్ణం, గ్యాస్,  మలబద్ధకం వంటి సమస్యలకు ఇది ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది.. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే చాలా మంచిది. బరువు.. వెల్లుల్లి నీరు బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని నియంత్రించడం ద్వారా   పదే పదే ఏదో ఒకటి తినాలని అనిపించే వారికి చాలా చక్కగా సహాయపడుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి డ్రింక్. వ్యాధులు.. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,   చర్మం మీద ముడుతలు వంటివి పడకుండా చర్మం యవ్వనంగా ఉండటంలో సహాయపడుతుంది. వెల్లుల్లి నీరు ఎలా తయారు చేసుకోవాలంటే.. రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తాగాలి. కొన్ని రోజుల్లోనే చాలా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.                                      *రూపశ్రీ.
  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు అంటున్నారు. మరీ ముఖ్యంగా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే మూత్రపిండాల సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేటికాలంలో చర్మ సంరక్షణలో భాగంగా చాలా రకాల క్రీములు వాడుతూ ఉంటారు.  ఇవి కూడా మూత్రపిండాల సమస్యకు కారణం అవుతాయి అనే మాట చాలా చర్చలకు దారి తీస్తోంది.   మూత్రపిండాల సమస్యకు అసలు కారణాలు ఏంటి? మూత్రపిండాల సమస్య ఎవరిలో ఎక్కువ వస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. రెండు రూపాలు.. మూత్రపిండాల వ్యాధులు రెండు రూపాలలో వస్తాయి.  మధుమేహం వల్ల వచ్చే మూత్రపిండాల వ్యాధి మొదటిది. 50 శాతం మందికి మధుమేహం కారణంగా మూత్రపిండాల వ్యాధి వస్తుంది. అధిక రక్తపోటు మరొక కారణం. మూత్రపిండాల్లో రాళ్లు,  ఇన్ఫెక్షన్లు కూడా ఈ వ్యాధికి ఇతర కారణాలు. జన్యుపరంగా,  ఇతర మందులు తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల వ్యాధి రావచ్చు. తాత్కాలిక,  శాశ్వత మూత్రపిండాల వ్యాధులు కూడా ఉన్నాయి. తాత్కాలిక మూత్రపిండాల వ్యాధి.. మలేరియా, డెంగ్యూ జ్వరం లేదా లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధి వచ్చినప్పుడు,  మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోతాయి. ఈ పరిస్థితిలో డయాలసిస్ అవసరం కావచ్చు. లేదా మందులతో దీనిని నయం చేయవచ్చు. ధీర్షకాల మూత్రపిండాల వ్యాధి.. కొంతమందికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉండవచ్చు. ఇది మధుమేహం,  అధిక రక్తపోటు కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, చివరికి  డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరం  ఏర్పడుతుంది. లక్షణాలు.. మూత్రపిండాల వ్యాధికి తరచుగా ఎలాంటి లక్షణాలు ఉండవు. అందుకే చాలామంది  దానిని పట్టించుకోరు. ఏదైనా అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే రక్తంలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి అత్యంత సాధారణ లక్షణం కాళ్ళలో నీరు చేరడం. ఇతర లక్షణాలలో లైట్ గా చలి, నొప్పి, జ్వరం, లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చలి,  వెన్నెముకకు ఇరువైపులా నొప్పి వంటివి  ఉంటాయి. పాదాల వాపు మూత్రపిండాల వ్యాధి లక్షణం అని ఖచ్చితంగా చెప్పలేము. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా పాదాల వాపు రావచ్చు. జీవనశైలిలో మార్పులు కూడా మూత్రపిండాల వ్యాధికి కారణం కావచ్చు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తినడం,  ఊబకాయం వంటివన్నీ మూత్రపిండాల వ్యాధికి దారితీసే పరిస్థితులు. మూత్రం రంగు మారడం, మూత్రంలో రక్తం కనిపించడం,  మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వ్యాధి లక్షణాలే. చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో మూత్రపిండ వ్యాధులు.. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగించే క్రీములు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చని వైద్యులు అంటున్నారు. వైద్యపరంగా ఉపయోగించే క్రీములు సాధారణంగా పెద్ద సమస్యలను కలిగించవు.  కానీ చాలామంది అందం మీద పిచ్చితో సోషల్ మీడియాలో కనిపించే ప్రమోషన్ యాడ్స్,  ఇంటర్నెట్ లో కనిపించే పేక్ రివ్యూస్ చూసి సొంతంగా క్రీములు ఎంచుకుని వాడుతుంటారు. అలాంటి క్రీములలో అధిక పరిమాణంలో పాదరసం ఉండవచ్చని అంటున్నారు. పాదరసానికి చర్మాన్ని తెల్లగా చేసే గుణం ఉంది. పాదరసం మూత్రపిండాలకు ప్రమాదకరమైన పదార్థం. మూత్రపిండాలకు హాని కలిగించే మరొక పదార్థం ఆర్సెనిక్. చాలా క్రీములలో వీటన్నింటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు  వాడటం వల్ల, ఇది చర్మం ద్వారా రక్తంలో కలిసి మూత్రపిండాలకు చేరి ప్రమాదం కలిగిస్తుందని పరిశీలనలలో తేలింది. వైద్య సలహా లేకుండా ఎలాంటి క్రీములు వాడకుండా ఉండటం చాలా ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.