LATEST NEWS
 అస్సాంలో  యువశక్తి ఉరకలు వేస్తున్నది. అసోం అసెంబ్లీ ఎన్నికలలో నవతరం జోష్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలలో రాజకీయంగా ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిసిస్తోంది.  ఎన్నికల బరిలో యువనేతల పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు.  దాదాపు అన్ని ప్రధాన పార్టీలూ కూడా అభ్యర్థుల ఎంపికలో యువతకే పెద్ద పీట వేశాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పెద్ద సంఖ్యలో  యువత బరిలోకి దిగింది.   అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి  30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే  క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నిరుద్యోగం, విద్యా సౌకర్యాలు, డిజిటల్ విప్లవం వంటి అంశాలే అజెండాగా వీరు ముందుకు సాగుతున్న తీరు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.  భిన్నమైన ఆలోచనా దృక్పథంతో ఉన్న  యువత, అస్సాం రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం ఖాయమని అంటున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా యువత ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నది. జన్ జీ సరికొత్త ఆలోచనలతో నవశకం దిశగా మార్పును ఆహ్వానిస్తున్నది. అదే ఒకవడి అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా యువత  గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి వంటి అంశాలను  బలంగా వినిపిస్తూ అసోం ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసోం ఎన్నికల బరిలో యువత పెద్ద సంఖ్యలో నిలబడటం రానున్న సామాజిక మార్పులకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే  అస్సాంలో యువ ఓటర్ల శాతం గణనీయంగా ఉండటం ఎన్నికల బరిలో నిలబడిన యువ అభ్యర్థులకు పెద్ద ప్లస్ గా మారింది.  తొలి సారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారు, సమకాలీన సమస్యలపై  అవగాహన ఉన్న యువత మద్దతుపై జన్ జీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధాన పార్టీలు కూడా యువతకు అగ్రతాంబూలం ఇచ్చి వారినే పెద్ద సంఖ్యలో అభ్యర్థులుగా బరిలోకి దింపాయి.  ఇది అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని కచ్చితంగా మారుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  రాజకీయ అనుభవం గల ఉద్ధండులను ఎదిరించి మరీ పెద్ద సంఖ్యలో యువత రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం.  
తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శాసనమండలిలో   విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కారులు ప్రాణాలకు తెగించి పోరాటం చేయకపోతే.. ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా అని  ప్రశ్నించారు. ఎన్నికల వేళ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని  డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై  శాసనమండలి వేదికగా విజయశాంతి తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం   పోరాటం చేసిన ఉద్యమకారులకు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నెరవేర్చకపోవడాన్ని విజయశాంతి ఎత్తి చూపారు.  ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు.. ఆ కుటుంబాలకు నెలకు పాతిక వేల చొప్పున పింఛన్‌ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి.. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చాలన్నారు. అలాగే.. తెలంగాణ ఉద్యమకారులపై రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలనీ,  ప్రభుత్వ గుర్తింపు కార్డు  ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలనీ డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ  ఇప్పటికే దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ కేంద్ర ప్రభుత్వం వైపు మళ్లింది. అమరావతికి కేంద్ర చట్టబద్ధత కల్పించే ప్రక్రియపై ఢిల్లీలోని అధికార వర్గాల్లో కీలక చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక చర్చలు జరిపారు.   అమరావతికి సంబంధించిన కేంద్ర చట్టంపై వెంకయ్యనాయుడు అమిత్ షాతో చర్చించారు.  ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించే విషయంలో వేగంగా కదలాలని ఆయన ఈ సందర్భంగా అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది.  ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసిందని చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది.   ఈ ప్రతిపాదనపపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తరువాత బిల్లును సభలో ప్రవేశపెడతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.  కేంద్ర స్థాయిలో వెంకయ్య నాయుడికి ఉన్న అనుభవం, సంబంధాలు, పలుకుబడి ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తికావడానికి ఆయన జోకయం దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.  హోం శాఖ ఈ విషయంపై ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసిందనీ, ఇక కేబినెట్ ఆమోదమే తరువాయి అనీ అంటున్నారు.  అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెల 1న అమరావతికి సంబంధించిన అధికారిక ప్రతిపాదనను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనల ఫలితంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తే  నిధుల సమీకరణ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు రాక సులభతరం అవుతుంది.  
ALSO ON TELUGUONE N E W S
ఈగలు తోలుకుంటున్నాను హార్మోనియం ఎక్కడుందో తెలియదు మణిశర్మ షాకింగ్ కామెంట్స్ మణిశర్మ ఎంత గొప్ప సంగీత దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన పాటలను అందించి మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కొత్త బెంచ్ మార్క్ నే సెట్ చేశారని చెప్పవచ్చు. అలాంటి మణిశర్మకు కొంతకాలంగా సినిమాలు తగ్గిపోయాయి. (Mani Sharma) కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తుండటంతో మణిశర్మ రేసులో వెనకబడిపోయారు. ఒకప్పుడు తమ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాలని కోరుకునే ఎందరో స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు.. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ లో పడి వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మణిశర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love Story) సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్.కె.ఎన్ తో కలిసి బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి 'గురుతుందా' సాంగ్ ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో మణిశర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "ఈగలు తోలుకుంటున్నాను" అంటూ తనకు కొంతకాలంగా సరైన అవకాశాలు లేవనే విషయాన్ని మణిశర్మ చెప్పారు. "ఈగలు తోలుకునే నా దగ్గరకు సాయి రాజేష్ వచ్చి, నేను బేబీ దర్శకుడినని పరిచయం చేసుకున్నారు. ఈయనకు నాతో ఏం పని అనుకున్నాను. మీరు మా సినిమాకి మ్యూజిక్ చేయాలి సార్ అన్నారు. నా హార్మోనియం ఎక్కడుందో కూడా తెలీదు. ఆయనే వెతికి పట్టుకొని, దుమ్ము దులిపి, నన్ను కూర్చోబెట్టారు. ఒక ట్యూన్ అయ్యాక తెలిసింది.. మళ్ళీ లోపల నుంచి మ్యూజిక్ బయల్దేరిందని" అంటూ మణిశర్మ చెప్పుకొచ్చారు. మణిశర్మ కామెంట్స్ విని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఒకప్పుడు ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ను అందించిన మణిశర్మ.. ఇప్పుడిలా మాట్లాడుతుంటే చూడలేకపోతున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మణిశర్మ అనే కాదు.. ఎందరో సీనియర్ సంగీత దర్శకుల పరిస్థితి ఇలాగే ఉంది. ఒకప్పుడు ఎన్నో చార్ట్ బస్టర్స్ ఇచ్చి, ఇప్పుడసలు లైమ్ లైట్ లో లేకుండా పోయారు. కీరవాణి సైతం ప్రస్తుతం రాజమౌళి సినిమాలకే పరిమితమయ్యారు.  https://x.com/Theteluguone/status/2038611295986171983
    -ఇండియా వైడ్ గా క్రేజ్ ని కంటిన్యూ చేస్తున్న ధురంధర్ 2  -నిన్న నీలిర మూవీ ఈవెంట్ లో వెట్రి మారన్ కీలక వ్యాఖ్యలు  -ఖచ్చితంగా ధురంధర్ 2 గురించే  -ఇంతకీ ఆ మాటలేంటి! సినిమా రిలీజై రెండు వారాలు దాటినా సోమవారం నాడు సెకండ్ సెకండ్ షో ఫుల్ అవ్వాలంటే ప్రస్తుత స్క్రాప్, పైరసీ వరల్డ్ లో సినిమాతో పాటు ఎంతో మంది రాత బాగుండాలి. ఆ రాత బాగుందని 'ధురంధర్ 2'(Dhurandhar 2)టీం నిరూపించింది. ఇండియా వైడ్ గా నిన్న చాలా ఏరియాస్ లోని సెకండ్ షోస్ ఇదే పరిస్థితి. దీన్ని బట్టి ధురంధర్ 2 ప్రేక్షకుల నీరాజనాలు ఏ విధంగా అందుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు. కానీ రీసెంట్ గా విభిన్న చిత్రాల దర్శకుడు 'వెట్రిమారన్'(Vetrimaaran)ధురంధర్ 2 పేరు ఎత్తకుండానే ఇటీవల రిలీజైన ఒక మూవీ అంటు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమలో హీట్ ని రాజేస్తున్నాయి. మరి ఈ న్యూస్ ఏంటో చూద్దాం  ఏప్రిల్ 3 న శ్రీలంక సివిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన 'నీలిర'(Neelira)అనే మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రస్తుతం ప్రతిదీ ఒక ప్రచారంగా మారిపోయింది. మన జ్ఞాపకాలని, ఆలోచనలని ప్రభావితం చేసే శక్తి కూడా సదరు ప్రచారానికి ఉంది. వందల కోట్ల రూపాయలు సంపాదించాలనే లక్ష్యంతో, ద్వేషాన్ని హింసని పెట్టుబడిగా పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నోట్ల రద్దు' సమయంలో సాధారణ ప్రజలు క్యూ లైన్లలో నిలబడి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం  మనందరికీ తెలుసు. కానీ సినిమాల ద్వారా ఆ ప్రభావాన్ని చాలా సులభంగా మార్చేయవచ్చు. వాస్తవాలను వక్రీకరించి చూపిస్తు ప్రజల జ్ఞాపకాలని  తారుమారు చేస్తున్నారు. కానీ నీలిర మూవీ ఒక జాతిని, మతాన్ని అపహాస్యం చేసేలా తెరకెక్కలేదని చెప్పుకొచ్చాడు. aslo read: VIjay: విజయ్ పై ప్రముఖ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు.. విజయ్ సమర్పించిన ఆస్తులు ఎన్ని  ధురంధర్ 2 లోని ఒక సన్నివేశం విషయానికి వస్తే పాకిస్థాన్ లో ఉన్న దావూద్ ఇబ్రహీం 60000 కోట్ల రూపాయిల ఒరిజినల్ ఇండియన్ కరెన్సీ లాగానే ఉండే వాటిని ముద్రించి  ఇండియాలో మార్చాలని చూస్తాడు. ధురంధర్ ఈ విషయాన్నీ కనిపెట్టి ఇండియన్ ఐబి చీఫ్ కి చెప్పడంతో మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం నోట్ల రద్దు చేసినట్టుగా చూపించారు. మరి వెట్రిమారన్ తన స్పీచ్ లో 'ధురంధర్ 2' పేరు ప్రస్తావించకపోయినా   ఆయన మాట్లాడింది ధురంధర్ 2 గురించే అనే విషయం క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎలాంటి ఆర్భాటాలు, భేషజాలకి పోకుండా మనుషుల జీవితాలు, భావోద్వేగాలు  సామాజిక అస్పృశ్యతల వల్ల కలిగే సదరు మనుషులు పడే  ఇబ్బందులు, వాళ్ళు ఎదురుతిరిగితే ఏర్పడే పరిస్థితులు ఆధారంగానే వెట్రి మారన్ సినిమాలు ఉంటాయి. అణగారిన వర్గాల్లో నుంచే తన హీరో వస్తుంటాడు. ప్రెజెంట్ 'విడుతలై 2'  'అరసన్' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ధురంధర్ 2 కూడా రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తు బిజీగానే ఉంది. ప్రెజెంట్ తన స్టేటస్ 1365 కోట్లు.   
  -నిన్న నామినేషన్ దాఖలు చేసిన విజయ్  -మీడియాతో ముచ్చటించిన వాణి భోజన్ -విజయ్ చెప్పిన ఆస్తుల వివరాలు ఎన్ని  వాణి భోజన్ ఏం చెప్తుంది ఇళయ దళపతి విజయ్(VIjay)వల్ల అభిమానులకే కాదు యావత్తు ఇండియన్ సినిమా లవర్స్ , పొలిటికల్ లవర్స్ లో టెన్షన్ పెరిగిపోతుంది. ఏప్రిల్ 23 న జరగనున్నతమిళనాడు ఎలక్షన్స్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. విజయ్ ఫ్యాన్స్ అయితే తమ హీరో ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోవడం గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు. విజయ్ కూడా ఆ విషయంలో ఎవరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని  అంటున్నాడు. ఈ క్రమంలో విజయ్ కి సంబంధించిన మరిన్ని తాజా అప్ డేట్స్ కోసం నెటిజన్స్ అందరు తమకి ఎన్ని  పనులు ఉన్నా సోషల్ మీడియాకి మాత్రం న్యాయం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే విజయ్ గురించి ప్రముఖ హీరోయిన్ వాణి భోజన్ చేసిన వ్యాఖ్యలతో పాటు నామినేషన్ సందర్భంగా విజయ్ ప్రకటించిన ఆస్తుల డీటెయిల్స్  టాక్ ఆఫ్ ది డే గా తమ ప్రాభవాన్ని చూపిస్తున్నాయి. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. వాణి భోజన్ రీసెంట్ గా కుంభకోణంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుతు నేను విజయ్ సార్ కి వీరాభిమానిని.ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది నా జీవిత లక్ష్యం. ఇప్పుడు విజయ్ సార్ రాజకీయాల్లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక వ్యక్తిగా, నటుడిగా ఆయనకి ఉన్న క్రేజ్ తెలిసిందే. ప్రజల కోసం ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఎన్నికల్లో అయన పార్టీకి నా పూర్తి మద్దతు ఉంటుంది. ముందు ముందు ప్రచారం కూడా చేస్తాను. విజయ్ లాంటి విజనరీ లీడర్ రాజకీయాల్లోకి రావడం తమిళనాడు భవిష్యత్తుకి ఎంతో అవసరమని ఆమె చెప్పుకొచ్చింది. సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన వాణి భోజన్, ఓ మై కడవులే వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 2019 లో వచ్చిన 'మీకు మాత్రమే చెప్తాలో కూడా కనిపించి సందడి చేయనుంది. ఇక విజయ్ నిన్న పెరంబూరు అసెంబ్లీ సెగ్మెంట్ స్థానం నుంచి నామినేషన్ సమర్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సమర్పించిన ఎలక్షన్ల అవిడిఫీట్ లో స్థిర,చరాస్తులు కలిపి మొత్తం 520 కోట్ల రూపాయిల విలువైనవి ఉన్నట్లుగా వెల్లడించాడు. ఇందులో స్ధిరాస్తులు 115 కోట్లు, చరాస్తులు 405 కోట్లు. 5.35 లక్షల విలువైన మారుతీ స్విఫ్ట్ కారు,  67, 400 విలువైన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం ఇళ్లు, స్థలాలు, బంగారం బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, వాహనాలు, ఇతర చరాస్తులతో సహా BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి ఖరీదైన కార్లు  ఉన్నాయి.  అలాగే గత ఆర్థిక సంవత్సరాలకి సంబంధించిన 2024-25లో 184.53 కోట్లు, 2023-24లో 105.69 కోట్లు, 2022-23లో 198.71 కోట్లు, 2021-22లో  237.46 కోట్లు, మరియు 2020-21లో  8.04 కోట్ల ఆదాయాన్ని నివేదించినట్టుగా పేర్కొన్నాడు. విజయ్ భార్య 2020-21 ఆర్థిక సంవత్సరానికి  6,13,520 ఆదాయాన్ని ప్రకటించడం జరిగింది.    
మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్, ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్‌కు చుక్కలు చూపిస్తున్నారనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 'పుష్ప' సినిమాతో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు, తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్నప్పటికీ, సైన్ చేయడానికి మాత్రం భారీ కండిషన్లు పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఫహద్ ఫాజిల్ తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించడానికి ఏకంగా రూ. 15 నుండి రూ. 20 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. సాధారణంగా స్టార్ హీరోలకు ఇచ్చే రేంజ్‌లో ఒక నెగటివ్ రోల్ చేసే నటుడు ఇంత పారితోషికం అడగడంతో మన నిర్మాతలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. కేవలం విలన్‌కే ఇంత ఇస్తే, ఇక సినిమా బడ్జెట్ ఎక్కడికి చేరుతుందోనని మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పాత్ర కోసం ఫహద్‌ను సంప్రదించగా, రెమ్యూనరేషన్ విషయంలో ఆయన పట్టు వీడకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఫహద్ అడిగినంత ఇవ్వలేక ఆ పాత్రలోకి నందమూరి కళ్యాణ్ రామ్‌ను తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.  నిజానికి ఫహద్ ఫాజిల్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనను సినిమాలో తీసుకుంటే కేరళ (మలయాళం) మార్కెట్ కూడా కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తారు. కానీ రూ. 20 కోట్లు అనేది మరీ ఎక్కువ అని వారి అభిప్రాయం. మరోవైపు, ఫహద్ కేవలం రొటీన్ విలన్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని, కంటెంట్ బలంగా ఉండి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఫహద్ గతంలో నటించిన 'ట్రాన్స్', 'విక్రమ్', 'మామన్నన్' వంటి చిత్రాల్లో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే టాలీవుడ్ అగ్ర దర్శకులు కూడా ఆయన డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఫహద్ రెమ్యూనరేషన్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "అంత టాలెంట్ ఉన్న నటుడికి ఆ మాత్రం డిమాండ్ ఉండటంలో తప్పులేదు" అని కొందరు అంటుంటే, "విలన్ పాత్రకే 20 కోట్లా? ఇది మరీ టూమచ్" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఫహద్ తన పారితోషికం విషయంలో తగ్గేదేలే అంటుండటంతో, మన నిర్మాతలు ఆయన కోసం అంత మొత్తం ఖర్చు పెడతారా లేదా అనేది వేచి చూడాలి.
వరుస సెలవులు, చల్లని సాయంత్రాలు.. తోడుగా ఒక మంచి సినిమా ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే డిజిటల్ ప్రియుల కోసం ఈ వారం ఓటీటీ సంస్థలు భారీ విందును సిద్ధం చేశాయి. థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నప్పటికీ, ఇంటి వద్దే ఉండి వినోదాన్ని ఆస్వాదించే వారి కోసం ఏప్రిల్ మొదటి వారంలో ఏకంగా 16కు పైగా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్నాయి. ఇందులో తెలుగు ప్రాముఖ్యత కలిగిన సినిమాలతో పాటు క్రేజీ బాలీవుడ్, హాలీవుడ్ కంటెంట్ కూడా ఉండటం విశేషం. ఈ వారం ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోల చిత్రాలు డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధమైంది. విభిన్నమైన కథాంశాలతో మెప్పించే శ్రీవిష్ణు ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీనితో పాటు, వైవిధ్యమైన నటనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సుహాస్ నటించిన 'హే బల్వంత్' చిత్రం జీ5 వేదికగా అలరించనుంది. మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఏమిటంటే, సీనియర్ నటి లయ, నటుడు శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' చిత్రం ఈ వారమే ఈటీవీ విన్‌లో నేరుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తర్వాత లయ తెలుగు తెరపై కనిపిస్తుండటం, ఇటీవలే బిగ్ బాస్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న శివాజీ ఇందులో నటించడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. థ్రిల్లర్, కామెడీ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిందీ ప్రేక్షకుల కోసం ఆమిర్ ఖాన్ సమర్పణలో వస్తున్న 'సితారే జమీన్ పర్' సోనీ లివ్‌లో విడుదల కానుంది. అలాగే కామెడీ డ్రామా 'హ్యాపీ పటేల్', ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'వధ్-2' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వీటితో పాటు హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు 'రిపుల్', 'జో కిట్టీ సీజన్-3', 'బ్లడ్ హౌండ్స్ సీజన్-2' వంటి హై-వోల్టేజ్ కంటెంట్ అంతర్జాతీయ స్థాయి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. హారర్ చిత్రాలను ఇష్టపడే వారి కోసం అమెజాన్ ప్రైమ్‌లో 'సెండ్ హెల్ప్' లాంటి సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్.. మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్) - ఏప్రిల్ 04 సెండ్ హెల్ప్- ఇంగ్లిష్ సినిమా - మార్చి 31 అవతార్ ఫైర్ అండ్ యాష్ - మార్చి 31 జియో హాట్‌స్టార్‌.. సెండ్ హెల్ప్‌(హాలీవుడ్ హారర్‌ మూవీ) - మార్చి 31 ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్‌-2(హాలీవుడ్ సినిమా) - ఏప్రిల్ 03 నెట్‌ఫ్లిక్స్.. రిపుల్(హాలీవుడ్ వెబ్ సిరీస్) - మార్చి 31 హ్యాపీ పటేల్(హిందీ సినిమా) - ఏప్రిల్ 01 జో కిట్టీ- సీజన్-3(హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 02 మృత్యుంజయ్(తెలుగు సినిమా) -ఏప్రిల్ 03 మామ్లా లీగల్‌ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 03 వధ్‌-2(హిందీ సినిమా) -ఏప్రిల్ 03 బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ వెబ్ సిరీస్) -ఏప్రిల్ 03 హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 03 జీ5  హే బల్వంత్‌(తెలుగు సినిమా) - మార్చి 31 బాబ్జీ ఘర్‌ పర్‌ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ) - ఏప్రిల్ 03 తానా - ఏప్రిల్ 3 ఈటీవీ విన్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’- ఏప్రిల్ 3 ఆపీల్ టీవీ ప్లస్.. యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 03 సన్‌ నెక్ట్స్.. వడం(తమిళ సినిమా) - ఏప్రిల్ 03 సోనీ లివ్ సితారే జమీన్ పర్(బాలీవుజ్ ) - ఏప్రిల్ 03
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం. మధ్యాహ్నం పూట ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడమే ఒక పెద్ద పనిగా మారుతుంది.  మండే ఎండల్లో బయటకు వెళ్లిరావడం అంటే పెద్ద యుద్దం చేసిన ఫీలింగ్ వస్తుంది. ప్రభుత్వాలు కూడా ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెబుతాయి.   ఇంత కఠినమైన వేసవి ఎండలో బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు తమకు తాము రక్షణ కల్పించుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.  లేకపోతే  అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వేసవి ఎండలో ఇంటి నుండి బయటకు వెళ్లే అవసరం వస్తే.. మరీ ముఖ్యంగా మద్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే.. తప్పకుండా కొన్ని వస్తువులు వెంట తీసుకెళ్లాలని, అది వారికి ఎంతో సహాయపడతాయని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. ఇంతకూ వేసవి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసిరిగా వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటో.. వారి ఉపయోగం ఎంటో తెలుసుకుంటే.. వాటర్ బాటిల్.. మండుటెండలో  ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే అనేక అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు  బ్యాగ్‌లో ఒక వాటర్ బాటిల్  ఉంచుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే డీహైడ్రేషన్ తీవ్రమై  అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ. సన్ గ్లాసెస్.. వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు  బ్యాగ్‌లో సన్ గ్లాసెస్ తప్పకుండా ఉంచుకోవాలి. ఎండ నుండి  కళ్ళను కాపాడుకోవడానికి ఇవి చాలా అవసరం. ఇవి కంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడతాయి. సన్‌స్క్రీన్ క్రీమ్.. వేసవి ఎండలకు సన్‌స్క్రీన్ క్రీమ్ చాలా ముఖ్యం. సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ  చర్మం పొడిబారడం లేదా గరుకుగా మారడం మొదలైతే వెంటనే సన్ స్క్రీన్  రాసుకోవచ్చు. గొడుగు.. వానలో తప్ప ఎండలో గొడుగు వాడటం తెలియని వారు ఉన్నారు. ఈ మండుటెండలో బ్యాగ్‌లో తప్పకుండా ఒక గొడుగు ఉంచుకోవాలి. ఇది  ఎండ నుండి కాపాడటానికి సహాయపడుతుంది. స్కార్ఫ్ లు.. అమ్మాయిలు బయటకు వెళ్లే ముందు తమ బ్యాగ్‌లో తప్పకుండా స్కార్ఫ్ ఉంచుకోవాలి. ఇది  తీవ్రమైన ఎండ నుండి కాపాడుతుంది, అలాగే ఎండదెబ్బ,  చర్మం నల్లబడటాన్ని కూడా నివారిస్తుంది.                                     *రూపశ్రీ.
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత నెల ఆఖరున వచ్చే విద్యుత్ బిల్లు ఒక ఎత్తు.  చాలా మంది విత్యుద్ బిల్లుకు భయపడి ఏసీ వినియోగించే విషయంలో వెనకడుగు వేస్తారు.  అయితే ఇలాంటి వాటికి సోలార్ ఏసీ ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఇవి హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయి. పగటిపూట సూర్యరశ్మితో, రాత్రిపూట గ్రిడ్ లేదా బ్యాటరీ బ్యాకప్‌తో నడుస్తాయి. ఇవి ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఎంత ఏసీకి ఎంత సోలార్ సెటప్ ఉండాలి? 1 టన్ను సోలార్ ఏసీని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, అది సరిగ్గా పనిచేయడానికి కనీసం 1.5KW (1500 వాట్స్) సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ అవసరం అవుతుంది. పగటిపూట సూర్యరశ్మి  తీవ్రంగా ఉన్నప్పుడు, ఏసీ పూర్తిగా సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో పనిచేస్తుంది.  ఇది నేరుగా DC పవర్‌పై పనిచేసే మోడళ్లలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పవర్ నష్టాన్ని తగ్గించి, మెరుగైన కూలింగ్  పనితీరును అందిస్తుంది. నైట్ బ్యాకప్ సెలక్షన్.. సోలార్ ఏసీ  అతిపెద్ద ప్రయోజనం దాని సౌలభ్యం. అంటే, ఒకవేళ రాత్రిపూట  బ్యాటరీ బ్యాకప్ అయిపోతే,  దానిని విద్యుత్‌తో నడపవచ్చు. ఈ సాంకేతికత రాత్రిపూట కూడా  ఏసీ పనితీరుకు ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తుంది.  సులభంగా చెప్పాలంటే,  సౌరశక్తితో పాటు విద్యుత్తుతో కూడా ఏసీని నడపవచ్చు. పైన పేర్కొన్న సోలార్ ఏసీ ని ఆన్లైన్ మార్కెట్లో అయినా, ఆఫ్ లైన్ మార్కెట్ లో అయినా కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పు మీద తగినంత స్థలం ఉంటే.. సోలార్ ఏసీ ఎంపిక చాలా మంచిది.                                         *రూపశ్రీ.
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           
 అస్సాంలో  యువశక్తి ఉరకలు వేస్తున్నది. అసోం అసెంబ్లీ ఎన్నికలలో నవతరం జోష్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలలో రాజకీయంగా ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిసిస్తోంది.  ఎన్నికల బరిలో యువనేతల పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు.  దాదాపు అన్ని ప్రధాన పార్టీలూ కూడా అభ్యర్థుల ఎంపికలో యువతకే పెద్ద పీట వేశాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పెద్ద సంఖ్యలో  యువత బరిలోకి దిగింది.   అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి  30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే  క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నిరుద్యోగం, విద్యా సౌకర్యాలు, డిజిటల్ విప్లవం వంటి అంశాలే అజెండాగా వీరు ముందుకు సాగుతున్న తీరు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.  భిన్నమైన ఆలోచనా దృక్పథంతో ఉన్న  యువత, అస్సాం రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం ఖాయమని అంటున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా యువత ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నది. జన్ జీ సరికొత్త ఆలోచనలతో నవశకం దిశగా మార్పును ఆహ్వానిస్తున్నది. అదే ఒకవడి అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా యువత  గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి వంటి అంశాలను  బలంగా వినిపిస్తూ అసోం ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసోం ఎన్నికల బరిలో యువత పెద్ద సంఖ్యలో నిలబడటం రానున్న సామాజిక మార్పులకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే  అస్సాంలో యువ ఓటర్ల శాతం గణనీయంగా ఉండటం ఎన్నికల బరిలో నిలబడిన యువ అభ్యర్థులకు పెద్ద ప్లస్ గా మారింది.  తొలి సారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారు, సమకాలీన సమస్యలపై  అవగాహన ఉన్న యువత మద్దతుపై జన్ జీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధాన పార్టీలు కూడా యువతకు అగ్రతాంబూలం ఇచ్చి వారినే పెద్ద సంఖ్యలో అభ్యర్థులుగా బరిలోకి దింపాయి.  ఇది అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని కచ్చితంగా మారుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  రాజకీయ అనుభవం గల ఉద్ధండులను ఎదిరించి మరీ పెద్ద సంఖ్యలో యువత రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం.  
తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శాసనమండలిలో   విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కారులు ప్రాణాలకు తెగించి పోరాటం చేయకపోతే.. ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా అని  ప్రశ్నించారు. ఎన్నికల వేళ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని  డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై  శాసనమండలి వేదికగా విజయశాంతి తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం   పోరాటం చేసిన ఉద్యమకారులకు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నెరవేర్చకపోవడాన్ని విజయశాంతి ఎత్తి చూపారు.  ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు.. ఆ కుటుంబాలకు నెలకు పాతిక వేల చొప్పున పింఛన్‌ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి.. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చాలన్నారు. అలాగే.. తెలంగాణ ఉద్యమకారులపై రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలనీ,  ప్రభుత్వ గుర్తింపు కార్డు  ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలనీ డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ  ఇప్పటికే దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ కేంద్ర ప్రభుత్వం వైపు మళ్లింది. అమరావతికి కేంద్ర చట్టబద్ధత కల్పించే ప్రక్రియపై ఢిల్లీలోని అధికార వర్గాల్లో కీలక చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక చర్చలు జరిపారు.   అమరావతికి సంబంధించిన కేంద్ర చట్టంపై వెంకయ్యనాయుడు అమిత్ షాతో చర్చించారు.  ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించే విషయంలో వేగంగా కదలాలని ఆయన ఈ సందర్భంగా అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది.  ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసిందని చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది.   ఈ ప్రతిపాదనపపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తరువాత బిల్లును సభలో ప్రవేశపెడతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.  కేంద్ర స్థాయిలో వెంకయ్య నాయుడికి ఉన్న అనుభవం, సంబంధాలు, పలుకుబడి ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తికావడానికి ఆయన జోకయం దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.  హోం శాఖ ఈ విషయంపై ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసిందనీ, ఇక కేబినెట్ ఆమోదమే తరువాయి అనీ అంటున్నారు.  అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెల 1న అమరావతికి సంబంధించిన అధికారిక ప్రతిపాదనను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనల ఫలితంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తే  నిధుల సమీకరణ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు రాక సులభతరం అవుతుంది.  
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు. పైగా అవన్నీ చాలా ఆరోగ్యమైనవే అని అనుకుంటూ ఉంటారు. అయితే  గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రిపూట నివారించాల్సిన కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. రాత్రి భోజనం.. రాత్రిపూట భోజనం గురించి చాలామందికి ఒక నిర్లక్ష్యం ఉంటుంది.  చాలామంది బాగా పుష్టిగా తింటుంటారు.  కానీ రాత్రి బోజనం అతిగా తినడం గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రాత్రి బోజనం  అతిగా తినకూడదు. రాత్రి అతిగా తింటే  జీర్ణ సమస్యలు తలెత్తి, రక్త ప్రసరణ,  గుండె పనితీరు ప్రభావితం కావచ్చు. కాఫీ.. కొందరికి గంట గంటకు కాఫీ తాగే అలవాటు ఉంటుంది.  రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కాస్త కాపీ సిప్ చేస్తుంటారు. కానీ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది  నిద్రను ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఫోన్.. రాత్రి పూర్తీగా కళ్లు మూత పడేవరకు పోన్ ను వాడేవారు చాలా మంది ఉంటున్నారు.  అయితే రాత్రి పడుకునే ముందు  ఫోన్‌ను ఉపయోగించడం మానుకోవాలి. రాత్రి పూట పోన్ ఎక్కువ చూస్తే ప్రశాంతమైన నిద్ర పట్టదు.  పైగా మెదడు, కళ్లు చాలా అలసిపోతాయి.  గుండె ఆరోగ్యాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది. చిరుతిళ్లు.. కొంతమందికి రాత్రి భోజనం తర్వాత కూడా కాఫీ తాగే అలవాటు ఉంటే.. మరికొందరికి నిద్రపోయే ముందు చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల  ఆకలి తగ్గడమే కాకుండా,  నిద్ర కూడా ప్రభావితం అయ్యే ప్రభావం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం  గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి.. నేటి కాలంలో చాలా మంది చేస్తున్న ఫిర్యాదు ఒత్తిడి.  అధిక ఒత్తిడి చాలా ప్రమాదం. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటుకు,  గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీయవచ్చు. మద్యం.. రాత్రి పడుకునే ముందు మద్యం సేవించడం చాలామంది మగవారికి అలవాటు.  ఈ అలవాటు వల్ల  రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మద్యం సేవించడాన్ని మానుకోవడం మంచిది.                                  *రూపశ్రీ.
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.  వెల్లుల్లి వాసన, ఘాటైన రుచితో ఆహారానికి రెట్టింపు రుచిని ఇస్తుంది.  అయితే  వెల్లుల్లి తినడం కంటే.. వెల్లుల్లి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.  ఇంతకీ వెల్లుల్లి నీరు ఆరోగ్యానికి  చేసే మలు ఏమిటి? వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేసుకోవాలి?  పూర్తీగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి.. వెల్లుల్లి నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే ఒక పానీయం. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియా మరియు ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి బలాన్ని ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లికి రక్తపోటును తగ్గించే సామర్థ్యం ఉంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు మరియు పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల నుండి వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అజీర్ణం, గ్యాస్,  మలబద్ధకం వంటి సమస్యలకు ఇది ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది.. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే చాలా మంచిది. బరువు.. వెల్లుల్లి నీరు బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని నియంత్రించడం ద్వారా   పదే పదే ఏదో ఒకటి తినాలని అనిపించే వారికి చాలా చక్కగా సహాయపడుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి డ్రింక్. వ్యాధులు.. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,   చర్మం మీద ముడుతలు వంటివి పడకుండా చర్మం యవ్వనంగా ఉండటంలో సహాయపడుతుంది. వెల్లుల్లి నీరు ఎలా తయారు చేసుకోవాలంటే.. రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తాగాలి. కొన్ని రోజుల్లోనే చాలా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.                                      *రూపశ్రీ.
  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.