ఏపీ ప్రభుత్వానికి బీజేపీ నిర్మాణాత్మక సహకారం
posted on: Jan 22, 2015 8:14PM
.jpg)
ప్రతిపక్ష పార్టీ అంటే వీలయినప్పుడల్లా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండాలి. ఏదో ఒక అంశం దొరకబుచ్చుకొని ఉద్యమాలతో హడావుడి చేస్తుండాలి. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ సంప్రదాయాన్నే ఎంతో నిష్టగా పాటించేస్తూ ప్రజలని కూడా ఇదే సరయిన పద్దతేమోనని నమ్మేలా చేస్తున్నాయి. కానీ రాష్ట్రాభివృద్ధిలో నిర్మాణాత్మకమయిన పాత్ర పోషించాలానే ఆలోచన వాటికి కలలో కూడా కలగదు. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ఆ పాత్ర బహు చక్కగా పోషిస్తోంది.
తెదేపాకు మిత్రపక్షమయిన బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను సున్నితంగా ఎత్తి చూపుతూనే దానికి నిర్మాణాత్మకమయిన సలహాలు ఇస్తోంది. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సంఘంలో సభ్యుడయిన సోమూ వీర్రాజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలలో వేసవి ఇంకా రాకమునుపే అప్పుడే నీటి ఎద్దడి మోదలయిందని, ఆ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు చేప్పట్టాలని కోరారు. రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలను పేర్కొంటూ కేంద్రప్రభుత్వానికి ఒక నివేదిక పంపినట్లయితే తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తరచూ కరువు బారిన పడుతున్న రాయలసీమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు.
ఆ తరువాత మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస రాజు, రాష్ట్రంలో ఇసుక విక్రయాలపై ప్రభుత్వం ఇంత వరకు ఒక నిర్దిష్టమయిన విధానం అవలంభించలేకపోతోందని దాని వలన దళారులు లబ్ది పొందుతుంటే, నిర్మాణరంగం తీవ్రంగా నష్టపోతోందని, కనుక రాష్ట్ర ప్రభుత్వం వీలయినంత త్వరగా లోపరహితమయిన విధానాలను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.



.jpg)
.jpg)

.webp)



