LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే అంటూ ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో మంగళగిరిలోని తెలుగుదేశ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు. కెమెరాలు కట్ చేసి చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన తొలిసారి పెదవి విప్పారు.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. తన దగ్గర డబ్బు లేదు కాబట్టి బతుకుదెరువు చూపిస్తామని ప్రలోభ పెట్టారని, మండలినే రద్దు చేస్తామని బెదిరించారని నాటి వైసీపీ ఘాతులకాలను వివరించారు.
అయినా తనకున్న అధికారంతో మూడు రాజధానుల బిల్లు ఆమోదించలేదని షరీఫ్ సగర్వంగా చెప్పారు. నమాజ్ చేసుకుని అల్లాని ప్రార్థించుకుని 'అల్లా సత్యం వైపు ఉండేటట్లుగా నా కళ్లు తెరువు' అని కోరారన్నారు. ఎన్ని ఒత్తిడిలు ఉన్నా.. బెదిరించినా ధర్మం వైపు నిలబడాలనే అల్లా మాటలకు ఆరోజు కట్టుబడి ఉన్నా. ఆ తర్వాతా తనన న్ను చైర్మన్ స్థానం నుంచి దింపేందుకు అనేక కుట్రలు చేశారని, ఇప్పుడు అమరావతి రాజధానిగా చట్టం చేయడం ఆనందంగా ఉందని నాడు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు
అమరావతిని వైసీపీ నాశనం చేయాలని చూస్తే.. తాము శాసనం చేసి నిలబెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లోనూ అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయమన్నారు. అమరావతిలో శుక్రవారం (ఏప్రిల్ 3) మీడియాతో మాట్లాడిన చంద్రబాబు పార్లమెంటు ఉభయ సభల్లోనూ 35 మంది వరకు ఎంపీలు అమరావతికి మద్దతుగా మాట్లాడారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని అందరూ అన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతానికి రాజకీయ, సాంస్కృతిక ప్రాధాన్యం ఉందన్నారు. సమృద్ధిగా నీరు, సారవంతమైన భూములు ఉన్నాయన్నారు. ఆనాడు అసెంబ్లీలో వైసీపీ కూడా రాజధానిని సమర్థించిందని... కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని జగన్ చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాజకీయాలు, అవినీతి, సామాజిక అంశాలపై ప్రముఖ జర్నలిస్ట్, జమీన్‌రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌తో కలిసి తెలుగువన్ ఎండి కె. రవిశంకర్ నిర్వహిస్తున్న సంచలనాత్మక చర్చా కార్యక్రమం వాస్తవ వేదిక విజయవంతంగా కొనసాగుతోంది. తాజా సంచికలో తెలుగు రాజకీయాల్లో డ్రగ్స్ ప్రకంపనలపై విస్తృతంగా చర్చించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు. రాజకీయ నేతలు సమాజానికి రోల్ మోడల్స్‌గా ఉండాల్సిన తరుణంలో, వారిపై ఇటువంటి ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వాలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ వ్యసనం బారిన పడటం ఆందోళనకరమన్నారు. ఇక రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి వాడుకుంటున్నాయే తప్ప, మూలాల నుంచి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయడం లేదన్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు, వారి అనుచరులు డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్నప్పుడు, అది మీడియా చర్చలకే పరిమితమవుతోంది తప్ప వారికి కఠినమైన శిక్షలు పడిన దాఖలాలు దాదాపు లేదన్నారు.
డ్రగ్స్ మాఫియాను అరికట్టడానికి కేవలం పోలీసు చర్యలు సరిపోవనీ, ఇందులో వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటం వల్ల డ్రగ్స్ కేసుల విచారణలు తరచుగా నీరుగారిపోతున్నాయని డోలేంద్రప్రసాద్, రవిశంకర్ లు అభిప్రాయపడ్డారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే.. డ్రగ్స్ వినియోగాన్ని చట్టపరంగా తీవ్రమైన నేరంగా పరిగణించకపోవడం కూడా డ్రగ్స్ వినియోగం నిర్మూళనకు అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం డ్రగ్స్ అమ్మడం నేరం కానీ, తీసుకోవడం పెద్ద నేరంగా పరిగణించడం లేదనీ, దీనివల్ల నిందితులు సులభంగా బయటపడే అవకాశం ఉందన్నారు.
రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒక నూతన వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులను ప్రకటించినట్లే, తాము డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉన్నామని నిరూపించుకోవడానికి డోప్ టెస్ట్' నివేదికలను సమర్పించే నిబంధనను తీసుకురావాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులుగా ఉండేవారు ప్రతి ఆరు నెలలకోసారి రక్త పరీక్షలు చేయించుకుని, ఆ నివేదికలను బహిరంగపరచడం ద్వారా పారదర్శకతను పెంచాల్సి ఉందన్నారు. ఇది ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఒక సానుకూల సందేశాన్ని పంపుతుందన్నారు.
రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో నైతిక విలువలకు పెద్దపీట వేయాలని రవిశంకర్ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని రాజకీయాల నుంచి బహిష్కరించడం లేదా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. పంజాబ్ రాష్ట్రం ఎదుర్కొన్న 'ఉడ్తా పంజాబ్' వంటి దుస్థితి తెలుగు రాష్ట్రాలకు రాకూడదంటే, రాజకీయ నేతలు స్వచ్ఛందంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలనీ, రాజకీయాలు కేవలం అధికారం కోసమే కాకుండా, సామాజిక బాధ్యతను నెరవేర్చే వేదికలుగా మారినప్పుడే ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడం సాధ్యమౌతుందనీ డోలేంద్రప్రసాద్, రవిప్రసాద్ లు పేర్కొన్నారు.
ALSO ON TELUGUONE N E W S
-రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న రామాయణ టీజర్
-తాజాగా ఎన్నో విషయాలు బయటకి
-నితీష్ తివారి చెప్తున్న మాటలేంటి
నిన్నరిలీజైన 'రామాయణ'(Ramayana)టీజర్ తో సాక్షాత్తు ఆ అయోధ్య రాముడే మన మందు నడయాడుతున్నాడా అనిపించింది. అంతలా రామాయణ టీజర్ ప్రతి ఒక్క రామభక్తుడిని తన్మయత్వంతో ముంచెత్తుతుందని చెప్పవచ్చు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న వ్యూస్ నే ఒక ఉదాహరణ. అదే టైంలో రామాయణని ప్రపంచం మెచ్చేలా చేయడానికి ఎంత కష్టపడుతున్నారో కూడా టీజర్ ద్వారా అర్ధమవుతుంది.అది నిజమే అన్నట్టుగా రీసెంట్ గా రామాయణ దర్శకుడు నితీష్ తివారి(Nitesh Tiwari)ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇండియన్ సినీ ప్రేమికులని, రామ భక్తులని విశేషంగా ఆకరిస్తున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం
నితీష్ తివారి మాట్లాడుతు 'సెవన్ ఇయర్స్ నుంచి రామాయణ కోసం వర్క్ చేస్తున్నాను. టీజర్ తో ఇప్పుడు లభిస్తున్న ప్రేక్షకాదరణకి కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కినట్లయింది . రామాయణ కోసం వరల్డ్ వైడ్ గా 10000 మంది వర్క్ చేస్తున్నారని తెలిపాడు. దీంతో రామాయణ ని ఎంత ప్రతిష్టాత్మకంగా, ప్రాణంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారో అర్ధమవుతుంది. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో నితీష్ తివారి ఒకరు. ఇప్పటికి హయ్యస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీగా రికార్డు పొరల్లో దాగి ఉన్న ఆమీర్ ఖాన్ దంగల్ కి నితీష్ తివారీనే దర్శకుడు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన 'ఛిచో రె' కూడా నితీష్ తివారిదే. 2023 లో వచ్చిన 'బవాల్' తర్వాత రామాయణతో వస్తున్నాడు.
Also read: Undekhi: ఇండియాలో నిజంగా జరిగిన కథ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్
రాముడిగా రణబీర్ కపూర్(Ranbir Kapoor)సీతమ్మ తల్లిగా సాయిపల్లవి(sai Pallavi)చేస్తుండగా, యష్(yash)రావణుడిగా చేస్తున్నాడు. రెండు భాగాలుగా తెరెక్కుతున్న రామాయణ మొదటి భాగం ఏ ఏడాది దీపావళికి, రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి. నమిత్ మల్హోత్రా ప్రొడ్యూసర్. బాక్స్ ఆఫీస్ వద్ద రామాయణ కలెక్షన్ల సునామీని సృష్టించడం ఖాయమనే నమ్మకం అందరిలో ఉంది.
-థ్రిల్లర్ చిత్రాలంటే ఇష్టమా
-అయితే ఏ మాత్రం మిస్ అవ్వకండి
-వెంటనే చూసెయ్యండి
థ్రిల్లర్ కధాంశంతో తెరకెక్కిన చిత్రాలు చూస్తుంటే వచ్చే మజానే వేరు. అలాంటిది వాస్తవిక సంఘటనలతో కూడిన థ్రిల్లర్ అయితే ఉన్న పళంగా అన్ని పనులు మానుకొని సదరు మూవీ ముందు వాలిపోతాం. పై పెచ్చు సదరు చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంటే ఎవరితో మాట్లాకుండా సైలెంట్ గా గదిలోకి వెళ్లి మూవీలో లీనమవుతాం. ఇప్పుడు నేను చెప్పబోయే థ్రిల్లర్ మూవీ మీ చేత ఆ పనే చేయించబోతుంది. రెడీగా ఉండండి మరి.
2016లో పంజాబ్ లోని బటిండాలో పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిని ఒక వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో ఈ విషయం ఎంతగానో సంచలనం సృష్టించడంతో పాటు యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనకి కొంత కల్పిత కథని జోడించి నిర్మించిన చిత్రమే 'అన్ దేఖి'(Undekhi). ప్రతి ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా సాగడంతో పాటు హత్య చుట్టూ అల్లుకున్న కథనం మిమ్మల్ని ఆద్యంతం పిచ్చెక్కిస్తుంది. మొత్తం మూడు సీజన్స్ గా రూపొందగా మూడు సీజన్లు ఇదే విధంగా ఉంటాయి. ఫస్ట్ సీజన్ నుంచి చివరి సీజన్ వరకు ప్రతి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా హత్యల చుట్టూ సాగుతుంది.
సీజన్ 1 పశ్చిమ బెంగాల్‌లోని సుందరబన్స్ అడవుల్లో మొదలవుతుంది. ఆ తర్వాత మనాలీలో అత్వాల్ కుటుంబంలో జరిగే పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసే ఇద్దరు అమ్మాయిలలో ఒకమ్మాయిని చూస్తుండగానే కాల్చి చంపేస్తాడు.ఈ ఘటన మొత్తాన్ని పెళ్లి వేడుకని షూట్ చేస్తున్న ఇద్దరు కుర్రాళ్లు తమ కెమెరాలో షూట్ చేస్తారు. అక్కడి నుంచి సీజన్ 1 ముగుస్తుంది.
Also read: Virosh: ఇప్పుడు మేము ముగ్గురం కాబోతున్నాం.. రష్మిక పోస్ట్ తో ఫ్యాన్స్ హ్యాపీ
సీజన్ 2 సైతం హత్యలు, దర్యాప్తు చుట్టూ సాగుతుంది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. అత్వాల్ కుటుంబ సభ్యుల నేర చరిత్ర గురించి చెప్తుంది. ఇక సీజన్ 3 గతాన్ని వెంటాడే దెయ్యాలు అట్వాల్ కుటుంబాన్ని వేధించడానికి తిరిగి వచ్చినప్పుడు,కుటుంబ సామ్రాజ్యం కోసం పాపాజీ వేసిన ప్రణాళికలకి అడ్డంకిగా మారుతుంది. ఆ ముప్పుని ఎదుర్కొని అట్వాల్ కుటుంబం ఐక్యంగా నిలబడగలదా, లేక ప్రతీకారానికి బలైపోతుందా? అనేది ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. దిబ్యేందు భట్టాచార్య, హర్ష్ ఛాయా, సూర్య శర్మ, అంకుర్ రథీ, ఐన్ జోయా, ఆంచల్ సింగ్, శివాంగి సింగ్ మరియు వరుణ్ బడోలా ముఖ్యమైన క్యారెక్టర్స్ ని పోషించారు. ఆర్.శుక్లా(R. Shukla)దర్శకత్వం వహించగా ఓటీటీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. IMDBలో ఉన్న 7.9 రేటింగ్ నే అన్ దేఖి చరిష్మాకి ఉదాహరణ. తెలుగులో కూడా అందుబాటులో ఉంది
-ఫిబ్రవరి 26 న ఒక్కట్టైన రష్మిక, విజయ్
-రీసెంట్ గా ఇనిస్టాలో గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
-ముగ్గురు కాబోతున్నాం అంటూ వెల్లడి
స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika),విజయ్ దేవరకొండ(Vijay deverakonda)వివాహం మొన్న ఫిబ్రవరి 26 న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. వివాహం చేసుకొని ఆ ఇద్దరు ఎంత ఆనందంగా ఉంటారో అంతకంటే ఎక్కువ పది రేట్లు ఆనందంగా వారివురి అభిమానులు ఉంటారు. ఎందుకంటే విజయ్, రష్మిక ప్రేమ పక్షులుగా ఉన్నన్ని రోజులు ఆ ఇద్దరి గురించి పలు రకాల గాసిప్స్ వచ్చాయి. అవన్నీ వింటు అభిమానులు ఎంతో బాధపడుతు వస్తున్నారు. అలాంటిది ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవడంతో వాళ్లంతా ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నారు. రీసెంట్ గా రష్మిక చేసిన పోస్ట్ తో వాళ్ళల్లో మరింత నూతనోత్సాహం వచ్చినట్లయింది. ఆ పోస్ట్ ఏంటో చూద్దాం.
రష్మిక మందన్న తన ఇనిస్టాగ్రమ్ లో ఇప్పుడు మేము ముగ్గురయ్యామంటూ ఒక వీడియో క్లిప్ షేర్ చేసింది. సదరు వీడియోలో రష్మిక, విజయదేవరకొండలా ఉన్న కార్టూన్ బొమ్మలు ఉండగా రష్మిక టీ షర్ట్ పై గుడ్డు ఫోటో ఉంది. ఒక పొద్దు తిరుగుడు పువ్వు ని కూడా పక్కన ఉంచారు. దీంతో రష్మిక తల్లి కాబోతుందా అనే కామెంట్స్ తో ఇనిస్టాగ్రమ్ క్రాక్ అయ్యే పరిస్థితి.
Also read: Bandla Ganesh: బండ్ల గణేష్ కూతురి పెళ్లి.. అల్లుడు సూర్యతేజ బ్యాక్ గ్రౌండ్ ఏంటి
అసలు విషయం ఏంటంటే రష్మిక కి ఇన్ స్టాగ్రామ్ లో మరో అకౌంట్ ఉంది. పేరు rashmikaru .అందులో పొద్దుతిరుగుడు పువ్వుకి సంబంధించిన కథలని,యానిమేటెడ్ స్టోరీస్ ని ఉంచుతుంది. ఇప్పుడు ఆ యానిమేషన్ ప్రపంచంలోకి విజయ్ ని ఆహ్వానిస్తూ సదరు పోస్ట్ చేసింది. ఇదే అసలు నిజం.
నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎడురోలు రాజు
ఎడిటింగ్: అన్వర్ అలీ
సంగీతం: అనుదీప్ దేవ్
నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్‌కుమార్ బన్సాల్
బ్యానర్స్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
సమర్పణ: జీ స్టూడియోస్
రచన, దర్శకత్వం: మానసశర్మ
విడుదల తేదీ: 03.04.2026
సినిమా నిడివి: 133 నిమిషాలు
ఒక సినిమాను నిర్మించడం కంటే దాన్ని ప్రమోషన్స్ ద్వారా జనంలోకి తీసుకెళ్లడమే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్. సినిమా ఎలా ఉన్నా, దానికి హైప్ తీసుకొచ్చి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడమే స్ట్రాటజీ. దాన్నే ఫాలో అయింది ‘రాకాస’ చిత్ర యూనిట్. అన్ని మాధ్యమాల్లో సినిమా గురించి ప్రమోట్ చేసి ఏప్రిల్ 3న ‘రాకాస’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగీత్ శోభన్ హీరోగా లేడీ డైరెక్టర్ మానసశర్మ రూపొందించిన ఈ సినిమాకి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. హారర్ కామెడీగా ప్రమోషన్స్‌లో ప్రొజెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేర ఆకట్టుకుంది అనేది తెలుసుకుందాం.
కథ:
ఇది 1000 క్రితం మొదలైన కథ. రాజుల కాలం నుంచి ఆ ఊరి చివర కోటలో ఉన్న భీకర బ్రహ్మరాక్షసుడికి నరబలి ఇవ్వడం అనేది ఆచారంగా వస్తూ ఉంటుంది. కోటలో ఉన్న రాక్షసుడి నుంచి హెచ్చరికలు వచ్చిన ప్రతిసారీ ఓ నిండు ప్రాణాన్ని బలిగా పంపిస్తుంటారు. బలి ఇవ్వకపోతే ఊరు మొత్తం నాశనం అయిపోతుందనే మూడనమ్మకంతో హెచ్చరికలు వచ్చిన ప్రతిసారి బలి అర్పిస్తుంటారు. ఆ కోటలో నిజంగానే రాక్షసుడు ఉన్నాడనే భయంతో ఎవరూ ఆ కోట వైపు వెళ్లరు.
వెయ్యేళ్ల తరువాత 2026లో ఆ ఊరివాడైన వీరబాబు (సంగీత్ శోభన్) అమెరికా నుంచి వస్తాడు. రకరకాల మలుపుల తర్వాత రాక్షసుడికి బలిగా వెళ్లేందుకు సిద్ధపడతాడు వీరబాబు. కోటలోకి వెళ్లిన వీరబాబు బయటికి వచ్చే అవకాశం ఉండదు. అదే కోటలో వెన్నెల కిషోర్ కొన్నిరోజులుగా ఉంటూ ఉంటాడు. వీరబాబును వెతుక్కుంటూ హీరోయిన్, గెటప్ శ్రీను కూడా కోటలోకి వెళతారు. కానీ, బయటికి వచ్చే అవకాశం లేదు. రాక్షసుడ్ని చంపితేనే అక్కడి నుంచి వారంతా బయట పడగలరు. మరి వీరబాబు ఏం చేశాడు? చివరికి రాక్షసుడు హతమయ్యాడా? వీరబాబు బృందం బయటపడిందా.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఓపెనింగ్ సీన్ చూస్తే సినిమాలో చాలా పెద్ద స్టఫ్ ఉంది అనిపిస్తుంది. 1000 ఏళ్ళ క్రితం కథతో మొదలై 2026లో హీరో ఎంటర్ కావడంతో పంచ్ డైలాగులతో కూడిన కామెడీ సినిమాగా మారిపోతుంది. అయితే ఇది హారర్ కామెడీ సినిమా అని గుర్తు చెయ్యడానికి అన్నట్టుగా కోట, రాక్షసుడికి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని మధ్య మధ్య చూపిస్తుంటారు. ఏదో చందమామ కథని చూస్తున్న ఫీల్ కలిగించి, వీరబాబులోని ఫన్ ఎలిమెంట్స్‌ని వాడుకుంటూ కథని బాగా నడిపించారు దర్శకురాలు మానస.
కథలో, కథనంలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా నడపడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సంగీత్ శోభన్, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ చాలా చోట్ల నవ్వించింది. ఎంతో బిల్డప్‌తో స్టార్ట్ అయిన సినిమా ఆ తర్వాత కామెడీ వైపు టర్న్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీపైనే నడుస్తుంది. సెకండాఫ్‌లో అసలు కథలోకి వెళ్తుంది. ఇక క్లయిమాక్స్‌లో చిన్నపాటి ట్విస్ట్‌తో, సెకండ్ పార్ట్ లీడ్‌తో సుఖాంతమవుతుంది. అలాగే క్లయిమాక్స్‌లో వచ్చే ప్రమోషనల్ సాంగ్ కూడా బాగుంది.
నటీనటులు:
సినిమాకి మెయిన్ ఎస్సెట్‌గా హీరో సంగీత్ శోభన్‌ని చెప్ప్పుకోవాలి. చక్కని టైమింగ్‌లో పంచ్ డైలాగులు కొడుతూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశారు. అతనికితోడు గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ కూడా బాగుంది. హీరోయిన్ నయన్ సారిక తన లుక్‌తో, అవసరమైన చోట పెర్‌ఫార్మ్ చేస్తూ ఆకట్టుకుంది. తనికెళ్ళ భరణి, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ వంటి నటులు తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణులు:
టెక్నికల్‌గా ఈ సినిమా గురించి చెప్ప్పుకోవాలంటే ఎడురోలు రాజు సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే అన్వర్ అలీ ఎడిటింగ్ కూడా గ్రిప్పింగ్‌గా బాగానే ఉంది. సినిమా నిడివి 2 గంటల 13 నిమిషాలుగా ఉండడం విశేషం. అనుదీప్ దేవ్ సంగీతం ఫర్వాలేదు అనిపించింది. ఇక గ్రాఫిక్స్ విషయంలో కూడా మంచి కేర్ తీసుకున్నట్టు కనిపించింది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌ను బాగా డిజైన్ చేసుకున్నారు. డైరెక్టర్ మానసశర్మ గురించి చెప్పాలంటే.. కాస్త క్లిష్టంగా ఉన్న సబ్జెక్ట్‌ని డీల్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అక్కడక్కడా కనిపించే కొన్ని మైనస్‌లు తప్ప డైరెక్టర్‌గా ఓకే అనిపించుకున్నారు. ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పాల్సి వస్తే.. ఖర్చుకు వెనుకాడకుండా అవసరమైన మేరకు రాజీ పడకుండా సినిమాను నిర్మించారని ఔట్‌పుట్ చూస్తే అర్థమవుతుంది. ఈ విషయంలో నిర్మాత నిహారిక కొణిదెలను అప్రిషియేట్ చెయ్యాలి.
ప్లస్ పాయింట్స్:
సంగీత్ శోభన్ పెర్‌ఫార్మెన్స్
పంచ్ డైలాగ్స్
కొంత వరకు గ్రాఫిక్స్
పిల్లల్ని ఆకట్టుకునే అంశాలు
ప్రమోషనల్ సాంగ్
మైనస్ పాయింట్స్:
కథ, కథనాల్లో కేర్ తీసుకుంటే బాగుండేది
ప్రధాన ఇతివత్తంలోనే లోపాలు
ఫైనల్‌గా చెప్పాలంటే..
థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకులు మంచి ఎంటర్‌టైన్‌మెంట్, పిల్లల్ని ఆకట్టుకునే కొన్ని అంశాలతో శాటిస్‌ఫై అవుతారు.
రేటింగ్: 2.5/5
- జి.హరా
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
-కూతురి పెళ్లిని అధికారకంగా వెల్లడి చేసిన బండ్ల గణేష్
-ఎక్స్ వేదికగా డీటెయిల్స్
-పిక్స్ వైరల్
'బండ్ల గణేష్'(Bandla Ganesh)అనే పేరు ఎత్తి ఆయన హిస్టరీ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే నీ దగ్గర లేనంత సినీ హిస్టరీ మా దగ్గర ఉందని అభిమానులతో పాటు ప్రేక్షకులు, నెటిజన్స్ చెప్పే పరిస్థితి. అంత అదృష్టాన్ని సంపాదించుకున్న బండ్ల గణేష్ ఇంట శుభముహుర్తానికి శుభ గడియలు దగ్గర పడ్డాయి. ఆ వివరాలేంటో చూద్దాం.
బండ్ల గణేష్ ఎక్స్ క్లూజివ్ గా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు దేవుడి ఆశీస్సులు, పెద్దల దీవెనలతో మా ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరగబోతుంది. చిరంజీవి సూర్య తేజ చిలుకూరి, చిరంజీవి లక్ష్మి సౌభాగ్య వతి జనని వివాహం సందర్భంగా పసుపు, కుంకుమ కార్యక్రమం నిర్వహించామని ఎక్స్ సాక్షిగా తెలిపాడు. ఈ రోజు పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకి ట్వీట్ చేయడంతో మరి ఈ లెక్కన నిన్న సదరు పసుపు కుంకుమ కార్యక్రమం జరిగి ఉంటుంది. కూతురు, అల్లుడు ఫోటోలు కూడా షేర్ చెయ్యడంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కాబోయే వధూవరులకి విషెస్ చెప్తున్నారు.
Also Read: Sreeleela: శ్రీలీల లేటెస్ట్ కామెంట్స్ వైరల్.. ఒత్తిడిలోనే అదంతా
మరి బండ్ల గణేష్ ప్రధానంగా సినిమా ప్రాపర్టీ కాబట్టి బండ్ల గణేష్ కాబోయే అల్లుడు ఎవరనే ఆసక్తి నిమిష నిమిషానికి టన్నుల లెక్కన పెరిగేలా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి బండ్ల గణేష్ నే పూర్తి డిటైల్ చెప్పాలని ఫ్యాన్స్, నెటిజన్స్ కోరుతున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన, భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు. ఇది సాధారణ పండుగలా ఆనందంతో జరుపుకునే రోజు కాదు.. దీని వెనుక ఉన్న భావం ఎంతో గంభీరమైనది, ఆధ్యాత్మికతతో నిండినది. యేసు ప్రభువు త్యాగాన్ని ప్రతిబింబించేది.. గుడ్ ఫ్రైడే గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
యేసు క్రీస్తు తన బోధనల ద్వారా ప్రేమ, క్షమ, దయ వంటి విలువలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన చెప్పిన మార్గం సహనం, పరస్పర గౌరవంతో కూడుకుని ఉంది. అయితే ఆయన బోధనలు అప్పటి కొందరు అధికారులకు నచ్చకపోవడంతో ఆయనను శిక్షించడానికి కుట్రలు పన్నారు. చివరకు ఆయనను శిలువపై వేయడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు.
గుడ్ ఫ్రైడే రోజు యేసు క్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసి, మానవాళి పాపాల విమోచన కోసం తనను తాను అర్పించుకున్నారని క్రైస్తవులు విశ్వసిస్తారు. ప్రేమకు, క్షమకు ఉన్న అపారమైన శక్తిని ఈ త్యాగం ద్వారా యేసు ప్రభువు ప్రపంచానికి చాటి చెప్పాడని అంటారు. తనను బాధించిన వారిని కూడా క్షమించగలిగిన హృదయం ఉండాలని.. ఈ గొప్ప సందేశాన్ని ఆయన తానే ఒక ఉదాహరణగా మారి ప్రజలకు, ప్రపంచానికి అందించారు.
గుడ్ ఫ్రైడే ను గుర్తు చేసుకునే విధానం కూడా ఎంతో ప్రత్యేకమైనది. గుడ్ ఫ్రైడే రోజు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు, యేసు ప్రభువు శిలువ అయిన విధానాన్ని స్మరించుకుంటారు, చాలా మంది ఉపవాసం పాటిస్తారు. ఇది ఆత్మపరిశీలనకు, ప్రతి ఒక్కరూ తమ తప్పులను గుర్తించి మార్పు చెందడానికి అవకాశం కల్పిస్తుంది.
గుడ్ ఫ్రైడే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.. నిజమైన ప్రేమ అనేది త్యాగంతో కూడుకున్నదని, క్షమించగలిగే మనసు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని నేర్పుతుంది. ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో కూడా ఇతరులను ప్రేమించడం, సహాయం చేయడం, క్షమించడం వంటి విలువలను అలవాటు చేసుకోవాలని గుడ్ ఫ్రైడే అందరికీ గుర్తు చేస్తుంది.
గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువును శిలువ వేసిన కారణంగా.. ఈ రోజు ప్రతి క్రైస్తవ సోదరుడు, సోదరి.. ఎంతో భావోద్వేగంగా యేసును స్మరించుకుంటారు. గుడ్ ఫ్రైడే అనేది ఒక విషాద దినం మాత్రమే కాదు, ఇది మానవత్వాన్ని, దయను, నిస్వార్థ త్యాగాన్ని ప్రతిబింబించే ఒక పవిత్రమైన రోజు. మనసును శుద్ది చేసుకుని, ప్రతి ఒక్కరూ మంచి మార్గం వైపు నడిచేందుకు గుడ్ ఫ్రైడే ఒక మార్గం చూపిస్తుంది.
*రూపశ్రీ.
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలను పెంచేటప్పుడు, తల్లిదండ్రులు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాయి. ఆడపిల్లలను పెంచే తల్లిదండ్రులు చేయకూడని తప్పులేంటి? ఆడపిల్లను పెంచేటప్పుడు తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటి? ఆచార్య చాణక్యుడు దీని గురించి ఏం చెప్పాడు? తెలుసుకుంటే..
ఆంక్షలు, పరిమితులు..
ఆడపిల్ల అంటే కుటుంబానికి పరువుగా భావిస్తారు. అందువల్ల తల్లిదండ్రులు తరచుగా ఆడపిల్లల కలలను అల్పమైనవిగా భావించి, వాటిపై ఆంక్షలు విధిస్తుంటారు. చాణక్య నీతి ప్రకారం ఆడపిల్లల కలలను ఎన్నడూ పరిమితం చేయకూడదు. ఆమె చదువును, వృత్తిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆడపిల్ల అభివృద్ధి చెందడానికి ప్రతి అవకాశమూ కల్పించాలి. ఆడపిల్ల చదువులో, వృత్తిలో ఎదిగే ఇంటికి అంతులేని గౌరవ మర్యాదలు లభిస్తాయి.
స్వేచ్ఛ..
అతిగా స్వేచ్ఛ ఇవ్వడం ఎవరికీ మంచిది కాదు. అలాగే, ప్రతి విషయంలోనూ అతిగా జోక్యం చేసుకోవడం కూడా మంచిది కాదు. నిరంతరం ఆంక్షలు విధించడం మంచి ఆలోచన కాదు. అలా చేయడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కొడుకు అయినా, కూతురు అయినా, వారి సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. కొడుకుకు అయితే అన్నీ తెలుసు వారికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకోవడం, కూతురుకు ఏమీ తెలియదు అని ఏ విషయాన్ని ఆమె ఆలోచించకుండా, ఆమె నిర్ణయించుకోకుండా చెయ్యడం మంచిది కాదు.
వివాహం పట్ల అబిప్రాయం..
నేటి సమాజం మారుతున్నప్పటికీ, కొందరు అమ్మాయిలు మాత్రమే పెళ్లి విషయంలో తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది తండ్రులు ఇప్పటికీ తమ కూతుళ్ల పెళ్లి విషయమై వారి అభిప్రాయం తెలుసుకోరు. నేటికీ కూతుళ్లకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు ఉంటున్నారు. సమాజపు ఒత్తిడికి లొంగి కూతురికి పెళ్లి చేయడం లేదా అనారోగ్యకరమైన బంధంలోనే ఉండమని ఒత్తిడి చేయడం మంచిది కాదు.
పెంపకం..
కూతుళ్ల పెంపకం రెండు విధాలుగా ఉంటుంది. కొందరు ఆడపిల్లను ప్రేమగా పెంచుతారు. అలాంటి వారు కూతుళ్లతో ప్రేమగా, స్నేహంగా అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడేలా పెంచుతారు. కానీ కొందరు భయం గుప్పెట్లో పెంచుతారు. ఇలాంటి పెంపకంలో ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర, పెద్ద వారి దగ్గర, సమాజంలోని వ్యక్తుల దగ్గర కూడా నోరు విప్పాలంటే భయపడుతుంది. దీని వల్ల ఆడపిల్ల తనను తాను కోల్పోతుంది.
*రూపశ్రీ.
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా, మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల ఏ విధమైన ఆటంకం లేకుండా, శ్రద్దగా చదువుకోవాలంటే వారికి జ్ఞాపకశక్తి కూడా మెరుగ్గా ఉండాలి. ముఖ్యంగా స్టడీ టేబుల్‌పై వారి ఏకాగ్రతను దెబ్బతీసే వస్తువులు ఉంటే, వారు ఎంత కష్టపడి చదివినా ఏకాగ్రత తక్కువగానే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా చదువు మీద దృష్టి పెట్టలేరు. ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే వారు చదువుకునే ప్రదేశంలో లేదా స్టడీ టేబుల్‌పై ఉంచకూడని ఐదు వస్తువులు ఉన్నాయి. అవేంటో.. వాటిని ఎందుకు చదువుకొనేటప్పుడు పిల్లలకు దగ్గరగా ఉంచకూడదో తెలుసుకుంటే..
మొబైల్ ఫోన్..
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు పిల్లల ఏకాగ్రతను బాగా దెబ్బతీస్తున్నాయి. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, గేమ్స్, వీడియోలు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. ఫోన్‌ను టేబుల్‌పై దూరంగా ఉంచినప్పటికీ, పిల్లల మనసు పదే పదే నోటిఫికేషన్ల కోసం చూస్తూ ఉంటుంది. దీనివల్ల వారి చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. అందువల్ల, చదువుకునే సమయంలో మొబైల్ ఫోన్‌ను వేరే చోట ఉంచాలి. మరీ ముఖ్యంగా నేటికాలంలో టీనేజ్ పిల్లలకు కూడా సపరేట్ గా ఫోన్ లు కొనివ్వడం పెద్దలు చేస్తున్న తప్పు. చిన్నతనం నుండే పిల్లలకు ఫోన్ విషయంలో మంచి క్రమశిక్షణ పెట్టడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే పిల్లల మనసు చదువుపైన దృష్టి పెట్టేందుకు సహాయపడుతుంది.
స్నాక్స్..
చదువుకునే బల్లపై లేదా చదువుకునే ప్రదేశంలో చిప్స్, చాక్లెట్, శీతల పానీయాలు వంటివి ఉంచడం కూడా మంచిది కాదు. పిల్లలు చదువుకునేటప్పుడు తినేస్తుంటారు, దీనివల్ల వారి ఏకాగ్రతకు భంగం కలుగుుతంది. జంగ్ ఫుడ్ వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది. దానికి బదులుగా, పిల్లలను చురుకుగా, ఏకాగ్రతతో ఉంచడానికి బల్ల దగ్గర పండ్లు, నీళ్లు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను ఉంచాలి. ఆరోగ్యకరమైన స్నాక్స్, ఒక గ్లాసు నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోండి.
స్టేషనరీ..
పిల్లలు తరచుగా పెన్నులు, పెన్సిళ్లు, మార్కర్లు , పోస్ట్-ఇట్ నోట్లను బల్లలపై వదిలేస్తుంటారు. దీనివల్ల స్టడీ టేబుల్ చిందరవందరగా, అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఈ మానసిక గందరగోళం ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల, బల్లపై కేవలం అత్యవసరమైన పుస్తకాలు, పెన్నులు, నోట్‌బుక్‌లను మాత్రమే ఉంచాలి. ఇతర స్టేషనరీని అల్మరాలో లేదా డ్రాయర్‌లో భద్రపరచాలి.
గేమింగ్ పరికరాలు..
టేబుల్‌పై గేమింగ్ కన్సోల్, హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ పరికరం లేదా కంట్రోలర్‌ను ఉంచడం వల్ల పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. గేమింగ్ పరికరాన్ని చూడగానే పిల్లలకు ఆడాలనే కోరిక కలిగే అవకాశం ఎక్కువ. దీనివల్ల చదువుకునే సమయం తగ్గి, వారి ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. గేమింగ్ పరికరాలను వేరే గదిలో లేదా అల్మరాలో ఉంచాలి.
కోట్స్..
గెలుపుకు బోలెడు మార్గాలు ఉంటాయి. కొందరు భయంతో గెలవాలని ప్రయత్నం చేస్తారు. చాలామంది పిల్లలకు బాగా చదువుకుని మార్కులు బాగ తెచ్చుకోవాలని ఉన్నా, ఏదో బలహీనత వారిని వెనక్కు లాగుతూ ఉంటుంది. ఈ కారణంగా భయంతో చదువు వైపు ఏకాగ్రత పెట్టడానికి కొన్ని కోట్స్ రాసిన స్టిక్కర్స్ పెట్టుకుంటారు. కానీ భయంతో చదివే చదువుకంటే.. ఇష్టంతో చదివే చదువు చాలా బాగా గుర్తుంటుంది. అందుకే చదువుకోవడాన్ని ప్రేరేపించే విదంగా ఉండే కోట్స్ ను స్టడీ టేబుల్ లేదా చదువుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇది మరింత మెరుగ్గా చదవడానికి సహాయపడుతుంది.
చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు పైన చెప్పుకున్నవి పాటించడం వల్ల పిల్లలు చదువులో మరింత మెరుగ్గా ముందుకెళతారు.
*రూపశ్రీ.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే అంటూ ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో మంగళగిరిలోని తెలుగుదేశ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు. కెమెరాలు కట్ చేసి చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన తొలిసారి పెదవి విప్పారు.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. తన దగ్గర డబ్బు లేదు కాబట్టి బతుకుదెరువు చూపిస్తామని ప్రలోభ పెట్టారని, మండలినే రద్దు చేస్తామని బెదిరించారని నాటి వైసీపీ ఘాతులకాలను వివరించారు.
అయినా తనకున్న అధికారంతో మూడు రాజధానుల బిల్లు ఆమోదించలేదని షరీఫ్ సగర్వంగా చెప్పారు. నమాజ్ చేసుకుని అల్లాని ప్రార్థించుకుని 'అల్లా సత్యం వైపు ఉండేటట్లుగా నా కళ్లు తెరువు' అని కోరారన్నారు. ఎన్ని ఒత్తిడిలు ఉన్నా.. బెదిరించినా ధర్మం వైపు నిలబడాలనే అల్లా మాటలకు ఆరోజు కట్టుబడి ఉన్నా. ఆ తర్వాతా తనన న్ను చైర్మన్ స్థానం నుంచి దింపేందుకు అనేక కుట్రలు చేశారని, ఇప్పుడు అమరావతి రాజధానిగా చట్టం చేయడం ఆనందంగా ఉందని నాడు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు
అమరావతిని వైసీపీ నాశనం చేయాలని చూస్తే.. తాము శాసనం చేసి నిలబెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లోనూ అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయమన్నారు. అమరావతిలో శుక్రవారం (ఏప్రిల్ 3) మీడియాతో మాట్లాడిన చంద్రబాబు పార్లమెంటు ఉభయ సభల్లోనూ 35 మంది వరకు ఎంపీలు అమరావతికి మద్దతుగా మాట్లాడారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని అందరూ అన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతానికి రాజకీయ, సాంస్కృతిక ప్రాధాన్యం ఉందన్నారు. సమృద్ధిగా నీరు, సారవంతమైన భూములు ఉన్నాయన్నారు. ఆనాడు అసెంబ్లీలో వైసీపీ కూడా రాజధానిని సమర్థించిందని... కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని జగన్ చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాజకీయాలు, అవినీతి, సామాజిక అంశాలపై ప్రముఖ జర్నలిస్ట్, జమీన్‌రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌తో కలిసి తెలుగువన్ ఎండి కె. రవిశంకర్ నిర్వహిస్తున్న సంచలనాత్మక చర్చా కార్యక్రమం వాస్తవ వేదిక విజయవంతంగా కొనసాగుతోంది. తాజా సంచికలో తెలుగు రాజకీయాల్లో డ్రగ్స్ ప్రకంపనలపై విస్తృతంగా చర్చించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు. రాజకీయ నేతలు సమాజానికి రోల్ మోడల్స్‌గా ఉండాల్సిన తరుణంలో, వారిపై ఇటువంటి ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వాలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ వ్యసనం బారిన పడటం ఆందోళనకరమన్నారు. ఇక రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి వాడుకుంటున్నాయే తప్ప, మూలాల నుంచి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయడం లేదన్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు, వారి అనుచరులు డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్నప్పుడు, అది మీడియా చర్చలకే పరిమితమవుతోంది తప్ప వారికి కఠినమైన శిక్షలు పడిన దాఖలాలు దాదాపు లేదన్నారు.
డ్రగ్స్ మాఫియాను అరికట్టడానికి కేవలం పోలీసు చర్యలు సరిపోవనీ, ఇందులో వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటం వల్ల డ్రగ్స్ కేసుల విచారణలు తరచుగా నీరుగారిపోతున్నాయని డోలేంద్రప్రసాద్, రవిశంకర్ లు అభిప్రాయపడ్డారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే.. డ్రగ్స్ వినియోగాన్ని చట్టపరంగా తీవ్రమైన నేరంగా పరిగణించకపోవడం కూడా డ్రగ్స్ వినియోగం నిర్మూళనకు అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం డ్రగ్స్ అమ్మడం నేరం కానీ, తీసుకోవడం పెద్ద నేరంగా పరిగణించడం లేదనీ, దీనివల్ల నిందితులు సులభంగా బయటపడే అవకాశం ఉందన్నారు.
రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒక నూతన వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులను ప్రకటించినట్లే, తాము డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉన్నామని నిరూపించుకోవడానికి డోప్ టెస్ట్' నివేదికలను సమర్పించే నిబంధనను తీసుకురావాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులుగా ఉండేవారు ప్రతి ఆరు నెలలకోసారి రక్త పరీక్షలు చేయించుకుని, ఆ నివేదికలను బహిరంగపరచడం ద్వారా పారదర్శకతను పెంచాల్సి ఉందన్నారు. ఇది ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఒక సానుకూల సందేశాన్ని పంపుతుందన్నారు.
రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో నైతిక విలువలకు పెద్దపీట వేయాలని రవిశంకర్ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని రాజకీయాల నుంచి బహిష్కరించడం లేదా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. పంజాబ్ రాష్ట్రం ఎదుర్కొన్న 'ఉడ్తా పంజాబ్' వంటి దుస్థితి తెలుగు రాష్ట్రాలకు రాకూడదంటే, రాజకీయ నేతలు స్వచ్ఛందంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలనీ, రాజకీయాలు కేవలం అధికారం కోసమే కాకుండా, సామాజిక బాధ్యతను నెరవేర్చే వేదికలుగా మారినప్పుడే ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడం సాధ్యమౌతుందనీ డోలేంద్రప్రసాద్, రవిప్రసాద్ లు పేర్కొన్నారు.
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు. నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య నిపుణులు రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే చాలా మంది ప్రజలు తరచుగా తమ రోజును కప్పు టీతో లేక కాఫీతో మొదలుపెడుతుంటారు. దీని వల్ల ఉదయాన్నే చురుగ్గా పనిచేయగలుగుతామని చెబుతారు. అయితే టీకి బదులుగా ఉదయాన్నే ఒక గ్లాసు నీరు త్రాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు , రోజుకు ఎన్ని లీటర్ల నీరు త్రాగాలో.. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుంటే..
ఎన్ని లీటర్ల నీరు తాగాలి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరానికి సరైన మోతాదులో నీరు త్రాగడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతిరోజూ 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. వేసవి కాలంలో మరింత నీరు త్రాగడం మంచిది. జిమ్‌కు వెళ్లేవారు కూడా నీటిని ఎక్కువగా తాగాలి.
ఎప్పుడు నీరు తాగాలి?
ప్రతి ఒకటి నుండి రెండు గంటలకు కొద్దిగా నీరు త్రాగాలి. ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడం మంచిది కాదు. కొద్దికొద్దిగా నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనానికి 30 నిమిషాల ముందు నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు. అలాగే పడుకునే ముందు కొద్దిగా నీరు తాగవచ్చు, కానీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
ఉదయాన్నే ఎందుకు తాగాలి?
రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత, శరీరానికి తిరిగి తేమను అందించడానికి నీరు అవసరం. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
చర్మానికి మంచిది..
ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం అందాన్ని పెంచుతుంది. నిజానికి, నీళ్లు తాగడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఇది జుట్టుపై కూడా ప్రభావం చూపుతుంది. నీళ్లు తాగడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. తగినంత నీరు తాగడం వల్ల ముఖ ముడతలు తగ్గుతాయి , శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది.
జీవక్రియ..
ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల జీవక్రియ వేగవంతమవుతుంది. జీవక్రియను పెంచుకోవడం బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. దీని వల్ల కాలేయం, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం వల్ల పైన చెప్పుకున్న లాభలన్నీ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి రోజూ తప్పకుండా శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి.
*రూపశ్రీ.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి. కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి. అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి. చూడటానికి ఆకుపచ్చ రంగులో, క్యాలీ ఫ్లవర్ ను పోలిన బ్రోకలీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల జబ్బులను ఆమడ దూరంలో ఉంచే శక్తి బ్రోకలీకి ఉంది. అసలు బ్రోకలీలో ఉండే పోషకాలు ఏంటి? బ్రోకలీ తింటే ఏ వ్యాధులు దూరంగా ఉంటాయి? తెలుసుకుంటే..
బ్రోకలీలో ఉండే పోషకాలు..
బ్రోకలీలో ఫైబర్, విటమిన్-సి, విటమిన్-కె, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
బ్రోకలీ తింటే ఏ జబ్బులు దూరంగా ఉంటాయంటే..
గుండె జబ్బులు..
బ్రోకలీని తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇందుకోసం బ్రోకలీని తీసుకునే విధానం కూడా చాలా ముఖ్యం. ఆవిరి మీద ఉడికించిన బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
రక్తనాళాల ఆరోగ్యం..
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా బ్రోకలీ గుండె మరియు రక్తనాళాల వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు, పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి.
క్యాన్సర్..
బ్రోకలీకి క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే.. బ్రోకలీ యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రోస్టెస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
కంటిచూపు..
కంటి చూపుకు పదును పెట్టడంలో, దృష్టి లోపాన్ని నివారించడంలో, రేచీకటి వంటి దృష్టి సమస్యలు నివారించడంలో బ్రోకలీ కొంతవరకు సహాయపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.
పేగు ఆరోగ్యం..
బ్రోకలీలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి చక్కగా సహాయపడుతుంది. బ్రోకలీని తీసుకుంటూ ఉంటే పేగు ఆరోగ్యం మెరుగవుతుంది.
చక్కెర స్థాయిలు..
మధుమేహం ఉన్నవారు బ్రోకలీని తింటే చాలా ఉపయోగం. బ్రోకలీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు శరీరంపై రహస్యంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏసీలో ఎక్కువగా గడిపేవారిలో ఊబకాయం సమస్య చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఏసీ లో గడపడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ నిజాలు తెలుసుకోవాలి...
ఊబకాయం ఎలా పెరుగుతుందంటే..
కార్యకలాపాలు లేకపోవడం..
శరీరం సౌకర్యవంతంగా చల్లగా ఉన్నప్పుడు, అది శక్తిని ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయదు. రోజంతా కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల కేలరీల బర్నింగ్ గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా, కొవ్వు వేగంగా పేరుకుపోతుంది.
ఉష్టోగ్రత..
వేడి వాతావరణంలో, శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి శరీరం ఎక్కువగా శ్రమిస్తుంది, దీనివల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది. ఏసీలో ఉండటం ఈ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల జీవక్రియ రేటు తగ్గి బరువు పెరుగుతుంది.
ఆకలి..
చల్లని వాతావరణంలో శరీరానికి అదనపు శక్తి అవసరం ఏర్పడుతుంది. దీని ఫలితంగా తరచుగా ఆకలి వేయడం, విచక్షణారహితంగా జంక్ లేదా నూనె పదార్థాలను తినడం వంటివి ఊబకాయానికి దారితీస్తాయి.
చెమట, డిటాక్స్..
చెమట పట్టడం అనేది శరీరం సహజ డిటాక్స్ ప్రక్రియ. ఎయిర్ కండిషన్డ్ గదులలో ఉండటం వల్ల చెమట తక్కువగా పడుతుంది, దీనివల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి, బరువు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
మనస్సు, శరీరం..
చల్లటి గాలి మనసును మొద్దుబార్చి, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రేరణపై కూడా ప్రభావం చూపి, వ్యాయామం పట్ల ఇంటరెస్ట్ లేకుండా చేస్తుంది. సోమరితనం పెంచుతుంది.
ఇలా జాగ్రత్త పడాలి..
ప్రతి 45 నిమిషాలకు 5 నిమిషాల పాటు నడవాలి, లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి.
ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా ఉంచకూడదు, దానిని 24–26 డిగ్రీలకు పరిమితం చేయాలి.
ఇంటి పనులతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి.
తాజా పండ్లు, సలాడ్లు, నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
ప్రతిరోజూ వ్యాయామం కోసం కనీసం 30 నిమిషాలు కేటాయించాలి.
విశ్రాంతి ముఖ్యం, కానీ విశ్రాంతి అలవాటు వల్ల వచ్చే ఊబకాయం జీవితాంతం ఉండే ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ.
