జీన్స్ కొనేముందు తప్పనిసరిగా ఈ విషయాలు గుర్తుంచుకోవాలి!   ఇప్పటికాలం అమ్మాయిలు  వస్త్రాధరణ విషయంలో అబ్భాయిలకు ఏమీ తీసిపోవడం లేదు. అబ్బాయిలతో సమానంగా చక్కగా జీన్స్ ధరిస్తున్నారు. చాలామంది అమ్మాయిలు రెగులర్ గా ధరించడానికి జీన్స్ నే ఎంచుకుంటున్నారు. అయితే జీన్స్ కొనేముందు చాలా సందేహాలు వస్తాయి. వాటిలో జీన్స్ నాణ్యత నుండి కంఫర్ఠ్, ఫ్యాషన్ వరకు బోలెడు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా జీన్స్ కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలివీ.. సైజ్..  జీన్స్ కొనుగోలు చేసినప్పుడు,  సైజ్ ను బట్టి జీన్స్ ఎంచుకోవడానికి ముఖ్యం.అయితే ఈ సైజ్ జీన్స్  బ్రాండ్‌లు,  శైలులను బట్టి మారుతుంటుంది, కాబట్టి మీ సైజ్  కొలవడానికి టేప్ కొలతను ఉపయోగించాలి. దీనికి  అనుగుణంగా జీన్స్‌ని ఎంచుకోవాలి. స్టైల్ స్టైల్ ఎప్పుడు ట్రెండ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం  మార్కెట్లో లభించే జీన్స్ వివిధ స్టైల్స్,  కటింగ్స్‌లో లభిస్తున్నాయి. మీ స్టైల్ ను బట్టి జీన్స్ ను ఎంచుకోవడం మరచిపోకండి.   క్వాలిటీ.. జీన్స్  కొనుగోలు చేసేటప్పుడు , దాని నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఖరీదైన జీన్స్ ఎప్పుడూ మంచి నాణ్యతతో ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే చవకగా దొరికే జీన్స్ ను తీసిపారేయాల్సిన అవసరం లేదు.  కాబట్టి డబ్బు,  నాణ్యత రెండింటినీ గుర్తుంచుకోవాలి. క్వాలిటీ జీన్స్ ధరించడం ద్వారా మాత్రమే మీరు సౌకర్యాన్ని పొందవచ్చు. కలర్స్ క్రష్.. మీరు జీన్స్ కు ఇచ్చే ప్రాధాన్యత, ఉపయోగించే విధానం  ప్రకారం ముదురు నీలం, లేత నీలం, నలుపు,  స్టోన్‌వాష్ వంటి జీన్స్ రంగులను ఎంచుకోవచ్చు. వాషింగ్ విధానం.. ప్రతి రకం వస్త్రానికి ఒకో విధమైన వాషింగ్ స్టైల్ ఉంటుంది. జీన్స్ కొనుగోలు చేసేటప్పుడు, వాటిని ఎలా వాష్ చేయాలో తెలుసుకోవాలి. కొన్ని జీన్స్‌ని చేతితో ఉతకవచ్చు, మరికొన్ని డ్రై క్లీన్‌ చెయ్యాల్సి ఉంటుంది. చాలా జీన్స్‌లో వాషింగ్ మెషీన్‌లో ఉతకడం సాధ్యం  కాదు. కాబట్టి కొనుగోలు చేయబోయే జీన్స్ ఎలా వాష్ చేయాలో ముందే తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది.                                                       *నిశ్శబ్ద. 

Best Dresses for Your 20s 30s 40s Till few months back that was like a staple for me. Have to take my son, Aarav to the garden? I wear tee and jeans. Going to a dinner? I am wearing a fancy tee and jeans. Got to go to Aarav's school meeting? I am wearing a basic tee and jeans. So practically I have stayed in and out of jeans, like I did in college. But then it struck me suddenly, I will be soon turning 30, and while I like to believe that 30's is the new 20's, the truth is that my body, my face, my social interactions, and many other things around me have changed. So I guess I should start dressing appropriately, as per my age at each occasion. People say 30’s are the time to be more serious about life and style and Image. Well no, not really. This is the age where you are not on a fixed pocket money to shop, you are not under peer pressure, and you have a mind of your own. So here are my tips to dress fashionably at thirties: * Wear clothes that fit well and make you feel confident. Invest in quality fabrics, cuts and clothes that flatter your body, while steering clear of juvenile prints and tight or revealing clothes. As Marilyn Monroe said, ‘Your clothes should be tight enough to show you're a woman, but loose enough to show you're a lady.’ * You can still be fashion forward by pairing simple patterns and statement jewelry. My recommendations are bigger pieces of jewelry, because you exude the confidence it takes to pull these pieces off. * Don’t follow fashion blindly. Coloured pants are in fashion right now, so get at least one according to your body shape and style, but don’t get anything and everything that is available. So follow only those things that you are comfortable in, and not just because it is in. That way you will be able to get your money’s worth. * Buy good quality shoes. Shoes add a good elegance to your whole outfit. Have your shoes occasion wise. Peep-toes or heels for formals, sandals for slightly casual days, loafers or moccasin’s for a day out, and slip-ons only for the beach. Currently a whole range of styles are available so check what suits you. * Dressing like a 20-year old, no matter how much it might suit you, won't keep you looking young. Develop a look and personal style that has more sophistication, but retain some fun elements if that is your personality. Develop a style that is you from inside out, if you are feminine, look for fabrics which drape and have some softness. * Jeans are a great staple in many wardrobes, look for darker denims in plain washes rather than ripped or torn or distressed. Wear them with a funky sandal or flat or whatever the time and place demands. Throw out or donate jeans that are more than five years old. * Invest in some good blouses (casual and dressy), instead of wearing tees everywhere. * Get a trendy haircut by a good stylist who understands your lifestyle and day in general. A good haircut is like a quick makeover, it goes a long way if done well. * Invest in good quality creams for your skin. This is important for all ages but 30s are the most important. The way you treat your skin now, it will show the results later in life.

జుట్టుకు రంగు వేస్తుంటారా..ఈ షాకింగ్ నిజాలు తెలుసా!    ఈ రోజుల్లో హెయిర్ కలరింగ్ అనేది ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. కొత్త లుక్ కోసం,   స్టైలిష్ గా కనిపించడానికి, చాలా మంది జుట్టుకు వివిధ రకాల రంగులను ఉపయోగిస్తారు. కొంతకాలం క్రితం వరకు తెల్ల జుట్టును కవర్ చేయడానికి జుట్టు రంగును ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అది కొత్త ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారింది. కానీ పదే పదే జుట్టుకు రంగు వేయడం వల్ల జుట్టు బలహీనపడుతుందని  తెలుసా?. దీనితో పాటు  జుట్టుకు అనేక రకాల నష్టాన్ని కలిగిస్తాయి. జుట్టుకు అధికంగా రంగులు వేయడం వల్ల, జుట్టు పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. హెయిర్ కలర్ ని పదే పదే వాడటం వల్ల ఎలాంటి హాని జరుగుతుందో తెలుసుకుంటే.. జుట్టుకు రంగు వేయడం వల్ల కలిగే నష్టాలు.. జుట్టు రాలడం, విరిగిపోవడం హెయిర్ కలర్ ని పదే పదే వాడటం వల్ల, జుట్టు బలహీనపడి విరిగిపోతుంది. ఎందుకంటే అమ్మోనియా,  హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు జుట్టు రంగులో ఉంటాయి. ఇవి జుట్టు నుండి సహజ తేమను తొలగిస్తాయి.  చికాకు,  అలెర్జీలు.. పదే పదే జుట్టుకు రంగు వేయడం వల్ల తలపై చర్మం చికాకుకు లోనవుతుంది.  అలెర్జీలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పారాఫెనిలిన్ డైమైన్ (PPD) వంటి రసాయనాలు చికాకు, దురద,  దద్దుర్లు వంటి సమస్యలను కలిగిస్తాయి. జుట్టు పలుచన.. జుట్టుకు రంగు వేయడం వల్ల అది రాలిపోతుంది.  జుట్టు కూడా సన్నగా మారుతుంది. రసాయన రంగులు తల చర్మం  సహజ తేమ,  పోషణను తొలగిస్తుంది. దీని కారణంగా జుట్టు పలచబడుతుంది. జుట్టు  స్వభావం.. జుట్టుకు పదే పదే రంగు వేసుకుంటే జుట్టు మునుపటిలా మృదువుగా,  మెరుస్తూ ఉండదు. జుట్టు రంగు జుట్టును గజిబిజిగా చేస్తుంది. దీని వల్ల జుట్టు స్వభావం కోల్పోతుంది.                                  *రూపశ్రీ.  

అమ్మాయిలకు ఎంతో  ఇష్టమైన నెయిల్ ఆర్ట్.. ఇంట్లోనే సులభంగా ఇలా..!     పెళ్లి, పేరంటం, శుభకార్యం, ప్రత్యేక రోజులు.. ఈవెంట్స్.. ఇలా ప్రతి ఒకదానికి అమ్మాయిలు సెలబ్రిటీస్ కు తగ్గకుండా అందంగా తయారవుతుంటారు.  అందులో భాగంగా గోళ్లను ఆకర్షణీయంగా మార్చుకోవడం ఒకటి. గోళ్లు అందంగా కనిపించడానికి చాలామంది నెయిల్ పాలిష్ పెడుతుంటారు. డ్రస్ కు మ్యాచ్ అయ్యేలా నెయిల్ పాలిష్ పెట్టుకుంటే కనిపించే అందమే వేరు.. అయితే గోళ్లకు నార్మల్ నెయిల్ పాలిష్ పెట్టకుండా మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి నెయిల్ ఆర్ట్ బాగా సహాయపడుతుంది.  నెయిల్ ఆర్ట్ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయ్యింది కూడా. కాస్త సృజనాత్మకత ఉన్నవారు నెయిల్ పెయింట్ ఉపయోగించి నెయిల్ ఆర్ట్ ను సులభంగా వేసుకోవచ్చు. ఇంతకీ ఇంట్లోనే ఈ నెయిల్ ఆర్ట్ ను ఈజీగా ఎలా వేసుకోవాలో తెలుసుకుంటే.. నెయిల్ ఆర్ట్ కు కావలసినవి.. నెయిల్ పాలిష్ బేస్ కోట్ టాప్ కోట్ డాటింగ్ టూల్ లేదా టూత్ పిక్ టేప్ స్పాంజ్ నెయిల్ పాలిష్ రిమూవర్ నెయిల్ ఆర్ట్ వేసే విధానం.. మొదటగా గోళ్ల మీద ఎలాంటి పాత నెయిల్ పాలిష్ గుర్తులు లేకుండా నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగించి  తో తొలగించాలి.  తరువాత పొడవుగా ఉన్న గోళ్లను నచ్చిన ఆకారంలో అందంగా కనిపించేలా కట్ చేయాలి. గోళ్ల మీద బేస్ కోట్ అప్లై చేయాలి. ఇది గోళ్ల రంగులో ఉండే రసాయనాల నుండి గోళ్లను కాపాడుతుంది.  అంతేకాకుండా గోళ్ల మీద ఎక్కువసేపు నెయిల్ ఆర్ట్ నిలిచి ఉండేలా సహాయపడుతుంది. బేస్ కోట్ వేసిన తరువాత అది పూర్తీగా ఆరేవరకు వెయిట్ చెయ్యాలి. డాటింగ్ టూల్ లేదా టూత్ పిక్ ఉపయోగించి  గోళ్ల మీద  వివిధ రకాల సైజ్ లతో చుక్కలను పెట్టాలి. టేప్ ఉపయోగించడం వల్ల గోళ్ల మీద చారల గుర్తులను కూడా సులువుగా వేయవచ్చు. గోరు పై టేప్ ను అతింకించాలి.  దానిపై వేరేరంగు నెయిల్ పాలిష్ వేయాలి,  టేప్ తీసేసిన తరువాత చారల గుర్తులు పొందుతారు. తెలుపు లేదా ఏదైనా ఇతర రంగు నెయిల్ పాలిష్ ఉపయోగించి ఫెంచ్ ట్రిక్స్ ను క్రియేట్ చేయాలి.  ఇలా నెయిల్ ఆర్ట్ వేసుకున్న తరువాత నెయిల్ ఆర్ట్ తొందరగా పోకుండా ఉండటం కోసం గోర్ల మీద టాప్ కోట్ వేయాలి.  ఇలా వేసుకుంటే నెయిల్ ఆర్ట్ పూర్తయినట్టే. ఈ నెయిల్ ఆర్ట్ కు బేస్ కోట్,  టాప్ కోట్ వేసి ఉండటం వల్ల గోర్ల మీద నెయిల్ ఆర్ట్ చాలా కాలం ఉంటుంది. అలాగే  గోళ్లు కూడా రసాయనాల నుండి సేఫ్ గా ఉంటాయి.  ఫ్యాన్సీ గా కనిపించే గోళ్లు ఇంట్లోనే మెరుగులు దిద్దుకున్నట్టే.                                                       *రూపశ్రీ.

హీల్స్ గురించి ఈ విషయాలు తెలిస్తే మగువలు షాక్ అవుతారు..!    ఫ్యాషన్ ప్రపంచంలో, హీల్స్ లేదా హై-హీల్డ్ బూట్లు మహిళల శైలికి,  ఆకర్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా  పరిగణించబడతాయి. కానీ హీల్స్ మొదట్లో తయారు చేసింది అసలు  మహిళలకు కాదు, పురుషులకే అని మీకు తెలుసా? ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. హీల్స్ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  కాలక్రమేణా మారుతున్న సామాజిక,  సాంస్కృతిక  మార్పులను ఇది ప్రతిబింబిస్తుంది. దీని గురించి పూర్తీగా  తెలుసుకుంటే.. పురుషుల కోసమేనట.. ఎత్తు మడమల చెప్పులు లేదా బూట్ల  చరిత్ర 10వ శతాబ్దం నుండి ప్రారంభమవుతుంది. ప్రారంభంలో మడమలను పెర్షియన్ అశ్వికదళం ఉపయోగించింది. గుర్రంపై ఉన్నప్పుడు స్టిరప్స్‌లో వారి పాదాలను స్థిరంగా ఉంచడానికి వారికి ఎత్తు మడమల బూట్లు అవసరమయ్యాయి. ఈ డిజైన్ రైడింగ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి   వారికి సహాయపడిందట. క్రమంగా ఈ ధోరణి యూరప్‌కు చేరుకుంది.  16వ శతాబ్దం నాటికి  పురుషుల ఫ్యాషన్‌లో భాగమైంది. యూరప్‌లో మడమలు ఎత్తుగా ఉన్న బూట్లు,  చెప్పులను వేసుకోవడం అంటే  హోదా చిహ్నంగా చూడటం ప్రారంభించారు. ఎత్తు మడమల చెప్పులు ధరించిన వ్యక్తి ధనవంతుడు,  ప్రభావవంతమైన వాడుగా పరిగణించబడ్డాడు. ఎందుకంటే అతను శారీరకంగా కష్టతరమైన పని చేయవలసిన అవసరం లేదని ఇది చూపిస్తుంది. ఫ్రాన్స్ రాజు లూయిస్ XIV కూడా తన రాజ శైలిలో ఎత్తు మడమల బూట్లను ఒక భాగంగా చేసుకున్నాడు. వారి బూట్లకు తరచుగా ఎర్రటి మడమలు ఉండేవి. అవి వారి శక్తికి,  ప్రతిష్టకు చిహ్నంగా ఉండేవట. స్త్రీ ల వద్దకు ఇలా.. 17వ శతాబ్దం చివరి నాటికి మడమల ధోరణి స్త్రీలలో కూడా వ్యాపించడం ప్రారంభించింది. ఈ సమయంలో పురుషుల ఫ్యాషన్ నుండి ప్రేరణ పొంది మహిళలు హీల్స్ ధరించడం ప్రారంభించారు. ఈ ధోరణి ముఖ్యంగా యూరప్‌లో కనిపించింది.  అక్కడ మహిళలు తమ దుస్తులలో పురుషుల దుస్తులను చేర్చడం ప్రారంభించారు. 18వ శతాబ్దంలో పురుషులలో హీల్స్ ఫ్యాషన్  తగ్గిపోయినప్పటికీ అవి మహిళలకు ఫ్యాషన్‌లో ముఖ్యమైన భాగంగా మారసాగాయి. 19వ,  20వ శతాబ్దాలలో హీల్స్ మహిళల ఫ్యాషన్‌లో కొత్త గుర్తింపును సృష్టించాయి. ఇది శైలికి చిహ్నంగా మాత్రమే కాకుండా మహిళల కాన్పిడెన్స్ కు వారి గంభీరత్వానికి  చిహ్నంగా మారాయి. ఫ్యాషన్ డిజైనర్లు వివిధ డిజైన్లలో,  ఆకర్షణీయమైన రూపాల్లో హీల్స్‌ను ప్రవేశపెట్టారు. ఇది మహిళలకు తప్పనిసరిగా ఉండవలసిన యాక్సెసరీగా మారింది. నేటి ప్యాషన్ లో.. నేటి కాలంలో హీల్స్ మహిళల ఫ్యాషన్‌లో అంతర్భాగం. ఇది ఎత్తును పెంచడంలో సహాయపడటమే కాకుండా, స్త్రీలను ఆత్మవిశ్వాసంతో,  ఆకర్షణీయంగా భావించేలా చేస్తుంది. అయితే ఆధునిక యుగంలో సౌకర్యం,  శైలి రెండింటినీ దృష్టిలో ఉంచుకుని హీల్స్ డిజైన్‌లో అనేక మార్పులు చేయబడ్డాయి. ఇప్పుడు ఫ్లాట్ హీల్స్, వెడ్జ్ హీల్స్,  బ్లాక్ హీల్స్ వంటి చాలా రకాలు  కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి మహిళలకు సౌకర్యాన్ని, అందంగా కనిపించడాన్ని  రెండింటినీ  బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఇదీ హీల్స్ చరిత్ర.                               *రూపశ్రీ.  

ఆడవాళ్లు ట్రెండ్ ను ఫాలో అవడం అందరికి తెలిసిందే. కొత్త కొత్త లేటెస్ట్ ఫ్యాషన్ మార్కెట్ లోకి ఏది వచ్చిన కూడా దానిని ఫాలో అవడం చేస్తుంటారు. కానీ ట్రెండ్ ను ఫాలో అవడం కన్నా మీరే కొత్త ట్రెండ్ ను మీకోసం తయారు చేసుకోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన దుస్తులకు చక్కని లుక్ వస్తుంది. శరీరంలో ఛాతీ భాగం కాస్త బొద్దుగా ఉన్నవారు చేతుల విషయంలో జాగ్రత్తపడాలి. బుట్ట చేతులు, వదులుగా ఉండే చేతులు, కుచ్చులుండేలా.... అసలు కుట్టించుకోకూడదు. ఒంటికి అతుక్కుని ఉండే మోడల్ ఎంచుకోవాలి. కింది భాగంలో వదులుగా ఉండేలా దుస్తులు కుట్టించుకుంటే పై భాగం నుంచి దృష్టి మళ్ళుతుంది. నడుం కిందిభాగం లావుగా ఉండేవారు దుస్తుల చేతులతో తమాషాలు చేయవచ్చు. రకరకాల కుచ్చులు, బుట్ట చేతులు, వదులుగా ఉండే పొడవు చేతులు, రఫెల్స్... ఇలా ఎన్నో రకాలు ప్రయత్నించవచ్చు. అప్పుడు పైన కింద బ్యాలెన్స్ అయ్యి ఆకృతి అందంగా కనిపిస్తుంది. మీ చేతులు సన్నగా ఉన్నాయా? ఒంటికి అటుక్కున్నట్లు, వేలడుతున్నట్లుండే ఫ్యాబ్రిక్ కాకుండా కాస్త నిలబడి ఉండే వస్త్రం ఎంచుకోవాలి. పొడవు చేతులు, మూడొంతుల పొడవున్న చేతులు ఇలాంటివారికి బాగుంటాయి. చేతులు లావుగా ఉన్నాయా? మీరు తప్పనిసరిగా మూడొంతుల పొడవుండే వదులు చేతులు కుట్టించుకోవాలి. పొట్టి చేతులు మీకు బాగోవు. చక్కటి కుచ్చులతో ఒక మంచి షర్టు మీ వార్డ్ రోబ్ లో లేదా? ఒక మీటరు మంచి లేసు తీసుకుని మీ దగ్గరున్న తెల్ల షర్టుకి కుట్టించుకోండి. మీ దగ్గర ఒక మంచి పొడవు చేతుల తెల్ల షర్టు ఉంది. దాన్ని స్కర్టు మీద ధరించినపుడు అలాగే వేసుకోండి. అదే ప్యాంటు మీద ధరించినపుడు అలాగే వేసుకోండి. అదే ప్యాంటు మీద ధరించినపుడు అంచుల్ని రెండు మడతలు పైకి మడిచారనుకోండి. స్టైల్ గా ఉంటుంది.

చెవి పోగులు భారతీయ మహిళల అందాన్ని మరింత పెంచుతాయి.  ముక్కు కుట్టించడం,  చెవులు కుట్టించడం వెనుక చాలా ఆరోగ్య రహస్యం దాగుందని కూడా చెబుతారు. అయితే ఫ్యాషన్ పెరిగేకొద్దీ ఇలా చెవులు కుట్టించడం, ముక్కు కుట్టించడం చాదస్తం అనుకుంటున్నవారు ఉన్నారు.  దీనివల్ల ఇప్పటికే  ముక్కు కుట్టించడం అనే  అలవాటు చాలా వరకు తగ్గిపోయిందని చెప్పాలి. అయితే చెవి పోగులు మాత్రం ఫ్యాషన్ కు తగ్గట్టు అప్డేట్ అవ్వడం వల్ల సాధారణ దుస్తుల నుండి వివిధ రకాల ఫ్యాషన్ దుస్తుల వరకు సెట్ అయ్యే చెవి పోగులు అందుబాటులో ఉంటాయి. అమ్మాయిల దగ్గర చెవి పోగులకు సంబంధించి చాలా వివిధ్యమైన కలెక్షన్ ఉంటుంది.  ఓ సారి వాటి వైపు లుక్కేస్తే.. వెండిపొర చెవి పోగులు.. సూట్ వేసుకున్నా  చీర కట్టుకున్నా రెండు రకాల దుస్తులకు సెట్ అయ్యేలా చెవి పోగులు కావాలి అంటే వాటికి వెండిపొర చెవిపోగులు కరెక్ట్ గా సెట్ అవుతాయి. వెండి ధర బంగారం కంటే తక్కువే కాబట్టి  వెండిపొర చెవిపోగులు తీసుకుంటే అద్భుతంగా ఉంటాయి. కుందన్ చెవిపోగులు.. ఈ రోజుల్లో కుందన్ చెవి పోగులు ప్రతి సంప్రదాయ దుస్తులపై చాలా బాగా సెట్ అవుతాయి.  సెట్ అవ్వడమే కాదు.. మరింత అందాన్ని పెంచుతాయి. సూట్ తో అయినా చీరతో అయినా వివిధ రకాల వెస్ట్రన్ దుస్తులతో అయినా చెవిపోగులు ధరించడం వల్ల అందం మరింత పెరుగుతుంది. స్టడ్ చెవిపోగులు.. స్టడ్ చెవిపోగులు చెవులకు అతుక్కున్నట్టు ఉంటాయి.  ఇవి ఇవి పరిమాణాన్ని బట్టి మరింత సింపుల్ లుక్ అయినా, గ్రాండ్ లుక్ అయినా ఇస్తాయి.  సాధారణ దుస్తుల నుండి అన్నిరకాల వస్త్రాలకు మంచి క్లాసీ లుక్ ఇవ్వడంలో ఇవి బాగుంటాయి. బుట్టలు.. దుస్తులలో అయినా ఆభరణాలలో అయినా బుట్టలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  పట్టు పావడా కొట్టించినా,  చీరలో జాకెట్ కుట్టించినా  హ్యాండ్స్ కు బుట్ట పెట్టిస్తే ఆ కళనే వేరు. ఇక బుట్ట కమ్మలు ఎంత సెన్సేషన్ సృష్టించాయో మాటల్లో చెప్పలేం. పెళ్లికూతురు అంటే ఖచ్చితంగా బుట్ట కమ్మలు పెట్టుకున్న బుట్టబొమ్మే అయ్యుంటుంది. ఈ బుట్ట కమ్మలు కూడా వివిధ రకాల డిజెన్లతో చాలా స్టైల్స్ లో అందుబాటులో ఉంటాయి. కేవలం బంగారమే కాకుండా వివిధ రకాల మెటల్స్ లో అందుబాటులో ఉంటాయి.                                       *రూపశ్రీ.

  మహిళల మానసిక ఆరోగ్యం మీద ఫ్యాషన్ ప్రభావం ఉంటుందా!   ఫ్యాషన్ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెట్టేది,  ఒక వ్యక్తి రూపాన్ని మార్చేసేది,  ఒక వ్యక్తిని అందంగా చూపెట్టేది.  ముఖ్యంగా అందంగా కనబడాలనే తపనతోనూ,  అందరిలో తాము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటారు.  అయితే ఫ్యాషన్ కు మానసిక ఆరోగ్యానికి మధ్య చాలా సంబంధం ఉందని అంటున్నారు మానసిక  నిపుణులు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. మానసిక ఆరోగ్యంపై ఫ్యాషన్ ప్రభావం.. మంచి బట్టలు.. మంచి బట్టలు వేసుకోవడం ఫ్యాషన్ లో భాగమే.. ఒక మనిషిని హుందాగా,  పది మందిలో గౌరవంగా నిలబెట్టడంలో వస్త్రధారణ కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల అందరిలో  చాలా సౌకర్యవంతంగా ఉండగలుగుతారు. దీన్ని బట్టి చూస్తే ఫ్యాషన్ అనేది మనిషి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  మనిషి మానసిక ఆరగ్యం పైన సానుకూల ప్రభావం చూపిస్తుంది.  ఒంటరితనం.. ఫ్యాషన్ అనేది  ఏ ఒక్కరో ఫాలో అయ్యే విషయం కాదు. ఫ్యాషన్ ను కొందరు ఉమ్మడిగా ఫాలో అవుతారు. ముఖ్యంగా ఫ్యాషన్ లో భాగంగా ఫ్యాషన్ షోలు,  ట్రెడిషన్,  వెస్ట్రన్,  ఫారిన్ అంటూ వివిధ రకాల కల్చర్ కు సంబంధించిన దుస్తులను అందరూ ఉమ్మడిగా ధరిస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు.  ఇది వ్యక్తిని ఒంటరితనం నుండి బయటకు తీసుకు వస్తుంది.  అంటే ఫ్యాషన్ అనేది మనిషిని సమాజంలో భాగం చేస్తుంది. ప్రతికూలత కూడా.. ఫ్యాషన్ అనేది కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ.. కొందరిని మానసిక ఒత్తిడిలోకి కూడా నెట్టుతుంది. ముఖ్యంగా ఫ్యాషన్ లో భాగంగా మానసిక ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. ఇతరులతో పోల్చుకోవడం,  ఇతరుల కంటే తాము ఫ్యాషన్ గా లేమని అనుకోవడం,  తమను తాము తక్కువ చేసుకోవడం.  ఇలాంటివన్నీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫ్యాషన్ అనేది వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచినా అది వ్యక్తి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది.  ఖరీదైన దుస్తులు,  ఖరీదైన ఆభరణాలు,  ఖరీదైన హ్యాండ్ బ్యాగులు,  వాచ్ లు, చెప్పులు.. ముఖ్యంగా మ్యాచింగ్ వేర్ అనేది ఫ్యాషన్ లో భాగం కాబట్టి చాలా ఖర్చు అవుతుంది.  ఇది ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది.  ఇది క్రమంగా ఒత్తిడి,  ఆందోళనకు దారితీస్తుంది. ఫ్యాషన్ ఇప్పట్లో చాలా వేగంగా మారిపోతుండటం వల్ల ఇది ఎక్కువగా ఉంది. ఫ్యాషన్ అనేది వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెట్టేదే.. కానీ ఈ ఫ్యాషన్ ఫాలో అయ్యే పది మందిలో ఏ ఒక్కరో తగినంత ఫ్యాషన్ గా లేకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా మిగిలిన వ్యక్తుల నుండి వివక్ష ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఫ్యాషన్ గా లేకపోవడాన్ని నేటి కాలంలో అనాగరికంగా భావించడం కూడా దీనికి కారణం. ఫ్యాషన్ లో పోకడలు ఏవైనా  సమాజ ఆమోద యోగ్యంగా ఉన్నంతవరకు ఎలాంటి నష్టం ఉండదు. కానీ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నా,  సమాజ కట్టుబాట్లకు భిన్నంగా ఉన్నా ఆ వ్యక్తిని దూరం ఉంచినట్టు,  ఆ వ్యక్తిని ఒంటరిగా ఉంచినట్టు చేస్తారు. పై కారణాలు అన్నీ గమనిస్తే.. ఫ్యాషన్ అనేది మనిషిని ఉన్నతంగానూ నిలబెట్టగలదు.. అదే విధంగా సమాజం నుండి వేరు చేసి దోషిగానూ నిలబెట్టగలదు.  మానసికంగా ఆత్మవిశ్వాసంగా ఉంచగలదు,  కృంగదీయగలదు కూడా.  వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాషన్ ను ఫాలో అవ్వడం మంచిది.                                        *రూపశ్రీ.

  ఈకలతో ఈకాలం ఫ్యాషన్ అమ్మాయిల అందం పెంచడంలో చెవి రింగులకు ప్రాధాన్యత చాలా ఉంటుంది. అలాంటి చెవి రింగులు రోజూ ఒకటే తరహావి పెట్టుకుంటే ఏం బావుటుంది. అప్పుడప్పుడు కొత్తవి కూడా ట్రై చేస్తూ ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ కు తగ్గట్టు మన చెవి రింగులు ఎంపికచేసుకోవాలి. అలాంటి మోడల్స్ లో ఒకటే ఈ ఫెదర్ ఇయర్ రింగ్స్. మోడ్రన్ గా కనిపించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. పక్షి ఈకలతో తయారుచేసే ఈ ఫెదర్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలు దొరుకుతున్నాయి. ఇవి మోడ్రన్ దుస్తుల మీదకి అయితే బాగా నప్పుతాయి. మామూలు చుడీదార్స్ మీదకి కూడా బావుంటాయి. కానీ... చుడీదార్స్ మీదకి ఈ రింగులు కొంచం జాగ్రత్తగా ఎంపికచేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మోడ్రన్ గా కనిపించండి...

ఆడవారి వార్డ్ రోబ్ అధిరిపోవాలంటే ఈ ఐదు చిట్కాలు చాలా ముఖ్యం..    బీరువా లేదా వార్డ్ రోబ్ నిండా మంచి మంచి దుస్తులు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఎంత మంచి దుస్తులు కొన్నా ఏదో వెలితి మహిళలను వెంటాడుతుంటుంది. వార్డ్ రోబ్ తీయగానే ఎందుకో అంతగా ఆకర్షించని దుస్తులు చాలావరకు వెక్కిరిస్తున్నట్టు ఉంటాయి. కొనేటప్పుడు ఉన్నంత హుషారు ఆ తరువాత చాలావరకు ఉండదు. కానీ తీసేద్దామని అనుకునేటప్పుడు మాత్రం ఆ దుస్తులకోసం పెట్టిన ఖర్చు గుర్తుకొస్తుంది. ఈ కారణంగా మహిళల వార్డ్ రోబ్ లలో ధరించని దుస్తులు ఎక్కువ ఉంటాయి. కేవలం ఐదే ఐదు చిట్కాలు పాటించడం వల్ల దుస్తుల విషయంలో చాలా జాగ్రత్త పడవచ్చు. కేవలం మంచి దుస్తులు మాత్రమే వార్డ్ రోబ్ లో ఉంచేలా చేయడమే కాదు, డబ్బు కూడా ఆదా చేయవచ్చు. ఆ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. బాగా సరిపోయే దుస్తులను ఎంపిక చేసుకోవడం ఎప్పుడూ ముఖ్యం.  శరీర సౌష్టవానికి తగిన షేప్,  శరీరానికి నప్పే రంగుల కోసం ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతారు. కానీ తీరా కొన్నాక బాలేదని అనిపిస్తుంది.ఒకటి రెండు అలాంటివి ఉన్నా పర్లేదు కానీ ఎక్కవ మొత్తం వార్డ్ రోబ్ లో ఉంటే మాత్రం కష్టమే.. ఇలాంటివి అరికట్టడానికే ఈ సింపుల్ టిప్స్.. రెగులర్స్ పై సేవింగ్స్.. కొన్ని దుస్తులకు  అధిక ఖర్చు అవసరం లేదు. రోజువారి ధరించే టీ షర్డ్ లు, టాప్ లు, షార్ట్ లు, ప్యాంట్ లు తక్కువ దగ్గరకు దగ్గరలో ఉన్న దుకాణాలలో లభిస్తాయి. ఇలాంటి దుస్తులకు బ్రాండెడ్ అనే ట్యాగ్ కోసం వెంపర్లాడకండి. ఇవి రోజూ ధరిస్తుంటారు కాబట్టి తక్కువ ధరవే బెస్ట్.  పైపెచ్చు తక్కువ ధరకు లభించే వీటిని ఎక్కువ మొత్తం ఒకేసారి తీసుకుంటే దుకాణాదారులు  కాస్త డిస్కౌంట్ కూడా ఇస్తారు. దీనివల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది, ఇంకోవైపు  సౌకర్యవంతంగా ఉన్నవి కొన్నట్టు ఉంటుంది.  వార్డ్ రోబ్  శుభ్రం చేయాలి..  ఇది దాదాపు అందరు మహిళలకు ఏదో ఒక సమయంలో ప్రయోజనం చేకూర్చే  చిట్కా.  ఎప్పుడూ ధరించని దుస్తులను బయటకు తీసేయాలి.  ధరించకూడదని పదే పదే అవాయిడ్ చేస్తున్న దుస్తులు, పాతగైపోయిన వస్త్రాలు తొలగించడం వల్ల వార్డ్ రోబ్ ఇష్టమైన వాటితో వెలిగిపోతుంజి. నచ్చని దుస్తులను   స్వచ్ఛంద సంస్థలకు  విరాళంగా ఇవ్వచ్చు. దీనివల్ల ఒకింత సంతృప్తి కూడా లభిస్తుంది. క్లాసిక్‌ దుస్తులు ఉండాలి.. ఎక్కువ కాలం  వార్డ్‌రోబ్‌లో తళుక్కున మెరవాలంటే అవి ఖచ్చితంగా క్లాసిక్ దుస్తులు అయి ఉండాలి. ఎందుకంటే క్లాసిక్ దుస్తులకంటే  విలువైనవి ఏవీ లేవు. వాటిలో కొద్దిగా నలుపు రంగు దుస్తులు ,  తెల్లటి చొక్కా, బ్లేజర్, ఒక జత  జీన్స్, నలుపు ప్యాంటు, స్మార్ట్ ఉన్ని కోటు, న్యూట్రల్ కార్డిగాన్,  ర్యాప్ డ్రెస్ మొదలైనవి ఉంచవచ్చు. ఇవి  సౌకర్యవంతంగా కొంచెం ఎక్కువ ఖర్చు చేయగల దుస్తులు. మరో మాటలో చెప్పాలంటే, కొంచెం ఖరీదైన శీతాకాలపు కోటు మీకు అందంగా సరిపోతుంటే దానిని కొనడం ఆపుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇవి   చాలా సంవత్సరాలు ధరించే అవకాశం ఉంది. ట్రెండింగ్..  ప్రతి సీజన్ దానితో పాటు ట్రెండింగ్ దుస్తులను తీసుకువస్తుంది. ఇటీవలి సీజన్‌లలో శిల్పకళతో కూడిన భుజాలు,  గ్లాడియేటర్ హీల్స్ ఉన్న టాప్‌ల నుండి సీక్విన్స్,  స్టడ్‌ల వరకు ప్రతిదీ ఉంటోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే చందాన పాత తరం ఫ్యాషన్ మళ్లీ కొత్త సొబగులతో వచ్చి అలరిస్తుంది.  కాబట్టి  ట్రెండింగ్ దుస్తుల కోసం  ఖర్చు పెట్టడంలో  అతిగా ఉండకూడదు. కంఫర్ట్ ముఖ్యం.. ఏ దుస్తులు అయినా కంఫర్ట్ గా లేకపోతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దుస్తులలో అందమంతా కంఫర్ట్ గా ఉండటంలోనే సగానికి పైగా ఎస్సెట్ అవుతుంది. శరీర ఆకృతి, శరీరంలో భాగాలకు అనుగుణంగా తగిన దుస్తులు ఎంచుకోవడం వల్ల దుస్తులు, శరీరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపిస్తాయి. అందుకే శరీరాకృతికి తగిన దుస్తులు ఎంచుకుంటే అవి ఎప్పుడు ధరించాలన్నా ఇష్టంగా ఉంటుంది.                                                                      *నిశ్శబ్ద

ఈ స్టైలిష్ నెయిల్ ఆర్ట్ డిజైన్‌లు మీరూ ట్రై చేయండి చాలా మంది మహిళలు తమ గోళ్లను అందంగా మార్చుకోవడానికి సెలూన్‌కి వెళ్లి మెనిక్యూర్ చేయించుకోవడానికి ఇష్టపడతారు. అయితే మీరు బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే ఇంట్లోనే  మీరు నెయిల్ ఆర్ట్‌తో మీ గోళ్లకు అందమైన డిజైన్‌ను కూడా ఇవ్వవచ్చు. నెయిల్ ఆర్ట్ క్లిష్టంగా కనిపించవచ్చు కానీ మీరు ఇంట్లోనే మీ గోళ్లకు సులభంగా అందమైన రూపాన్ని ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో మహిళలు సరళమైన, హుందాగా ఉండే రంగు డిజైన్లలో ఫ్యాన్సీ నెయిల్ ఆర్ట్‌ను చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ నెయిల్ ఆర్ట్ చేయడానికి పదే పదే నెయిల్ ఆర్ట్ స్టూడియోకి వెళ్లడం వల్ల మీ నెయిల్స్ బలహీనంగా మారుతాయని మీకు తెలుసా?.. ఎలాంటి ప్రొఫెషనల్ సహాయం లేకుండానే మీరు చేయగలిగిన నెయిల్ ఆర్ట్‌లోని కొన్ని సరళమైన,  హుందాగా ఉండే డిజైన్‌లను చూద్దాం. ఇంట్లో మీరే చేయోచ్చు. 1. జిగ్‌జాగ్ డిజైన్: ఈ నెయిల్ ఆర్ట్ తయారు చేయడం చాలా సులభం. 2. హాఫ్ మూన్ స్టైల్: ఈ నెయిల్ ఆర్ట్ చాలా సింపుల్ గాచ చేయోచ్చు. 3. స్టోన్ వర్క్ నెయిల్ ఆర్ట్ డిజైన్: ఈ రకమైన నెయిల్ ఆర్ట్ చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. 4. షిమ్మర్ డిజైన్ నెయిల్ ఆర్ట్:   సరళంగా, హుందాగా ఉంటుంది. 5. మోనోక్రోమ్ గ్రాఫిక్ నెయిల్ ఆర్ట్: ఇది సరికొత్త డిజైన్, చాలా మంది మహిళలకు ఈ నెయిల్ ఆర్ట్ గురించి తెలియదు. 6. స్ట్రిప్ డిజైన్ నెయిల్ ఆర్ట్ డిజైన్‌లో మీరు ఏ నిపుణుల సహాయం తీసుకోవలసిన అవసరం లేదు.   7. పోల్కా డాట్ నెయిల్ ఆర్ట్ అనేది బట్టలు లేదా పాదరక్షల ట్రెండ్‌లో మాత్రమే కాకుండా, నెయిల్ ఆర్ట్‌లో పోల్కా డాట్ లుక్‌ని కూడా అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.

కాటుక వాడే అమ్మాయిలు ఈ నిజాలు తెలిస్తే షాకవుతారు!   అదేంటో గానీ అబ్బాయిల ముఖంలోనూ, అమ్మాయిల ముఖంలోనూ అవయవాలన్నీ ఒకే విధంగా ఉన్నా అమ్మాలకు క్రెడిట్ ఎక్కువ. కళ్లు, ముక్కు, పెదవులు, నుదురు, బుగ్గలు ఇలా ప్రతిదీ అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల కళ్లను చూసి ఫిదా అయ్యేవారు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు కళ్లకు కాటుక పెట్టి, నుదుటన బొట్టుతో అమ్మాయిలు కనిపిస్తే బాపు బొమ్మ అనే ట్యాగ్ ఇచ్చేవారు. అయితే కాలంతో పాటు ఫ్యాషన్ మారింది. ఫ్యాషన్ కు తగ్గట్టు పాత సౌందర్య ఉత్పత్తులు కొత్తగా పరిచయం అవుతున్నాయి. వాటిలో కాజల్ కూడా ఒకటి. కాటుకను ఫ్యాషన్ గా కాజల్ అని పిస్తుంటారు. వాటర్ ప్రూప్ అని చాలా రకాలుగా కాటుక అందుబాటులోకి వచ్చాక అమ్మాయిలు వివిధ రకాలుగా కాటుక అప్లై చేసి కళ్లను మెరిపిస్తారు. అయితే ఇప్పట్లో కాటుక వాడుతున్న అమ్మాయిలు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. వాటిని తెలుసుకున్న తరువాత బహుశా ఖచ్చితంగా షాకవుతారు. కాటుక వెనుక నిజం.. ఇప్పట్లో కాటుకను కాజల్ అని, పెన్సిల్ తోనూ, కోన్ తోనూ, స్కెచ్ తోనూ పెట్టడం అలవాటైంది. ఎక్కువసేపు ఇది నిలిచి ఉండాలనే కారణంతో బ్యూటీ ఉత్పత్తులు కాజల్ తయారీలో రసాయనాలు ఉపయోగిస్తారు. ఒకప్పటిలా ఆవు నెయ్యి, బాదం, ఔషద మూలికలతో తయారైన కాటుక కాకపోవడం   వల్ల నేటి కాలం కాజల్ కళ్లకు నష్టం కలిగిస్తాయి. కాటుక పెడితే కళ్లు అందంగా కనిపిస్తాయేమో కానీ వాటిలో ఉన్న జింక్, ఐరన్, లెడ్ ఆక్సైడ్ వంటి పదార్ధాలు కళ్లకు ప్రమాదం కలిగిస్తాయి. ఇవి కళ్లకు అప్లై చేసిన తరువాత రాత్రికి అంతా క్లీన్ చేయాలి. లేకపోతే రసాయనాలు చర్మంలో ఇంకిపోయి డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం అవుతుంది. అందుకే రాత్రి సమయంలో కళ్ల చుట్టూ ఉన్న కాటుక తొలగించాలి. అందుకోసం కింది పద్దతులు ఫాలో అవ్వాలి. కళ్ల చుట్టూ ఉన్న కాటుకను తొలగించడానికి వేజిలైన్ లేదా ప్రెట్రోలియం జెల్లీ వాడాలి. గోరుతో కొద్దిగా పెట్రోలియం జెల్లీ తీసుకుని దాన్ని కళ్లకు అప్లై చేసి మెల్లిగా మసాజ్ చేస్తూ కాటుక తొలగించుకోవాలి. తరవాత కాటన్ ప్యాడ్ తో తుడిచేసుకోవాలి. చాలామంది మేకప్ రిమూవ్ చేయడానికి క్లెన్సింగ్ మిల్క్ వాడతారు. ఇది కాటుక తొలగించడానికి కూడా సహాయపడుతుంది. కాటన్ ప్యాడ్ మీద క్లెన్సింగ్ మిల్క్ తీసుకుని దానితో కంటి చుట్టూ మెల్లిగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే కాటుక తొలగిపోతుంది. రోజ్ వాటర్ చాలామంది బ్యూటీ కేర్ లో ఉపయోగిస్తారు. కాటన్ ప్యాడ్ ను రోజ్ వాటర్ తో తడిపి దీంతో కళ్ల చుట్టూ ఉన్న కాటుక తొలగించవచ్చు. ఇవన్నీ చాలా తక్కువ ధరలో కాటుక తొలగించుకోవడానికి సురక్షితమైన పద్దతులు.                                             *నిశ్శబ్ద

ఏ డ్రస్సులో ఏ చెప్పులు వేసుకుంటే అట్రాక్షన్ గా ఉండచ్చో తెలుసా! ఫ్యాషన్, స్ట్రైల్, ట్రెండింగ్ అనే పదాలు అమ్మాయిలను ఒక్కచోట కుదురుగా ఉండనివ్వవు. ఈ ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్దది. ఒకటి, రెండు కాదు అలంకరణలు, అందంగా తీర్చిదిద్దే అధ్బుతాలు. ఒకప్పటి పాత తరం అలంకరణ, వస్త్రాధరణ కూడా ఇప్పుడు మళ్లీ కొత్త సొబగులతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. అయితే ఫ్యాషన్ లో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకునేది మ్యాచింగ్. ఒక డ్రస్ వేసుకుంటే దానికి తగ్గట్టు గాజులు, నగలు, జడ పిన్నులు, బొట్టు బిళ్ల ఇలా అన్నీ ఫ్యాషన్ గా ఉండాలి. అయితే ఈ మ్యాచింగ్ పరంపరలో చెప్పులకు ప్రాధాన్యత ఇచ్చేవారు తక్కువగానే ఉంటారు. అలాగని మరీ దుస్తులు కొన్నట్టు  చెప్పులు కొనాలంటే అయ్యేపని కాదు. మరి ఏ తరహా దుస్తులకు ఎలాంటి చెప్పులు బాగుంటాయో తెలుసుకుంటే ఓ మూడు లేదా నాలుగు జతల చెప్పులతో అన్నింటికీ ఆకర్షణగా ఉండేలా సరిపెట్టవచ్చు. ఫ్లాట్ చెప్పులు.. ఫ్లాట్ చెప్పులు లెగ్గింగ్స్ లేదా ఫ్యాంటు  ధరించినప్పుడు వేసుకోవచ్చు. ఈ ఫ్లాట్ లలో చాలా విభిన్నమైన డిజైన్లు ఉన్నాయి. ఫ్యాంటు లేదా లెగ్గింగ్స్ పొట్టిగా ఉంటే స్ట్రాపీ చెప్పులు వేసుకోవచ్చు. అదే లెగ్గింగ్స్ పొట్టిగా లేకుండా నార్మల్ గా ఫ్లాట్ గా ఉన్న చెప్పులు వేసుకోవచ్చు.   స్టిలెట్టోస్.. కేవలం వెస్ట్రన్ దుస్తులకే కాకుండా అన్నిరకాల దుస్తులతోనూ ఈ స్టిలెట్టోస్ చక్కగా ఉంటాయి. వీటిని ఎత్నిక్ తో ధరించవచ్చు. కావాలనుకుంటే చీరతో కూడా వీటిని వేసుకోవచ్చు.  ఇవి వేసుకున్నప్పుడు చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. వెడ్డెస్.. ఈ వెడ్డెస్ చెప్పులను ఏ సీజన్ లో అయినా సాదారణ దుస్తులతో అయినా కూడా వేసుకోవచ్చు. ప్యాంట్, సూట్,  ఇతర దుస్తులలో కూడా ఇవి చాలా అట్రాక్ట్ గా కనిపిస్తాయి. పైపెచ్చు ఇవి ఫ్యాషన్ కు మెరుగులు దిద్దుతాయి. షూస్.. పొడవాటి షర్ట్, లాంగ్ టాప్, టీ షర్ట్ టాప్ వంటి విదేశీ టాప్స్ దరించి వీటికి కిందుగా లెగ్గింగ్స్ ధరిస్తే మాత్రం షూస్ ఎంపిక అధిరిపోతుంది. షూస్ బోలెడు రంగులలో ఉంటాయి. ఈ షూస్ లోకూడా స్నీకర్లు అని పిలువబడేవి అమ్మాయిలకు అందం. కేవలం ఇలా డ్రస్సులలోకే కాదు. వ్యాయామం, రన్నింగ్, జాగింగ్ వంటి సందర్భాలలో స్నీకర్లు చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. వీటి వల్ల పాదాల నొప్పలు రావు. లోఫర్లు.. లోఫర్లు ధరించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే అన్ని రకాల దుస్తులలోకి ధరించవచ్చు. లెగ్గింగ్స్ నుండి విదేశీ దుస్తుల వరకు అన్ని రకాల దుస్తులతో ఈ లోఫర్లు ధరించవచ్చు. హై హీల్స్.. మహిళలు ఎన్ని రకాల చెప్పులు ధరించినా హై హీల్స్ దగ్గరకు తప్పకుండా తిరిగి వస్తారు. ఈ హై హీల్స్ వల్ల కాళ్ళ నొప్పులు వచ్చినా సరే ఎలాంటి సంకోచం లేకుండా వీటిని వేసుకోవడానకి ఇష్టపడతారు. స్కూల్, కాలేజీ వారి నుండి పెద్దల వరకు హీల్స్ కు ఓటు వేసేవారు ఎక్కువ. హై హీల్స్ ఓ జత మీతో ఉంటే ఈవెంట్ లో బాగా షో కొట్టచ్చు.                                      *నిశ్శబ్ద.

ఈ టిప్స్ తో పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గా కనిపించవచ్చు! ప్రస్తుత కాలంలో అమ్మాయిల డ్రెస్సింగ్ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్సు రంగు నుండి ప్రతిదీ మ్యాచింగ్ ఉండేలా చూసుకుంటారు అమ్మాయిలు. అయితే డ్రెస్సులు, జ్యువెలరీ, మేకప్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. చాలామంది అమ్మాయిలు కేవలం కాళ్ళకు వేసుకునే చెప్పుల విషయంలో చాలా కమిట్మెంట్ తో ఉంటారు. ఒక్కో రకమైన డ్రెస్సుకు ఒక్కో రకం పాదరక్షలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి కూడా. . వీటిని ధరించి అందరూ స్టైలిష్‌గా కనిపిస్తారు. కానీ, ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలకు చెప్పలేనంత అసౌకర్యం ఉంటుంది. అందులోనూ పొట్టిగా ఉన్న  ఆడపిల్లలు తమ ఎత్తు ఎక్కువగా కనిపించేందుకు హై హీల్స్ వేసుకుంటారు. దీని వల్ల వారి శరీరంలో చాలా సమస్యలు మొదలవుతాయి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సందర్భానికి హీల్స్ ధరించకూడదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ పొట్టిగా కనిపించడం ఎవరుకీ నచ్చదు. అందుకే పొట్టిగా ఉన్న అమ్మాయిలు పొడుగ్గా కనిపించడం కోసం కొన్ని చిట్కాలు. నిజానికి ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు పొడవుగా కనిపించాలంటే హీల్స్ ధరించడం ఒక్కటే పరిష్కారం  కాదు. దీని కోసం, దుస్తులను ఎంచుకునే విధానాన్ని కూడా మార్చవచ్చు. కొన్ని దుస్తులను ధరించడం వల్ల పొట్టి అమ్మాయిల ఎత్తు పెరుగినట్టు కనిపిస్తుంది. . అందుకే అమ్మాయిలు ఎప్పుడూ ఎత్తుకు తగ్గట్టుగానే దుస్తులను ఎంచుకోవాలి.  హై వెయిస్ట్ జీన్స్ ధరించాలి... నేటి కాలంలో, హై వెయిస్ట్ జీన్స్ చాలా ట్రెండ్‌లో ఉంది. హీల్స్ ధరించకుండా పొడవుగా కనిపించాలనుకుంటే, హై వెయిస్ట్ జీన్స్‌ని ప్రయత్నించవచ్చు. క్రాప్ టాప్ దీనితో వేసుకుంటే బాగా కనిపిస్తుంది. కావాలంటే, దానితో పాటు ఓవర్ సైజ్ టీ-షర్టును కూడా వేసుకోవచ్చు. పొడవాటి కుర్తీని ధరించొచ్చు... ఎత్తు తక్కువగా ఉంటే, నేరుగా పొడవైన కుర్తా ధరించవచ్చు. దీనితో చుడీదార్ పైజామా లేదా స్కిన్ టైట్ జీన్స్ వేసుకుంటే బాగుంటుంది. అనార్కలి సూట్.. మీరు ఎత్నిక్ వేర్ ధరించాలనుకుంటే, అనార్కలి సూట్‌ను ప్రయత్నించవచ్చు. పొట్టిగా ఉన్నవారు ఈ డ్రెస్ వేసుకుంటే ఉన్న  హైట్ కంటే ఎక్కువగా  కనిపిస్తారు.. వి నెక్ బట్టలు మెరుగ్గా ఉంటాయి.... పొట్టిగా ఉండే అమ్మాయిలకు వి నెక్ బట్టలు బాగుంటాయి. ఇలాంటి నెక్ ఉన్న డ్రెస్సులలో అమ్మాయిల  ఎత్తు ఎత్తుగా కనిపిస్తుంది.. ముదురు రంగులకే ఓటెయ్యండి..  ఎత్తు తక్కువగా ఉంటే ముదురు రంగు దుస్తులు ధరించాలి.  ఇలా చేయడం వల్ల ఎత్తు ఎక్కువగా కనిపించడమే కాకుండా సన్నగా కనబడతారు. కాబట్టి పొట్టిగా ఉన్నామని ఫీలవ్వకుండా.. హై హీల్స్ వేసుకుంటేనే హైట్ కవర్ అవుతుందనే భ్రమలో ఉండకుండా.. పైన చెప్పిన చిట్కాలు పాటించేయండి.                                   ◆నిశ్శబ్ద.

కొత్తగా కొన్న షూ సరిపోవడం లేదా.. ఈ టిప్స్ ఫాలో అయితే.. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల షాపింగ్ విస్తారమైనది. అమ్మాయిలకు ఏదీ ఒక పట్టాన నచ్చదు. చాలామంది అమ్మాయిలు తమకు సెట్ అవుతుందా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టి డ్రస్సు అయినా, చెప్పులు అయినా, షూస్ అయినా, గాజులు అయినా కంటికి నచ్చితే చాలు కొనేస్తారు. కానీ తీరా కొనేసి  ఇంటికి తెచ్చుకున్నాక అవిసరిపోవడం లేదని బాధపడతారు. ఇప్పటి అమ్మాయిలు బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువగా షూ ధరించడానికే ఇష్టపడుతుంటారు. కాబట్టి షూ నచ్చిందని కొనేసి ఆ తరువాత సరిపోవడం లేదని ఇబ్బంది పడుతున్నా, కొత్తగా కొన్నవాటిని వేసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతున్నా ఈ కింది టిప్స్ ఫాలో అయితే చాలు.. సమస్య పరిష్కారం అవుతుంది. కొత్త షూస్ కొన్న తరువాత వాటిని వేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిని వేసుకోవాలన్నా, కొత్త షూ తో నడవాలన్నా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. బూట్లు వేసుకునేటప్పుడు చాలా మందికి ఎదురయ్యే సమస్య అవి వేసుకున్నప్పుడు కాలి చిటికెన వేలుమీద చాలా ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. దీని కారణంగా షూ వేసుకున్నంతసేపు ఇబ్బంది పడుతూనే ఉంటారు.  కొన్నిసార్లు ఇలా ఒత్తిడి కలగడం వల్ల వేలి కందిపోయి చర్మం తొలగిపోతుంది కూడా. ఇది చాలా నరకంగా ఉంటుంది. కానీ ఈ సమస్య పరిష్కారం కావాలంటే చిటికెన వేలిపై బ్యాండ్రాయిడ్ ను అప్లై చేయవచ్చు. చాలామంది షూస్ కొనేటప్పుడు కరెక్ట్ గా కాలుకు సరిపడేలా తీసుకుంటారు. అయితే కొన్ని రోజులుకాగానే అవి బాగా లూజుగా అయిపోతాయి. ఈ విషయం గమనించిన వారు షూస్ ను కొనుగోలు చేసేటప్పుడు కాస్త టైట్ గా ఉన్నవే కొనుగోలు చేస్తారు.  దీని వల్ల షూస్ మెల్లిగా అలవాటు పడ్డాక సెట్ అవుతాయని అనుకుంటారు. కానీ షూస్ కొన్న కొత్తలో వాటి కారణంగా నరకం కనబడుతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి కొత్త షూ కొనుగోలు చేశాక న్యూస్ పేపర్ లేదా వేస్ట్ పేపర్స్ ను రోల్ చేసి షూస్ లో కొన్నిరోజుల పాటు ఉంచాలి. వీటి వల్ల షూస్ మెల్లిగా పాదానికి సెట్ అవుతాయి. షూస్ వేసుకున్నప్పుడు మడమ భాగం ఎత్తుగా ఉన్నట్టైతే అది ఇబ్బంది కలిగిస్తుంది. ఈ ఇబ్బంది అధిగమించడానికి  కాటన్ ప్యాడ్ లేదా శానిటరీ ప్యాడ్ ను షూ లోపల పాదాలకింద పెట్టుకోవచ్చు. దీనివల్ల మడమలకు సౌకర్యంగా ఉండటమే కాదు, చెమట, షూ నుండి వచ్చే దుర్వాసన మొదలైన వాటికి కూడా చెక్ పెట్టచ్చు. షూ వేసుకున్నప్పుడు కొన్నిసార్లు పాదాలు జారినట్టు అవుతుంటుంది. ఇలా పాదాలు జారినట్టు ఉన్నా లేదా షూ వదులుగా ఉన్నా వాటిని వేసుకునే ముందు షూ లోపల హెయిర్ స్ప్రే ను స్ప్రే చేయాలి.  ఇలా చేస్తే ఇబ్బంది తొలగిపోతుంది.                        *నిశ్శబ్ద.

హీరోయిన్స్ లా స్టైల్ గా మెడకు పెర్ఫ్యూమ్ కొట్టేవారికి షాకింగ్ న్యూస్..!   ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్దది.  ముఖ్యంగా అమ్మాయిలు ఫ్యాషన్ లో మునిగి తేలుతుంటారు. దుస్తులు, మేకప్ నుండి అంతా తయారయ్యాక చివరగా పెర్ఫ్యూమ్ స్ప్రే చేయడం వరకు ఎక్కడా రాజీ పడరు. చాలామంది సెలబ్రిటీలను, హీరోయిన్స్ ను అనుసరిస్తారు. వారిలా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిలో పెర్ఫ్యూమ్ అప్లై చేయడం ఒకటి. టీవీ లో పెర్ఫ్యూమ్  యాడ్స్ గమనిస్తే గనుక హీరోయిన్స్ లేదా మోడల్స్  పెర్ఫ్యూమ్ ను చాలా స్టైల్ గా మెడ దగ్గర స్ప్రే చేస్తుంటారు. ఆ తరువాత చేతి మణికట్టు దగ్గర కూడా స్ప్రే చేస్తుంటారు. అయితే ఇలా స్ప్రే చేయడం ఎంత వరకు ఆరోగ్యకరం అనే విషయం మాత్రం ఆలోచించరు.  మెడ దగ్గర, మణికట్టు దగ్గర పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే జరిగేదేంటో.. దీని గురించి చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెప్పారో తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. పెర్ఫ్యూమ్ ను మెడ, మణికట్టు దగ్గర స్ప్రే చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య  బాధితులుగా మారే అవకాశం ఉంటుందట. పెర్ఫ్యూమ్ సువాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఇందులో చాలా రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. వీటిని ఫోటోసెన్సిటైజింగ్ ఏజెంట్లు అని అంటారు. పెర్ఫ్యూమ్ స్ప్రే చేసిన చర్మం భాగంలో పదునైన సూర్య కిరణాలు తాకినప్పుడు చర్మం చికాకు పెట్టడం, వాపుకు గురి కావడం, హైపర్పిగ్మెంటేషన్ కు దారితీయడం జరుగుతుంది. చాలా పెర్ఫ్యూమ్ ల తయారీలో ఆల్కహాల్ వాడతారు. ఈ ఆల్కహాల్, సింథటిక్ వాసనలు చర్మాన్ని చికాకు పెడతాయి. అలెర్జీని కలిగిస్తాయి. పిగ్మెంటేషన్ కు కారణమయ్యే మెలనోసైట్ లను ప్రేరేపించి చర్మాన్ని  నల్లగా మార్చే మెలనిన్ ను ఉత్పత్తి చేసేలా చేస్తుంది. మచ్చలు ఏర్పడటానికి కూడా కారణం అవుతుంది. కొన్ని రకాల పెర్ఫ్యూమ్ లలో ఉండే రసాయనాల కారణంగా చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. ఇది కూడా పిగ్మెంటేషన్ ను కలిగిస్తుంది.                                              *రూపశ్రీ.   

  వేసవి చెమట కారణంగా జుట్టు జిగటగా అనిపిస్తోందా? ఈ చిట్కాలు ఫాలో అయి చూడండి!  సమ్మర్ సీజన్‌లో ఎన్ని అందమైన టాప్స్, కుర్తాలు, డ్రెస్సులు వేసుకున్నా జుట్టు తలకు అతుక్కుపోయి విపరీతంగా జిడ్డుగా ఉంటే లుక్ మొత్తం చెడిపోతుంది.  భరించలేని ఎండ, దాన్నుండి పుట్టే  చెమట  జుట్టు  మెరుపును చాలా వేగంగా తగ్గించేస్తాయి. ఈ సమస్య తగ్గించుకోవాలి అంటే జుట్టు సంరక్షణ చిట్కాలు తప్పకుండా పాటించాలి.  చెమట కారణంగా జుట్టు జిగటగా మారుతూ ఉంటే దాన్నుండి జుట్టును రక్షించుకోవడానికి ఈ కింది చిట్కాలు పాటించాలి.. హీటింగ్ టూల్స్ వద్దు.. హెయిర్ స్టైల్ చేయడానికి హీటింగ్ టూల్స్ ఉపయోగిస్తుంటారు.  కానీ సమ్మర్ సీజన్‌లో హీటింగ్ టూల్స్ వాడటం వల్ల హెయిర్ డ్యామేజ్ పెరిగి,  జుట్టు  ఫ్రీగా ఉండటానికి బదులుగా  తలపై అతుక్కున్నట్టు అనిపిస్తుంది.   తలలో పుట్టే చెమట దీనికి ప్రధాన కారణం అవుతుంది.  మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. జుట్టులో ఉండే తేమను హీటింగ్ టూల్స్ లాగేస్తాయి. ఈ కారణంగా జుట్టు నిర్జీవంగా మారి చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది. గుడ్డు వాడాలి..  వారానికి ఒకసారి జుట్టుకు  గుడ్డు హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు  జిగట నుండి ఉపశమనం లభిస్తుంది. గుడ్డు జుట్టుకు హైడ్రేషన్ ఇస్తుంది. గుడ్డులో పెరుగు కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. అంతే కాకుండా పెరుగు, తేనె కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. నూనె రాయాలి.. పగటిపూట జుట్టుకు నూనె రాసినట్లయితే తల జిగటగా కనిపిస్తుంది. వేసవిలో  చెమట అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ చెమటతో పాటు నూనె  కూడా తల మీద నుండి ప్రవహిస్తుంది.  అందుకే ఉదయానికి బదులు  రాత్రి సమయంలో తలకు నూనె రాసుకోవాలి. నూనెను రాత్రిపూట తలకు పట్టించి మసాజ్ చేసి మరుసటి రోజు జుట్టును  శుభ్రం చేసుకోవాలి.  ఇలా చేస్తే జుట్టు మృదువుగా, ఫ్రీగా ఉంటుంది.  కండీషనర్‌.. చాలా మంది మహిళలకు   కండీషనర్‌ని  ఉపయోగించడం సరిగ్గా తెలియదు.  దీని కారణంగా కండీషనర్ రాసినా సరే.. జుట్టు జిగటగా కనిపిస్తుంది. షాంపూతో జుట్టును శుభ్రం చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించాలి. కండీషనర్ జుట్టు పొడవునా అప్లై చేయాలి. కానీ చాలామంది కేవలం  తలపై మాత్రమే రాస్తుంటారు. కండీషనర్‌ను తలపై లేదా స్కాల్ప్‌పై రాసుకుంటే జుట్టు జిడ్డుగా మారుతుంది,  బరువుగా కనిపిస్తుంది. అదనంగా ఇది తలపై జిడ్డు ఏర్పడటానికి కారణమవుతుంది.   డ్రై షాంపూ.. ఎంత వేడిగా ఉన్నా ప్రతి రోజూ తలస్నానం చెయ్యాలంటే ఇబ్బందే. హెయిర్ ఫాల్ పెరుగుతుందని చాలా భయం. అందుకే ప్రతిరోజు జుట్టును నీటితో కడగకుండా డ్రై షాంపూను జుట్టు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.  జుట్టు జిగటగా కనిపించినప్పుడు డ్రై  షాంపూని అప్లై చేసిన తర్వాత జుట్టులో వెంటనే  బౌన్స్ కనిపిస్తుంది. జుట్టు పొడిగా, ఫ్రీగా ఉంటుంది.                                             *రూపశ్రీ.  

   వాకింగ్ షూస్.. రన్నింగ్ షూస్.. ఈ రెండింటి మధ్య తేడాలేంటో తెలుసా? ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు  రోజువారీ జీవనశైలిలో నడక, రన్నింగ్, వ్యాయామాలు, జిమ్ వంటివి భాగం చేసుకుంటారు.  ఈ విషయాలను కూడా జాగ్రత్తగా పాటించేవారు ఉంటారు. వారు వాకింగ్ వెళ్లినప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు, జిమ్ చేసేటప్పుడు షూస్ వేసుకుంటారు. అయితే రన్నింగ్, వాకింగ్, జాకింగ్, జిమ్, స్పోర్ట్స్ సమయాల్లో వేసుకునే షూస్ కూడా వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా ఎక్కువమంది చేసే రన్నింగ్, వాకింగ్ కోసం వాడే షూస్ మధ్య తేడాలేంటి?  కొత్త షూస్ కొనేటప్పుడు తీసకోవలసిన జాగ్రత్తలు, గుర్తుంచుకోవలసిన విషయాలేంటో  తెలుసుకుంటే..  రన్నింగ్ షూస్ బరువు తక్కువగా ఉండాలి.  తేలికగా ఉన్న షూస్ వేసుకుంటే  సులభంగా పరిగెత్తవచ్చు.  తక్కువ బరువున్న బూట్లు ధరించి పరిగెత్తితే పాదాలపై తక్కువ ప్రభావం ఉంటుంది. దీని వల్ల రన్నింగ్ లో అలసిపోరు.  బూట్లు కొనడానికి వెళ్ళినప్పుడు రన్నింగ్ షూస్ కోసం హీల్స్ కొనకూడదని  గుర్తుంచుకోవాలి. మడమలున్న షూస్ వేసుకుంటే అవి  పాదాలపై ఒత్తిడి తెస్తాయి. దీనివల్ల త్వరగా అలసిపోతారు. రన్నింగ్ షూస్ ఎంత సౌకర్యవంతంగా ఉంటే పాదాలపై ఒత్తిడి అంత తక్కువ ఉంటుంది. రన్నింగ్ షూల మిడ్‌సోల్‌లో ఎక్కువ కుషన్ ఉంటుంది, ఇది  పాదాలపై ప్రభావం లేకుండా చేస్తుంది.  అలాగే  షాక్ లేదా గాయాన్ని తగ్గించడంలోనూ, గాయాలు కాకుండా ఉండటంలోనూ సహాయపడుతుంది. రన్నింగ్ షూల ముందు భాగంలో   ఫ్లెక్సిబిలిటీ మరింత ఎక్కువగా ఉంటుంది.  ఇది వేగంగా పరుగెత్తడానికి  సహాయపడుతుంది. ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉన్న బూట్లు  పడిపోకుండా కాపాడతాయి.  నడుస్తున్నప్పుడు సపోర్ట్ ఇస్తాయి. వాకింగ్ షూస్.. రన్నింగ్ షూస్ కంటే వాకింగ్ షూస్ కొంచెం బరువుగా ఉంటాయి. ఎక్కువ దూరం వాకింగ్ కు  వెళ్లాలనుకుంటే తేలికగా,  మంచి కుషనింగ్ ఉన్న షూలను కొనుగోలు చేయాలి. ఇది పాదాలలో మంట లేదా నొప్పిని తగ్గిస్తుంది. రన్నింగ్ షూస్ లాగా వాకింగ్ షూస్‌లో కూడా మంచి మిడ్‌సోల్ ఉండటం ముఖ్యం. వేగంగా నడిచినప్పుడు, ఈ సోల్  పాదాలను షాక్ నుండి కాపాడుతుంది,  బ్యాలెన్స్‌ను చక్కగా ఉంచుతుంది. వాకింగ్ షూస్ కు  కూడా హీల్స్ ఉండకూడదు. దీని కారణంగా  ఎక్కువసేపు నడవడానికి ఇబ్బంది పడవచ్చు. మడమలు లేని బూట్లు  మంచి  సపోర్ట్ ఇస్తాయి. నడక సమయంలో  సౌకర్యవంతంగా ఉంటారు.                                            *నిశ్శబ్ద.