కుర్తీ కుట్టేటప్పుడు ఇవి గుర్తుంచుకోవాలి.. లేకపోతే డిజైన్ పాడవుతుంది..!

కుర్తీ కేవలం దుస్తులు మాత్రమే కాదు, భారతీయ మహిళలకు సౌకర్యాన్ని, స్టైల్ ను కూడా ఫర్పెక్ట్ గా కంబైండ్ చేస్తుంది. ఆఫీసు అయినా, కాలేజ్ అయినా లేదా ఏదైనా పండుగ అయినా, కుర్తీ ప్రతి సందర్భంలోనూ ధరించడానికి ఫర్పెక్ట్ ఎంపిక. కుర్తీ కుట్టేవాళ్లు మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉంటారు. కానీ సొంతంగా కుర్తీని కుట్టుకునేవాళ్లు, పెద్దగా అనుభవం లేనివారు కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. ఇలా కుర్తీ స్టిచింగ్ చేసేటప్పుడు చిన్న తప్పులు కూడా మొత్తం లుక్‌ను పాడు చేస్తాయి.
సరైన ఫిట్టింగ్, ఫాబ్రిక్ ఎంపిక, మెడ, స్లీవ్ డిజైన్ వంటి వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే, ఖరీదైన బట్టలు, డిజైన్లు కూడా నిస్తేజంగా కనిపిస్తాయి. అందువల్ల కుర్తీ కుట్టేటప్పుడు కొన్ని ఫ్యాషన్ చిట్కాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. అవేంటో తెలుసుకుంటే..
డిజైన్..
ట్రెండ్ ని ఫాలో అవుతూ ఎప్పుడూ కుర్తీ డిజైన్ ని ఎంచుకోకూడదు. ప్రతి డిజైన్ ప్రతి శరీరానికి బాగా కనిపించదని గుర్తుంచుకోవాలి. స్లిమ్ గా ఉంటే A-లైన్ లేదా స్ట్రెయిట్ కట్ కుర్తీ బాగుంటుంది. అయితే కర్వీ ఫిగర్ కి అనార్కలి లేదా ప్రిన్సెస్ కట్ బాగుంటుంది. కాబట్టి అందరినీ చూసి కాదు.. మీ శరీర తత్వాన్ని బట్టి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఫిట్టింగ్..
కుర్తీ ఫిట్టింగ్ ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉండాలి. చాలా టైట్ గా లేదా చాలా లూజ్ గా ఉన్న కుర్తీ బాగా కనిపించదు. ఎందుకంటే కుర్తీ చాలా టైట్ గా లేదా చాలా లూజ్ గా ఉంటే స్టైల్ చెడిపోతుంది. కుర్తీ పర్ఫెక్ట్ గా ఉండేలా ప్రతిసారీ కొలతలను చూసుకోవడం ముఖ్యం.
ఫాబ్రిక్.
వాతావరణాన్ని, ప్రదేశాన్ని బట్టి ఎప్పుడూ కుర్తీ ఫాబ్రిక్‌ను ఎంచుకోవాలి. కాటన్ ఫాబ్రిక్ ఆఫీసుకు సరైనది. సిల్క్, చందేరి లేదా రేయాన్ పార్టీవేర్‌కు ఉత్తమమైనవి. వేసవిలో బరువైన ఫాబ్రిక్ అసౌకర్యంగా అనిపించవచ్చు. అయితే లినెన్ ఫాబ్రిక్ వర్షాకాలానికి తగినది కాదు. ఫాబ్రిక్ విషయంలో ఇలాంటి అవగాహన ఉండటం ముఖ్యం.
ఫేస్ కట్ vs నెక్, స్లీవ్..
ముఖ ఆకారాన్ని బట్టి ఎప్పుడూ మెడ, స్లీవ్ డిజైన్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు రౌండ్ ఫేస్ ఉంటే, V-నెక్ లేదా బోట్ నెక్, బాగుంటుంది. కావాలంటే ఒకసారి ప్రయత్నించాలి. మీకు ఏది బాగుంటుందో చూడాలి. ఆ తర్వాత నిర్థారించుకోవాలి.
పొడవు, సైడ్స్..
కుర్తీ పొడవు పొట్టిగా లేదా పొడవుగా కనిపించేలా చేస్తుంది. అలాగే కటింగ్స్ లేదా సైడ్ చీలికలతో కొత్తదనాన్ని కూడా జోడించవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ ఎత్తుకు అనుగుణంగా కుర్తీ పొడవును ఎంచుకోవాలి.
*రూపశ్రీ


.webp)
