Heroine Aditi Myakal's Sankranthi Special Collection 2018..   తెలుగు పండుగల్లో సంక్రాంతికి అతి పెద్ద పండుగ. ఈ పండుగ రోజు మాత్రం అమ్మాయిలు పట్టు పరికిణీలు, లంగా ఓణీలు ధరించి అచ్చమైన తెలుగు అమ్మాయిల్లా తయారవుతారు. అయితే ఒకప్పుడు పట్టు పరికిణీలు ధరించేవారు కానీ... ఇప్పుడు ఫ్యాషన్ పెరిగిపోయింది. మరి ఎంత ఫ్యాషన్ పెరిగిపోయినా.. వాటికి ఉన్న ప్రత్యేకత మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అయితే వాటికి కొంచెం హంగులు దిద్దితే చాలు... అటు ఫ్యాషన్ ను.. ఇటు తెలుగుదనాన్ని చూపించవచ్చు. అలాంటి వారి కోసమే ఈ సంక్రాంతికి కొన్ని కలక్షన్స్ మీ ముందుకు తీసుకొచ్చాం. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూడండి..  https://www.youtube.com/watch?v=iV5bMTRdyDE

How To Choose a Right Hand Bag..   ప్రస్తుతం ఫ్యాషన్ ఎంత పెరిగిపోయిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాళ్లకి వేసుకునే చెప్పుల దగ్గర నుండి.. గోళ్లకు వేసుకునే నెయిల్ పాలిష్ వరకూ అన్ని మ్యాచింగ్ ఉండేలా.. ట్రెండీగా చూసుకుంటా. కానీ... ఒక్క విషయంలో మాత్రం మనం అంత కాన్సన్ ట్రేషన్ చేయం. అదే హ్యాండ్ బ్యాగ్ విషయంలో. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే మనం... హ్యాండ్ బ్యాగ్ విషయంలో మాత్రం లైట్ తీసుకుంటాం. అలాంటి వారికోసమే ఈ వీడియో. మనకు ఎలాంటి హ్యాండ్ బ్యాక్ కావాలి.. సింపుల్ గా ఎలా సెలక్ట్ చేసుకోవచ్చు.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అజల్ ఆలీ అక్బర్ పలు సూచనలు ఈ వీడియో ద్వారా ఇస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం...ఈ వీడియో చూసి అవేంటో తెలుసుకోండి...https://www.youtube.com/watch?v=mf0f4m7h55U

  Welcome This 2018 With Your Style Statements   ట్రెండీగా, ఫ్యాషన్ గా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ కొంత మంది ఫ్యాషన్ కు తగ్గట్టు ఎంచుకోవడంలో మాత్రం చాలా కష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే కొన్ని కలక్షన్స్ ను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాం.  https://www.youtube.com/watch?v=02Xbwou64Ro

Trendy Churidars in Ikaths Handlooms.. రోజు రోజుకి ఫ్యాషన్ పెరిగిపోతున్నా అతివల ఆల్ టైం ఫేవరెట్ డ్రెస్సింగ్ మాత్రం చుడీదార్స్. క్యాజువల్ గా అయినా పార్టీకైనా ఇట్టే అమరిపోయే ప్రత్యేకత చుడీదార్స్ ది. అదే హ్యాండ్ లూమ్ చూడీదార్స్ అంటే ఇంకా బావుంటాయి. అలాంటి చుడీదార్స్ లో లేటెస్ట్ కలెక్షన్ మీ కోసం అందిస్తుంది Ikaths Handlooms. మీరూ ఓ లుక్కేయండి...  https://www.youtube.com/watch?time_continue=2&v=n2wHOBbfjCU

Kora Silk Sarees !! ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎన్ని మోడ్రన్ డ్రెసెస్ వచ్చినా అతివలు ప్రత్యేక సందర్భాలలో చీరలకే ప్రాధాన్యమిస్తారు. ఎంత ఫ్యాషన్ పెరిగిపోయినా చీరకున్న ప్రత్యేకత వేరు. ఇది పాతబడటం అంటూ ఉండదు. అందుకే మారుతున్న కాలాన్ని బట్టి డిజైన్లు తేడా ఉంటాయేమో కానీ... చీరకున్న ప్రాధాన్యత మాత్రం పోదు. అందులోవే ఈ కోర సిల్క్. అటు ఫ్యాషన్ కు తగ్గట్టు... ఇటు కట్టుకోవడానికి వీలుగా ఉండే కొన్ని కోర సిల్క్ డిజైన్లు మీకోసం.. https://www.youtube.com/watch?v=E430IuY6B60

Samantha Reddy Boutique Saree Latest Fashion Designs 2017..!   ఆడవాళ్ళకి అమితంగా నచ్చేవి ఏంటంటే ఠక్కున వచ్చే సమాధానం చీరలు అని. ఎందుకంటే ఆడవాళ్ళకి, చీరలకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. అదే డిజైనర్ చీరలంటే ఇంక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అలాంటి వాళ్ళ కోసం ఫ్యాషన్ కలెక్షన్. ఈ వీడియో చూడండి, చీరలంటే ఇలా ఉండాలి అంటారు...  https://www.youtube.com/watch?v=uFCcigamQ1g

కిరాకు పుట్టిస్తోన్న కిమోనో ఫ్యాషన్ సౌలభ్యత కోసం మనం ఎన్నో విధానాలను అవలంభిస్తాం.. వస్త్రధారణ నుంచి ఆహారం వరకు అన్నీ రోజు రోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే. అప్పట్లో చీరలకు మాత్రమే పరిమితమైన ఆడవారికి మారుతున్న ఫ్యాషన్ వైవిధ్యమైన డిజైన్లను అందించింది. వాటిలో జబ్బల జాకెట్లు, బుట్ట చేతులు, త్రీ ఫోర్త్ హ్యాండ్స్, ఫుల్ స్లివ్స్, విమానం రెక్కలు ఇలా ఎన్నో రకాల ఫ్యాషన్లను చూశాం. తాజాగా ఇప్పుడు కిమోనోపై పడ్డారు. జపాన్‌కు చెందిన ఈ లేటెస్ట్ ట్రెండ్ గురించి మరిన్ని విషయాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.  

ప్రమిద డెకరేషన్.. చూసి ఎంజాయ్ చేయండి!     ‘ఎప్పుడూ బిగినేసేనా... మడిసన్నాక కాసింత కాలాపోసనుండాలి’... అంటాడు ‘ముత్యాలముగ్గు’లో  రావుగోపాల్రావ్. ‘మనిషి అన్నాక... కొత్తగా ఆలోచించాలి’ అని... ఆ డైలాగ్ తో చెప్పకనే చెప్పారన్నమాట. అంటే... మనం మామూలుగా చేసే పనుల్నే కొత్తగా చేస్తే.. సరిపోతుంది. ఉదాహరణకు ప్రమిదల్ని తీసుకుందాం. దీపావళికి వరుసగా ప్రమిదలు వెలిగిస్తాం కదా. మట్టి ప్రమిదల్లో నూనెపోసి దీపాలను వెలిగించేసి ‘దీపావళి’ని ‘మమ’ అనిపించేస్తాం కదా. అలా కాకుండా కొత్తగా ఆలోచిస్తే?. మట్టి ప్రమిదల్నే తీసుకొని వాటిని ఇంకేమైనా చేయొచ్చేమో ఆలోచిస్తే?.. రంగులేసి, డెకరేట్ చేసి.. ఆ ప్రమిద లోంచి వచ్చే వెలుగుల్లో కొత్త రంగులు కనిపించేలా ప్లాన్ చేస్తే? అద్గదీ ‘దీపావళి’ అంటే. ఈ వీడియోలో... మామూలు ప్రమిదకు కొత్త శోభను తీసుకురావడానికి ఈ అమ్మాయ్ చేసిన ప్రయత్నం చూడండి. నిజంగా వండర్. మీకూ ట్రై చేయాలనుంటే..  ఈ వీడియో వైపు ఒక్కసారి లుక్కేయండి. మీ ఇంటి దీపావళిని స్వర్ణకాంతుల మయం చేసుకోండి.         

నక్షత్రాన్నిబట్టి వస్త్రాలు ధరిస్తే మంచిది (దసరా స్పెషల్)     దసరా పండుగ వచ్చేసింది. ఈ తొమ్మిది రోజులు దేశమంతా ఘనంగా ఉత్సవాలు , జరుపుకుంటారు. పూజలు చేసి, నైవేద్యాలు అమర్పించి కొత్త బట్టలు ధరించి ఆనందోత్సాహాలతో గడుపుతారు. దసరా తొమ్మిది రోజులూ ప్రతిరోజూ ఆ వారాన్నిబట్టి, ఆ రోజు నక్షత్రాన్నిబట్టి ప్రత్యెకించిన రంగుల వస్త్రాలు ధరిస్తే మంచిదని శాస్త్రం చెప్తోంది.       మొదటిరోజు :- దుర్గామ్మవారిని పూజలందుకొమ్మని ఆహ్వానించే ఘటస్తాపన మహోత్సవం. శైలపుత్రిగా,గిరితనయగ, పార్వతి అమ్మవారుగా కీర్తించబడే అమ్మ పుట్టింది కొండ, కోనల్లోంచి.అంటే ప్రక్రుతిలోంచి.అందుకే ప్రక్రుతికి ప్రతీకగ పసుపు రంగు దుస్తులు  ధరించడం ఈరోజు శుభప్రదం.   రెండవరోజు :- పార్వతి అమ్మబారి  రూపాన్ని పూజిస్తారు. శివునికోసం తపస్సు చేసింది.అనుకున్నది సాధించే పట్టుదల చూపింది. అందుకు చిహ్నంగా ఆకుపచ్చని బట్టలు ధరించాలి.   మూడవరోజు :- పెళ్లైన వనితగ, సకల సౌభాగ్యరూపిణిగా చంద్రఘంట రూపంలో అమ్మ పూజలందుకుంటుందీరోజు.ఆమె నుదుటన  అర్థచంద్రుడు ఘంటలాగా ఉంటాదు.శివుని పెళ్లాడటానికి ఆమె చూపిన ధైర్యానికి,పోరాటస్ఫూర్తికి గుర్తుగా బూడిద రంగు దుస్తులు ధరిస్తే మేలు.   నాలుగవరోజు:- కూష్మాండరూపిణిగా అమ్మవారిని పూజిస్తారు ఈరోజు.సూర్యునిలో నివ్నసించి బ్రహ్మాండాన్ని స్రుష్టించిన లయకారిణి. వులుగు,శక్తి ప్రసాదిస్తుంది. దానికిగుర్తుగా ఆరెంజ్ రంగు దుస్తులు ధరించాలి.   ఐదవరోజు :- కార్తికేయుని తల్లిగా స్కందమాతగా పూజిస్తారు.తెల్లని వస్త్రాలు ఈరోజు ధరించలి.   ఆరవరోజు :- కాత్యాయనిగ పూజిస్తారు ఈరోజున. మహిషాసురుని సమ్హరించి అరుణిమతో ఉంటుంది కాబట్టి ఎర్రని వస్త్రాలు ధరిస్తే మంచిది.   ఏడవరోజు :- చిమ్మచీకటి, కాళరాత్రి రూపంలో అమ్మవారిని పూజిస్తారు. అన్ని సమస్యలు, బాధల నుంచి తప్పించె తల్లిని కీర్తించే రోజు నీలిరంగు దుస్తులు వేసుకోవాలి.   ఎనిమిదవరోజు :- మహాగౌరి రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈరోజున.పాపాలను తుడిచివేసె బాలికగా,అందాలరాశిగా తేజస్సు ఉట్టిపడే తల్లిని గులాబీ వస్త్రాలు  ధరించి మొక్కితే  మంచిది.   తొమ్మిదవరోజు :- సిద్ధిధాత్రిగా, అపూర్వ శక్తిస్వరూపిణిగా  కొలుస్తారు ఈరోజున. ఆమెను పూజించిన శివునికి శక్తులు ఇచ్చిన తల్లి భక్తులకూ ఇస్తుందని నమ్మకం. వంగరంగు వస్త్రాలు ధరించాలి ఈరోజు.   పదవరోజు :- చెడు మీద మంచి సాధించిన విజయం. దసరా పండుగన పంచవన్నెల్లో యే రంగునైనా ధరించవచ్చు. - Sridevi  

  Bangle Trends for Dussera   The auspicious Ten days of Dussera, Bathukamma and Dandiya shake up this festive season with happiness, savories, gold, glam and glitter....wherever you see, every market, every store is busy with people rushing to purchase dresses for every family member...and the trends and options changing for every season, there's so much to explore in the market. Keeping the Men and the Boys aside, the time is just not enough to finish buying all the matchings for Ladies and Girls, starting from matching hair bands to  'dont-miss-the bangles'....     Bangles have changed numerous trends from glass to terracota, to wood, to plastic and now to silk woven bangles....these silk ones are definitely not brand new, they existed 15-20years ago but looks like they were unrecognised or never in news due to the fashion industry and media on the low. But with pinterest and online shopping on the boom, every new trend is everywhere !  The most embellished, the stone studded, the mirror work, ones with beads and pearls woven in them and such. Some places even offer customised designs and deliver the product in a couple weeks of days and in sizes for even the tiny hands and in custom colors for a bride and the ladies' multicolor dresses and sarees. There are even many tutorials on the web teaching how to weave a silk thread bangle. This art is not stuck with bangles only, we can find even earrings and necklaces appearing into the limelight. Have you tried a pair for yourself!?   -Prathyusha

  కిమొనో... కిర్రాకు పుట్టిస్తోంది!     కిమొనో... పేరులోనే స్టైల్ ఉంది కదూ! అది వేసుకుంటే మన స్టైల్ కూడా మారిపోతుంది. ఓ కొత్త లుక్ వచ్చేస్తుంది. ఇంతకీ కిమొనో అంటే ఏంటి? స్లీవ్స్ లో అదో రకం. కిమొనో మోడల్ చేతులు కుట్టించామంటే మామూలు డ్రెస్సు కూడా ఒక ఎక్స్ ట్రార్డినరీ డ్రెస్ లా మారిపోతుంది. కావాలంటే ఈ ఫొటోలు చూడండి.       గౌన్, షర్ట్, టీ షర్ట్, మ్యాక్సీ, నైటీ... దేనికి కిమొనో స్లీవ్స్ పెట్టినా దాని లుక్కు మారిపోవడం ఖాయం. అందుకే లూజుగా... వేళ్లాడుతున్నట్టుగా ఉండే ఈ స్లీవ్స్ ఇప్పుడు ప్రపంచమంతటా కిర్రాకు పుట్టిస్తున్నాయి. మనకి కూడా ఈ స్టయిల్ ఇప్పుడిప్పుడే బాగా దగ్గరవుతోంది.      నిజానికి ఒకప్పుడు జపనీస్ దుస్తులు మాత్రమే ఇలా ఉండేవి. చాలా లూజుగా ఉన్న స్లీవ్స్ వాళ్ల సంప్రదాయం. కానీ వాళ్ల సంప్రదాయం ఇప్పుడు ఓ పెద్ద ఫ్యాషనై కూర్చుంది. అందరూ కిమొనో స్లీవ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. తమ స్టయిల్ కి మార్కులు పడుతుంటే మురిసిపోతున్నారు. మరి మీకొద్దా మార్కులు?! - Sameera  

  శారీ లాంటి గౌన్... గౌన్ లాంటి శారీ!     చీర ట్రెడిషనల్... గౌను మోడ్రన్. ఈ రెండిటినీ కలిపితే?! ఐస్ క్రీమ్ లో ఆవకాయ్ కలిపినట్టుంటుంది అనుకుంటున్నారు కదూ! అలా అనుకుంటే కొత్త ఫ్యాషన్లు పుట్టవు కదండీ. ఆల్రెడీ ఆ ఆలోచన ఒకరికి రావడం, చీరనూ గౌనునూ కలిపి ఓ సరికొత్త డ్రెస్సును క్రియేట్ చేయడం జరిగిపోయింది. అదిప్పుడు ఎంత సంచలనం సృష్టిస్తోందంటే... బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ సెలెబ్రిటీలకూ ప్రియమైనదైపోయింది. చివరికి మనవాళ్లను చూసి కొందరు హాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఈ డ్రెస్సును వేసుకోవాలని ముచ్చటపడుతున్నారంటే ఆలోచించండి.     శారీగౌన్ చూడటానికి ముందు శారీలా కనిపిస్తుంది. కానీ శారీ కాదు. జాగ్రత్తగా గమనిస్తే గౌనులా ఉంటుంది. కానీ గౌనూ కాదు. కానీ అటు చీరలోని సోయగాన్నీ ఇటు గౌనులోని గ్లామర్ నూ కలిపి ఒలికించి చూపరుల మతి మాత్రం పోగొడుతుంది. అక్కడితో ఆగిపోలేదు దీని సొగసు. రకరకాల డిజైన్లు, వివిధ రకాల ఎంబ్రాయిడరీ, బీడ్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వంటి వాటితో చూడగానే అబ్బ.. ఎంత బాగుందో అనిపించేలా తయారవుతున్నాయి శారీగౌన్స్.         మొదట్లో దీపికా పదుకొనె, శిల్పాశెట్టి లాంటి వాళ్లు ఈ శారీగౌన్లు వేసి ర్యాంప్ మీద నడుస్తుంటే... వారేవా, ఏం ఫ్యాషన్ అంటూ అందరూ చప్పట్లు చరిచారు. అందరూ శారీగౌన్స్ తో వార్డ్ రోబ్స్ ని నింపేశారు. మెల్లమెల్లగా వీటి ధర అందుబాటులోకి కూడా రావడంతో ఇప్పుడు కాలేజీ అమ్మాయిలు పార్టీల్లో వీటిని ధరించి ప్రత్యక్షమవుతున్నారు. కొందరైతే బర్త్ డేలు, రిసెప్షన్లకు కూడా మంచి మంచి శారీ గౌన్స్ ని డిజైన్ చేయించుకుంటున్నారు. చక్కని నెక్స్, పల్చని హ్యాండ్స్ వంటివి ఈ డ్రెస్సులకు అదనపు ఎసెట్స్. నడుము చుట్టూ వడ్డాణం పెట్టినట్టుగా ఉండే డిజైన్స్ కూడా వీటి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.      మరి ఇంత స్పెషల్ డ్సెస్సుని మీరు వేసుకోకపోతే వెనుకబడిపోతరూ! అందుకే వెంటనే ఓ శారీగౌన్ ని కొనేయండి. అటు ట్రెడిషనల్ లుక్కునూ ఇటు మోడ్రన్ కిక్కునూ ఒకేసారి అందరికీ రుచి చూపించండి! - Sameera

When we think of “Sravanamasam” which is a wedding season for all the south Indians, this month is also known for “VaraLakshmi Vratham” where every South Indian woman/ girl would love to pamper herself with right costumes and jewellery. And ofcourse, Kanjivarams are one of its kind which are eternal favorites of every saree loving woman. These are stunningly gorgeous hand-woven sarees, which are must have in every sounth Indian bride’s/ lady’s wardrobe. Though they are being heavy, Kanjivaram sarees tend to have a slimming effect, as they drape wonderfully, given the awesome fall and fluidity of their woven material. That’s the reason this has become the choice of mnay brides during their big day. Kanjeevarams have huge range right from 8000 to more than 1 lakh as the weave gets finer. Because of its quality and grace Kanjivarams  are super fashionable and in-vogue right now and  are absolutely traditional, yet  have a modern appeal. They are so many saree shops and online stores released their Kanchi saree collections for the season and these sareees can be worn with heavy blouse for brides and simple ones for the rest. They are available in self “zari”baorder  and also with contrast boarders which are suitable for all the age groups. Kanjeevarams are equally beautiful when paired with sleeveless blouse and also crop tops . Beauty of the saree enhances the way you drape and the way you accessorize. That’s the only reason why most of the celebrity ladies are wearing these sarees for evening parties, public gatherings and along with weddings. So, as per the fashionista, adding Kanjeevarams to your wardrobe is a very good buy for the season.  Go for it girls.

ఇది కూడా ఫ్యాషనే... కాకపోతే!   ఫ్యాషన్ ప్రపంచం ఓ మహాసముద్రం. ఇందులో కొత్త కొత్త ట్రెండ్లకి కొదవ ఉండదు. ఆ ట్రెండ్ సృష్టించాలనే తపనతో డిజైనర్లు పడే తిప్పలకి అంతుండదు. తమ ఫ్యాషన్ జనాల మనసు గెల్చుకుంటే... రాత్రికిరాత్రే సంచలనం సృష్టించవచ్చు. ఒకవేళ జనాలకి నచ్చకపోతే... మరో దారి వెతుక్కోవచ్చు. అలా ఫ్యాషన్ దునియాని అనుకోకుండా ఓ ఊపు ఊపేసిన కొన్ని చిత్రమైన మార్పులు ఇవిగో... Sagging Pants నడుము భాగం నుంచి కిందకి దిగిపోయి, అసలు ఈ మనిషి ప్యాంట్ ఎందుకు వేసుకున్నాడ్రా అనిపించే ప్యాంట్స్ ఇవి. ఈ శాగింగ్ ప్యాంట్స్ వెనుక ఓ వింత కథ ఉందని చెబుతారు. అమెరికా జైళ్లలో ఉండే ఖైదీలు బెల్టులు పెట్టుకోవడానికి వీల్లేదట. అలా బెల్టులు లేకుండా, జారిపోతున్న ప్యాంట్లతో తిరిగే ఖైదీలని చూసి ఈ ఫ్యాషన్ పుట్టిందంటున్నారు. Shutter shades ఇంటికి కిటికీలు లేకపోతే కష్టం. కానీ ఇంటికి ఉండే కిటికీలు కంటికి ఎందుకు ఉండకూడదు అనుకున్నారు. దాంతో షట్టర్ని తలపించే కళ్లద్దాలని రూపొందించారు. వీటికి అద్దాలు ఏవీ ఉండవు కానీ, అడ్డంగా ఊచలు మాత్రం కనిపిస్తాయి. బయటి ప్రపంచం మనకి, మన మొహం బయట ప్రపంచానికీ కనిపించీ కనిపించకుండా ఉంటుందన్నమాట. 1950లలో మొదలైన ఈ ట్రెండ్ అడపాదడపా అక్కడక్కడా కొనసాగుతూనే ఉంది. Corset టైటానిక్ సినిమాలో హీరోయిన్ corset వేసుకుంనేందుకు నొప్పిని భరిస్తున్న దృశ్యం గుర్తుండే ఉంటుంది. ఆడవారి శరీర ఆకారాన్ని అందంగా చూపించేందుకు, లేసులు బిగించి కట్టేసే దుస్తులే ఈ కార్సెట్లు. వీటిని తరచూ వాడటం వల్ల లోపల అవయవాలన్నీ దెబ్బతినిపోతాయనీ, ఆఖరికి ఊపిరి పీల్చుకోవడం కూడా నరకంగా మారిపోతుందనీ చెబుతారు. కానీ ఇప్పటికీ ఆ కార్సెట్లు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతూనే ఉన్నాయి. Skinny ties ఎప్పుడో రోమన్ సైనికులు, తాము ఫలానా రాజ్యానికి చెందినవారం అని సూచించేందుకు టై ధరించేవారట. ఈ విషయం తెలియకపోయినా ఇప్పటికీ చాలామంది హుందాగా కనిపించడం కోసం టై ధరిస్తూ ఉంటారు. మరి ఫ్యాషన్ ప్రపంచం దీన్ని మాత్రం ఎందుకు వదలిపెడుతుంది. టై వీలైనంత సన్నగా ఉంటే ఎలా ఉంటుందా అని ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని బీటల్స్ వంటి పాప్స్టార్లు అంగీకరించారు. ఇంకే! ఆడామగా అంతా స్కిన్నీ టై కట్టుకుని ర్యాంప్ మీద నడకలు సాగిస్తున్నారు. ఇంతేనా! జుట్టుకి వింత రంగులు, పళ్లకి క్లిప్పులు, భుజాలు వెడల్పుగా కనిపించే shoulder pads... ఇలా వింత ఫ్యాషన్ జాబితా చేంతాడంత కనిపిస్తుంది. అవన్నీ ఏదో ఒక సమయంలో ఓ వెలుగు వెలగడం మరో విశేషం. - నిర్జర.    

  వెరీ బ్యూటిఫుల్... శాటిన్ శాండల్!     కేలెండర్లో రోజులెంత ఫాస్ట్ గా మారుతున్నాయో మార్కెట్లో ఫ్యాషన్లు కూడా అంతే ఫాస్ట్ గా మారిపోతున్నాయి. నిన్న కనిపించింది ఈరోజు కనిపించదు. ఈరోజు కనిపించింది రేపు ఉండదు. ఫాలో అయ్యే ఓపికుండాలే కానీ నిమిషానికో నయా ఫ్యాషన్. అలా ఈ మధ్య కొత్తగా వచ్చిన ఫ్యాషన్ ట్రెండ్స్ లో శాటిన్ శాండిల్ ఒకటి. శాటిన్ క్లాత్ తో బట్టలు కుడతారని మనకి తెలుసు. ఎన్నో యేళ్లుగా అందరం వేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు శాటిని పాదాల వరకూ పాకింది. చెప్పులపై చేరి కొత్త షోకులు పోతోంది. ఫ్లాట్స్, హీల్స్, షూస్... ఇలా శాటిన్ క్లాత్ తో రకరకాల పాదరక్షలు తయారవుతున్నాయి. తళతళా మెరిసే శాటిన్ క్లాత్ కాళ్లకు ఎంత అందాన్నిస్తోందో చెప్పనలవి కాదు.     వేసుకుని చూడాల్సిందే. అందులోనూ బ్రైట్ కలర్స్ వాడుతున్నారేమో కళ్లు చెదరగొడుతున్నాయి. దానికి తోడు చక్కని పువ్వులు, యాంకిల్ ర్యాప్స్ వంటివి అదనంగా చేర్చుతున్నారేమో... వాటి అందం మరింత మురిపిస్తోంది. కొన్ని కంపెనీల వాళ్లయితే ఖరీదైన స్టోన్స్ వంటివి కూడా అద్దుతున్నారు. రేటు విషయానికొస్తే ఆరేడు వందల నుంచి కొన్ని వేల వరకూ పలికేవి కూడా ఉన్నాయి. ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ లో అయితే డిస్కౌంట్లు బాగా లభిస్తున్నాయి. - Sameera

నీ హిప్పీ ప్యాంటూ చూసి బుల్లమ్మో...   ఒకప్పుడు నీ జీనూ ప్యాంటూ చూసి బుల్లమ్మో అంటూ పాడేవారు అబ్బాయిలు. కానీ ఇప్పుడు నీ హిప్పీ ప్యాంటూ చూసి బుల్లమ్మో అంటూ పాడుతున్నారు. ఎందుకంటే జీన్స్ మెల్లమెల్లగా వెనకబడుతోంది. రకరకాల సరికొత్త రకాల ప్యాంట్లు మార్కెట్లో ప్రత్యక్షమవడంతో దాని మీద క్రేజ్ కొద్దికొద్దిగా తగ్గిపోతోంది. అలా జీన్స్ ని వెనక్కి నెట్టేస్తోన్న ప్యాంట్లలో హిప్పీ ప్యాంట్ ఒకటి. మెత్తని క్లాత్ మీద చక్కని ప్రింట్ తో అట్రాక్టివ్ గా కనిపిస్తోన్న ఈ ప్యాంట్ల పేరు... హిప్పీ ప్రింటెడ్ ప్యాంట్స్. పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రింట్సే వీటి ప్రత్యేకత.     ఇంతవరకూ చీరల మీద, స్కర్ట్ ల మీద, షర్ట్స్ మీద ఇలాంటి ప్రింట్లు కనిపించేవి. ప్యాంట్ల మీద అంటే కేవలం నైట్ ప్యాంట్లు మాత్రమే ఈ రకంగా ఉండేవి. కానీ ఇప్పుడివి ఫ్యాషన్లో ప్రధాన భాగమైపోయాయి. చిన్నగా పెద్దగా ఎలా కావాలంటే అలా... ఎంత దట్టంగా కావాలంటే అంత దట్టంగా వేసిన ప్రింట్లు ఫిమేల్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. వీటిలోనే హిప్పీ వైడ్ లెగ్ ప్యాంట్స్ అనీ, హిప్పీ బ్యాగీ ప్యాంట్లనీ కూడా లభిస్తున్నాయి. వాటి లెగ్స్ స్టయిల్ ను బట్టి పేరు మారిందే తప్ప అన్నిటిదీ ఒకటే ఫార్ములా... ప్రింట్. ఈ ప్రింటే వాటి ప్రాణం. ఈ ప్రింట్ అంటేనే ఆడపిల్లలకు అభిమానం.     ధర కూడా భయపడేంత ఏమీ లేదు. నాలుగొందల నుంచి ఏడు వందల లోపే ఉంటోంది. కాస్త లేస్ లాంటిదేమైనా చేరిస్తే ధర పెరుగుతుందే తప్ప ఇవి ఏ స్థాయి వాళ్లయినా కొనుక్కోగలిగే విధంగానే ఉంటున్నాయి. - Sameera      

  ఇప్పుడంతా బాహుబలి ఫ్యాషన్     బాహుబలి మొదటి భాగం రాకముందు ఉత్తరాదివారికి తెలుగు సినిమా సత్తా ఏమిటో తెలియనే తెలియదు. ఏటా వందల కొద్దీ సినిమాలు తీస్తుంటారు, చూస్తుంటారు అన్న భావన తప్ప మన గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఒకవేళ  అడపాదడపా మాట్లాడుతున్నా తెలుగు సినిమాని ‘సౌత్ ఇండియన్ మూవీ’ అనే పిలిచేవారు. కానీ బాహుబలి మొదటిభాగం టాలీవుడ్ అనే పేరుని బాలీవుడ్కి పరిచయం చేసింది. ఇక బాహుబలి2 ఉత్తరాదిలో విజయబావుటా ఎగరేసి.... సినిమా సరిహద్దలనే చెరిపివేసింది. ఈ కబుర్లన్నీ మనం రోజూ వింటున్నవే! కానీ బాహుబలి ఉత్తరాదిలో ఫ్యషన్ ప్రపంచాన్ని కూడా ఒక ఊపు ఊపుతోందని తెలుసా... బాహుబలి పెండెంట్     బాహుబలి సినిమా అంటేనే శివలింగాన్ని పెకిలించే సన్నివేశమే గుర్తుకువస్తుంది. దాంతోపాటుగా బాహుబలి మెడలో చిన్నపాటి శివలింగం ఉన్న గొలుసూ కనిపిస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడ చూసినా ఈ పెండెంట్ విచ్చలవిడిగా కనిపిస్తోంది. మగవారే కాదు ఆడవారు కూడా దీన్ని సరదాగా వేసుకోవచ్చునంటున్నారు. బాహుబలి నగలు       బాహుబలిలో శివగామి కాసులపేరుని ఎవరు మర్చిపోగలరు, దేవసేన అరవంకీ నుంచి ఎవరు చూపు తిప్పుకోగలరు. ముక్కుపుడకల దగ్గర్నుంచీ, వడ్డాణాల దాకా బాహుబలిలో ప్రతి ఆభరణమూ ప్రత్యేకంగా తయారుచేయించినదే! జైపూర్కి చెందిన ఆమ్రపాలి అనే సంస్థ బాహుబలి కోసం 1500 రకాల ఆభరణాలని రూపొందించింది. ఇప్పుడు వాటిలో 1000 ఆభరణాలని అమ్మకానికి ఉంచింది. హైదరాబాద్ సహా 30 ప్రదేశాలలో ఆమ్రపాలి షోరూంస్లో ఈ ఆభరణాలు దొరుకుతున్నాయి. బాహుబలి జాకెట్లు   ఓ నాలుగుదశాబ్దాల క్రితం బుట్ట జాకెట్లదే హవా. ఆ హవా ఎప్పుడో చల్లబడిపోయింది. బాహుబలి పుణ్యమా అని ఇప్పుడు మళ్లీ బుట్ట జాకెట్లకి రోజులు వచ్చాయి. దేవసేన పాత్రలో అనుష్క వేసుకునే తరహా జాకెట్లకి క్రేజ్ పెరిగింది. అంతేకాదు! కాంట్రాస్ట్ రంగులు, జరీ అంచులు, పూలు.. ఉండే జాకెట్లని బాహుబలి చూసి మరీ వేసుకుంటున్నారు. బాహుబలి కుర్తీలు బాహుబలి2లో అమరేంద్ర బాహుబలి ఠీవిగా ఏనుగునెక్కే సన్నివేశం గుర్తుందా! పోనీ అటు పౌరుషాన్నీ, ఇటు ప్రేమనీ ఏకకాలంలో పలికించే ప్రభాస్, అనుష్కలు విల్లు ఎక్కుపెట్టే దృశ్యం చూశారా. ఇలా బాహుబలిలో ముఖ్యమైన సన్నివేశాలని గుండెలకు హత్తుకునేలా కుర్తీలు వచ్చేశాయి. ఆన్లైన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. బాహుబలి చీరలు   అయితే పంజాబీ డ్రెస్సులు, లేకపోతే పాలిస్టర్ చీరలు రాజ్యమేలుతున్న కాలంలో మగ్గం చీరల్ని మరోసారి గుర్తుచేసింది బాహుబలి. నూలు చీరలైనా, పట్టు చీరలైనా మన సంప్రదాయపు కట్టులో ఉన్న అందానికి సాటి లేదని నిరూపించింది. పెద్దరికాన్ని గుర్తుచేసే శివగామి చీరలైనా, రాచరికాన్ని ప్రదర్శించే అనుష్క చీరలైనా... ఇప్పడు బాహుబలి చీరల పేరుతో మార్కెట్ని ముంచెత్తుతున్నాయి. - నిర్జర.    

    Cool And Creative Nail Designs     Looking for a beautiful and gorgeous way to add flair to your look? Nail art can complement your outfit for a special event or add a unique touch to your personality every day. While very detailed nail art is best left to professionals, there are a number of designs you can create yourself.Try duotones, glitter and jewels, polka dots, blended colors, marbling or stamping to create a gorgeous effect. Water-Marbled Designs: 1)Remove old nail polish: Make sure you're starting with a clean slate by removing any old polish that's still lingering on your nails. 2)Gather your supplies: Water marbling is a creative technique that uses water and a variety of colors for a unique look. Get the following materials ready: A base coat and two or three colors that blend well together, like light blue, yellow and white. A shallow, wide-mouthed cup or bowl filled almost to the brim with room-temperature water. Petroleum jelly. 3)Apply the base coat color: Allow it to dry completely. 4)Add color to the water: Drop some polish into the water from a low height. Notice how it creates a circle of color within the water. 5)Drop an alternate color into the center of the first color: Continue adding drops in the same way, at the center of the circle of color, alternating the colors until you see a bulls-eye shape. 6)Use a toothpick to alter the design. Insert it in the water and drag it through the bulls-eye of color to create patterns. Spiderweb designs are popular, as are flower designs and geometric shapes. Don't go too far with the toothpick, since if you blend the colors too much they won't be distinct from one another. If you create something with the toothpick and you don't like it, simply discard your first attempt and start over from the beginning. 7)Apply the design to your nails: Spread petroleum jelly on the skin around your nails and up your fingers. Carefully place your nails against the design that you created and then submerge them slightly. Remove water from the nails. Blow off any water droplets and use a cotton swab or cotton ball (coated with acetone if necessary) to clean up the edges and remove polish from your fingers.