కొబ్బరి నూనెలో ఇవి మిక్స్ చేసి రాస్తే చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతం..! జుట్టుకు ఉపయోగించే నూనెలలో కొబ్బరినూనె వాడే వారు అధికశాతం మంది ఉంటారు. కొబ్బరి నూనె మరీ చిక్కగా లేకుండా తేలికగా ఉంటుంది.  దీన్ని జుట్టుకు అప్లై చేసిన తరువాత జుట్టు ఆరోగ్యంగా,  మెరుస్తూ కనిపిస్తుంది.  సాధారణంగా కొబ్బరినూనెను తలకు పెట్టుకుని అలాగే ఉంచుకుంటారు.  మరుసటి రోజు లేదా రెండు రోజుల తరువాత తలస్నానం చేసేవారు కూడా ఉంటారు.  మరికొందరు మాత్రం కొబ్బరినూనెను తలకు పెట్టుకుని ఒక గంట ఆగి తలస్నానం చేస్తుంటారు.  పై పద్దతులలో ఎలా చేసినా జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో ఇది సహాయపడుతుంది. అయితే సరైన కేశ సంరక్షణ లేకపోవడం, జుట్టు పలుచగా ఉండటం,  జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు.  ముఖ్యంగా జుట్టు పెరుగుదల సరిగా లేక నిరాశ పడేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారు కొబ్బరినూనెలో కొన్ని పదార్థాలు మిక్స్ చేసి తలకు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  ఎంతో మంది అమ్మాయిలు కలగనే పొడవాటి జుట్టు,  నడుము వరకు పెరిగే జుట్టు ఈ చిట్కాల వల్ల సాధ్యమవుతుంది.  ఇంతకీ ఇందుకోసం ఏం చేయాలంటే.. జుట్టుకు కొబ్బరినూనె.. కొబ్బరినూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు,  విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి.  ఇవి జుట్టును ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. జుట్టుకు పోషణ ఇస్తాయి.  కొబ్బరి నూనెలో కొన్ని పదార్థాలు మిక్స్  చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. వేప.. కొబ్బరినూనెలో వేప ఆకులను మిక్సీ వేసి కలపాలి.  ఈ నూనెను తలకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.  ఇలా చేస్తే జుట్టు పెరుగుదల అద్భుతంగా  ఉంటుంది. లేకపోతే కొబ్బరి నూనెలో వేప విత్తనాల నూనె కూడా కొద్దిగా కలిపి అప్లై చేసుకోవచ్చు. ఈ నూనె చాలా ప్రభావవంతంగా ఉంటుంది.  వారంలో రెండు సార్లు ఈ కాంబినేషన్ వాడుతుంటే జుట్టు పెరుగుదల చూసి ఆశ్చర్యపోతారు.  అంతేకాదు.. ఈ నూనె వాడటం వల్ల జుట్టు మందంగా కూడా మారుతుంది. దాల్చిన చెక్క .. కొబ్బరి నూనెలో దాల్చిన చెక్క పొడిని కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.  జుట్టుకు మెరుపు వస్తుంది. అంతేకాదు జుట్టు రాలడం ఆగాక ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది.   కరివేపాకు.. జుట్టుకు కొబ్బరినూనె, కరివేపాకు కాంబినేషన్ ను చాలా ఏళ్ళ క్రితం నుండి వాడుతున్నారు.  కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడతాయి.  కరివేపాకును కొబ్బరినూనెలో కలిపి వాడటమే కాకుండా ప్రతిరోజూ నాలుగైదు పచ్చి కరివేపాకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుంది.                                                       *రూపశ్రీ.  

  కళ్ళ కింద నల్లటి వలయాలను తొలగించే చిట్కాలు... పెరిగిపోతున్న ఒత్తిడి, తగ్గుతున్న నిద్రాసమయం ఫలితంగా కళ్ళ కింద నల్లటి వలయాలు. టీనేజ్ అమ్మాయిల నుంచి అన్ని వయసుల వారిని ఇబ్బంది పెట్టే ఈ నల్లటి వలయాలని కనిపించకుండా చేయడానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. 1. మేకప్ వేసుకోవడానికి ముందు ఒక మంచి మాయిశ్చరైజర్ ని కళ్ళ కింద రాయండి. దాని వల్ల ఆ భాగంలో చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది. 2. సాధారణంగా మేకప్ వేసుకునే ముందు పౌండేషన్ అప్లై చేస్తారు. నల్లటి వలయాలు ఉన్నవాళ్లు ఫౌండేషన్ కంటే ముందు కంటి కింద ప్రైమర్ అప్లై చేస్తే చాలు. అది నలుపుదనం కనిపించకుండా చేస్తుంది. 3. ఇక నల్లటి వలయాలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా తక్కువ మేకప్ వేసుకోవాలి. ఎందుకంటే ఎంత ఎక్కువ మేకప్ వేసుకుంటే, కాసేపటికి అంత ఎక్కువగా ఆ నల్లటి వలయాలు బయటపడతాయి. 4. కన్సీలర్ వాడే అలవాటు ఉన్నవారు మరీ ముదురు రంగులో ఉన్న దానిని కాకుండా స్కిన్ టోన్ కు సరిపడే రంగుకి దగ్గరగా ఉండే బూడిద రంగులోది వాడటం మంచిది. ముదురు రంగు మరింతగా నల్లటి వలయాలు కనిపించేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మీరు వాడే ఫౌండేషన్ కంటే ఓ రెండు షేడ్లు లైట్ గా ఉండాలి మీ కన్సీలర్. అలాగే కళ్ళ కింద మేకప్ ప్యాచులాగా కనిపించ కూడదంటే క్రీమ్ లో ఉండే దానిని వాడండి. దానిని చాలా నెమ్మదిగా కళ్ళకింద వలయాలపై అద్దండి. 5. అలాగే మేకప్ తీసాకా చల్లటి నీటిలో ముంచిన మేత్తని వస్త్రాన్ని ఓ పదినిమిషాలు కళ్ళమీద పెట్టుకుంటే మంచిది.   -రమ

  వారానికి రెండుసార్లు.. ఈ ఒక్క డ్రింక్ తాగితే జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే..!   మనిషి అందంగా కనిపించడంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తుగా జుట్టు ఉండటం వల్ల చాలామంది ఎంతో ఆత్మివిశ్వాసంతో కూడా ఉంటారు. అయితే జుట్టు రాలే సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో నాణ్యమైన జుట్టు పెరుగుదల కలలా మారుతోంది.  చాలామంది అమ్మాయిల నుండి పురుషుల వరకు ప్రతి ఒక్కరు జుట్టు పెరుగుదల కోసం చాలా చిట్కాలు ట్రై చేసి నిరాశ చెందుతున్నారు. అయితే జుట్టును ఊహించని విధంగా పెంచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే డ్రింక్ ఒకటుంది.   ఈ డ్రింక్ ను వారంలో కేవలం రెండు సార్లు తాగితే చాలు.. తొందరలోనే హెయిర్ గ్రోత్ ప్రారంభమవుతుంది. పలుచగా ఉన్న జుట్టు మందంగా కూడా మారుతుంది. అలాగే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.  జుట్టుకు ఇన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చే ఆ డ్రింక్ ఏంటో.. దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే.. మునగాకు డ్రింక్.. మునగ ఆకు జుట్టుకు చాలా సహాయపడుతుంది.  చాలామంది మునగాకును లైట్ గా తీసుకుంటారు. కానీ ఇది షుగర్ పేషెంట్లకు,  అలాగే జుట్టు పెరుగుదలకు, కంటి ఆరోగ్యానికి, చర్మానికి.. ఇలా చాలా రకాలుగా మేలు చేస్తుంది. కావలసిన పదార్థాలు.. మునగ ఆకు.. ఒక గుప్పెడు క్యారెట్.. ఒకటి నిమ్మకాయ.. సగం నీరు.. ఒక గ్లాసు.. తయారు విధానం.. ఒక గుప్పెడు మునగ ఆకులను తీసుకుని మిక్సర్ జార్ లో వేయాలి. ఇందులో ఒక క్యారెట్ ను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇందులో సగం కాయ  నిమ్మరసం పిండాలి.  తర్వాద దీంట్లో గ్లాసుడు నీరు పోసి బాగా గ్రైండ్ చేయాలి.  తర్వాత దీన్ని వడగట్టి తాగాలి. ఈ డ్రింక్ ను వారంలో రెండు సార్లు తాగాలి. మునగను వాడటం వల్ల  జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది . ఎందుకంటే ఇందులో విటమిన్లు ఎ, బి, సి,  ఇ వంటి అనేక పోషకాలతో పాటు ఐరన్  కూడా ఉంటుంది. ఇవన్నీ కలిసి జుట్టు రాలడాన్ని నివారించడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో,  తల చర్మంతో సహా వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.                                                 *రూపశ్రీ.  

  రోజూ ముఖానికి తేనె అప్లై చేస్తే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా!   తేనె ఆరోగ్యానికి అద్బుతమైన ఔషధం. తేనె శరీరానికి చేకూర్చే లాభాల గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే తయారవుతుంది. రుచికి తియ్యగా, ఆహ్లాదంగా అనిపించే తేనె శరీరంలో ఏర్పడే అసౌకర్యాన్ని,  .. జబ్బులను తగ్గిస్తుంది. అయితే తేనెను ఇలా ఆహారంలోనే కాదు.. చర్మానికి కూడా ఉపయోగించవచ్చు.  తేనెను చర్మానికి ఉపయోగించడం వల్ల చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రతిరోజూ కొన్ని చుక్కల తేనెను ముఖానికి రాసుకుంటూ ఉంటే ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. తేనె ఎలా పనిచేస్తుంది.. తేనెలో యాంటీ ఆక్సిడెంల్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుండి కాపాడతాయి. తద్వారా చర్మం డ్యామేజ్ కావడం తగ్గుతుంది.  అంతేకాదు తేనెలో ఉండే సమ్మేళనాలు చర్మానికి బిగుతును ఇస్తాయి. ప్రతిరోజూ కొన్ని చుక్కల తేనెను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.  ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మం మీద ముడతలు,  గీతలు తగ్గుతాయి.  ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.  ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మానికి ఎలాస్టిక్ గుణాన్ని పెంచుతుంది. పొడి చర్మం ఉన్నవాళ్లకు తేనె భలే పనిచేస్తుంది. చర్మం పొడిబారడం తగ్గి చర్మం మృదువుగా మారుతుంది. చర్మంలో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. తేనె చర్మాన్ని క్లియర్ చేస్తుంది.  తద్వారా కొత్త చర్మ కణాల ఉత్పత్తి ఆరోగ్యకరంగా ఉంటుంది.  ఇది చర్మాన్ని మెరిచేలా చేస్తుంది. మొటిమలు, చర్మ సంబంధ సమస్యలు, ర్యాషెస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి తేనె చక్కని మార్గం.  తేనెను రోజూ కొన్ని చుక్కలు ముఖానికి రాస్తుంటే ముఖం మీద మొటిమలు ఏర్పడటం తగ్గుతుంది. తరచుగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడేవారికి ఈ చిట్కా ఎంతగానో సహాయపడుతుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా సులువుగా తొలగిపోతుంది.                                           *రూపశ్రీ.

  పెడిక్యూర్ ఇంట్లోనే ఇలా ట్రై చేయండి.. బ్యూటీ పార్లర్ అక్కర్లేదు..!   మగువలు శరీరంలో ప్రతి భాగం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వెంట్రుకల నుండి పాదాల వరకు ప్రతీదీ వారి సౌందర్య సంరక్షణలో భాగమే.. ముఖ్యంగా పాదాలు చాలా తొందరగా ప్రభావానికి గురవుతూ ఉంటాయి.దుమ్ము,ధూళి,  కాలుష్యం,  ఎక్కువ తేమ తగలడం వంటి కారణాల వల్ల పాదాలు పగలడం,  గరుకుగా మారడం,  కళ కోల్పోవడం,  పాదాల చర్మం పొట్టులాగా లేవడం వంటివి జరుగుతూ ఉంటాయి.  ఈ కారణంగానే చాలామంది బ్యూటీ పార్లర్ కు వెళ్లి పాదాలకు పెడిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు. కానీ కేవలం నిమ్మకాయ ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా పెడిక్యూర్ చేసుకోవచ్చు.   కావసిన పదార్థాలు.. ఇంట్లోనే పెడిక్యూర్ చేయడానికి  2, 3 నిమ్మ తొక్కలు 1 షాంపూ సాచెట్ ఆముదం బేబీ ఆయిల్ బేకింగ్ సోడా అవసరం అవుతాయి. పెడిక్యూర్ పేస్ట్.. 1 గ్లాసు నీటిని వేడి చేయాలి. మరుగుతున్న  నీటిలో  నిమ్మ తొక్కలు వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని ఒక పెద్ద పాత్రలో వేసి ఎక్కువ నీరు కలపాలి.  దీనివల్ల పాదాలకు సరిపడినంత నీరు సమకూరుతుంది.  ఇప్పుడు ఉడకబెట్టిన నిమ్మతొక్కకు  స్క్రబ్‌ మిశ్రమం వేసుకుని పాదాలను బాగా రబ్  చేసుకోవాలి. దీని తరువాత, నిమ్మ  తొక్కతో గోర్లు,  ముఖ్యంగా గోర్ల  మూలలను శుభ్రం చేయాలి. తర్వాత నీళ్లతో పాదాలను శుభ్రంగా కడగాలి. స్క్రబ్ ఎలా చేసుకోవాలంటే.. ఒక గిన్నెలో 1 టీస్పూన్ బేబీ ఆయిల్, 1 టీస్పూన్ ఆముదం,  1 టీస్పూన్ బేకింగ్ పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్టే ను పాదాలకు స్ర్కబ్ లాగా ఉపయోగించాలి.                                     *రూపశ్రీ.                  

అవాంఛిత రోమాలను శరీరంలో ఏ భాగం నుండి ఎలా తొలగించాలంటే..!   అవాంఛిత రోమాలు సాధారణంగా అమ్మాయిలను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందమైన దుస్తులు ధరించాలంటే కనీసం కాళ్లు చేతుల మీద కూడా వెంట్రుకలు లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇక స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవాలంటే అండర్ ఆర్మ్ లో అవాంఛిత రోమాలు తొలగించుకోవాల్సిందే.. ముఖం మీద.. కొందరికి పెదవుల మీద.. మరికొందరు బికినీ ఏరియాలో అవాంఛిత రోమాలు తొలగిస్తుంటారు. ఇప్పట్లో అవాంఛిత రోమాలు తొలగించడానికి హెయిర్ రిమూవల్ క్రీములు,  రేజర్ లు అందుబాటులో ఉండటం వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేకుండానే వాటిని తొలగిస్తుంటారు. కానీ ఏ ప్రాంతంలో అవాంఛిత రోమాలను ఎలా తొలగించాలో చాలామందికి తెలియదు. చర్మ సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెప్పారో తెలుసుకుంటే.. చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం ముఖంపై వెంట్రుకలను తొలగించడానికి సురక్షితమైన మార్గం షేవింగ్. ఇప్పట్లో మార్కెట్లో చాలా రేజర్ లు మాత్రమే కాకుండా చిన్నపాటి ఫేషియల్ హెయిర్ రిమూవర్ బ్లేడ్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. పై పెదవులు,  కనుబొమ్మల దగ్గర  వెంట్రుకలను తొలగించడానికి థ్రెడింగ్ ఉత్తమ మార్గం.  ఇది చాలా కాలం పాటు  సురక్షితంగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో షేపింగ్, వ్యాక్సింగ్ చేయరాదు. అండర్ ఆర్మ్ హెయిర్ తొలగించడానికి వాక్సింగ్ ఉత్తమ మార్గం. బికినీ ప్రాంతం కోసం కత్తెరతో హెయిర్ ను చిన్నగా కత్తిరించండి లేదా ట్రిమ్మర్‌ని ఉపయోగించండి. చేతులు,  కాళ్ళ నుండి అవాంఛిత రోమాలను తొలగించడానికి హెయిర్ రిమూవల్ క్రీమ్‌లను ఉపయోగించవచ్చు. మీరు చేతులు.  కాళ్ళపై వెంట్రుకలు చాలా వేగంగా  పెరిగే సమస్య ఉంటే, అప్పుడు ట్రిమ్మర్ ఉపయోగించవచ్చు. శరీరంలోని ఏ భాగానైనా అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించడానికి లేజర్ హెయిర్ రిమూవల్ చేయవచ్చు. సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ మార్గదర్శకత్వంలో ఎల్లప్పుడూ లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలి.   హెయిర్ ను బట్టి  అనుగుణంగా లేజర్ శక్తిని వినియోగిస్తారు. డెర్మటాలజిస్టులు చెబుతున్న పద్ధతులు వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటాయి. షేవింగ్ గురించి మాట్లాడటం, షేవింగ్ చేయడం సులభం.   పార్టీకి వెళ్లవలసి వస్తే లేదా ఏదైనా పని ఉంటే చివరి నిమిషంలో దీన్ని చేయవచ్చు. అంతేకాదు షేవింగ్ చేయడం వల్ల నొప్పి ఉండదు. జాగ్రత్తగా షేవింగ్ చేయడం ముఖ్యం లేకపోతే చర్మంపై కోతలు ఏర్పడవచ్చు, లేదా  రేజర్ బర్న్ అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు షేవింగ్ చేయడం వల్ల ఇన్గ్రోన్ హెయిర్ సమస్య కూడా వస్తుంది. వ్యాక్సింగ్ చేస్తే  జుట్టు చాలా వారాల వరకు తిరిగి పెరగదు. వ్యాక్సింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంత నొప్పి ఉంటుంది.  మైనం చాలా వేడిగా ఉంటే అది చర్మాన్ని కమిలిపోయేలా చేస్తుంది. అందుకే వ్యాక్సింగ్ చేసేటప్పుడు లేదా చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. హెయిర్ రిమూవల్  క్రీమ్‌తో హెయిర్ రిమూవ్ చేస్తుంటే ప్యాచ్ టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే హెయిర్ రిమూవల్ క్రీమ్ వాడాలి.                                             *రూపశ్రీ.

సమ్మర్ లో మహిళలు తీస్కోవాల్సిన జాగ్రత్తలు... సమ్మర్ హీట్ మోతెక్కిస్తోంది. బయటికి వెళ్లాలంటేనే భయం వేసేంతగా వాతావరణం మారిపోయింది. ఎక్కువగా బయట తిరిగే మహిళల చర్మం ఈ సమ్మర్ ఎఫెక్ట్ కు నల్లగా మారిపోవడం, మేని ఛాయ తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నపు ఎండ చర్మానికి తీవ్రమైన హాని కలుగజేస్తుంది. మహిళల మృదువైన చర్మంలో ఉండే సాగే గుణాన్ని, సమ్మర్ హీట్ ధ్వంసం చేస్తుంది. అందుకే మరీ అవసరమైతే తప్ప, మహిళలు బయటికి వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం. ఒక వేళ తప్పనిసరైతే మాత్రం, స్కార్ఫ్, గ్లోవ్స్ తో పాటు, సాక్స్ కూడా వేసుకోవడం తప్పనిసరి. ఉదయం ఏడింటి వరకూ వచ్చే ఎండ చాలా మంచిది. ఇది చర్మానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తితో పాటు, డి విటమిన్, కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. కానీ ఆ తర్వాతి నుంచి మాత్రం భానుడి భగభగలు మొదలవుతాయి. అందుకే సమ్మర్ లో బయటికి వెళ్లేప్పుడు మాయిశ్చరైజర్ కంపల్సరీ. రెండు మూడు గంటలకోసారి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. పెదాలు పొడిబారిపోయి, పగిలిపోకుండా లిప్ బాప్ వాడుతుండాలి. సన్ స్క్రీన్ రాసుకున్నంత మాత్రాన ఎండలో తిరగచ్చు అనుకుంటే పొరబాటే. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంట గొడుగో లేక స్కార్ఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఒక వేళ ఎండ వేడికి చర్మంపై రాష్ లు గానీ దురదలు గానీ వస్తుంటే, కలబందతో తయారైన జెల్ వాడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. కుటుంబ ఆరోగ్యచరిత్రలో చర్మకాన్సర్ ఉన్నవాళ్లు వీలైనంత వరకూ ఎండలో తిరగడాన్ని నివారించాలి. సమ్మర్ అంతా బి, సి, ఇ, విటమిన్లు, కెరోటిన్‌, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే ఆహారాన్నే ఎంచుకోవాలి. ద్రాక్ష, చెర్రీ, బెర్రీలు, ఆపిల్‌, గ్రీన్‌టీ, ఉల్లిపాయ, బొప్పాయి, నిమ్మజాతిపండ్లు లాంటి ఫ్లేవనాయిడ్ల ఆధారిత ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యమివ్వాలి. వీటివల్ల శరీరంలో తేమ శాతం పెరుగి అలసట దూరమవుతుంది.

ముఖం పై బ్లీచ్ ను ఎంతసేపు ఉంచుకోవాలి !   ముఖం గ్లో పెంచడానికి మహిళలు ఫేషియల్ తర్వాత బ్లీచింగ్ ట్రీట్‌మెంట్ మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  ఈ బ్యూటీ ట్రీట్‌మెంట్ తో  ముఖంపై అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. బ్లీచింగ్ పద్ధతి చాలా సులభం అయినప్పటికీ కొన్నిసార్లు ఇది  సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది.  అందుకే బ్లీచ్ చేసుకునే ముందు లేదా చేయించుకునే ముందు   కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖం మీద బ్లీచ్‌ను ఎంతకాలం ఉంచాలో.. ఇతర జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే.. ఏం చేయాలి.. ముఖం మీద బ్లీచ్ ను 10 నిమిషాలు మాత్రమే ఉంచాలి. దీని కంటే ఎక్కువ సమయం ఉంచితే అది  చర్మానికి  హాని కలిగిస్తుంది, ఇది  చర్మానికి హాని కలిగించే క్లోరిన్ వినియోగాన్ని పెంచుతుంది.  అలెర్జీలు వచ్చే అవకాశాలను కూడా పెంచుతుంది. రాత్రిపూట బ్లీచ్ వేయడం ఉత్తమం. ఇది సహజ కాంతిని తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది.  ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్లీచ్ తొలగించిన తర్వాత ముఖంపై మరే ఇతర క్రీమ్ ఉపయోగించకూడదు. ఇది చర్మానికి హాని కలిగిస్తుంది. చర్మం నుండి అదనపు నూనె,  మురికిని తొలగించడానికి  మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరవడానికి బ్లీచింగ్ చేయడానికి ముందు  ముఖాన్ని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఏం చేయకూడదు.. బ్లీచింగ్ చేసిన వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. బ్లీచింగ్  చర్మాన్ని సున్నితంగా చేస్తుంది.  ఎండలోకి వెళితే సూర్య కిరణాలు ఈ సున్నితత్వాన్ని పెంచుతాయి. కుదిరితే బ్లీచింగ్ తరువాత 48 గంటల పాటూ ఎండ తగలకుండా ఉండటం మంచిది. దద్దుర్లు లేదా చికాకును నివారించడానికి కళ్ళు లేదా పెదవుల వంటి సున్నితమైన ప్రదేశాలలో బ్లీచ్‌ను పూయడం మానుకోవాలి.                                         *రూపశ్రీ.

రైస్ పేపర్ ఫేస్ మాస్క్..మ్యాజిక్ చేసే ఈ మాస్క్ గురించి విన్నారా!     షీట్ మాస్క్‌లు ప్రపంచానికి పరిచయం అయినప్పటి నుండి చాలా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. షీట్ మాస్క్ లలో చాలా రకాలు ఉంటాయి. ప్రూట్స్ కాంబినేషన్ లో ఉన్న షీట్ మాస్క్ లు ముఖానికి తాజా మెరుపును,  కాంతిని ఇస్తాయి.  ఇకపోతే చాలామందికి బియ్యం అనేది ఆహార పదార్థం.  బియ్యం కడగగా లేదా బియ్యం ఉడికించగా అందులో మిగిలే నీటిని నిరభ్యరంతంగా సింకులో పోసేస్తుంటారు.  అయితే ఇది పొరపాటని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.   బలమైన జుట్టుకు, ఆరోగ్యకరమైన చర్మానికి ఈ రైస్ వాటర్ లేదా బియ్యం ఉడికించిన నీటిని ఉపయోగించవచ్చు.  పెద్దగా ఖర్చు లేకుండానే  సన్నని బియ్యం కాగితపు షీట్లతో తయారు చేసిన మాస్క్ లను ఉపయోగించవచ్చు.  ఈ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, చర్మ కాంతిని  మెరుగుపరచడానికి సహాయపడుతుంది.  దీన్ని షాప్స్ లో అయినా  కొనుగోలు చేసి నేరుగా ఉపయోగించవచ్చు లేదా ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. బియ్యం షీట్ ఫేస్ మాస్క్.. ఇది బియ్యంతో సన్నని షీట్లుగా  తయారు చేయబడిన ఒక రకమైన బ్యూటీ ట్రీట్మెంట్. ఇది చర్మానికి పోషకాలను  అందించడానికి సహాయపడుతుంది.  ఈ మాస్క్ సాధారణంగా హైడ్రేటింగ్ సీరమ్‌లు, విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు వంటి వివిధ పోషక పదార్థాలతో నింపబడి ఉంటుంది. రైస్ పేపర్స్ అని మార్కెట్లో దొరుకుతాయి.  వాటిని కొనుగోలు చేసి అయినా వాడచ్చు. లేదంటే టిష్యూ పేపర్స్ ఉంటాయి.  వాటిని షీచ్ మాస్క్ షేప్ లో కట్ చేసి అన్నం ఉడికించిన చిక్కటి ద్రవంలో ఈ షీట్ ను నాన బెట్టి ఆ తరువాత జాగ్రత్తగా ముఖం మీద మాస్క్ లాగా వేసుకోవాలి.  ఈ షీట్ మాస్క్ చాలా ప్రయోజనాలను అందిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.. ఈ షీట్ మాస్క్ చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. ఇది హైడ్రేటింగ్ సీరమ్స్ ఏజెంట్స్ ను కలిగి ఉంటుంది.  కాబట్టి ఇది చర్మం  పొడిబారకుండా నిరోధించి,  చర్మానికి  పోషణ ఇస్తుంది.  "ఇది ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి , అదనపు హైడ్రేషన్ అవసరమయ్యే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.  చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.. బియ్యం కాగితం ఫేస్ మాస్క్‌లో సాధారణంగా విటమిన్ సి, బియ్యం సారం,  నియాసినమైడ్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. ఈ పదార్థాలు నల్ల మచ్చలు,  హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో పనిచేస్తాయి.  విటమిన్ సి చర్మంలో వర్ణద్రవ్యం ఉత్పత్తిని నిరోధించడం ద్వారా నల్ల మచ్చలను తగ్గిస్తుంది. సన్ బర్న్ నుండి ఉపశమనం.. ముఖ్యంగా  సన్‌స్క్రీన్ ఉపయోగించకుండా బయటకు వస్తే ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల చర్మం కందిపోతుంది. బియ్యం ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల సూర్యుడి నుండి చర్మ నష్టాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రైస్ పేపర్‌తో తయారు చేసిన ఫేస్ మాస్క్‌లో చర్మానికి ఓదార్ఫు ఇచ్చే  లక్షణాలు ఉంటాయి. అవి సన్ బర్న్ ను  ఎదుర్కోవడంలో సహాయపడతాయి.  చర్మ ఆకృతి.. ఈ రకమైన ఫేస్ మాస్క్ చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది సున్నితమైన ఎక్స్‌ఫోలియేషన్‌కు సహాయపడుతుంది. ఇది చర్మంపై ఉన్న కఠినమైన మచ్చలను సున్నితంగా చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మ పునరుత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. ఇది కాలక్రమేణా చర్మ ఉపరితలం మృదువుగా అనిపించేలా చేస్తుంది. వృద్ధాప్యానికి చెక్ పెడుతుంది. రైస్ పేపర్ ఫేస్ మాస్క్ తరచుగా కొల్లాజెన్,  హైలురోనిక్ యాసిడ్ వంటి పదార్థాలతో నింపబడి ఉంటుంది, ఇవి యాంటీ ఏజింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ పదార్థాలు చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడం,   చర్మానికి లోతుగా తేమను  అందించడం ద్వారా చక్కటి గీతలు,  ముడతలను  తగ్గించడంలో సహాయపడతాయి.  సున్నితమైన చర్మానికి.. రైస్ షీట్ మాస్క్  మృదువైనది  రాపిడి లేకుండా ఉంటుంది. కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది ఒక గొప్ప ఎంపిక. బియ్యం నుండి తీసుకోబడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులు సురక్షితమైనవి.  చికాకు కలిగించవు. కఠినమైన ఫేస్ మాస్క్‌ల మాదిరిగా కాకుండా, బియ్యం కాగితం ఫేస్ మాస్క్ చర్మానికి సున్నితంగా అంటుకుంటుంది. చికాకు లేదా అసౌకర్యాన్ని కలిగించదు.                                    *రూపశ్రీ.

మామిడికాయను తినడానికే కాదు.. ముఖానికి కూడా వాడచ్చు ఇదిగో ఇలా..!     పండ్ల రారాజు మామిడి పండు.  వేసవి కోసం చాలా మంది ఎదురు చూసేది మామిడి పండ్ల కోసమే అంటే అతిశయోక్తి కాదు. కానీ మామిడి పండును కేవలం తినడానికే కాదు.. ముఖానికి కూడా ఉపయోగించ వచ్చు.  దీని వల్ల అందం పెరుగుతుంది.  మెరిసే చర్మం సొంతమవుతుంది.  దీని కోసం మామిడి పండును ముఖానికి ఎలా వాడాలో తెలుసుకుంటే.. మామిడికాయ గుజ్జు.. మామిడికాయ గుజ్జులో విటమిన్-సి,  బీటా కెరోటిన్ ఉంటాయి.  ఇవి సహజంగా చర్మాన్ని మెరిపించడంలోనూ, పొడి చర్మాన్ని మృదువుగా ఉంచడంలోనూ సహాయపడతాయి.  ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడం కోసం మామిడికాయ గుజ్జును ముఖానికి అప్లై చేయవచ్చు. మామిడి కాయ, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్.. ముఖం పై టానింగ్,  ముడతలను తగ్గించడానికి మామిడి, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాస్ ను ఉపయోగించవచ్చు.  దీన్ని తయారు చేసుకోవడం కూడా సులభం. కావలసిన పదార్థాలు.. పండిన మామిడి పండు. ముల్తాని మట్టి.. పెరుగు.. తయారీ విధానం.. మామిడి పండు గుజ్జు తీయాలి.  ఈ గుజ్జులో పెరుగు వేయాలి.  ఇందులోనే ముల్తానీ మట్టి వేసి బాగా మిక్స్ చేయాలి.  ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. లిప్ బామ్.. మామిడి పండుతో లిప్ బామ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది మంచి ఫ్లేవర్ తో భలే ఉంటుంది.  పగిలిన పెదవులకు రెగ్యులర్ గా ఈ లిప్ బామ్ వాడుతూ ఉంటే పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు,  కొవ్వు ఆమ్లాలు పెదవులను మృదువుగా చేస్తాయి. మామిడి తొక్కల పేస్ట్.. ముఖం ప్రకాశవంతంగా ,  అందంగా కనిపించడానికి మామిడి తొక్కలను ఉపయోగించవచ్చు. ఇందుకోసం మామిడి తొక్కలను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి.  దీనికి రోజ్ వాటర్ జోడించాలి.  దీన్ని ముఖానికి అప్లై చేయాలి.  ఇది చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది. మామిడి ఐస్ క్యూబ్స్.. ముఖం మీద వాపు,  నల్లటి మచ్చలు ఉంటే మామిడి రసం ను ఐస్ ట్రే లలో వేసి ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవాలి.  ఈ ఐస్ క్యూబ్స్ ను ముఖం మీద అప్లై చేయాలి.  ఇది ముఖాన్ని తాజాగా,  తేమగా ఉంచుతుంది.                                              *రూపశ్రీ.  

తెలిసి తెలియక చేసే ఈ తప్పుల వల్లే జుట్టు రాలిపోతుంది..! ఈ రోజుల్లో ప్రతి ఇద్దరు వ్యక్తులలో ఒకరు  జుట్టు రాలడమనే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి.  వాటిలో ప్రధాన కారణం విపరీతమైన వేడి, మారుతున్న వాతావరణం,  చెడు ఆహారపు అలవాట్లు అని ప్రజలు అనుకుంటారు. ఇది చాలా వరకు నిజం. కానీ జుట్టు రాలడానికి  ఆ వ్యక్తే ముఖ్యమైన  కారణం కావచ్చని చాలా మందికి తెలియదు.  నిజానికి తెలిసి లేదా తెలియకుండా చేసే కొన్ని తప్పులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి.  జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే ఖరీదైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం చాలామంది చేసే మొదటి పని. ఇలా చేసిన తర్వాత కూడా జుట్టు రాలడం తగ్గకపోతే వారు తప్పుగా వెళుతున్నారనే అర్థం.  చాలా మంది చేసే తప్పుల గురించి తెలుసుకుంటే.. తలస్నానం.. ప్రతి ఒక్కరూ తమ జుట్టు రకాన్ని బట్టి జుట్టు కడుక్కోవాలి. కానీ చాలామందికి తమ  జుట్టు రకం తెలియదు. జుట్టు రకం ఏదో తెలియని వారు వారానికి మూడు సార్లు మాత్రమే  జుట్టును కడుక్కోవాలి. జుట్టును మూడు సార్లు కంటే ఎక్కువ వాష్ చేస్తుంటే అది బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. జుట్టు  ఒకసారి బలహీనంగా మారితే అది రాలిపోవడాన్ని  ఎవరూ ఆపలేరు. తల చర్మం.. తరచుగా ప్రజలు తమ జుట్టును క్రమం తప్పకుండా వాష్ చేసుకుంటారు.  కానీ తల చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేయరు. దీని కోసం జుట్టుకు సరైన మొత్తంలో షాంపూ వేసి ఆపై శుభ్రం చేసి బాగా కడగాలి. తద్వారా తల చర్మం శుభ్రంగా మారుతుంది. తలపై చర్మం మురికిగా ఉండటం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. తడి జుట్టును దువ్వడం.. ఉదయం జుట్టును పూర్తిగా ఆరబెట్టి తరువాత దువ్వుకోవడానికి ఎవరికీ తగినంత సమయం ఉండదు. కానీ తడి జుట్టును ఎప్పుడూ దువ్వకూడదని  గుర్తుంచుకోవాలి. తడి జుట్టును దువ్వడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి. దీనివల్ల జుట్టు వేగంగా రాలిపోతుంది. జుట్టును గట్టిగా కట్టడం..  జుట్టును ఎప్పుడూ గట్టిగా కట్టకూడదు. తరచుగా మహిళలు వేడిని నివారించడానికి జుట్టును చాలా గట్టిగా కట్టుకుంటారు. దీనివల్ల జుట్టు మూలాలు స్వయంచాలకంగా బలహీనపడతాయి. అందువల్ల  జుట్టును గట్టిగా కట్టుకునే బదులు, కొంచెం వదులుగా కట్టుకోవాలి. కొప్పు పెట్టుకుంటున్నా జుట్టు వదులుగా ఉండాలి.  అలాగే చాలా టైట్ గా ఉండే రబ్బర్ బ్యాండ్ లను వాడటం ఆపేయాలి. వేడి చేసే ఉపకరణాలు.. ఈ రోజుల్లో పురుషులు,  మహిళలు ఇద్దరూ తమ జుట్టును స్టైల్ చేయడానికి వేడి చేసే సాధనాలను ఉపయోగిస్తున్నారు. స్ట్రెయిట్నర్లు, కర్లర్లు, బ్లో డ్రైయర్లు జుట్టును బలహీనపరుస్తాయి. కాబట్టి వీలైనంత తక్కువగా వాడాలి. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి.                               *రూపశ్రీ.  

అలొవెరా జెల్ సరిగా వాడకపోతే డేంజర్..! భారతదేశంలో కలబంద మొక్కను లేని ఇల్లు ఏదీ ఉండదు. దీనిని చాలా మంది అలంకరణ కోసం పెంచుతూ ఉంటారు. నిజానికి దీనిని ఉపయోగించడం ద్వారా అనేక చర్మ,  జుట్టు సంబంధిత సమస్యలను  నయం చేయవచ్చు. చాలా మంది ఎవరి సలహా లేకుండానే కలబందను ఉపయోగించవచ్చని అనుకుంటారు.  కానీ అది నిజం కాదు. కలబందను సాధారణంగా చర్మానికి ప్రయోజనకరంగా పరిగణిస్తున్నప్పటికీ, సరిగ్గా ఉపయోగించకపోతే, కొంతమందికి ముఖ సమస్యలను కూడా కలిగిస్తుంది. కలబందను సరైన విధంగా ఎలా ఉపయోగించాలి తెలుసుకుంటే..  ప్యాచ్ టెస్ట్.. ఇంటి నివారణలు ఎలాంటి అలెర్జీని కలిగించవని అమ్మాయిలు  భావిస్తారు. అందువల్ల దీన్ని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు అని అనుకుంటారు. అయితే ఇది నిజం కాదు. కలబందను ఉపయోగించే ముందు  ప్యాచ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. దీని కోసం ముందుగా కలబందను  చేతి లోపలి భాగంలో పూయడం ద్వారా పరీక్షించాలి.  24 గంటల్లోపు ఎలాంటి అలెర్జీ కలగకపోతే అప్పుడు మాత్రమే వాడాలి.  తాజాగానే.. ఈ రోజుల్లో మార్కెట్లో చాలా కంపెనీలు కలబంద జెల్‌ను విక్రయిస్తున్నాయి. ఇందులో రసాయన మిశ్రమం ఉండవచ్చు.  అందుకే  తాజా కలబంద జెల్‌ను మాత్రమే ఉపయోగించేందుకు ప్రయత్నించాలి. అది తాజాగా లేకపోతే దాని వాడకం చర్మంపై రియాక్షన్ కు  కారణం కావచ్చు. సమయం.. కలబంద వల్ల అలెర్జీ లేదా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెద్దగా లేకపోయినప్పటికీ దానిని అప్లై చేసేటప్పుడు  ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి . దీన్ని  ముఖంపై అరగంట కంటే ఎక్కువసేపు అప్లై చేయకూడదు. చర్మ నిపుణుడి సలహా మేరకు మాత్రమే రాత్రంతా అలాగే ఉంచాలి. లేకుంటే అది చర్మ  సమస్యలను పెంచుతుంది. వారానికి ఎన్ని సార్లంటే.. రోజూ  ముఖానికి కలబందను  పూయకూడదు. ఇది అందరికీ సరిపోదు. ప్రతిరోజూ ఉపయోగించే బదులు వారానికి రెండు నుండి మూడు సార్లు మాత్రమే వాడాలి. తద్వారా ఎలాంటి అలెర్జీ ప్రమాదం ఉండదు. అప్లై చేసే ముందు.. ముఖానికి కలబందను ఉపయోగించే ముందుగా  ముఖాన్ని మంచి ఫేస్ వాష్ సహాయంతో శుభ్రం చేసుకోవాలి. ఇది  ముఖం నుండి మురికిని శుభ్రపరుస్తుంది.  అప్పుడు మాత్రమే కలబంద  ముఖంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.                                   *రూపశ్రీ.  

ఇంట్లోనే చేసుకునే ఈ ఫేస్ ఫ్యాక్ లు.. సమ్మర్ లో ఎంత హాయిని ఇస్తాయంటే..!     ఫేస్ ప్యాక్ ముఖ చర్మ రక్షణలో చాలా ఎక్కువగా ఉపయోగించే పద్దతి.  చర్మానికి మేలు చేసే పదార్థాలను ఉపయోగించి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం రంగు మెరుగవుతుంది. చర్మం మీద మచ్చలు,  మొటిమలు వంటివి తగ్గుతాయి. వాతావరణం వల్ల చర్మానికి ఎదురయ్యే సమస్యలు కూడా తగ్గుతాయి.  సమ్మర్ లో చర్మ సంరక్షణ కోసం తులసిని ఉపయోగించవచ్చు.  ఇది చాలా హాయిని ఇస్తుంది.  తులసి ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు,  తులసి ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి? దీనికి కావలసిన పదార్థాలు అన్నీ తెలుసుకుంటే.. తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల, తులసి  ముఖాన్ని చంద్రుడిలా ప్రకాశింపజేస్తుంది. దీనికోసం తులసి తో ఫేస్ మాస్క్ తయారు చేసే సరైన పద్ధతిని తెలుసుకోవాలి. తులసి,  తేనె.. తేనెలో కూడా చర్మానికి మేలు చేసే  అనేక లక్షణాలు ఉన్నాయి, ఇవి అనేక ముఖ సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.అందాన్ని పెంచుకోవడానికి ఈ రెండింటి మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖానికి తేమ అందుతుంది.  తులసి పేస్ట్ మొటిమలను తొలగిస్తుంది. ఎలా తయారు చేయాలి.. ముందుగా కొన్ని తులసి ఆకులను బాగా రుబ్బుకుని, ఆపై అందులో తేనె కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని  ముఖం మీద అరగంట పాటు అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. తులసి, పసుపు.. తులసి ఆకులు వివిధ ముఖ సమస్యలను తొలగించడంలో సహాయపడినట్టే పసుపు కూడా  ముఖాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. ముందుగా తులసి ఆకులను బాగా రుబ్బి పేస్ట్ లా చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ లో కొంచెం పసుపు కలపాలి.  ఇప్పుడు ముఖం కడుక్కున్న తర్వాత ఈ ప్యాక్‌ను ముఖంపై పూర్తిగా అప్లై చేయాలి. అరగంట తర్వాత  ముఖం కడుక్కోవాలి. తులసి, పెరుగు..   తులసి ఒకవైపు ముఖంలోని అనేక సమస్యలను తొలగిస్తుండగా, మరోవైపు పెరుగు ఈ మండే వేడిలో ముఖానికి చాలా ఉపశమనాన్ని అందిస్తుంది. తులసి,  పెరుగుతో ఫేస్ ప్యాక్ ముఖానికి చాలా మంచి ప్రయోజనాలు ఇస్తుంది. ముందుగా తులసి ఆకులను రుబ్బాలి. తరువాత అందులో చిక్కటి పెరుగు కలపాలి. ప్యాక్ చాలా పలుచగా ఉండకూడదు.  లేకుంటే అది ముఖం మీద నుండి జారిపోతుంది. ఇప్పుడు దాన్ని  ముఖం మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖం కడుక్కోవాలి.  ఈ ప్యాక్‌ని అవసరానికి అనుగుణంగా  ఉపయోగించవచ్చు.                                   *రూపశ్రీ

ఐస్ ఫేషియల్ చేస్తున్నారా...ఈ నిజాలు తెలుసా!     ఈ మధ్యకాలంలో సౌందర్య రక్షణలో ఐస్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.  ఐస్ ముక్కలు వేసిన నీటిలో ముఖాన్ని కొన్ని సెకెన్ల పాట్లు ముంచి ఉంచడం,  ఐస్ ముక్కలతో ముఖం మీద రబ్ చేయడం వంటివి చాలామంది ఫాలో అవుతున్నారు. ఇది ముఖాన్ని కాంతివంతంగా, అందంగా మారుస్తుందని అంటుంటారు.  అయితే ఇలా మంచు ముక్కలను ముఖానికి అప్లై చేయడం మంచిదేనా?  ఇది ఎంతవరకు మంచి చేస్తుంది తెలుసుకుంటే.. ముఖం మీద ఐస్ క్యూన్స్ వేయడం లేదా చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవడం వంటివి చాలా మంది చేస్తున్నారు.  వీటి వల్ల అప్పటికప్పుడు  చాలా విషయాలలో కొంతవరకు ఉపశమనం అయితే లభిస్తుంది. కానీ చర్మ సంరక్షణ నిపుణులు మాత్రం ముఖం మీద అసలు ఐస్ వేయకూడదు అని అంటున్నారు. ఇలా చేయడం వల్ల క్రమంగా ముఖంలోని నరాలు దెబ్బతింటాయట. ముఖం మీద ఐస్ అప్లై చేస్తూ ఉంటే ముఖం నరాలు విచ్చిన్నమై క్రమంగా ముఖం మీద ఎర్రటి మచ్చలు,  లేదా దద్దుర్లు వంటి గుర్తులు వస్తాయట. ఇలాంటి వాటిని విరిగిన కేశనాళికలు  అని అంటారట. నిజానికి ఈ ఐస్ ఫేషియల్ అనేది మన దేశంలో మొదటి నుండి లేదు. ఇది విదేశాల ట్రెండ్. విదేశాల ప్రజలు ఇప్పటికే చల్లని వాతావరణంలో నివసిస్తుంటారు.  అలాంటి వారు ఐస్ క్యూబ్స్ అప్లై చేసినా,  ఐస్ వాటర్ లో ముఖాన్ని ముంచినా వారికి ఎక్కువ ప్రబావం ఉండదు.  ఎందుకంటే వారి చర్మం చల్లదనానికి అలవాటు పడి ఉంటుంది. ఉష్ణ ప్రాంతాలలో నివసించే భారతీయ ప్రజలకు ఇలాంటి ఐస్ ఫేషియల్స్ అవసరం లేదు.  భారతీయుల చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఐసింగ్ కు బదులు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే చర్మానికి తగినంత సూర్యరశ్మి, తేమ అవసరం. భారతీయులు చర్మానికి ఐస్ క్యూబ్స్ అప్లై చేస్తుంటే చాలా నష్టాలు ఉంటాయి.  భారతీయుల చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉంటుంది. జలుబు లేదా చికాకు వంటివి ఎదురైనప్పుడు వాటి నుండి చర్మం సేఫ్ గా ఉండటం కోసం చర్మం మెలనిన్ ను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల బుగ్గలు, ముక్కు,  నుదురు మొదలైన ప్రాంతాలలో నల్లని మచ్చలు కనిపిస్తాయి. భారతీయులు చర్మానికి ఐస్ వేయడం వల్ల చర్మంలోని తేమ తగ్గుతుంది. ఇది చర్మంలో ఉండే సహజ నూనెలు తగ్గడానికి కూడా కారణం అవుతుంది.  దీని కారణంగా చర్మం పొడిగా, బిగుతుగా అనిపిస్తుంది. ముఖానికి ఐస్ అప్లై  చేయడం వల్ల ముఖంలో రక్తనాళాలు కుచించుకుపోతాయి. ఇలా పదే పదే చేయడం వల్ల ముఖం లో రక్త ప్రసరణ తగ్గుతుంది. చర్మానికి ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. దీని వల్ల చర్మం వాడిపోయినట్టు నీరసంగా కనిపిస్తుంది. అందుకే ముఖానికి ఐస్ అప్లై చేయడం మంచిది కాదు.                                        *రూపశ్రీ

మహిళలలో ముఖం మీద అవాంఛిత రోమాలు...ఇలా చేస్తే మాయం అవుతాయి..! ఆడవాళ్ల ముఖం అందంగా కనిపించాలని కోరుకోవడం చాలా సహజం. అయితే ముఖం అందంగా ఉన్నా ముఖం మీద పై పెదవి, గడ్డం వంటి ప్రాంతాలలో లైట్ గా మగవాళ్లకు లాగా వెంటుక్రలు ఉంటాయి చాలామందికి.  ఇలా వెంట్రుకలు ఉండటాన్ని నేటి కాలం అమ్మాయిలు అస్సలు భరించలేరు. వీటిని తొలగించడానికి చాలామంది థ్రెడ్డింగ్,  వ్యాక్సింగ్ లేదా రేజర్ తో షేవ్ చేయడం వంటివి ఫాలో  అవుతారు. ఇవి వెంట్రుకలను తొలగిస్తాయి తప్ప.. వెంట్రుకలు పెరగడాన్ని అయితే ఆపవు.  పైగా ఈ పద్దతుల వల్ల చర్మానికి చాలా హని జరుగుతుంది. అయితే ఇంట్లోనే ఒక పానీయాన్ని  తయారు చేసుకుని తాగడం వల్ల అవాంఛిత రోమాలు తగ్గిపోతాయట.  అంతేకాదు మళ్లీ రావు కూడా..  ఇంతకీ ఇదేంటో.. దీన్ని తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుంటే.. కారణం.. ముఖం పైన వెంట్రుకలు రావడానికి ఆండ్రోజెన్ అనే హార్మోన్ పెరుగుదలే కారణం.  ఇది పురుష హార్మోన్.  ఈ హార్మోన్ మహిళలలో కూడా రిలీజ్ అయినప్పుడు ఇలా ముఖం మీద అవాంఛిత రోమాలు పెరగడం జరుగుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే  అవాంఛిత రోమాలు రావడం కూడా తగ్గుతుంది. అందుకే ఈ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన పానీయాన్ని నిపుణులు సూచించారు. ఇలా తయారు చేసుకోవాలి.. కావలసిన పదార్థాలు.. నీళ్లు.. 1 గ్లాసు మెంతులు.. 1టీస్పూన్ దాల్చిన చెక్క పొడి.. చిటికెడు పుదీనా ఆకులు.. కొన్ని తయారు విధానం.. స్టౌ మీద ఒక గిన్నె ఉంచి అందులో ఒక గ్లాసు నీరు పోయాలి.  అందులో ఒక స్పూన్ మెంతులు కూడా వేయాలి.  అందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి రంగు పసుపు రంగులోకి వచ్చే వరకు మరిగించాలి.  మరిగిన తరువాత స్టౌ ఆఫ్ చేసి అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి మూత పెట్టి 5నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.  5 నిమిషాల తరువాత ఫిల్టర్ చేసి తాగాలి. లేదంటే ఈ పానీయంలో పుదీనా ఆకుల బదులు స్పియర్మింట్ టీ బ్యాగ్ వేసి 5 నిమిషాల తరువాత తాగవచ్చు.  ఇలా 2 నెలలు చేస్తే ముఖం మీద అవాంఛిత రోమాలు తగ్గుతాయట. ప్రభావం.. స్పియర్‌మింట్ టీ యాంటీ-ఆండ్రోజెనిక్ ప్రభావాలను కలిగి ఉంటుంది.   టెస్టోస్టెరాన్ స్థాయిలను  నేరుగా తగ్గిస్తుందని, అదే సమయంలో LH,  FSH లను పెంచుతుందని, అండాశయ సమతుల్యతను ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని వారాల పాటు ఈ టీని తాగిన  తర్వాత PCOS,  ఇతర ఆండ్రోజెన్ హార్మోన్  సమస్యలు  ఉన్న మహిళల్లో ముఖంపై వెంట్రుకలు తగ్గుతాయని స్పష్టంగా చెబుతున్నారు. మెంతి గింజలు ముఖంపై వెంట్రుకల పెరుగుదలను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. మెంతుల గింజలు ఈస్ట్రోజెన్ లాంటి చర్య కలిగిన మొక్కల సమ్మేళనమైన డయోస్జెనిన్‌ను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ఫైటోఈస్ట్రోజెన్‌లు  ఆండ్రోజెన్‌లను స్వల్పంగా ఎదుర్కోవడం ద్వారా హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. అండాశయ పనితీరుకు సంబంధించిన హార్మోన్ల నియంత్రణకు ఇది సపోర్ట్ ఇస్తుందని అంటున్నారు. దాల్చిన చెక్కలో పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి ఇన్సులిన్ గ్రాహకాలపై పనిచేస్తాయి.  సెల్యులార్ గ్లూకోజ్ శోషణను పెంచుతాయి. తద్వారా రక్త ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తాయి. అధిక ఇన్సులిన్ అండాశయాలను ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. దాల్చిన చెక్క పరోక్షంగా ఆండ్రోజెన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. PCOS ఉన్న మహిళల్లో, దాల్చిన చెక్క సప్లిమెంటేషన్ మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఇది మెరుగైన హార్మోన్ల బ్యాలెన్స్ ను చేకూరుస్తుంది.                                         *రూపశ్రీ.

జుట్టు సిల్కీ గా మారాలంటే ఇలా ట్రై చేయండి..!   జుట్టు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలని, చివర్లు చిట్లిపోకుండా ఉండాలని, సన్నగా మారకుండా, జుట్టు రాలకుండా పెరుగుతూనే ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని కోసం పెద్ద బ్రాండ్ల నుండి షాంపూలు, నూనెలు, కండిషనర్లతో పాటు  అనేక ఇతర వస్తువులను కూడా ఉపయోగిస్తారు.  కానీ ఇంత చేసినా సరే.. సహజంగా మెరిసే జుట్టును పొందలేకపోతున్నారు చాలామంది.  అయితే జుట్టు సిల్కీగా అందంగా ఉండటం పెద్ద కల ఏమీ కాదు. ఇంట్లోనే మూడు వస్తువులు ఉపయోగించి జుట్టును సిల్కీగా మార్చుకోవచ్చు.  ఇంట్లోనే జుట్టును సిల్కీగా ఎలా మార్చుకోవచ్చు? దీని కోసం కావలసిన పదార్థాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే.. మునగ పొడి.. మునగచెట్లు చాలా చోట్ల విరివిగా పెరుగుతూ ఉంటాయి. అందరూ  మునగకాయలు తింటారు కానీ మునగాకు గురించి పట్టించుకోరు.  మునగాకును ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిని జుట్టుకు వాడాలి.  మునగ పొడిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా,  మెరిచేలా చేస్తాయి.  మునగ పొడిలో పెరుగు వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు ప్యాక్ వేసుకోవాలి.  గంటసేపు తరువాత గాఢత లేని షాంపూతో తల శుభ్రం చేసుకోవాలి.  ఇలా చేస్తే మెరిసే జుట్టు సొంతమవుతుంది. ఉల్లిపాయ రసం.. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుందని, ఇది జుట్టు ఆరోగ్యం,  పెరుగుదలను మెరుగుపరుస్తుందని చెబుతారు.   వారానికి రెండు నుండి మూడు సార్లు ఉల్లిపాయ రసంతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది.  జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  జుట్టు సన్నగా ఉంటే లేదా సులభంగా విరిగిపోతుంటే  కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది. జుట్టుకు ఉల్లిపాయ రసాన్ని రాసుకునే పద్ధతి చాలా సులభం. ఉల్లిపాయను పేస్ట్ చేసి అందులో నుండి రసాన్ని వడగట్టాలి. దీన్ని తలకు అప్లై చేసి కనీసం ఒక అరగంట సేపు ఉండి తలస్నానం చేయాలి. మందారపూల పొడి.. మందార అనేది జుట్టు,  చర్మం రెండింటికీ ఉపయోగించే ఒక పువ్వు.  ఇది జుట్టుకు చేసే మేలు గురించి మాట్లాడుకుంటే .. ఇది మన జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది, జుట్టు మూలాలను  బలపరుస్తుంది, జుట్టును మందంగా  చేస్తుంది, తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు,  జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది . మందార పువ్వులను సేకరించి  ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు. మందార పువ్వుల పొడిలో కాస్త పెరుగు వేసి పేస్ట్ చేసుకోవాలి.  దీన్ని తలకు పట్టించి గంట సేపటి తరువాత తలస్నానం చేయాలి.  ఇలా చే్స్తే జుట్టు మెరుస్తుంది.                                             *రూపశ్రీ.  

ముఖం మీద మచ్చలు తొలగించి మెరుపును ఇచ్చే అద్బుతమైన చిట్కా..! ముఖం అందంగా, ఆరోగ్యంగా మచ్చలు లేకుండా ఉండాలని కోరుకోని అమ్మాయిలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ముఖం మీద మచ్చలు, మొటిమలు, చర్మ సమస్యలు ఏవో ఒకటి లేకుండా కనిపించే అమ్మాయిలు చాలా అరుదు.  వాణిజ్య ప్రకటనలు  చూసి చాలా మంది అమ్మాయిలు చాలా ఉత్పత్తులు వాడుతు ఉంటారు. కానీ పాత కాలం నుండి ఉపయోగిస్తున్న ఒకే ఒక పేస్ట్ ముఖం మీద మచ్చలు తొలగించడంతో పాటు ముఖానికి అద్భుతమైన మెరుపును కూడా ఇస్తుందట. ఇంతకీ అదేంటో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. పాత రోజుల్లో రసాయన ఉత్పత్తులు లేవు.  అప్పటి కాలం  వారు శనగపిండి, ముల్తానీ మట్టి, పెరుగు, పచ్చి పాలు, తేనె,  పసుపు వంటి సహజ పదార్ధాలతో తయారు చేసిన పేస్టులను మాత్రమే వాడేవారు. ముల్తానీ మట్టితో తయారు చేసిన పేస్ట్,  సబ్బులను ఉపయోగించారని, ఇది వారి ముఖం,  శరీరంలోని మిగిలిన చర్మాన్ని  కూడా శుభ్రంగా ఉంచేదని చెబుతారు. ఇలాంటి ఒక పేస్ట్ తయారీ గురించి తెలుసుకుంటే.. ముల్తానీ మట్టి పేస్ట్.. ముల్తానీ మట్టి పేస్ట్ తయారు చేయడానికి, 1 గిన్నె ముల్తానీ మట్టికి అవసరానికి అనుగుణంగా పచ్చి పాలు,  2 టీస్పూన్ల తేనె వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఎక్కువ పాలు వేయకూడదు. లేకుంటే పేస్ట్ చిక్కగా మారుతుంది. ఈ పేస్ట్ ని ఉపయోగించడానికి, ముందుగా దీన్ని  ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఆరనివ్వాలి. సమయం ముగిసిన తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి,  ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది. ప్రయోజనాలు.. ముల్తానీ మట్టి  చర్మానికి సహజమైన క్లెన్సర్‌గా,  వృద్ధాప్యాన్ని నివారించే ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి పూయడం వల్ల పెద్ద చర్మ రంధ్రాలు తగ్గుతాయి.  చర్మం మచ్చలేనిదిగా కనిపిస్తుంది. అదనంగా మచ్చలు తగ్గుతాయి,  మెరుపు పెరుగుతుంది. సబ్బు కూడా.. శరీర చర్మాన్ని శుభ్రంగా,  ప్రకాశవంతంగా ఉంచుకోవాలనుకుంటే ముల్తానీ మట్టితో తయారు చేసిన సబ్బుతో స్నానం చేయడం మంచిది. దీన్ని తయారు చేయడానికి మీకు పేస్ట్ కోసం ఉపయోగించే పదార్థాలు మాత్రమే తప్ప పెద్దగా అవసరం లేదు. ముల్తానీ మట్టి చిక్కటి పేస్ట్ తయారయ్యాక, దానికి సబ్బు ఆకారం ఇచ్చి, ఎండలో ఆరనివ్వాలి. అది రాయిలా మారుతుంది. ఇప్పుడు స్నానం చేసే ముందు 2-3 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆపై స్నానానికి వాడాలి.                            *రూపశ్రీ.

మొటిమలు ఎందుకు వస్తాయి?దీని వెనకున్న అసలు కారణాలు ఇవీ..! ముఖం మీద మొటిమలు రావడం అనేది ఒక సాధారణ సమస్య. దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ముఖంపై మొటిమలు పదే పదే కనిపించినప్పుడు సమస్య పెరుగుతుంది. ఇది  అందాన్ని పాడు చేయడమే కాకుండా  మొత్తం ముఖాన్ని కూడా పాడు చేస్తుంది. కానీ ముఖం మీద మొటిమలు పదే పదే ఎందుకు వస్తాయో  ఎప్పుడైనా ఆలోచించారా? మొటిమలు రావడానికి కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. హార్మోన్ల మార్పులు.. హార్మోన్ల మార్పుల వల్ల కౌమారదశలో మొటిమలు ఎక్కువగా వస్తాయి. హార్మోన్ల మార్పుల వల్ల కూడా స్త్రీలకు ఋతుస్రావం,  గర్భధారణ సమయంలో మొటిమలు రావచ్చు. హార్మోన్ల మార్పుల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి ముఖంపై మొటిమలు వస్తాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల కూడా ముఖం మీద మొటిమలు వస్తాయి.  ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నవారు  ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఇది కాకుండా కొన్ని పోషకాల లోపం వల్ల కూడా ముఖంపై మొటిమలు వస్తాయి. రసాయన ఆధారిత ఉత్పత్తులు.. మెరిసే చర్మాన్ని పొందడానికి, చాలా మంది రసాయన ఆధారిత ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ వీటిలో మొటిమలకు కారణమయ్యే రసాయనాలు ఉంటాయి. తప్పుడు చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కూడా ముఖంపై మొటిమలు వస్తాయి. ఒత్తిడి,  నిద్ర లేకపోవడం ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం, నిద్ర లేకపోవడం వల్ల కూడా మొటిమలు వస్తాయి. ఇలాంటి వారు  ముఖ మచ్చలను,  మొటిమలను వదిలించుకోవాలనుకుంటే ఒత్తిడిని నిర్వహించడం నేర్చుకోవాలి. ఇది కాకుండా, ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి.                             *రూపశ్రీ