వాకింగ్ షూస్.. రన్నింగ్ షూస్.. ఈ రెండింటి మధ్య తేడాలేంటో తెలుసా? ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు  రోజువారీ జీవనశైలిలో నడక, రన్నింగ్, వ్యాయామాలు, జిమ్ వంటివి భాగం చేసుకుంటారు.  ఈ విషయాలను కూడా జాగ్రత్తగా పాటించేవారు ఉంటారు. వారు వాకింగ్ వెళ్లినప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు, జిమ్ చేసేటప్పుడు షూస్ వేసుకుంటారు. అయితే రన్నింగ్, వాకింగ్, జాకింగ్, జిమ్, స్పోర్ట్స్ సమయాల్లో వేసుకునే షూస్ కూడా వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా ఎక్కువమంది చేసే రన్నింగ్, వాకింగ్ కోసం వాడే షూస్ మధ్య తేడాలేంటి?  కొత్త షూస్ కొనేటప్పుడు తీసకోవలసిన జాగ్రత్తలు, గుర్తుంచుకోవలసిన విషయాలేంటో  తెలుసుకుంటే..  రన్నింగ్ షూస్ బరువు తక్కువగా ఉండాలి.  తేలికగా ఉన్న షూస్ వేసుకుంటే  సులభంగా పరిగెత్తవచ్చు.  తక్కువ బరువున్న బూట్లు ధరించి పరిగెత్తితే పాదాలపై తక్కువ ప్రభావం ఉంటుంది. దీని వల్ల రన్నింగ్ లో అలసిపోరు.  బూట్లు కొనడానికి వెళ్ళినప్పుడు రన్నింగ్ షూస్ కోసం హీల్స్ కొనకూడదని  గుర్తుంచుకోవాలి. మడమలున్న షూస్ వేసుకుంటే అవి  పాదాలపై ఒత్తిడి తెస్తాయి. దీనివల్ల త్వరగా అలసిపోతారు. రన్నింగ్ షూస్ ఎంత సౌకర్యవంతంగా ఉంటే పాదాలపై ఒత్తిడి అంత తక్కువ ఉంటుంది. రన్నింగ్ షూల మిడ్‌సోల్‌లో ఎక్కువ కుషన్ ఉంటుంది, ఇది  పాదాలపై ప్రభావం లేకుండా చేస్తుంది.  అలాగే  షాక్ లేదా గాయాన్ని తగ్గించడంలోనూ, గాయాలు కాకుండా ఉండటంలోనూ సహాయపడుతుంది. రన్నింగ్ షూల ముందు భాగంలో   ఫ్లెక్సిబిలిటీ మరింత ఎక్కువగా ఉంటుంది.  ఇది వేగంగా పరుగెత్తడానికి  సహాయపడుతుంది. ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉన్న బూట్లు  పడిపోకుండా కాపాడతాయి.  నడుస్తున్నప్పుడు సపోర్ట్ ఇస్తాయి. వాకింగ్ షూస్.. రన్నింగ్ షూస్ కంటే వాకింగ్ షూస్ కొంచెం బరువుగా ఉంటాయి. ఎక్కువ దూరం వాకింగ్ కు  వెళ్లాలనుకుంటే తేలికగా,  మంచి కుషనింగ్ ఉన్న షూలను కొనుగోలు చేయాలి. ఇది పాదాలలో మంట లేదా నొప్పిని తగ్గిస్తుంది. రన్నింగ్ షూస్ లాగా వాకింగ్ షూస్‌లో కూడా మంచి మిడ్‌సోల్ ఉండటం ముఖ్యం. వేగంగా నడిచినప్పుడు, ఈ సోల్  పాదాలను షాక్ నుండి కాపాడుతుంది,  బ్యాలెన్స్‌ను చక్కగా ఉంచుతుంది. వాకింగ్ షూస్ కు  కూడా హీల్స్ ఉండకూడదు. దీని కారణంగా  ఎక్కువసేపు నడవడానికి ఇబ్బంది పడవచ్చు. మడమలు లేని బూట్లు  మంచి  సపోర్ట్ ఇస్తాయి. నడక సమయంలో  సౌకర్యవంతంగా ఉంటారు.                                            *నిశ్శబ్ద. 

మెనోపాజ్ దశలో మహిళలకు గుండెజబ్బుల ముప్పు ఎక్కువా? వైద్యులు చెప్పిన అసలు విషయాలు ఇవీ! మహిళల జీవితంలో  ఆరోగ్య పరంగా అనేక సవాళ్లు ఉంటాయి. ప్రతి దశలో విభిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. నెలసరి, గర్భం, ప్రసవం, తదుపరి ఎదురయ్యే దశ మెనోపాజ్.  ఈ మెనోపాజ్ తోనే మహిళల నెలసరి చక్రం ముగుస్తుంది. అయితే మెనోపాజ్ వల్ల మహిళలలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుందా? అంటే అవునంటున్నారు వైద్యులు. సాధారణంగా చాలా మంది మహిళల్లో 40ల మధ్య నుండి 50ల మధ్య వరకు మెనోపాజ్  సంభవిస్తుంది. ఈ దశలో, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిలో తగ్గుదలతో స్త్రీ శరీరంలో ప్రధాన హార్మోన్ల మార్పులు జరుగుతాయి. గుండె జబ్బుల నుండి స్త్రీలను రక్షించడంలో ఈస్ట్రోజెన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాలలో ఎర్రబడిన కణాలను తొలగించడంలో శరీరానికి సహాయం చేయడం ద్వారా అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  ఈ సమస్యలో ఫలకాలు ఏర్పడి అడ్డంకిని కలిగిస్తుంది. ఇంకా ఈస్ట్రోజెన్ ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ (LDL)ని తగ్గించడం ద్వారా రక్తపు లిపిడ్ స్థాయిలపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు పెంచుతుంది. తత్ఫలితంగా, రుతువిరతి తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వలన అనేక గుండె జబ్బులలో కీలకమైన అథెరోస్క్లెరోసిస్ అభివృద్ధి చెంది  గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే మెనోపాజ్ అనేది మహిళలలో గుండె జబ్బులకు ఎక్కువ ఆస్కారం ఇచ్చే దశగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ దశలో మహిళలు 7 జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల నుండి జాగ్రత్త పడవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం..  పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారం గుండెకు మంచిది. సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ (క్రీమ్, వెన్న, రెడ్ మీట్), సోడియం (ఉప్పు జోడించడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు), జోడించిన చక్కెరలను తీసుకోవడం పరిమితం చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ..  వ్యాయామం బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.  మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెద్దలు శారీరక శ్రమ కోసం ప్రతి వారం కనీసం 150 నిమిషాల  తక్కువ నుండి ఎక్కువ తీవ్రత కలిగిన ఏరోబిక్ వ్యాయామం లేదా 75 నిమిషాల  కఠిన వ్యాయామాల నుండి ఏరోబిక్ వ్యాయామంలో పాల్గొనవచ్చు.  వీటిలో వారంలో రెండు రోజులైనా శరీర కండరాలను బలపరిచే వ్యాయామాలు తప్పనిసరిగా ఉండాలి. బరువు.. మెనోపాజ్ తర్వాత నెమ్మదిగా జీవక్రియ తగ్గుతుంది. శరీర కూర్పులో మార్పుల కారణంగా బరువు పెరగడం సాధారణం. ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒత్తిడి.. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె జబ్బులకు దోహదం చేస్తుంది. ధ్యానం, యోగా ఒత్తిడి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ధూమపానం.. ధూమపానం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ధూమపానం మానేయడం మీ ప్రస్తుత వయస్సుతో సంబంధం లేకుండా  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రెగ్యులర్ హెల్త్ చెకప్ లు.. రెగ్యులర్ చెక్-అప్‌లు ఆరోగ్య సమస్యలను డీల్ చేయడం సులభతరం చేస్తాయి.  ప్రాథమిక దశలోనే సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులకు దారితీసే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, మధుమేహం వంటి పరిస్థితులను పర్యవేక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి. హార్మోన్ థెరపీ.. హార్మోన్ థెరపీ అనేది మహిళ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే రుతుక్రమం ఆగిన లక్షణాలను డీల్ చేయడంలో సహాయపడుతుంది. గుండె ప్రమాదం విషయంలో కొంతమంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది.  వైద్యులను  సంప్రదించి హార్మోన్ థెరపీపై నిర్ణయం తీసుకోవాలి.                            *నిశ్శబ్ద.  


  సర్దుకుపోవడం నేర్పితే సమస్యలే వుండవు...   పిల్లలంటే అమ్మకి ఎంతో ప్రేమ. వారికి ఏ బాధా కలగకుండా చూసుకోవాలనుకుంటుంది. వారి ప్రతి కోరికా తీర్చాలనుకుంటుంది. పిల్లలు అడిగిందే తడవుగా వారు కోరినవన్నీ కొనివ్వాలనుకుంటుంది. అయితే ఇలా కోరినవన్నీ పొందటానికి అలవాటు పడ్డ పిల్లలు, కోరినది దొరకనపుడు సర్దుకుపోవటం ఎలాగో నేర్చుకోలేరు. మన చేతుల్లో వున్నంతవరకు వాళ్ళకి అన్నీ అందుబాటులో వుంచుతాం. కానీ జీవితంలో కోరినవన్నీ దొరకాలని లేదు కదా! మరప్పుడు దొరికిన దానితో సర్దుకుపోవటం ఎలాగో పిల్లలకు తెలీక ఇబ్బంది పడతారు. అందుకే గెలుపు, ఓటములు, సర్దుకుపోవటం వంటివన్ని మనమే పిల్లలకి రుచి చూపించాలి. ఇందుకు సంబంధించిన ఓ కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఓ చిన్న కుటుంబం నివసిస్తోంది. తండ్రి ఓ చిన్న ఉద్యోగం చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలని పోషిస్తూ వుండేవాడు.  సంపాదన తక్కువైనా పిల్లలు ఏది అడిగినా దానిని తీర్చాలని తాపత్రయం పడేవాళ్ళు ఆ దంపతులు.  ఒకసారి సెవెంత్ క్లాసు చదువుతున్నపుడు వాళ్ళ పెద్దకొడుకు రాకెట్ కావాలని అడుగుతాడు. తన ఫ్రెండ్స్‌కి వాళ్ళ మావయ్య అమెరికా నుంచి బొమ్మ రాకెట్ తెచ్చాడని, అలాంటిది తనకీ కావాలని పేచీ పెడతాడు. పిల్లల  కోరికలన్నీ తీర్చాలని వున్నా, ఈ కోరిక తీర్చటం వాళ్ళ స్థోమతకు మించినది. ఎలా మరి? అని మథన పడతారు అ దంపతులు. రాకెట్ కోసం పిల్లాడి పేచీ రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. చివరికి పిల్లాడి తల్లి ఓ నిర్ణయానికొస్తుంది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి బోలెడన్ని రంగు కాగితాలు, జిగురు వంటివి తెచ్చిపెడుతుంది.   పిల్లలురాగానే వాళ్ళముందు రంగు కాగితాలు, కత్తెర, జిగురు పెడుతుంది. ఈ రోజు మనమే మంచి ఆట ఆడబోతున్నాం. ఈ రంగురంగు కాగితాలతో మీకు నచ్చినట్టు స్టార్స్‌ని, మూన్‌ని, సన్‌ని ఇలా అంతరిక్షాన్నంతటినీ మన గోడమీదకి తీసుకురావాలి. మీ గదిలోని గోడ పైన మీ ఇద్దరి క్రియేటివిటీతో అంతరిక్షాన్ని రెడీ చేస్తే ఆ అంతరిక్షం పైకి వాళ్ళే రాకెట్‌ని నేను మీకు ఇస్తాను అంటుంది. ఇక పిల్లలిద్దరూ హుషారుగా పని మొదలుపెడతారు గంటలు గడుస్తాయి. అమ్మా అయిపోయింది అని పిలుస్తారు. గోడ నిండా చుక్కలు, గ్రహాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. రాకెట్ ఏది అని అడుగుతారు పిల్లలు. ఆ తల్లి చిన్నగా నవ్వి మీ గదిలోని ఈ అంతరిక్షoలోకి వెళ్ళటానికి ఇదిగో ఈ కాగితం రాకెట్ సరిపోతుంది చూడండి అంటూ వివిధ సైజుల్లో చేసిన పేపరు రాకెట్లని చూపిస్తుంది. ఇదిగో ఎవరి రాకెట్ ఎక్కడికి వెళుతుందో విసరండి అంటుంది. పిల్లలిద్దరూ    పేపర్ రాకెట్లు విసురుతారు. ఆ ఆట వాళ్ళకి ఎంతో నచ్చుతుంది. మా ఫ్రెండ్ దగ్గరైతే బ్యాటరీలతో కొంతదూరం ఎగిరే రాకెట్ వుంది కానీ మన దగ్గర అంతరిక్షమే వుంది అంటారు. వాళ్ళ ఆనందాన్ని చూసిన తల్లికి అనిపిస్తుంది. పిల్లలు అడిగినవి మన చేతుల్లో లేనపుడు ‘‘లేదు’’ అని చెప్పటం కాదు వాళ్ళని ఎలా మళ్లించాలో తెలిసివుండాలి. ఆ తర్వాత ఆ పిల్లలు ఎప్పుడూ ఏ బొమ్మా కావాలని పేచీ పెట్టలేదు. నచ్చిన బొమ్మ కనిపిస్తే దానిని స్వయంగా ఎలా చేసుకోవచ్చో ఆలోచించేవారు.  అమ్మ సాయంతో రకరకాల బొమ్మలు తయారు చేసుకున్నారు. వారి ఆలోచనలకి పదును పెట్టారు, కొన్న బొమ్మలతో కూడా దొరకనంత తృప్తిని పొందారు. అన్నీ తెలుసుకోలేని వయను పిల్లలది. వారికి నిజమైన ఆనందాన్ని రుచి చూపిస్తే తప్పకుండా వారు ఆ దారిలో నడుస్తారు.  ఈసారి పిల్లలు అడిగినవన్నీ సమకూర్చాలని అనిపిస్తే ఒక్కసారి ఈ కథ గుర్తుచేసుకుంటారు కదూ! -రమ

Aracheta Gorinta / Mehendi / Gorinta Designs / Mehndi / Learn Simple & Easy Mehendi Designs / Learn Gorintaku Designs / Learn Tattoo Designs / Henna Designs

ఆడవాళ్లకు అలెర్ట్.. మార్కెట్లో దొరికే కాటుకను ఎడాపెడా వాడేస్తే ఇంతే! ఆడవాళ్ల అందాన్ని కవులు మామూలుగా వర్ణించలేదు. ముఖంలో ప్రతి భాగాన్ని చాలా ప్రత్యేకంగా అభివర్ణిస్తారు. నిజానికి కవుల వర్ణణ వల్ల అమ్మాయిల ముఖారవిందానికి ఎక్కువ మార్కులు వస్తాయో.. అమ్మాయిల అందం వల్ల కవులకు అంత మంచి వర్ణనలు దొరుకుతాయో చెప్పడం కాస్త కష్టమే.. అమ్మాయిల ముఖంలో కళ్ళను కలువరేఖలు అని వర్ణిస్తుంటారు. ఇక కళ్ళకు పెట్టుకునే కాటుకను చీకటితోనూ, నల్లని  తీర రేఖతోనూ పోలుస్తారు. కళ్లకు ఎక్కడలేని అందాన్ని తెచ్చిపెట్టే కాటుక ఈనాటిది ఏమీ కాదు.. కాటుక దిద్దిన కళ్లు చూస్తే ఫిదా అవ్వనివారు ఉండరు. ఇప్పట్లో సాధారణంగా రెఢీ అయినా సరే..  అమ్మాయిలు కేవలం కళ్లకే కాదు.. కళ్లకు కాస్త అటు ఇటు కూడా కాటుకను పొడవునా పెట్టి కనురెప్పలతో కలిపి అట్రాక్ట్ చేస్తారు. కానీ ఇప్పట్లో మార్కెట్లో దొరుకుతున్న కాటుక ఎడాపెడా వాడేయడం ఎంత వరకు మంచిదనే విషయం ఇప్పట్లో చర్చకు దారితీస్తోంది. మార్కెట్లో దొరికే కాటుక ఎక్కువ వాడితే కలిగే నష్టాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే.. కళ్ళు పొడిబారతాయి.. కాటుక తయారీలో  కొన్ని పదార్థాలు వినియోగిస్తారు. వీటి వల్ల  కళ్ళు పొడిగా మారుతాయి . దీని కారణంగా, కళ్లలో దురద లేదా నొప్పి ఎదురవుతుంది. కళ్లు పొడిబారే సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే కళ్లు దెబ్బతింటాయి. కళ్లలో అలెర్డీ.. మార్కెట్లో దొరికే కాటుకను రెగ్యులర్ గా వేసుకునే అలవాటు ఉన్నవారికి కళ్ళ అలెర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కళ్ల చుట్టూ దురద, వాపు, దద్దుర్లు  వంటి లక్షణాలు కనిపిస్తాయి. కంటి చికాకు.. కాటుకను రెగ్యులర్ గా పెడుతూ ఉంటే కళ్లలో చికాకు వస్తుంది. కళ్లలో నొప్పి వంటి ఇబ్బందులు కలుగుతాయి. డార్క్ సర్కిల్స్.. కాటుకను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్ల చుట్టూ మచ్చలు వస్తాయి. కొందరికి లైట్ గా ఉన్న డార్క్ సర్కిల్స్ కాటుక కారణంగా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కాజల్ స్మడ్జ్ ఫ్రూఫ్ కాదు కాబట్టి ఇలా జరుగుతుంది. కళ్లలో నీరు కారడం.. రెగ్యులర్ గా కాటుక పెడుతూ ఉంది అది కంటి మీద ప్రభావం చూపించి కళ్లలో నీరు రావడానికి కారణం అవుతుంది. ఎప్పుడైనా పండుగలు, శుభకార్యాలు, ఫంక్షన్స్, పార్టీలు మొదలైన సందర్బాలలో మాత్రమే మార్కెట్లో కొనుగోలు చేసే కాటుకను వాడాలి. మార్కెట్లో కొనే కాటుక వాడేముందు దాని ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. లేకపోతే గడువు దాటిన కాటుక వల్ల కొన్నిసార్లు కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.                                          *రూపశ్రీ.