ఫ్యాషన్ ఐకాన్ లా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి..!
ఫ్యాషన్ గా కనిపంచాలని నేటి కాలం అమ్మాయి నుండి పెద్దల వరకు చాలా తహతహలాడుతుంటారు. దుస్తుల ఎంపిక నుండి జ్యువెలరీ, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ లు ఇలా ఒకటనేమిటి.. అన్నీమ్యాచింగ్ ఉండాలని కోరుకుంటారు. అయితే ఎన్ని ఉన్నా కొందరు అస్సలు అందంగా కనిపించరు. అందంగా కనిపించాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. అవేంటంటే..
శరీర ఆకృతిని అర్థం చేసుకోవాలి..
పియర్ షేప్..
నడుము సన్నగా, తొడలు విస్తృతంగా ఉంటాయి. దీన్ని పియర్ షేప్ అంటారు. ఇలాంటి వారు టాప్ వైపు లైట్ కలర్స్, షోల్డర్ డీటైల్స్ ఉన్న బ్లౌజులు వేసుకుంటే బాగుంటుంది.
యాపిల్ షేప్ ..
పొట్ట వద్ద వెడల్పుగా ఉన్న శరీరం కలవారు ఉంటారు. ఇలాంటి వారి శరీర అకృతిని యాపిల్ షేప్ అని అంటారు. వీరు డీప్ నెక్‌లైన్ టాప్‌లు, ఫ్లోయింగ్ కుర్తాలు ఎంపిక చేసుకుంటే మంచిది.
అవర్ గ్లాస్:
అవర్ గ్లాస్ అంటే ఇసుక గడియారం. నడుము సన్నగా, పైకైనా, కిందకైనా సమానంగా ఉంటుంది. ఇలాంటి శరీరాకృతి అవర్ గ్లాస్ కు పోలికగా ఉంటుంది. బాడీ కాంటూరింగ్ కుర్తాలు, బెల్ట్ వేసే డ్రెస్‌లు బాగా పర్ఫెక్ట్ గా చూపిస్తాయి.
ఎలాంటి ఆకృతి అయినా దుస్తులు ఎంపిక చేసుకునే విధానం చాలా ముఖ్యం.
రంగు అనుసంధానం అంటే.. 3 రంగుల నియమం పాటించాలి.
ఒక ప్రధాన రంగు (main)
ఒక మద్దతు రంగు (support)
ఒక హైలైట్/కాంట్రాస్ట్ రంగు (accent)
ఉదాహరణకు..
వైట్ టాప్ + డెనిమ్ బ్లూ జీన్స్ + మెరూన్ బ్లేజర్
క్రిమ్ కుర్తా + బాటిల్ గ్రీన్ దుపట్టా + గోల్డ్ జ్యూవెలరీ
రంగులు తేలికగా ఉండాలి, కానీ క్లాస్ గా కనిపించాలి.
ఉపకరణాలు..
ఫ్యాషన్ సీక్రెట్ చాలామందికి పూర్తీగా తెలియవు. దుస్తులకు తగిన ఇయర్‌రింగ్స్, చైన్, బ్యాగ్, బెల్ట్, వాచ్ లాంటివి స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తాయి.
మినిమలిస్ట్.. ఒకసారి ఒక్క ఆభరణం ఉంటే చాలు.
ఉదా:
ఒక నీలం plain dress ఉంటే — పెద్ద సిల్వర్ జుమ్కాలు + ఆక్సిడైజ్డ్ గాజులు ఉంటే చాలు.
వెస్ట్రన్ టాప్ అయితే – చక్కటి హెయిర్‌స్టైల్ + హూప్స్ + క్లాచ్ బ్యాగ్ సరిపోతుంది.
పాదరక్షలు – లుక్‌ని పూర్తిచేసే గేమ్‌చేంజర్
స్లిప్పర్లు, షూస్, హెయిల్స్ అన్నీ సందర్భానికి తగినట్టు ఎంచుకోవాలి.
జీన్స్, ప్యాంట్లకి స్నీకర్స్ లేదా మ్యూల్స్.
చీరలు, సాల్వార్‌లకు జూటీలు లేదా బ్లాక్ హెయిల్స్.
హెయిర్ స్టైల్ + మేకప్..
"ఫ్యాషన్ లో హాఫ్ జాబ్" ఫేస్ షేప్‌కు తగిన హెయిర్‌కట్ ఎంపిక చేసుకోవడమే.
మేకప్ మితంగా, నేచురల్ గ్లో లా ఉండాలి.
చక్కటి కాటుక + లిప్‌బామ్ వాడి కూడా చాలా అద్బుతంగా కనిపించవచ్చు.
ఫైనల్ గా..
నడక, భంగిమ, ధైర్యమే అసలు ఫ్యాషన్.
ఎంత స్టైలిష్ దుస్తులు వేసుకున్నా ఆత్మవిశ్వాసం లేకపోతే అసలు వర్క్ చేయదు.
నడకలో గౌరవం, ముఖంలో చిరునవ్వు, భంగిమలో నిగుర్లు ఉంటే ఏం వేసుకున్నా మీరు ఫ్యాషన్ ఐకాన్ లా కనిపిస్తారు.
*రూపశ్రీ.
