నీ గొంతులో మత్తుంది... దాంతో సుధీర్ కి సర్జరీ చేసేయొచ్చు అన్న అనిల్ రావిపూడి
Aug 22, 2026 2:31PM

సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఇప్పటికే రెండు మూడు ప్రోమోస్ వచ్చాయి. ఒక్కో ప్రోమోలో ఒక్కో సాంగ్ వినిపించారు. ఇప్పుడు మంచి ఫుల్ ఆన్ జోష్ తో వచ్చిన ఒక సింగర్ సాంగ్ వినిపించారు. ఇక జడ్జెస్ కూడా ఫుల్ ఫిదా ఇపోయారు. కీర్తన అనే సింగర్ వచ్చి సూపర్ మూవీ లోంచి సాంగ్ పాడింది "ఉన్నా చోటా ఉండానీడు " అనే సాంగ్ పడేసరికి అనంత శ్రీరామ్ ఐతే ఫుల్ ఎంజాయ్ చేశారు. "పశ్చిమం నుంచి గాలొచ్చి భారత దేశ సంగీతాన్ని పలకరించినట్టు ఉంది " అంటూ కామెంట్ చేశారు.
ఇక ఎస్పీ శైలజ ఐతే "బాగా పాడావు ఎంజాయ్ చేస్తూ పాడావు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ సాంగ్ విన్న అనిల్ రావిపూడి ఎప్పటిలాగే సుధీర్ ని అడ్డు పెట్టుకుని అతని మీద జోక్స్ వేశారు. "నీ గొంతులో ఒక మత్తుంది . సుధీర్ కి ఏదన్నా ఆపరేషన్ చేయాలంటే నువ్వు పాడుతుంటే సర్జరీ చేసేయొచ్చు " అని చెప్పారు. దానికి కీర్తన నవ్వేసింది. "ఆవిడ పాట పాడడానికి నేను ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి గురువుగారు " అంటూ సుధీర్ రివర్స్ కౌంటర్ వేసాడు. ఇక జడ్జెస్ అంతా నవ్వేశారు. ఈ షో ఆదివారం రాత్రి 9 గంటలకు జీ ఛానెల్ లో మెగా లాంచ్ కాబోతోంది. ఈమె అసలు పేరు కీర్తన చంద్రు . ఫేమస్ సౌత్ ఇండియన్ సింగర్. కన్నడ , తెలుగు భాషల్లో ఎన్నో కవర్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ చిత్రమైన 'సరళ సుబ్బారావు' ట్రైలర్ సాంగ్ ని పాడారు. రీసెంట్ గా డ్రామా జూనియర్స్ సీజన్ 9 పూర్తి చేసుకుంది. ఇప్పుడు సింగింగ్ షోతో జీ ఆడియన్స్ కి ఎక్కడా గ్యాప్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ని పంచుతూనే ఉంది.



.webp)
