
సోషల్ మీడియాలో పల్సర్ బైక్ రమణ అంటే తెలియని వాళ్ళు లేరు. శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ మీద సాంగ్స్ రాసి పాడుతూ ఉంటాడు. అలాగే గతంలో రష్మీ మీద కూడా ఒక సాంగ్ పాడాడు. ఐతే పల్సర్ బైక్ సాంగ్ గురించి దాని ఖర్చు గురించి అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే విషయం మీద కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
"నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. నేను కష్టపడి, ఇష్టపడి అందరికీ నచ్చాలని తాపత్రయంతో సాంగ్స్ చేస్తూ ఉంటాను. నాకు ఈ పాట మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సాంగ్ నా ఇంటి పేరు కూడా మార్చేసింది. ఈ సాంగ్ కి ఆ టైములో స్టూడియో వెర్షన్ కి వచ్చేసరికి 15 వేలు ఖర్చు పెట్టాను. వీడియోకి 2 లక్షల 50 వేలు ఖర్చు పెట్టాను. ఆ తర్వాత ఫిమేల్ వెర్షన్ అది కూడా వీడియో చేయించాను. దానికి 2 లక్షలు అయ్యాయి. మొత్తం 4 లక్షల చిల్లర ఖర్చయ్యింది. " అని చెప్పాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే విషయం గురించి కూడా మాట్లాడాడు.
"బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఆలోచన ఉంది కానీ 2023 లో మంచి అవకాశం వచ్చింది. అప్పుడు నేను అమెరికా వెళ్లి ఒక 50 డేస్ ఉండిపోయాను. ఆ తర్వాత వచ్చేసరికి కొన్ని కారణాల వలన వెళ్ళలేకపోయాను. బిగ్ బాస్ షో వినాయక చవితి టైములో స్టార్ట్ అవుతుంది. ఆ టైములో నేను ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటాను. బిగ్ బాస్ హౌస్ కి వెళ్తే ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలీదు. ఆ టైములో ఈవెంట్స్ ఆగిపోతాయి. నాతో పాటు నా టీమ్ మరో 10 మందికి కూడా ఈవెంట్స్ ఆగిపోతాయి. వాళ్ళు ఉపాధి కోల్పోతారు. అందుకే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లకుండా డ్రాప్ అయ్యాను. ఇప్పుడు బిగ్ బాస్ అగ్నిపరీక్ష చూస్తుంటే నాకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాలన్న ఆలోచన కూడా పోయింది. బిగ్ బాస్ లైట్ అన్న ఫీలింగ్ వచ్చింది. " అని చెప్పాడు పల్సర్ బైక్ రమణ.
-----------------





.webp)
