Agnipariksha season 2 : ఉత్కంఠభరితంగా టాప్-15 కంటెస్టెంట్ల ఎంపిక.. షాకింగ్ ఎలిమినేషన్స్!
Aug 22, 2026 10:05AM
.webp)
బిగ్ బాస్ సీజన్ 10 మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. దీనికోసం గాను అగ్నిపరీక్ష సీజన్ 2 మొదలైంది. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని టాస్క్ లు ఇస్తున్నారు జడ్జ్ లు.. అయితే నిన్నటి ఏడో ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం..అపూర్వ, ఝాన్సీ, ప్రియాంక ముగ్గురూ ఈ ఎపిసోడ్ తో గేమ్ లోకి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చారు. లాస్ట్ డేర్ ఐస్ టబ్ లో అపూర్వ 3 నిమిషాల 14 సెకన్లు ఉండి రుచిత కంటే ముందు బయటకు వచ్చి గెలిచేసింది. ఝాన్సీ అయితే రుచిత ప్లేస్ లోకి లాస్ట్ మినిట్ లో వచ్చి వైబ్రేషన్స్ టాస్క్ ని చింపేసింది. చేతికి కరెంట్ షాక్ తగిలినా ఆపలేదు. టాస్క్ అయ్యాక తన నాన్న గురించి చెప్పి ఏడ్చేసింది. ప్రియాంక కూడా సైలెంట్ గా టాస్క్ చేసి జడ్జ్ ల మెప్పు పొంది టాప్-15 లోకి వెళ్ళింది. ఇక గాయత్రి టాస్క్ లో గివప్ ఇచ్చినా, జడ్జ్ లు లాస్ట్ లో ఒక ఛాన్స్ ఇచ్చి టాప్-15 కి పంపారు
ఇక సుమ బెలూన్ టాస్క్ లో కంట్లో కాటుక పడి ఆపేసింది. ఆ తర్వాత రికవర్ కాలేకపోయింది. లయ అసలు టాస్క్ నే కంప్లీట్ చేయలేదు. రుచితకి పట్టి కట్టే టైం లో చిన్న ఇష్యూ వచ్చింది, దాంతో శ్రీముఖి ఆమెని తీసేసి ఝాన్సీని పెట్టింది. జ్యోత్స్న క్లిప్స్ టాస్క్ లో ట్రై చేసింది కానీ రోహిత్ ముందు నిలబడలేకపోయింది. ఈ నలుగురూ ఇక్కడితో గేమ్ నుండి బయటకు వచ్చేశారు. ఇప్పుడు టాప్ 15 ఫైనల్ అయిపోయింది. ఆల్రెడీ ఉన్న 7 మందితో పాటు ఈ 8 మంది కొత్తగా యాడ్ అయ్యారు.
ఇక అపూర్వ, ఝాన్సీ ఎమోషనల్ కనెక్ట్ తో ఆడియన్స్ దగ్గర మార్కులు కొట్టేశారు. గాయత్రికి సెకెండ్ ఛాన్స్ దొరికింది. కానీ సుమ, లయ, రుచిత, జ్యోత్స్న, పుటా ఫ్యాన్స్ కి మాత్రం ఇది షాక్. ఇక నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఎవరు ఇంట్లో ఉండాలో మీ ఓటే డిసైడ్ చేస్తుంది.




