Ye Devi Varamo Neevu:పూజలో అంజలిని కిందపడేలా చేసిన కమల.. గీతాంజలి తిట్లు!
Nov 27, 2026 10:29AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 126 లో..... పూజ ఏర్పాట్లలో గీతకి అంజలి హెల్ప్ చేస్తుంది. అది భవిత చూసి.. చూసావా అదేదో ఇంటికి పెద్ద కూతురు అయినట్లు ఎలా ఫీల్ అవుతుందోనని కమలతో భవిత అంటుంది...ఆ తర్వాత మనీష్ పూజ దగ్గరికి వస్తాడు. గీత పూజ మొదలుపెడుతుంది అంతలో మనీష్ కి వెక్కిళ్లు వస్తాయి. వాటర్ తాగమని అంజలి సైగ చేస్తుంది. మనీష్ వెళ్తాడు. తన వెనకాలే అంజలి వెళ్లి వాటర్ ఇస్తుంది.
ఆ తర్వాత కావాలనే వాటర్ తనపై పడేస్తుంది.. కర్చీఫ్ తో తుడుచుకో అంటుంది అంజలి. మనిష్ తుడుచుకుంటాడు దానిపై మనాలి అని ఉంటుంది. అది చూసి మనాలి అంటే ఏంటని మనీష్ అడుగుతాడు. నువ్వే కనుక్కోని అంజలి అంటుంది. మరొకవైపు మనీష్ కి ఆ అంజలి సైగ చెయ్యడం ఇవ్వన్నీ చూస్తే బావ పూర్తిగా తన వైపు మారాడనిపిస్తుందని భవిత అనగానే దాని సంగతి నేను చెప్తానని కమల అంటుంది.ఆ తర్వాత పూజ దగ్గరికి ప్రసాదం తీసుకొని రమ్మని అంజలికి గీత చెప్తుంది. ప్రసాదం తీసుకొని అంజలి వస్తుంటే కమల చెయ్ అడ్డు పెడుతుంది. దాంతో అంజలి ప్రసాదం కింద పడేస్తుంది.
ఆ తర్వాత ప్రసాదం ఎందుకు పడేసావని అంజలిపై గీత కోప్పడుతుంది. నిన్ను ఎవరు అన్ని పనులు చెయ్యమన్నారని శంకర్ కోప్పడతాడు. అందరు కోప్పడేసరికి అంజలి బాధపడుతూ వెళ్తుంది. తరువాయి భాగంలో అంజలి ఏడుస్తూ కూర్చుంటే నీకు నేనున్నానని అంజలికి మనీష్ దైర్యం చెప్తాడు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




