TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Godavari Serial: సంజయ్ ఆఫీస్ లో జానుకి జాబ్.. నందు ఫైర్!

Nov 27, 2026 10:23AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godavari.ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 174 లో.....నందు ఆఫీస్ కి రెడీ అవుతుంటే బామ్మ.. ఎంతసేపు ఆఫీసేనా, నీ చెల్లి జాను చూడు చీర కట్టుకుని ముగ్గులు వేస్తూ పాటలు పాడుతూ ఎంత చక్కగా ఉందో, జానులా ఉండొచ్చు కదా అని అంటుంది. దాంతో నందు ఫైర్ అవుతుంది. నేనేం పనీపాట లేకుండా ఇంట్లో కూర్చోవడం లేదు, ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేస్తున్నా, అందుకే జీతం వస్తోంది, ఇల్లు గడుస్తోంది, జానుతో నన్ను పోల్చకు, డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుని లగ్జరీగా బతికే దాన్ని చూసి నేర్చుకోవాలా అని అరుస్తుంది. మురళీ, గౌతమి ఇద్దరు నందుకి సపోర్ట్ చేస్తారు.

 

మరోవైపు బామ్మ, తాతయ్య, సంజయ్ కోసం జానూ కాఫీ తీసుకెళ్తుంది. సంజయ్ కి ఇవ్వకుండా ఆటపట్టిస్తుంది. నా ముగ్గుని, పాటని పొగడలేదని తాతయ్యకి ఫిర్యాదు చేస్తుంది. నచ్చితే కదా మెచ్చుకునేది అని సంజయ్ అనడంతో చిన్న గొడవ అవుతుంది. ఆ తర్వాత జాను.. నాకు ఉద్యోగం కావాలని అడుగుతుంది. సంజయ్ వెంటనే.. నేను ఒప్పుకోనని అంటాడు. బోడి మీ పర్మిషన్ ఎవరికి కావాలని జానూ అంటూనే తాతయ్య గారు అంటారని కవర్ చేస్తుంది. ఎక్కడో ఎందుకు నీ ఆఫీస్ లోనే ఇచ్చేయ్ రా అని బామ్మ, తాతయ్య సంజయ్ ని ఒప్పిస్తారు. తాతయ్య సంతోషం ముఖ్యమని డాక్టర్ చెప్పిన మాట గుర్తుచేసుకుని సంజయ్ చివరికి.. సరే ఇస్తానని అంటాడు.

 

ఇంతలో గౌతమి కాలేజ్ కి వెళ్తూ రోడ్డు మీద ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఇద్దరు రౌడీలు వచ్చి ఏడిపిస్తారు. అప్పుడే ఓ వ్యక్తి (గుండె నిండా గుడిగంటలు బాలు ఫ్రెండ్) కారులో వచ్చి వాళ్లని బెదిరించి తరిమేస్తాడు. గౌతమిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా అంటే వద్దని గౌతమి వెళ్లిపోతుంది. ఫైనల్ గా సంజయ్ జానుని ఆఫీస్ కి తీసుకెళ్తూ.. తాతయ్య, అమ్మమ్మని బుట్టలో వేసుకుని జాబ్ కొట్టేశావ్, ఇన్నాళ్లు ఇంట్లో భరించా, ఇప్పుడు ఆఫీస్ లో భరించాలని విసుక్కుంటాడు. నీకు ఈ కోపం మీ అమ్మ నుంచి వచ్చినట్లు ఉందని సంజయ్ తల్లిని జాను గుర్తుచేయడంతో సంజయ్ కోపంగా కారు బ్రేక్ వేసి "షట్ అప్" అని అరుస్తాడు . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img