Jayam Serial: ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చిన పెద్దసారు..బైక్ పై ప్రమీల, కార్తీక్!
Nov 27, 2026 10:38AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 437 లో... ఆస్తి పేపర్స్ అన్ని రుద్ర దగ్గర ఉంచారని వంశీ సూర్య కోపంగా ఉంటారు. తన దగ్గర ఎందుకు ఆ డాక్యుమెంట్స్ పెట్టానో అని రుద్ర దగ్గరికి తీసుకొని వెళ్లి మార్ట్ గురించి అడుగుతాడు పెద్దసారు. మార్ట్ కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ రుద్ర చెప్తాడు. మీరు రుద్ర లాగా చెప్తారా అని వంశీ, సూర్యలని అడుగుతాడు పెద్దసారు. వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఇందుకే రుద్ర దగ్గర డాక్యుమెంట్స్ ఉంచానని పెద్దసారు అంటాడు.
ఆ తర్వాత కార్తీక్ ఎందుకో నీతో మాట్లాడాలని వచ్చాడని పెద్దసారు అంటాడు. కార్తీక్ పేపర్స్ లో మార్ట్ కి సంబంధించినది ఇస్తాడు. అది చూసి వెరీ గుడ్ .. మార్ట్ మంచి సక్సెస్ అవుతుందని కార్తీక్ కి ఇంక్రిమెంట్ ఇవ్వాలని పేపర్ రెడీ చేస్తాడు రుద్ర. అందులో ప్రమీల సంతకం పెట్టి కార్తీక్ కి ఇస్తుంది. కార్తీక్ అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. కార్తీక్ ప్రమీల బైక్ మీద వెళ్ళాలని గంగ ప్లాన్ చేస్తుంది. ప్రమీల అక్క సర్ కి కార్ అవసరం ఉంది.. మీరు కార్తీక్ బైక్ పై వెళ్ళండి అని గంగ అంటుంది.
ఆ మాటలు నేను అన్లేదు రుద్ర సర్ అన్నారని గంగ అనగానే అవును వెళ్తే తప్పేంటని రుద్ర కూడా అంటాడు. ఇద్దరు బైక్ ఎక్కి వెళ్తుంటే ఇంటి ముందు ముగ్గురు ఆడవాళ్లు ప్రమీల గురించి తప్పుగా మాట్లాడతారు. అది గంగ విని వచ్చి వాళ్ళకి బుద్ది చెప్పి ప్రమీల కార్తీక్ ని పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)