.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 72 లో....మనీష్ వస్తున్నాడని తెలిసి రోహిత్ చాలా టెన్షన్ పడతాడు. వెంటనే ఈ విషయం బావకి చెప్పాలని కార్ దగ్గరికి వెళ్తాడు. రాకీ తన గర్ల్ ఫ్రెండ్ తో కార్ లో ఉంటాడు. "బావ" అని పిలుస్తాడు. ఏంటి బావమరిదీ ఎందుకు డిస్టర్బ్ చేస్తావని రాకీ కోప్పడతాడు. మనీష్ బావ వస్తున్నాడని రోహిత్ చెప్తాడు. ఆలోపే అక్కడికి మనీష్, అంజలి వస్తారు. నువ్వు సైలెంట్ గా ఉండు నేనే మేనేజ్ చేస్తానని రోహిత్ తో రాకీ అంటాడు. ఇక్కడ ఎందుకు ఉన్నారని మనీష్ అడుగుతాడు. ఏం లేదు ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాము, కార్ ట్రబుల్ ఇస్తే మెకానిక్ దగ్గరికి వెళ్ళాడని రాకీ చెప్తాడు.
మా ఫ్రెండ్ కి డబ్బు కావాలని కాల్ చేశావట ఎందుకని మనీష్ కోప్పడతాడు. ఎప్పుడు మా ఫ్రెండ్ కి డొనేషన్ కి హెల్ప్ చేస్తావ్ కదా, ఇప్పుడు నిన్ను అడగడం ఎందుకని నేనే ట్రై చేశానని రాకీ యాక్టింగ్ చేస్తాడు. ఇంట్లో దొంగతనం చేసింది నువ్వేనా అని మనీష్ అనగానే లేదు అన్నయ్య నేను ఎందుకు తీస్తానని రాకీ మళ్లీ యాక్టింగ్ చేస్తాడు. దాంతో మనీష్ అక్కడి నుంచి వెళ్తాడు. మరోవైపు రేవతి తన ఫ్రెండ్ ద్వారా గీత అడ్రస్ కనుక్కుని వస్తుంది.
అంజలి దగ్గరికి చిన్ని వెళ్తుంది. తనని చూడగానే అంజలి ఎమోషనల్ అవుతుంది. అంజలిని హగ్ చేసుకుని రేవతి ఎమోషనల్ అవుతుంది. అక్క మీ అమ్మ అడ్రస్ దొరికిందా.. ఇక్కడ ఉన్నావ్ ఎందుకు..ఇదేనా మీ అమ్మ వాళ్ల ఇల్లు అని రేవతి అడుగుతుంది. తరువాయి భాగంలో అంజలి నెక్లెస్ తీసుకుని వస్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఎవరు ఈ పని చేసింది చెప్పమని అంజలిని గీత అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





(5).webp)
