
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 120 లో...శివుడు, పార్వతి ఇద్దరు తాంబూలంతో జాను ఇంటికి వెళ్తారు. మీ జానుకి మా సంజయ్ కి పెళ్లి చేద్దామని అడుగుతారు. ఇప్పుడు మేం పెళ్లి చేసే స్థితిలో లేం, మా కిన్నెర ఆపరేషన్ కోసం ఊర్లో ఇల్లు, తోట అన్నీ వదిలేసి సిటీకి వచ్చామని శారద, నందు చెప్తారు. మాకు కట్నకానుకలు వద్దు, పెళ్లి కూడా మేమే చేస్తాం, మీ సమస్యలన్నీ మా సంజు చూసుకుంటాడని పార్వతీ అన్నా జాను ఫ్యామిలీ ఒప్పుకోదు. క్షమించండి, మాకు ఈ సంబంధం వద్దు, మా ఇంటిని జానునే చూసుకుంటుంది.. మేం ఎవరి సాయం తీసుకోం.. ఆపరేషన్ అవ్వగానే ఊరు వెళ్లిపోతామని శారద, మురళీ తెగేసి చెప్పడంతో శివుడు, పారు బాధపడుతూ వెళ్లిపోతారు.
వాళ్లు వెళ్లిపోయాక ఇంట్లో అనుమానాలు మొదలవుతాయి. మనల్ని మరీ గతి లేని వాళ్లు అనుకుంటున్నారా అని గౌతమి అంటుంది. ఆ అబ్బాయి వరసే నాకు నచ్చలేదు, మనం వచ్చి ఎన్ని రోజులు అయిందని ఇంతలా బతిమాలి సంబంధం అడుగుతున్నారు.. ఆ అబ్బాయిలో ఏదో లోపం ఉంది.. అందుకే ఇప్పటివరకు పెళ్లి కాలేదని బామ్మ అంటుంది. సంబంధం వద్దన్నాం కదా, ఇల్లు ఖాళీ చేయమంటారేమోనని భయపడి త్వరలోనే ఇల్లు మారిపోవాలని ఫిక్స్ అవుతారు. ఇంట్లో సంజయ్ కి ఈ విషయం తెలిసి షాక్ అవుతాడు. డబ్బులు తీసుకుని, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి నో ఎలా చెప్తుందని మనసులో రగిలిపోతాడు.
జాను బయటకు రాగానే సంజయ్ నిలదీస్తాడు. నా అవసరం తీరాక ప్లేట్ తిప్పేస్తావా, మహా నటివి అని అరుస్తాడు. మీ అమ్మమ్మ తాతయ్యలు మా ఇంటికి వచ్చిన విషయం నాకు తెలియదు, మీరు ఇచ్చిన డబ్బులు చెల్లి ఆపరేషన్ కి ఉపయోగపడ్డాయి, అందుకే థ్యాంక్స్ చెప్పాను, మహానటి, ముదురు, డ్రామాలు ఏంటి ఆ భాష అని జాను ఎదురు తిరుగుతుంది. సంజయ్ అసలు విషయం బయటపెడతాడు. ఆల్ రైట్, ఈ శుక్రవారమే మన పెళ్లి, అది ఫిక్స్. నువ్వు అడిగే డబ్బులు తీసుకున్నావా? మా అమ్మమ్మ తాతయ్యల ఆనందం కోసం కొన్ని రోజులు పెళ్లి చేసుకున్నట్లు నటించాలి.. ఈ ప్రేమ పెళ్లి మాయాజాలంలో నేను ఇరుక్కోలేనని డెడ్ లైన్ పెడతాడు. మా వాళ్లు ఒప్పుకోకుండా ఎలా అని జాను బాధపడుతూ ఇంటికి వెళ్లి అగ్రిమెంట్ విషయం అక్క నందుకి చెప్పాలని అనుకుంటుండగా శారద.. నువ్వు ఇంటి ఓనర్ అబ్బాయితో మాట్లాడుతున్నావా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Godhavari, Godhavari Episode 120, Star Maa Serial, Janu, Sanjay, Shivudu, Parvathi, Sharda, Nandu, Kinnera, Marriage Agreement]





.webp)
