(5).webp)
బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ఇందులో నిన్న జరిగిన ఎపిసోడ్ లో కిచెన్ లో జరిగిన వ్యవహారం పెద్ద గొడవకు దారి తీసింది. గతంలో వంటగదిలో ఉన్నప్పుడు అతిగా మాట్లాడుతూ వంటపై దృష్టి పెట్టలేదని వంశీ, త్రిగుణ్ లకు హోస్ట్ నాగార్జున క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. అప్పుడు శిక్షగా ఒక రోజు అంతా నోటికి ప్లాస్టర్ వేసుకుని మాట్లాడకుండా వంట చేయాలని పనిష్మెంట్ ఇచ్చారు. అయితే ఆ పనిష్మెంట్ ను వాళ్లు సరిగ్గా అమలు చేయలేదనే విషయం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది.
కెప్టెన్ అయిన ఝాన్సీ వంటగదిలోకి వచ్చి వంశీ, త్రిగుణ్ లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మీరిద్దరూ వంట చేసేటప్పుడు అస్సలు మాట్లాడొద్దు.. కేవలం వంటపైనే దృష్టి పెట్టండని స్ట్రిక్ట్ గా చెప్తుంది. దీనికి త్రిగుణ్ కొంచెం వెటకారంగా, దూకుడుగా స్పందిస్తూ.. ప్లాస్టర్ ఉంటే వేసుకోండి.. లేకపోతే మేం మాట్లాడుతూనే ఉంటామని అన్నాడు. దీనికి ఝాన్సీ కూడా.. బిగ్ బాస్ ప్లాస్టర్ ఇవ్వడం లేదు, మీరే కావాలని మాట్లాడుతున్నారని ఎదురు సమాధానమిచ్చింది.
దీంతో వంశీ కూడా త్రిగుణ్ కి సపోర్ట్ గా నిలిచాడు. మీరే ప్లాస్టర్ వేయాలి, మాకు సంబంధం లేదంటూ ఝాన్సీతో వాదనకు దిగాడు. ప్లాస్టర్ లేకుండా తాము సైలెంట్ గా ఉండేది లేదని ఇద్దరూ తెగేసి చెప్పారు. వాళ్ల తీరుతో విసిగిపోయిన ఝాన్సీ.. ఇక లాభం లేదనుకుని నేరుగా బిగ్ బాస్ నే ప్లాస్టర్ పంపించమని కెప్టెన్ గా రిక్వెస్ట్ చేసింది. కెప్టెన్ మాటను కాదనలేక బిగ్ బాస్ వెంటనే ప్లాస్టర్ ను హౌస్ లోకి పంపించాడు. ప్లాస్టర్ రాగానే ఝాన్సీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కెప్టెన్ పవర్ చూపిస్తూ స్వయంగా వెళ్లి వంశీ, త్రిగుణ్ ఇద్దరి నోటికి ప్లాస్టర్ వేసింది. దీంతో వంటగదిలో కాసేపు పూర్తి సైలెన్స్ నెలకొంది. నోటికి ప్లాస్టర్ తో వాళ్లు చేస్తున్న హావభావాలు చూసి ఇంటి సభ్యులంతా నవ్వులు ఆపుకోలేకపోయారు. మరి ఈ పనిష్మెంట్ తర్వాతైనా వాళ్లు మారుతారా లేదా అనేది చూడాలి.




.webp)
(4).webp)
