
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 71 లో....తనపై పడ్డ దొంగతనం నిందను నువ్వే పోగొట్టాలంటూ మనీష్ ని అంజలి రిక్వెస్ట్ చేస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయి ఉండటంతో ఇదంతా ఎవరో కావాలనే చేశారని అర్థమవుతుంది. మరోవైపు రేవతి డల్ గా ఉండటంతో కృష్ణజ ద్వారా వాళ్ల ఇంటి అడ్రెస్ తెలుసుకోవాలని వేరే ఫోన్ ద్వారా ట్రై చేస్తారు. అయినా కృష్ణజ చెప్పదు.
మరోవైపు.. అంజలి దొంగతనం చేసిందని అనుకుంటున్నావా అని గీతను బాను అడుగుతాడు. అవును అనుకుంటున్నానని గీత చెప్తుంది. తీస్తే బ్యాగ్ లో బాక్స్ మాత్రమే ఎందుకు ఉంటుంది? నెక్లెస్ కూడా ఉండాలి కదా?" అని బాను అంటాడు. అయినా గీత ఒప్పుకోదు. కచ్చితంగా అంజలినే తీసిందని వాదిస్తుంది. ఆ తర్వాత ఇంట్లో పనివాళ్లను మనీష్ అడుగుతాడు.ఎవరూ తీయలేదని చెప్తారు.
అప్పుడే మనీష్ కి తన ఫ్రెండ్ కాల్ చేసి.. మీ తమ్ముడు రాకీ నన్ను డబ్బు అడిగాడు.. నాకు డౌట్ వచ్చి ఇవ్వలేదని చెప్తాడు. దీంతో రాకీకి మనీష్ కాల్ చేస్తాడు. ఫోన్ కలవదు. వెంటనే రోహిత్ కి ఫోన్ చేస్తాడు. బావ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడని రోహిత్ అబద్ధం చెప్తాడు. ఇప్పుడే అర్జెంట్ గా లొకేషన్ పంపమని మనీష్ అనగానే రోహిత్ భయంతో లొకేషన్ పంపిస్తాడు. అమ్మో ఇప్పుడు బావ ఇక్కడికి వస్తే అని రోహిత్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Ye Devi Varamo Neevu, Ye Devi Varamo Neevu Episode 71, Star Maa Serial, Anjali, Manish, Rocky, Rohith, Geetha, Krishnaja, Revathi]






