
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam) రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-380లో.. విశ్వకి రుద్ర గురించి వీరు నెగెటివ్ గా చెప్తాడు. రుద్ర మీకు పోటీగా దిగుతున్నాడు, గంగకి ట్రైనింగ్ ఇస్తున్నాడని చెప్పడంతో.. మా రుద్ర బాబు అలా ఏం చేయడని లక్ష్మి అంటుంది. ఆ తర్వాత విశ్వ ఎవరికో కాల్ చేసి.. రేపటి నుంచి నా కూతురికి నేనే ట్రైనింగ్ ఇస్తాను.. స్పాన్సర్ షిప్ కూడా తనకే రావాలని చెప్తాడు. ఎందుకు గంగకి ఇవన్నీ చేస్తున్నావని రుద్రతో శకుంతల అంటుంది.
మరోవైపు గంగ తన ఒంటిపై కొరడాతో తనే కొట్టుకుని, నొప్పి రావడంతో ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర.. ఎందుకు ఇలా తింగరి పనులు చేస్తుంటావ్.. ఒక్కసారి కూడా చెప్పింది చేయవని కోప్పడతాడు. ఇంకోవైపు విశ్వ తన క్యాబిన్ లో జయ స్పాన్సర్ షిప్ గురించి స్పాన్సర్లతో మాట్లాడుతుంటాడు. అగ్రిమెంట్ చేసుకోబోతున్న సమయంలోనే రుద్ర, గంగ అక్కడికి వస్తారు.
మీరు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా జయకి స్పాన్సర్ షిప్ ఎలా ఇస్తారని రుద్ర నిలదీస్తాడు. ఇక నుంచి గంగకి నేనే ట్రైనింగ్ ఇస్తున్నా, మీరు ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకోండి అని చెప్తాడు. దీంతో స్పాన్సర్లు కొంచెం టైమ్ తీసుకుని ఒక నిర్ణయం చెప్తారు. ఇద్దరికి ఒక మ్యాచ్ పెడతాం.. అందులో ఎవరు గెలిస్తే వాళ్లకే స్పాన్సర్ షిప్ ఇస్తామనగానే రుద్ర, విశ్వ ఇద్దరూ ఒప్పుకుంటారు.
ఒక తండ్రి సంకల్పం గెలుస్తుందా.. ఒక భర్త లక్ష్యం గెలుస్తుందా చూద్దామని గంగ అనగానే ఏంటి నా కూతురితోనే ఛాలెంజ్ చేస్తున్నావా అని విశ్వ కోప్పడతాడు. మీ కుటుంబం అంతా ఇంతే.. నమ్మించి మోసం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో.. స్పాన్సర్ షిప్ ఎవరికి దక్కుతుందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Jayam, Jayam Episode 380, Zee Telugu Serial, Vishw, Rudra, Ganga, Jaya, Lakshmi, Shakuntala, Sponsorship Match]






