Home

»

Tv News

Bigg Boss 10 Telugu: కెప్టెన్సీ టాస్క్ లో ముఖేష్ వర్సెస్ రోహిత్.. ఏడ్చేసిన దేబ్జానీ!

Sep 23, 2026 11:11AM

బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ గొడవలు ముగియగానే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలైంది. మూడో వారం థీమ్ టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్స్ లో భాగంగా లివింగ్ ఏరియాలో ఒక బజర్, గార్డెన్ ఏరియాలో మరో బజర్ ను ఏర్పాటు చేశాడు బిగ్ బాస్.

 

మొదటి బజర్ మోగగానే లివింగ్ ఏరియాలో ముఖేష్, గార్డెన్ ఏరియాలో రోహిత్ ముందుగా బజార్ ని టచ్ చేశారు. వీరిద్దరికి బిగ్ బాస్ పెట్టెను తోసే టాస్క్ ఇచ్చాడు. ముఖేష్ ఒకవైపు నుండి, రోహిత్ మరోవైపు నుండి పెట్టెను తోయాలి. మొదట్లో ముఖేష్ దూకుడుగా తోయగా రోహిత్ వెనక్కి వెళ్లాడు. కానీ చివర్లో ముఖేష్ వదిలేయడంతో రోహిత్ పెట్టెను తనవైపు లాక్కొచ్చాడు. అక్కడే అసలు గొడవ మొదలైంది. ఈ టాస్క్ కి సంఛాలక్ అమన్. అతను రోహిత్ కి సపోర్టివ్ గా ముఖేష్ ఎల్లో లైన్ దాటలేదని అన్నాడు.  ఎల్లో లైన్ దాటిందని ముఖేష్, వర్షిణి, రామ్ ప్రసాద్ అన్నారు. దాటలేదని సుధీర్, షాలినీ, చరణ్ వాళ్ళు  రోహిత్ కి సపోర్ట్ గా అన్నారు. సంచాలక్ గా ఉన్న అమన్ ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యాడు. అప్పుడే రామ్ ప్రసాద్ మధ్యలో వచ్చి.. శనివారం నువ్వే బుక్ అవుతావంటూ అమన్ కు చెప్పాడు. ఎల్లో లైన్ టచ్ అయితే చాలా లేక బాక్స్ మొత్తం దాటాలా అనే రూల్ పై క్లారిటీ లేని అమన్ .. మళ్ళీ తన మీదకి వస్తుందేమోనని ముఖేష్ గెలిచాడని ప్రకటించాడు. దాంతో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో మొదటి కంటెస్టెంట్ గా ముఖేష్ గెలిచాడు. 

 

ఇక ముఖేష్ కి  ఇంటి నుండి లెటర్ అండ్ మీ నాన్నతో నువ్వు ఉన్న పోటో వచ్చిందని బిగ్ బాస్ చెప్తాడు.. అది పొందాలంటే వర్షిణికి వచ్చిన ఫోటోని లేదా దేబ్జానీకి వచ్చిన లెటర్ ని ట్రాష్ చేయాలని బిగ్ బాస్ చెప్తాడు.  దేబ్జానీకి వచ్చిన లెటర్ ని ట్రాష్ చేయాలని ముఖేష్ డిసైడ్ అయి చెప్తాడు. ఇక ముఖేష్ కి ఇంటి నుండి లెటర్ వస్తుంది. దేబ్జానీకి వచ్చిన లెటర్ ని ట్రాష్ చేయడంతో తను ఏడ్చేసింది. అయితే ఇక్కడ బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకుంటుందని చెప్పేశాడు దాంతో దేబ్జానీ ఏడ్చేసింది. 

 

 

 

[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Captaincy Contender Task, Mukesh Gowda, Rohith, Aman, Varshini, Ram Prasad, Debjani, Sudheer, Shalini]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com