
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 70 లో భవిత నెక్లెస్ కనిపించకపోవడంతో ఇంట్లో అందరు నెక్లెస్ కోసం వెతుకుతారు. ఇంట్లో పనివాళ్లందరిని చెక్ చేశాం.. అంజలి కూడా ఈ ఇంటి పనిమనిషే కదా తన దగ్గర కూడా వెతుకుదామా అని రాకీ అనగానే అందరు షాక్ అవుతారు.ఏం మాట్లాడుతున్నావ్ రా, తను ఎందుకు తీస్తుందని రత్నం అంటుంది. వెతకనివ్వండి అమ్మగారు, వాళ్ల డౌట్ క్లియర్ అవుతుంది కదా అని అంజలి స్వయంగా అంటుంది. దీంతో అంజలి బ్యాగ్ ని తీసుకురమ్మని గీత ప్రీతికి చెప్తుంది. ప్రీతి బ్యాగ్ తీసుకొని రాగా అందులో నెక్లెస్ బాక్స్ ఉంటుంది కానీ లోపల నెక్లెస్ ఉండదు. దీంతో అందరు షాక్ అవుతారు.
ఈ బాక్స్ ఎలా వచ్చిందో నాకు తెలియదని అంజలి ఏడుస్తుంది. అంజలి బ్యాగ్ లోకి ఈ ఖాళీ బాక్స్ ఎలా వచ్చిందో తెలియాలని రత్నం అడుగుతుంది. మా అమ్మకి తనంటే చాలా నమ్మకం ఉంది, కానీ ఇప్పుడు తనే దొంగతనం చేయలేదని సాయంత్రం లోగా నిరూపించుకోవాలి.. లేదంటే నా విశ్వరూపం చూడాల్సి ఉంటుందని గీత వార్నింగ్ ఇస్తుంది.ఆ తర్వాత అంజలి.. అమ్మమ్మా నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి అని రత్నంతో అంటుంది. మరోవైపు.. బావా, నువ్వే నెక్లెస్ తీశావ్ కదా అని రాకీతో రోహిత్ అంటాడు. "లేదు రా" అని రాకీ అబద్ధం చెప్తాడు.
మరోవైపు అంజలి మనీష్ దగ్గరికి వచ్చి.. నేను దొంగతనం చేయలేదని అంటుంది. నేను సీసీటీవీ చూస్తున్నాను కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఫుటేజ్ డిలీట్ అయిందని మనీష్ అంటాడు. అంటే ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారమే చేశారని అంజలి అంటుంది. తరువాయి భాగంలో మనీష్, అంజలి కలిసి రాకీ దగ్గరికి వెళ్లి.. నెక్లెస్ దొంగతనం చేసింది నువ్వే అని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Ye Devi Varamoo Neevu, Ye Devi Varamoo Neevu Episode 70, Star Maa Serial, Anjali, Manish, Rocky, Rohith, Rathnam, Geetha, Preethi, Bhavitha]





.webp)
