
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 118 లో......జాను పరుగుపరుగున సంజయ్ గదికి వెళ్లడంతో శివుడు, పార్వతి షాక్ అవుతారు. జాను అలా వెళ్తే సంజయ్ ఊరుకుంటాడా అని శివుడు అంటే, అప్పుడప్పుడు అమ్మాయిలు ఇలా వెళ్తేనే వాడిలో మార్పు వస్తుందని పార్వతి అంటుంది. తలుపు తట్టకుండా వచ్చిన జానుతో మేనర్స్ ఉండాలని, తలుపు తట్టి రమ్మని సంజయ్ అంటాడు. దీంతో జాను మళ్లీ తలుపు తట్టి అర్జెంట్ గా మాట్లాడాలని, మీరు చెప్పినట్లే అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. వీకెండ్ లో మాట్లాడుకుందామని సంజయ్ అన్నా, చెల్లి ఆపరేషన్ ఆగిపోతుందని, ఇప్పుడే డబ్బు కావాలని జాను ఏడవడంతో సంజయ్ వెంటనే ఆఫీస్ కి తీసుకెళ్తాడు. ఇద్దరు కలిసి వెళ్లడం చూసి శివుడు, పార్వతిలు సంతోషంతో గంతులేస్తారు.
ఆఫీస్ లో సంజయ్ అగ్రిమెంట్ రెడీ చేసి చదువుకోమని ఇస్తే, ఏం అవసరం లేదు సంతకం పెట్టేస్తాను.. డబ్బు ఇవ్వండి అంటుంది జాను. సంతకం పెట్టే ముందు సూర్యని తలచుకుని ఏడ్చిన జాను, తండ్రిని, చెల్లిని గుర్తుతెచ్చుకుని కన్నీళ్లతో సంతకం పెట్టేస్తుంది. జాను చదవలేదని సంజయ్ అగ్రిమెంట్ చదివి వినిపించబోతే, ఆపండి అగ్రిమెంట్ లో ఏం ఉన్నా నాకు ఓకే, నాకు నా చెల్లి ప్రాణం ముఖ్యమని జాను అంటుంది. నా అవసరం ఈ పెళ్లి చేయిస్తుంది.. మీ డబ్బు మాట్లాడుతుంది.. నా పేదరికం వింటుంది అంటూ ఎమోషనల్ అవుతుంది. ఇందులో బలవంతం లేదని, ఇష్టం లేకపోతే డ్రాప్ అవ్వచ్చని సంజయ్ అంటే ఇష్టంతోనే పెడుతున్నానని జాను చెప్తుంది. ఆ తర్వాత సంజయ్ కూడా సంతకం పెట్టి, అగ్రిమెంట్ అయిపోయాక విడాకులు వస్తాయని, బంధాలు, భరణాలు ఏం ఉండవని క్లారిటీ ఇస్తాడు.
వెంటనే సంజయ్ డీడీ ఇచ్చి మీ చెల్లి హాస్పిటల్ కి ఎప్పుడో డబ్బు కట్టేశానని, అవసరానికి మించి 5 లక్షలు ఎక్కువే కట్టానని చెప్తాడు. జాను చేతులు జోడించి వెళ్లిపోతుంది. అటు హాస్పిటల్ లో శారద, నందులను డబ్బు కట్టలేదని నర్సులు తిడుతుండగా మురళి డబ్బు కోసం అందరిని అడిగి నిరాశతో వస్తాడు. అదే సమయంలో జాను వచ్చి డీడీ చూపించి డబ్బు కట్టేశామని చెప్తుంది. సంతకంలో తేడా వల్ల లేట్ అయిందని కవర్ చేస్తుంది. నర్సు వచ్చి డబ్బు కట్టేశారని, ఆపరేషన్ మొదలుపెడుతున్నామని చెప్పడంతో అందరు ఊపిరి పీల్చుకుంటారు. అంత డబ్బు ఎలా వచ్చిందని మురళి అడిగితే ఫ్రెండ్ ఇచ్చారని, తను ఇక ముందు పెద్ద సాయం చేయాలని జాను బాధగా సమాధానం ఇస్తుంది. కిన్నెరకు ఆపరేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Godhavari, Godhavari Episode 118, Star Maa Serial, Janu, Sanjay, Kinnera, Murali, Nandu, Parvathi, Shivudu]




.webp)

