Home

»

Tv News

Jayam serial : గంగకి ట్రైనింగ్ ఇస్తానన్న రుద్ర.. శకుంతలకి షాకిచ్చిన వీరు!

Sep 22, 2026 10:38AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్  379 లో ప్రీతి బాబుని పట్టుకొని అందరు ముద్దాడుతారు. బాబుకి దిష్టి పెట్టకండి అని శకుంతల అంటుంది. అప్పుడే సుధా, జయ వస్తారు. బాబు రాగానే ఇల్లంతా సందడిగా ఉందని బాబుని ఎత్తుకొని అతని మెడలో చైన్ వేస్తుంది. ఇంతకీ విశ్వ రాలేదా అని పెద్దసారు అడుగుతారు. నాన్న వచ్చేవాడు కానీ ఈ గంగ వచ్చి గొడవ చేసింది.. నాకు ట్రైనింగ్ ఇవ్వరా అని అడుగుతుంది.. దాంతో నాన్నకి కోపం వచ్చిందని జయ చెప్తుంది. ఈ గంగకి ఆల్రెడీ చెప్పాను కదా బాక్సింగ్ వద్దని.. మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్ళిందని శకుంతల అంటుంది.

 

అప్పుడే రుద్ర, గంగ వస్తారు. గంగ  వాళ్ల ఇంటికి గొడవ పెట్టుకోవడానికి వెళ్లలేదని రుద్ర చెప్తాడు. గంగకి మావయ్య ట్రైనింగ్ ఇవ్వకుంటే ఏంటి, నేను ఇస్తానని రుద్ర అనగానే అందరు షాక్ అవుతారు. అంటే మీ మావయ్యతో పోటీ పడుతున్నావా అని సుధా అంటుంది. లేదు అత్తయ్య, నా భార్యని ఛాంపియన్ చేయడం నా లక్ష్యం అని రుద్ర చెప్తాడు.

 

ఆ తర్వాత రుద్ర మాటలు గుర్తుచేసుకొని శకుంతల కోపంగా ఉంటుంది. గంగ తన అత్త కూతురు అని రుద్రకి తెలిస్తే నెత్తిన పెట్టుకుంటాడని భయపడుతుంది. ఆ విషయం రామనాథం అసిస్టెంట్ బాలకృష్ణకి తెలుసు.. అతను ఎలా ఉన్నాడోనని హాస్పిటల్ కి ఫోన్ చేసి కనుక్కుంటుంది. తను బానే ఉన్నాడని చెప్పగానే శకుంతలకి భయం మొదలవుతుంది. ఎప్పటికీ ఆ విషయం రుద్రకి తెలియొద్దనుకుంటుంది శకుంతల. అప్పుడే వీరు, ఇషిక వచ్చి..‌మేం ఎప్పటికీ తెలియనివ్వమని వీరు అనగానే.. మీకెలా తెలుసని శకుంతల అడుగుతుంది. నాకు అంతా తెలుసని వీరు అంటాడు. తెలిసే రామనాథంని అలా చేశావా అని శకుంతల అనగానే.. అవన్నీ ఇక మీరు అడగొద్దు.. నాకు మీకు నచ్చింది జరగాలి.. అందరు మీ మాటే వినాలి అని వీరు అ‌నగానే శకుంతల కూల్ అవుతుంది.

 

మరోవైపు సుధా, జయ జరిగిందంతా విశ్వకి చెప్తారు. గంగకి రుద్ర ట్రైనింగ్ ఇస్తున్నాడని జయ చెప్పగానే.. ఇస్తే ఏంటే, తన హస్బెండ్ తనకి ఇస్తున్నాడని విశ్వ అంటాడు. అప్పుడే వీరు వచ్చి.. రుద్ర కావాలనే మిమ్మల్ని ఓడించాలని చేస్తున్నాడని విశ్వని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Jayam, Jayam Episode 379, Zee Telugu Serial, Jaya, Ganga, Rudra, Preethi, Shakuntala, Veeru, Ishika]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com