స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' . ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-63 లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎందుకు గీతా పెళ్లికి ముందు ఫోటోలో నవ్వుతూ ఉన్నావ్.. పెళ్లి ఫోటోలో డల్ గా ఉన్నావ్.. పెళ్లికి ముందు నీ జీవితంలో ఏదైనా తుఫాన్ వచ్చిందా అని భాను అనగానే గీత టెన్షన్ పడుతుంది. అది నేనే.. పెళ్లి నుంచి నీ నవ్వు కూడా నేనే నవ్వుతున్నా, అందుకే నువ్వు నవ్వడం మానేశావ్.. ఇలా నేనే నవ్వుతూ నవ్విస్తూ ఉంటే బోర్ కొడుతోందని భాను సరదాగా మాట్లాడి వెళ్తాడు. కానీ తనకు ఎక్కడ పెళ్లికి ముందు గతం తెలిసిందోనని గీత టెన్షన్ పడుతుంది. అంజలి వంక కోపంగా చూస్తూ ఫోటోకి ఉన్న దుమ్ము మాత్రం దులుపు, దాని వెనకాల ఉన్న వాళ్ల గురించి నీకు అనవసరమని గీత కోప్పడుతుంది.
ఆ తర్వాత ఒరేయ్ నాకు ఒక లక్ష కావాలని రోహిత్ తో రాకీ అంటాడు. నా దగ్గర అంత లేవని రోహిత్ చెప్తాడు. సరే అత్తయ్య ఒక నెక్లెస్ కొన్నది.. అది తీసుకుని రా.. అది తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటా.. మళ్లీ నాలుగు రోజుల్లో తీసుకొస్తానని రాకీ అనగానే అమ్మో నాకు భయమని రోహిత్ అంటాడు. అయినా సరే రాకీ ఇబ్బంది పెట్టడంతో రోహిత్ సరే అంటాడు. ఆ తర్వాత గీత దగ్గరకు అంజలి కాఫీ తీసుకుని వస్తుంది. సారీ అమ్మగారు, మీ తలనొప్పికి కారణం నేనే అని అంజలి అంటుంది. మనుషుల గురించి కరెక్ట్ గా చెప్పగలవ్.. ఇప్పుడు నా మనసులో ఏముందో చెప్పు అని గీత అడుగుతుంది. సారీ అమ్మగారు అని అంజలి అంటుంది. నువ్వు నీ పని మాత్రమే చెయ్.. అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకని గీత వార్నింగ్ ఇస్తుంది.
ఆ తర్వాత రేయ్ అత్తయ్య పడుకుంది.. వెళ్లి నెక్లెస్ తీసుకుని రా అని రోహిత్ ని రాజీ పంపిస్తాడు. రోహిత్ వెళ్లేసరికి గీత వర్క్ చేసుకుంటూ ఉండడంతో రోహిత్ భయపడి కిందపడిపోతాడు. రాకీ వచ్చి తనను గదిలోకి తీసుకెళ్తాడు. బావా నన్ను ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ చేయకు అని రోహిత్ పడుకుంటాడు. వీడికి ఇలాంటివి చేయడం ఇష్టమే కానీ భయపడుతున్నాడు.. ట్రైనింగ్ ఇస్తే సెట్ అవుతాడని రాకీ అనుకుంటాడు. తరువాయి భాగంలో మనీష్ దగ్గరకు అంజలి వచ్చి నేను రోహిత్ కి రాకీ కట్టాలి.. నాకు అన్నదమ్ముళ్లు లేరు కదా అని అడుగుతుంది. నేను రిస్క్ చేయనని మనీష్ అంటాడు. ఆ తర్వాత భవిత వాళ్లు రోహిత్ కి రాకీ కడుతుంటే అంజలి బాధపడుతుంది. అది మనీష్ చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Ye Devi Varamo Neevu Today Episode, Ye Devi Varamo Neevu Episode 63, Geetha past tension, Rakhi Rohith necklace plan, Star Maa serial]




