Home

»

Tv News

Podharillu :మాధవ దుర్మార్గుడు.. శైలు గుట్టురట్టు చేసిన కేశవ!

Sep 13, 2026 12:26PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -208 లో... కేశవ దగ్గరికి శైలు వచ్చి మాధవను చూపించమని తనతో మాట్లాడాలని  అడుగుతుంది. ఇప్పుడేం మాట్లాడతావే అని కేశవ అంటే బావగారికి కంగ్రాట్స్ చెప్పాలి.. అలాగే థ్యాంక్స్ కూడా చెప్పాలని అంటుంది. బావగారి పెళ్లి అయిపోతే తర్వాత మనదే కదా.. అందుకే లైన్ క్లియర్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తా అంటుంది శైలు. నువ్వు మామూలు సెల్ఫిష్ కాదే అంటూనే కేశవ, మాధవ దగ్గరకు శైలును పంపిస్తాడు. అక్కడ శైలు మాధవతో మాట్లాడి తన సమస్య పరిష్కరించినందుకు థ్యాంక్స్.. పెళ్లి కుదిరినందుకు కంగ్రాట్స్.. నేను అడగగానే పెళ్లి చేసుకుంటున్నందుకు థ్యాంక్స్ అని చెప్తుంది.

దీంతో అసలు విషయం బయటపడుతుంది. నువ్వు కాదమ్మా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి.. ఆరోజు నువ్వు ఆ విషయం చెప్పకపోయి ఉంటే నేను పెళ్లికి రెడీ అయ్యేవాడినే కాదు.. మీ పెళ్లికి నేనే కారణమని నాకు తెలియదు.‌ వాడు అలాంటి కండిషన్ పెట్టాడని నాకు తెలియదు.‌ లేదంటే మీ పెళ్లికి నేను అడ్డు ఉండేవాడిని కాదని మాధవ అంటాడు. నువ్వు నన్ను కలిసి మీ పెళ్లి జరగకపోవడానికి కారణం నేనే అని చెప్పాకే బాగా ఆలోచించి ఇంత త్వరగా ఈ పెళ్లికి సిద్ధమయ్యాను.. మీ పెళ్లి కూడా త్వరగా చేసేస్తానని మాధవ అంటాడు. ఈ మాటలన్నీ వెనక నుంచి విన్న కేశవకు షాక్ తగులుతుంది. మొత్తం ఇదే చేసిందని శైలు గుట్టు అందరి ముందు రట్టు చేస్తాడు.

మరోవైపు బృందావనం ఇంట్లో నిశ్చితార్థాన్ని ఆపేందుకు చక్రి, మహా, నారాయణ టీమ్ ప్లాన్ చేస్తుంది. జయంతి నిజస్వరూపం తెలిసిన తర్వాత మాధవ పెళ్లి జరిగితే లైఫ్ నాశనం అవుతుందని మహా ఆందోళన పడుతుంది. జయంతి తల్లితో తాయారు ఫైట్ కూడా హైలైట్ గా నిలిచింది. మేనత్త తాయారు ఎంగేజ్మెంట్ కి రావడంతో మాధవ కుటుంబానికి అవమానం జరుగుతుంది. మాధవ దుర్మార్గుడు అంటూ తాయారు ఫైర్ అవుతుంది. ఈ గొడవల మధ్య నిశ్చితార్థం ఆగుతుందా.. మాధవ నిజం తెలుసుకుంటాడా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Podarillu Today Episode, Podarillu September 12 Episode, Madhava Jayanthi engagement, Shailu Keshava, Star Maa Podarillu serial]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com