స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -777 లో.....దీపను కలిసిన మాలిని తనతో చేతులు కలపమని అంటుంది. దీంతో దీప సీరియస్ అవుతూ చూడు సుమిత్రమ్మ నాకు కన్నతల్లి లాంటిది. ఆ ఇల్లు నాకు పుట్టినిల్లు.. వాళ్ల జోలికి రావొద్దు.. నాలో ఉన్న అమ్మోరు నిద్రలేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకోకు.. నేను ఉండగా ప్రమాదం నీడ కూడా ఆ ఇంటిపై పడనీయనంటూ వార్నింగ్ ఇస్తుంది. సరే అత్తా ఉంటాను.. తిన్నగా ఇంటికిపో అంటే మాలిని హేళనగా నవ్వి వెళ్లిపోతుంది. దీంతో మాలిని పగతో రగిలిపోతూ నువ్వు ఉండగా నీడ కూడా పడనీయవా.. అయితే నీ పనిలో నువ్వు ఉండు నా పనిలో నేను ఉంటానని మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు జ్యోత్స్న గురించే ఆలోచిస్తూ గేటు దగ్గర తన ఊహలో జ్యోత్స్నను చూస్తాడు సూరజ్. వెంటనే జ్యోత్స్న ఎదురుగా వచ్చి భ్రమ అనుకున్నావా అంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ గొడవ జరుగుతుంది. తన ఇంటి దగ్గర పడేసుకున్న పర్స్ ను జ్యోత్స్న ఇవ్వగా అందులో తన ఫోటో ఉండడం చూసి సూరజ్ ఎమోషనల్ అవుతాడు.ఫోటోను చింపేయమని జ్యోత్స్న అనగా సూరజ్ తప్పించుకుంటాడు.
అదే సమయంలో మాలిని సూరజ్ కి మరింత ఎక్కిస్తుంది. నీ తండ్రి చనిపోయి ఇన్నాళ్లైనా అస్తికలు గంగలో కలపలేదని.. ఇప్పుడు బదులు తీర్చుకున్నాం కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందని కాశీలో కలిపి రమ్మని చెప్తుంది. దక్షిణామూర్తి వచ్చి కాశీకి తనే వెళ్తానని బాధపడతాడు. మరోవైపు శివన్నారాయణ, దశరథ్ లకు అత్తాపూర్ బ్రాంచ్ లో ఫైర్ యాక్సిడెంట్..మిగిలిన బ్రాంచ్ లలో రైడ్స్ జరుగుతున్నాయని కాల్స్ వస్తాయి. ఎవరో కావాలనే చేస్తున్నారని వాళ్లు ఆఫీస్ కి బయలుదేరతారు. విషయం తెలిసిన దీప కూడా బావకి ఫోన్ చేయాలని కార్తీక్ కి కాల్ చేస్తుంది కానీ కార్తీక్ ఫోన్ ఇంట్లోనే మర్చిపోతాడు. దీంతో దీప ఒక్కతే రోడ్డుపై పరుగెడుతూ బయలుదేర్తుంది.
అదే ఛాన్స్ కోసం ఎదురుచూసిన మాలిని ప్లాన్ ప్రకారం వెనుక నుంచి కారు వచ్చి దీపను గట్టిగా గుద్దేస్తుంది. కడుపుతో ఉన్న దీప బోర్లా పడి చెత్త బండిని ఢీకొడుతుంది. గర్భానికి గట్టి దెబ్బ తగిలి రోడ్డుపై కుప్పకూలిపోతుంది. చుట్టూ ఉన్నవాళ్లు హాస్పిటల్ కి తరలిస్తారు. మాలినికి ఫోన్ చేసిన డ్రైవర్ మీరు చెప్పినట్లే చేశాను మేడమ్ అని చెప్తాడు. ప్రాణాలు పోయాయా అని మాలిని అడగ్గా బతికే ఛాన్స్ లేదని డ్రైవర్ చెప్తాడు. దీంతో మాలిని రాక్షసానందం పొందుతూ నేను ఇచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేసి నాకే వార్నింగ్ ఇచ్చావ్.. నా దమ్ము ఏంటో చేతల్లో చూపించానని అనుకుంటుంది. అదే సమయంలో ఆటోపై వెళ్తున్న జ్యోత్స్న.. దీపను చూసి అల్లాడిపోతుంది. తను కడుపుతో ఉందని హెల్ప్ అడుగుతుండగా సూరజ్ వచ్చి దీపను హాస్పిటల్ కి తరలిస్తాడు. తల్లి ప్రాణాలు తీయాలని చూస్తే సూరజ్ కాపాడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Karthika Deepam Today Episode, Karthika Deepam Sept 12 Episode, Deepa accident Malini plan, Suraj saves Deepa, Star Maa Karthika Deepam]




