Home

»

Tv News

Ye Devi Varamo Neevu : కొత్త చెఫ్‌గా అంజలిని ఒప్పుకున్న గీత.. అసలు కారణమేంటో చెప్పేసిందిగా!

Sep 6, 2026 10:02AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-57 లో.. చాలా బాగా వంటలు చేసిందని.. అసలు ఈ కొత్త చెఫ్ ఎవరు పిలవండి అని గీత అనగానే మనీష్ టెన్షన్ పడతాడు. తప్పదు అంజలి రా అమ్మ అని భాను అనగానే అంజలి వస్తుంది. తనని చూసి గీత షాక్ అవుతుంది. అప్పటికప్పుడు చెఫ్ ఎక్కడ దొరుకుతుందని భాను టెన్షన్ పడుతుంటే నేనే అంజలి చేస్తుందని చెప్పానని రత్నం చెప్తుంది. నీకు వంటలు నచ్చకపోతే వంట మనిషి నచ్చకపోతే మార్చేద్దామని భాను అనగానే ఇంత బాగా వంటలు చేస్తే ఎందుకు వద్దంటాను.. అమ్మ మీద కోపం భోజనం మీద చూపించొద్దని గీత అంటుంది.

జయమ్మకి ఎంత శాలరీ ఇస్తున్నారో దానికంటే పదివేలు ఎక్కువ ఇవ్వండి అని గీత చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అంజలి లోపలికి వెళ్లి అమ్మ నా వంటలు మెచ్చుకుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ నిన్ను వంటమనిషిని చేశారని రత్నం ఫీల్ అవుతుంది. మరోవైపు అసలు అంజలిని క్షమిస్తావని అనుకోలేదు గీత అని భాను అంటాడు. నేను తనని క్షమించానని ఎవరు చెప్పారు.. తను ఒక పనిమనిషి.. తన స్థాయి అదే అని జీతం ఇస్తూ మరీ గుర్తుచేయాలనుకున్నానని గీత చెప్తుంది. తన అసలు ఉద్దేశాన్ని బయటపెడుతుంది గీత.

మరోవైపు అంజలికి రాకీ క్షమాపణ చెప్తాడు. నీతో అలా మాట్లాడినందుకు సారీ అంజలి.. నాకు ఎలా మాట్లాడాలో తెలియదని రాకీ అంటాడు. నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి.. అది ఇక్కడ కాదు టెర్రస్ పైకి రా అని చెప్పి వెళ్తాడు. ఛీ వీడు మారడు అని అంజలి అనుకుంటుంది. తర్వాత అంజలి కిచెన్ లోకి వెళ్లేసరికి మనీష్ టీ పెట్టుకుంటాడు. ఏం చేస్తున్నావ్..  కిచెన్ లోకి రావాలంటే నా పర్మిషన్ ఉండాలని అంజలి అంటుంది. నువ్వు గ్రేట్ అంజలి, అత్తయ్య నిన్ను వంట చేయడానికి ఒప్పుకుందని మనీష్ చెప్తాడు. తరువాయి భాగంలో గీత తన పిల్లలకు గోరింటాకు పెడుతుంది కానీ తను పెట్టుకోకుండా నిద్రపోతుంది. దీంతో అంజలి చూసి నిద్రపోతున్న గీతకు గోరింటాకు పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Ye Devi Varamo Neevu Today Episode, Ye Devi Varamo Neevu Episode 57, Ye Devi Varamo Neevu September 6 Episode, Star Maa Ye Devi Varamo Neevu, Ye Devi Varamo Neevu Written Update, Anjali as Chef, Geetha Master Plan, Telugu Serial Today update] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com