Home

»

Tv News

Godhavari : గుడిలో జానూని మెచ్చిన శివరామకృష్ణ, పార్వతి.. వాళ్ళెవరంటే!

Sep 6, 2026 9:51AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-105 లో ..శివరామకృష్ణ, ఆయన భార్య పార్వతి ఇద్దరు గుడికి వస్తారు. ఎండకొడుతుందని శివరామకృష్ణ తన భార్యకు గొడుగుపడితే గుడికి వచ్చి గొడుగు పడతారా.. నేనేం కందిపోను అంటుంది పార్వతి. అయినా పర్వాలేదు అంటాడు శివరామ్. అప్పుడే పార్వతి కాలు బెణకగా.. భార్య కాలు పట్టుకుని మసాజ్ చేస్తాడు. వద్దండీ మీరు నా కాళ్లు పట్టుకోవడం ఏంటని అంటుంది పార్వతి. వాళ్లు అలా మాట్లాడుకోవడం జాను చూస్తుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావని పార్వతి అడగగా మీరిద్దరూ నిజమైన దంపతుల్లా ఉన్నారని అంటుంది జాను. దిష్టి పెట్టకు అని పార్వతి అనగా నావేం దిష్టి కళ్లు కావని జాను అంటుంది. 

ఆ తర్వాత జాను గుడి లోపలికి వెళ్లి.. తన చెల్లి బాగుండాలని అర్చన చేయిస్తుంది. ఈ రోజుల్లో కూడా ఇంత సంప్రదాయంగా గుడికి వచ్చే అమ్మాయి ఉండడం గ్రేట్ అని ఆ దంపతులు అనుకుంటారు. అసలు మన మనవడికి పెళ్లి ఆలోచన ఎందుకు రావడం లేదని బాధపడతారు. ఆ తర్వాత పార్వతి, శివరామ్ పూజారి దగ్గరకు వెళ్లి అర్చన చేయిస్తూ.. ఆ అమ్మాయి ఏం కోరుకుంది అని అడుగుతారు. వాళ్ల చెల్లికి ఆరోగ్యం బాలేదట.. వాళ్ల అక్క కాపురం బాగుండాలని కోరుకుందని పూజారి చెప్పగానే ఈ రోజుల్లో కుటుంబం గురించి ఆలోచించే వాళ్లు ఎవరు ఉన్నారని పార్వతి అంటుంది. మన మనవడికి అలాంటి అమ్మాయి వస్తే బాగుండు అని పార్వతి అనగానే అలాంటి అమ్మాయి అంటే అదే అమ్మాయినా అని శివరామ్ అంటాడు. అంతా దేవుడి దయ అని పార్వతి అంటుంది.

ఆ తర్వాత జాను తన ఫ్యామిలీతో సరదాగా జోక్స్ వేస్తూ నవ్వుకుంటుంది. కిన్నెర ఆపరేషన్ అయ్యాక బొటిక్ పెడదామని నందుతో జాను చెప్తుంది. ఇల్లు కావాలన్నారు కదా దొరికిందని బ్రోకర్ జానూకి ఫోన్ చేస్తాడు. తరువాయిభాగంలో గుడిలో ఒకతను జానూని ఢీ కొట్టడంతో, చూసుకోవా అంటూ జానూ కోప్పడుతుంది. ఈ ఆడవాళ్లు ఏం తెలియకుండా వాగుతూనే ఉంటారు.. అందుకే నాకు నచ్చదని అతను పొగరుగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Godhavari Today Episode, Godhavari Serial Episode 105, Godhavari September 6 Episode, Star Maa Godhavari Serial, Godhavari Written Update, Janu Godhavari Serial, Godhavari Serial Today Story, Telugu Serial Godhavari]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com