స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -771 లో....జ్యోత్స్న తన బాధను చెప్పుకుని సూరజ్ మనసు మార్చాలని ధైర్యం చేసి కలిస్తే, ప్రేమ కంటే తనకు పగే ఎక్కువ అని తెగేసి చెప్పి దూరం పెట్టేస్తాడు సూరజ్. సూరజ్ ని దీప, కార్తీక్ ఇద్దరు కలుస్తారు. నాతో ఏం మాట్లాడాలని సూరజ్ అనగా..మిమ్మల్ని జ్యోత్స్న పంపించింది.. ఆల్రెడీ ఆమెకు చెప్పాను కదా అని సూరజ్ అంటాడు. దానికి కార్తీక్.. ఒక ఆడపిల్లని ప్రేమ పేరుతో మోసం చేశావ్.. అనాథ అని డ్రామా ఆడించావ్.. మాలిని కొడుకువని తెలిశాక మైండ్ తిరిగిపోయిందంటూ కార్తీక్ నిలదీస్తాడు. ఇది మోసం కాదు, మా అమ్మ చూపించిన దారి అని సూరజ్ అంటాడు.
జ్యోత్స్న ఫ్యామిలీ మొత్తం బాధలో ఉంది, న్యాయం చేయాలని కార్తీక్ అనగా.. నేను నా తల్లి కోసమే చేశాను, నా తల్లి కోసమే చేస్తానని సూరజ్ అంటాడు. ప్రతీకారంతో ఆడపిల్లని నమ్మించి మోసం చేయడం మగతనం అనుకుంటున్నావా అని కార్తీక్ అంటే మీ నాన్న చనిపోవడానికి మీ అత్తే కారణమని జ్యోత్స్న జీవితాన్ని నాశనం చేశావ్.. మరి నీ తల్లి కారణంగా నా తల్లి కాళ్లు పోయాయి కాబట్టి నన్ను కూడా ప్రతీకారం తీర్చుకోమంటావా అని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. అప్పుడు సూరజ్.. మీ అమ్మ కాళ్లు మాత్రమే పోయాయి కానీ మీ మామయ్య చేసిన తప్పుకి మా నాన్న ప్రాణాలే పోయాయి.. మా అత్త మనసు మార్చి పెళ్లి చేసుకున్నది మీ మామయ్య కాదా.. మా అత్తని మాకు శత్రువుగా మార్చారని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
నా తండ్రిని నాకు దూరం చేసే హక్కు సుమిత్ర అత్తకు ఎవరు ఇచ్చారు.. నన్ను తండ్రి లేని వాడిని చేశారు.. నేను పడ్డ బాధ ముందు మీరు పడ్డ బాధ కౌంట్ లోకి రాదంటూ సూరజ్ బాధను వెళ్లగక్కుతాడు. దీంతో కార్తీక్.. నేను వచ్చింది నీ తల్లి కోసమో, నా తల్లి కోసమో కాదు, జ్యోత్స్న కోసం.. నువ్వు నాణేనికి అటు ఉంటే నేను ఇటు ఉన్నాను.. ఇద్దరి జీవితాలు ఒకేలా ఉన్నాయి. నువ్వు మోసగాడివే అయితే తాళి కట్టి ఈ ఇంటికి తీసుకొచ్చి నరకం చూపించేవాడివి కానీ నువ్వు అలా చేయలేదు అంటే నువ్వు జ్యోత్స్నని నిజంగానే ప్రేమించావ్. కొన్ని ప్రేమలు పగల్ని జయిస్తాయి.. మీ ప్రేమే మిమ్మల్ని కలుపుతుందంటూ చెప్పి దీపతో వెళ్లిపోతాడు కార్తీక్. ఇక కార్తీక్ మాట్లాడిన మాటల్ని మాలిని వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Karthika Deepam 2 Today Episode, Karthika Deepam 2 September 5 Episode, Karthika Deepam 2 Written Update, Star Maa Karthika Deepam 2, Suraj Jyotsna Love Story, Karthik Deepa Meet Suraj, Malini Revenge Truth, Telugu Serial Today Episode]




