
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవుYe Devi Varamo Neevu. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 65 లో మనీష్ కాలేజ్ యూనిఫామ్ డిజైనింగ్ పనిలో బిజీగా ఉంటాడు. తన ఆంటీ అడిగిన డిజైన్స్ ని ఫైనల్ చేయడానికి ట్రై చేస్తుండగా అంజలి వచ్చి హెల్ప్ చేస్తుంది. ఇద్దరూ కలిసి స్కెచెస్ డిస్కస్ చేసుకుంటూ ఫైనల్ డిజైన్స్ రెడీ చేస్తారు. వాళ్లిద్దరి ఐడియాస్ కలవడంతో వర్క్ త్వరగా పూర్తవుతుంది. ఇదే ఛాన్స్ అని వాడుకుని అంజలి తన మనసులో మాట మనీష్ కి చెప్తుంది రోహిత్ కి రాఖీ కట్టాలని కోరిక అని అంజలి చెప్పడంతో మనీష్ షాక్ అవుతాడు. వెంటనే సపోర్ట్ చేస్తానని మాట ఇస్తాడు.
మరోవైపు అంజలి కోసం రేవతి బాధపడుతుంటే వాళ్ల అమ్మ ఓదారుస్తుంది. అప్పుడే తము ఫాలో అయ్యే కృష్ణజ లైవ్ పెట్టిందని చూస్తుండగా లైవ్ లో రేవతికి అంజలి కనిపిస్తుంది. మా అక్క అని రేవతి చెప్పగానే.. నేను తర్వాత కృష్ణజకి కాల్ చేస్తాను, అడ్రస్ తీసుకుని వెళ్దామని వాళ్ల అమ్మ అనగానే రేవతి సరే అంటుంది. ఇంట్లో రాఖీ పండగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. మనీష్, రాకీలకి ప్రీతి రాఖీ కడుతుంది. ఆ తర్వాత కృష్ణ, భవిత ఇద్దరూ రోహిత్ కి రాఖీ కడతారు. గీతా వాళ్లకు గిఫ్ట్స్ ఇస్తుంది. మనీష్ కూడా వాళ్ల చెల్లికి గిఫ్ట్ ఇస్తాడు. ఆ తర్వాత అంజలి వంక చూసి తను అనుకున్నది చేయాలని మనీష్ సైగ చేశాడు.
వెంటనే మనీష్ నానమ్మ మీద రివర్స్ డ్రామా ప్లే చేస్తూ.. ఎందుకు హామీలు ఇస్తావ్ అన్నాడు.. ఏం హామీ ఇచ్చింది రా అని గీతా అడగ్గా.. నువ్వు కోప్పడను అంటే చెప్తానని మనీష్ అంటాడు. తరువాయి భాగంలో అంజలి చాలా ఎమోషనల్ గా రోహిత్ కి రాఖీ కట్టడానికి వస్తుంది.. సరిగ్గా రాఖీ కట్టబోతున్న టైమ్ లోనే గీతా.. ఆగు అంటూ అడ్డుకుంటుంది. దీంతో ఇంట్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. గీతా అలా ఎందుకు ఆపిందోనని అందరు షాక్ అవుతారు. అంజలి రాఖీ కడుతుంటే రోహిత్ ని అక్కడ నుంచి గీత లాక్కెళ్లిపోవడంతో అంజలి ప్లాన్ కి బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






