
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 113 లో....జాను పూజ చేసి కిన్నెరతో దేవుడికి దండం పెట్టించి హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి రెడీ అవుతారు. కిన్నెర.. నాకు ఆపరేషన్ చేస్తారా, కత్తులతో కోసేస్తారా అని భయపడుతూ అడగ్గా అందరూ ఎమోషనల్ అవుతారు. అలా ఏం లేదు, ఇంజక్షన్ వేస్తారు అంతే అని చెప్పి నవ్వించి హాస్పిటల్ కి తీసుకెళతారు. బయటకు వెళ్లేటప్పుడు శివుడు, పారులు పాపకి ధైర్యం చెప్తారు. నందు.. బావ నువ్వు జాను వెళ్లి డబ్బు తీసుకురండి అంటే మురళీ.. నేను వెళ్తాలే అని అంటాడు. నందు కొంత డబ్బే తీసుకురా అంటే మురళీ మొత్తం తెస్తే బెటర్ అని చెప్పి బయల్దేరతాడు. ఇంట్లో బామ్మ, గౌతమి ఉండిపోయారు.
జాను, నందు, శారద పాపని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి అడ్మిట్ అవుతారు. చిన్న ప్రాబ్లమ్ కి ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు అని కిన్నెర అడగ్గా.. నువ్వు చిన్నపిల్లవి కదా అందుకే అని చెప్తారు. డాక్టర్ పాపని చెక్ చేసి.. ఫారెన్ డాక్టర్ లక్కీగా వచ్చారు, ఆయన్ని రప్పించాను, డబ్బు వెంటనే కట్టేయండి లేట్ చేయొద్దని అంటుంది. మా బావ వెళ్లారు వస్తారని జాను చెప్పినా నందు.. బావ ఇంకా రాలేదు, నాకు బావ తెలివితేటల మీద నమ్మకం లేదని అంటుంది. వస్తాడులే అని జాను బయటకు చెప్పినా మనసులో.. బావ ఇంకా రాలేదేంటని కంగారుపడుతుంది. ఇంట్లో పారు కళ్లు తిరిగి పడిపోవడంతో శివుడు, రమణి కంగారుపడి సంజుకి కాల్ చేస్తారు.
మురళీ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకుని వస్తుంటే ఓ పెద్దాయన.. డ్రాప్ చేయమని బతిమాలడంతో స్కూటీ ఎక్కించుకుంటాడు. ఆ తాత లూప్ ఏరియాకి తీసుకెళ్లి రౌడీలకు అప్పగిస్తాడు. రౌడీలు.. నువ్వు చెప్పిన చోటుకి తెచ్చా అని తాత డబ్బు తీసుకోగా.. మురళీ దగ్గర ఆపరేషన్ డబ్బు లాక్కుంటారు. బ్యాగ్ ఇచ్చేయండిరా, చిన్న పిల్ల ఆపరేషన్ అని మురళీ ఎంత బతిమాలినా వినకుండా రక్తాలు వచ్చేలా దారుణంగా కొట్టి పడేస్తారు. జాను ఫోన్ చేయడానికి బయటకు రాగా హాస్పిటల్ మెట్ల మీద ఒంటి నిండా గాయాలతో మురళీ కూర్చుని ఉండటం చూసి షాక్ అవుతుంది జాను. ఏమైంది బావ, డబ్బులు ఏవి అని అడగ్గా మురళీ ఏడుస్తూ.. నాకేం కాలేదు జాను అని మురళి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






