Home

»

Tv News

Jayam serial : బాలకృష్ణ స్పృహలోకి.. ప్రీతికి నార్మల్ డెలివరీ చేసిన గంగ!

Sep 16, 2026 10:02AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్374లో వీరుని తీసుకురావడానికి పెద్దసారు, రుద్ర వెళ్తారు. నేను రాను, తప్పు చేశానని నింద వేశారు.. ఏ మొహం పెట్టుకుని రావాలని వీరు అంటుంటే రుద్ర కోప్పడటంతో బయటకు రావడానికి సరేనని అంటాడు. ఆ తర్వాత పెద్దసారు లాయర్ తో మాట్లాడుతుంటే రుద్ర, వీరు ఒక పక్కకి వచ్చి ఛాలెంజ్ విసురుకుంటారు. మరోవైపు బాలకృష్ణ స్పృహలోకి రావడం గంగ, రంగా చూస్తారు. దీంతో వెంటనే డాక్టర్ వేషం వేసుకుని బాలకృష్ణ దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అతను మాట్లాడుతుండగానే మళ్లీ స్పృహ కోల్పోతాడు.

 

అప్పుడే అసలు డాక్టర్లు వచ్చి‌. ఇంజక్షన్ వేశాం కాబట్టి అలా అప్పుడప్పుడు స్పృహలోకి వచ్చినట్టు మాట్లాడతారు, కానీ పూర్తిగా స్పృహలోకి రావడానికి టైం పడుతుందని చెప్పగానే గంగ, రంగా డిస్సపాయింట్ అవుతారు. మరోవైపు హాస్పిటల్ లో ప్రీతికి ఆపరేషన్ చేస్తుండగా ఆపరేషన్ థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ అవుతుంది. దీంతో అందరు భయపడి బయటకు వచ్చేస్తారు. ప్రీతి ఒక్కతే లోపల ఉండిపోతుంది. పరిస్థితి విషమించడంతో ప్రీతిని కాపాడటానికి గంగ ధైర్యంగా లోపలికి వెళ్తుంది. కాసేపటికి రుద్ర, వీరు వాళ్లు కూడా అక్కడికి వస్తారు‌. రుద్ర కూడా వాళ్లని కాపాడటానికి లోపలికి వెళ్తాడు.

 

గంగ, రుద్ర ప్రీతిని సురక్షితంగా బయటకు తీసుకొస్తారు. అయితే.. ఇప్పుడు ఆపరేషన్ చేయడం కష్టం, కరెంటు లేదని డాక్టర్ చెప్తుంది. దీంతో అక్కడ ఉన్న మగవాళ్లందరూ అడ్డుగా నిలబడతారు. గంగ తన సొంతంగా ప్రీతికి నార్మల్ డెలివరీ చేస్తుంది. ప్రీతికి బాబు పుట్టడంతో అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. బాలకృష్ణ నిజం చెప్పేలోపు మళ్లీ స్పృహ కోల్పోవడం, ప్రీతి ప్రసవం ఇలా ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com