.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 64లో.. మనీష్ వర్క్ చేస్తుంటే అంజలి అక్కడికి వస్తుంది. ఏం చేస్తున్నావని అడుగుతుంది. అత్తయ్య యూనిఫామ్ డిజైన్ చేయమంది అని మనీష్ చెప్తాడు. దాంతో.. నేను హెల్ప్ చేస్తానని అంజలి అంటుంది. సరేనని మనీష్ ఒప్పుకుంటాడు. యూనిఫామ్ డిజైన్ గురించి అంజలి చెప్తుంటే.. వావ్ బాగుందని మనీష్ మెచ్చుకుంటాడు. అంతా ఒకే కానీ ఒక చిన్న చేంజ్ చేయాలని అంజలి అంటుంది. ఏంటని మనీష్ అడిగితే..నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి.. ఏం లేదు నేను రోహిత్ కి రాఖీ కట్టాలి, నాకు తమ్ముడు లేడు కదా అని అంజలి అనగానే మనీష్ షాక్ అవుతాడు. అవసరం లేదు, నీ సాయమని మనీష్ కోపంగా అంటాడు. సరే అని అంజలి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరుసటి రోజు ఉదయం అంజలి దగ్గరికి మనీష్ వచ్చి.. ప్లీజ్ అంజలి ఆ ఒక్క చేంజ్ ఏంటో చెప్పమని రిక్వెస్ట్ చేస్తాడు. నాకు హెల్ప్ చేస్తాను అంటే చెప్తానని అంజలి అనగానే సరే చేస్తానని మనీష్ అంటాడు. యూనిఫామ్ పాకెట్ కి ఒక స్టార్ పెట్టు, రైసింగ్ స్టార్ లాగా ఉంటుందని అంజలి చెప్పగానే బాగుందని మనీష్ మెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఆ డిజైన్ ని గీతకి చూపిస్తాడు. వావ్ బాగుంది, స్టార్ అంటే రైసింగ్ స్టార్ అని అంజలి చెప్పినట్లే గీత కూడా చెప్తుంది. దాంతో మనీష్ ఆశ్చర్యంగా చూస్తాడు. నువ్వు వెళ్లి త్వరగా రెడీ అవ్వు, రాఖీ పండుగ మొదలు పెడదామని గీత అనగానే సరేనని మనీష్ వెళ్తాడు.
మరోవైపు రాత్రి.. నిన్ను హీరో చేద్దామని అనుకుంటే జీరో లాగా అత్తయ్యకి భయపడి వచ్చావని రోహిత్ తో రాకీ అంటాడు. మరోవైపు మీరు ఎలాంటి రాఖీలు కొన్నారని కృష్ణ, ప్రీతీని భవిత అడుగుతుంది. వాళ్లు చూపిస్తారు. నేను చాలా కాస్ట్లీ రాఖీ తీసుకున్నా, లక్ష రూపాయలు అని భవిత గొప్పగా చెప్తుంటే.. ఎంత కాస్ట్లీది కాదు.. ఎంత ప్రేమతో కట్టాము అన్నది ముఖ్యమని ప్రీతీ అంటుంది.తరువాయి భాగంలో రోహిత్ కి అంజలిని పిలిచి రాఖీ కట్టమని మనీష్ చెప్తాడు. అంజలి వచ్చి రాఖీ కడుతుంటే గీత ఆపేస్తుంది. రోహిత్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






