Home

»

Tv News

Godavari : సంజయ్ పెళ్లిచూపులు క్యాన్సిల్.. పార్వతి, శివరాం టెన్షన్!

Sep 15, 2026 12:03PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ గోదావరి. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 112 లో.. సంజయ్ పెళ్లిచూపులు చెడగొట్టుకున్నాడని పార్వతి, శివరాం బాధపడుతుంటారు. అది చూసి శేషు మనసులో.. నాకు కావాల్సింది కూడా ఇదేగా అని సంతోషపడతాడు. మరోవైపు సంజయ్ కి జరిగిన పెళ్లిచూపుల విషయాన్ని పెద్దావిడ జానూ వాళ్లకు చెప్తుంది. దాంతో జానూ నవ్వుతుంది. ఏమైందని శారద అడుగుతుంది.

 

ఏం లేదు.. ఏదో డేటింగ్ చేద్దాం అన్నాడట ఆ సంజయ్.. అందుకే అమ్మాయి వాళ్లకు కోపం వచ్చి వెళ్లిపోయారని పెద్దావిడ చెప్తుంది. అసలు డేటింగ్ అంటే ఏంటని శారద అమాయకంగా అడుగుతుంది. దాంతో నందు ఆమె చెవిలో డేటింగ్ అంటే ఏంటో చెప్తుంది. నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టమని రమణిని శేషు అడుగుతాడు. అమ్మా, నాన్న ఇంకా రాలేదు, వాళ్లు బాధపడుతున్నారని రమణి చెప్తుంది. వాళ్లు అలిగారు.. వాళ్లు అలిగితే నాకేంటని శేషు నిర్లక్ష్యంగా అంటాడు. అప్పుడే సంజయ్ వచ్చి.. పిన్నీ ఆకలిగా ఉంది, భోజనం పెట్టమని అంటాడు. రమణి భోజనం పెడుతుంది. కానీ అమ్మా, నాన్న భోజనానికి రాలేదని రమణి చెప్పగానే సంజయ్ తినకుండా లేచి వెళ్లి వాళ్లని బతిమాలుతాడు. వాళ్లు రామని చెప్పడంతో.. నేను కూడా తిననని సంజయ్ కోపంగా వెళ్లిపోతాడు. మరోవైపు నందు, మురళి గదిలోకి వస్తారు. మనకి ఇప్పుడు స్పెషల్ రూమ్ అవసరమా అని నందు కోప్పడుతుంది. నేను ఏం అనలేదని మురళి అంటాడు.

 

ఆ తర్వాత జాను బయట ఉన్న కృష్ణుడి విగ్రహం దగ్గర నిల్చొని తన తండ్రిని గుర్తుచేసుకుని బాధపడుతుంటుంది. అప్పుడే సంజయ్ అక్కడికి వచ్చి.. ఇక్కడ ఎందుకున్నావ్.. ఇది నేను ఉండే ప్లేస్ అని కోప్పడతాడు. మేం రెంట్ ఇస్తున్నామని జానూ అంటుంది. అవసరం లేదని చెప్పాను కదా, మళ్లీ ఏంటి ఇది అని సంజయ్ గట్టిగా అరుస్తాడు. వాడికి కాబోయే భార్య ఎప్పుడు వస్తుందోనని పార్వతి, శివరాం ఆలోచిస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com