
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 373లో.. రుద్రని విడిపించుకొని తీసుకురావాలని శకుంతల ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది. నేను నిన్ను ఎంత తిట్టినా అన్నీ భరించావ్.. ఒక తల్లి లాగా అనుకొని సర్దుకున్నావ్.. ఒక తల్లిగా అడుగుతున్నా వీరుని విడిపించుకొని తీసుకొని రా అని శకుంతల అంటుంది. దాంతో రుద్ర ఏం చేయలేక పెద్దసారుని తీసుకొని స్టేషన్ కి వెళ్తాడు. దాంతో శకుంతల లోలోపల నవ్వుకుంటుంది.
మరోవైపు గంగ డల్ గా ఉండడంతో.. ఏమైందని రంగా అడుగుతాడు. గంగ జరిగింది చెప్తుంది. వాడిని బావ మళ్లీ విడిపించుకొని రావడం ఏంటని రంగా అడుగుతాడు. ఆ తర్వాత గంగ దగ్గరికి ఇషిక వస్తుంది. గంగకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. ఇద్దరు గొడవ పడుతుంటే.. అప్పుడే శకుంతల వచ్చి ఇషికకి సైగ చేసి, గంగకి సపోర్ట్ గా మాట్లాడినట్లు యాక్టింగ్ చేస్తుంది. ఈ కుటుంబంలో ఎప్పుడూ గొడవలు పెట్టుకోవద్దు, అందరం కలిసి ఉండాలని చెప్తుంది. ఏంటి అత్తయ్య ఇంత సడెన్ గా మారిపోయారని గంగకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత రంగ దగ్గరికి వెళ్లి శకుంతల తనకి సపోర్ట్ గా మాట్లాడిందని చెప్తుంది. అత్తయ్య అలా మాట్లాడడం ఏంటని రంగా షాక్ అవుతాడు. అప్పుడే ఇద్దరు డాక్టర్లు.. రంగనాథం అసిస్టెంట్ బాలకృష్ణ సెమీ కోమాలో ఉన్నాడని మాట్లాడుకోవడం రంగా, గంగ విని షాక్ అవుతారు.
ఆ విషయం వెంటనే రుద్ర సర్ కి చెప్పాలని గంగ అనుకొని ఫోన్ చేసి రుద్రకి చెప్తుంది. అలా చెప్పడం ఇషిక విని.. ఓ మై గాడ్.. ఇప్పుడు అతను కూడా ఇదే హాస్పిటల్ లో ఉన్నాడా అని టెన్షన్ పడుతుంది. మరోవైపు వీరు దగ్గరికి పెద్దసారు వెళ్లి మాట్లాడతాడు. ఆ తర్వాత కాసేపటికి రుద్ర కూడా వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

