.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-61లో.. రోహిత్ బాధపడుతుంటే గీత వచ్చి..గట్టిగా తగిలిందా నాన్నా అని అడుగుతుంది. అసలు తప్పు నీదే, నేను సిగరెట్ కాల్చలేదని చెప్పాలి కదా అని భాను అనగా సారీ మమ్మీ అని రోహిత్ అంటాడు. ఆ తర్వాత రోహిత్ దగ్గరకు రాకీ వచ్చి.. తప్పు నీదే, అత్తయ్య ముందు భయపడి దొరికిపోయావని అనగా.. టైంకి అంజలి వచ్చి సేవ్ చేసిందని రోహిత్ అంటాడు. సేవ్ చేయాలనుకుంటే ముందే చేసేది..నిన్ను కొట్టాక సేవ్ చేసింది..ఇలాంటి వాళ్లకి ఏం కావాలో తెలుసా అంటూ రోహిత్ ను రాకీ రెచ్చగొడతాడు.
రాకీ చెప్పినట్లు అంజలి దగ్గరికి రోహిత్ వెళ్లి.. థాంక్స్ అంటూ డబ్బు ఇవ్వగా అంజలి తీసుకోకుండా బాధపడి వెళ్లిపోతుంది. మరోవైపు ప్రీతికి భవిత తన దగ్గర ఉన్న లగ్జరీ ఐటమ్స్ చూపించడంతో ప్రీతి అక్కడి నుండి వెళ్లిపోతుంది. రోహిత్ కి కట్టడానికి అంజలి రాఖీ కొనుక్కుని వస్తుంది. ఈ రాఖీ ఎలాగైనా రోహిత్ కి కట్టేలా నువ్వే చేయాలని రత్నంను రిక్వెస్ట్ చేస్తుంది అంజలి. దానికి రత్నం.. మనీష్ తో మాట్లాడి సెట్ చేస్తా అని చెప్తుంది.
ప్రీతి కోపంగా మనీష్ దగ్గరికి వచ్చి.. భవితకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, మన దగ్గర ఎందుకు లేవు అని అడగుతుంది. అత్తయ్య రిచ్, మనం కాదు, నేను ఒక్కడినే జాబ్ చేస్తున్నా.. నువ్వు జాబ్ తెచ్చుకుని నీకు నచ్చినట్లు ఉండు.. భవితను చూసి జెలస్ గా ఫీల్ అవ్వకని మనీష్ చెప్తాడు. ఆ తర్వాత అంజలి దగ్గరికి రాకీ వచ్చి.. రేపు గండిపేట చెరువు దగ్గరికి రమ్మని పిలువగా ఇలా ఇబ్బంది పెడితే మీ అత్తయ్యకి చెప్తానని అంజలి వార్నింగ్ ఇచ్చింది. దీంతో రాకీ కోపంగా.. నాకే వార్నింగ్ ఇస్తావా.. నువ్వు ఒంటరిగా దొరకాలి.. అప్పుడు నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తానని మనసులో అనుకుంటాడు. చివర్లో రోహిత్ చేత ఇప్పించడానికి గీత భవితకి నెక్లెస్ కొని భానుకి చూపించడం దాన్ని రాకీ చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
