Home

»

Tv News

Godhavari : పార్వతి కోసం షాంపూ రెడీ చేసిన శివరాం..జానూకి సంజయ్ వార్నింగ్!

Sep 11, 2026 11:19AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గోదావరి'Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 109 లో ఎమోషనల్ సీన్స్ తో పాటు టెన్షన్ కూడా నడిచింది. పార్వతి కోసం శివరాం ఇంట్లోనే స్వయంగా షాంపూ రెడీ చేయడం చూసి జాను ముచ్చటపడుతుంది. మిమ్మల్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది.. మీకు అసలు గొడవలు రావా అని జాను అడుగుతుంది.‌ఎందుకు రావు, వస్తాయి. ఫస్ట్ నేను మగాడిని అన్న అహంకారం ఉండొద్దని శివరాం చెప్తాడు. జానూ వాళ్లతో మాట్లాడి తిరిగి వెళ్తుంటే సంజయ్ డాష్ ఇస్తాడు. జానూ సారీ చెప్పగా మీరు కూడా డాష్ ఇచ్చారు కదా..‌మీరు సారీ చెప్పడం లేదని జానూ అడుగుతుంది. నిన్ను అసలు ఎవరు ఇక్కడికి రానిచ్చారని సంజయ్ కోప్పడతాడు.

ఆ తర్వాత జాను వాళ్లు సామాను అంతా షిఫ్ట్ చేస్తుండగా శివరాం చిన్నకూతురు శేషు భార్య రమణి వచ్చి వాళ్లతో మాట్లాడుతుంది. మరోవైపు సింహాద్రిని కొట్టినందుకు సంజయ్ దగ్గరికి మురళి వెళ్లి.. థాంక్స్ బ్రో అని షేక్ హ్యాండ్ ఇవ్వబోతే సర్ అని పిలువు అని కోపంగా వెళ్లిపోతాడు సంజయ్. ఎందుకు బావా నువ్వు అతని దగ్గరికి వెళ్లావని నందు కోప్పడుతుంది.

జాను ఏదో రాస్తుండగా మురళికి ఫోన్ వస్తే జాను లిఫ్ట్ చేస్తుంది. అవతల సూర్య ఉండటంతో.. గోదారి అమ్మాయి అని సూర్య అనగానే జాను ఎమోషనల్ అవుతుంది. అప్పుడే నిత్య వచ్చి.. బావా మన ఇంటికి వెళ్దాం పదా అనడంతో ఆ మాటలు విని జాను ఫోన్ కట్ చేస్తుంది. ఎందుకు వచ్చావని నిత్యపై సూర్య సీరియస్ అయ్యాడు. తరువాయిభాగంలో పెద్దావిడ అనుకోకుండా చెంబు కింద పడేయడంతో సౌండ్ విని సంజయ్ వచ్చి.. ఇక్కడ ఉండాలంటే సౌండ్ చేయొద్దు.. లేదంటే ఇప్పుడే ఖాళీ చేయండి అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com