.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 370లో సంచలన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. శకుంతల కుటుంబం పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడే వీరు కూడా ఇంటికి వస్తాడు. ఏంటి బావా పెళ్లికి రాలేదని సూర్య అడగ్గా.. ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయ్యిందని వీరు చెప్తాడు.
ఇంతలో పెద్దసారుకి గంగ నుంచి ఫోన్ వస్తుంది. ప్రీతిని హాస్పిటల్‌కి తీసుకొచ్చామని చెప్తుంది. దీంతో అందరు హడావిడిగా హాస్పిటల్‌కి బయలుదేర్తారు. అదే సమయంలో పోలీసులతో రుద్ర అక్కడికి వస్తాడు. ఏంటి రుద్రా.. పోలీసులు ఏంటని పెద్దసారు అడగ్గా వీరుని అరెస్ట్ చేయించడానికి అని రుద్ర చెప్పగానే అందరు షాక్ అవుతారు.రామనాథంని చంపింది మన వీరే. అతని అసిస్టెంట్ ఈ విషయం చెప్పాడని రుద్ర అంటాడు. దీంతో అందరు రుద్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వీడి గురించి మీకు తెలియదు పెద్దనాన్న.. ఇన్ని రోజులు ప్రీతి కోసం ఓపిక పట్టానని రుద్ర అంటాడు. అక్కడ ప్రీతి అడిగితే ఏం చెప్తావని శకుంతల కోప్పడుతుంది. ప్రీతికి వీడి గురించి తెలియాల్సిన అవసరం లేదని రుద్ర సమాధానమిస్తాడు. ఎవరో చెప్పింది విని ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నయ్య. వాళ్లు అబద్ధం చెప్పి ఉంటారని సూర్య అంటాడు. రుద్ర చెప్పిన వ్యక్తి ఇప్పుడు కోమాలో ఉన్నాడని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు.
ఇన్‌స్పెక్టర్ మీరు అరెస్ట్ చేయండి అని రుద్ర అనగానే పోలీసులు వీరుని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. పదండి పెద్దనాన్న హాస్పిటల్‌కి అని రుద్ర అనగా ఏ మొహం పెట్టుకొని వస్తావ్? నువ్వు రావడానికి వీలు లేదు. నువ్వు వీరుని తీసుకొస్తేనే అక్కడికి రా అని శకుంతల కోపంగా చెప్పి వెళ్లిపోతుంది.ఆ తర్వాత అందరు హాస్పిటల్‌కి వెళ్తారు. ఆయన ఎక్కడ.. అన్నయ్య ఎక్కడ అని ప్రీతి అడుగుతుంది. వస్తారని పెద్దసారు చెప్తాడు.
నాకు నమ్మకం లేదు. వీరుని రుద్ర బయటకు తీసుకొస్తాడని శకుంతల అనగా ఏంటి అమ్మగారు అని గంగ అడుగుతుంది. నాటకాలు ఆడకు గంగా. మీకు మొదటి నుంచి వీరు అన్నయ్య అంటే కోపమని ఇషిక అంటుంది. మరోవైపు.. ప్రీతి కోసం అయినా వాడిని విడిపించాలని రంగాతో గంగ అంటుంది. ఇదిలా ఉండగా రుద్ర ఏదో ఆలోచిస్తంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
