Ye Devi Varamo Neevu: అంజలిని అవమానించిన భవిత... శంకర్ ప్లాన్ ఏంటంటే!
Nov 24, 2026 8:55AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -123 లో అంజలి పొద్దున లేచి ఇంటి ముందు పెద్ద ముగ్గు వేస్తుంది. తను లంగా ఓణీ వేసుకొని ముగ్గు వేస్తూ ఉంటే మనీష్ చూసి తనని ఒక ఫోటో తీస్తాడు. ముగ్గు చూసి కృష్ణజ, ప్రీతీ బాగుందని చెప్తారు. ఎవరు నేర్పారు మీ అమ్మానా అని కృష్ణజ అడగడంతో అంజలి అమ్మ గురించి గుర్తు చేసుకొని బాధపడుతుంది. అప్పుడే భవిత వచ్చి తనని వాళ్ల అమ్మ వద్దని అనుకుంది.. అందుకే అలా వదిలేసిందని అనడంతో అంజలి బాధపడుతూ పక్కకి వెళ్తుంది. ఎందుకు అలా బాధపడేలా మాట్లాడుతావని భవితపై ప్రీతీ సీరియస్ అవుతుంది. ఆ తర్వాత అంజలి దగ్గరికి మనీష్ వచ్చి భవిత మాటలు పట్టించుకోకని చెప్తాడు.
మరోవైపు రాకీ ఒక హోటల్ కి వెళ్లి అంజలి మీద కోపంతో ఎక్కువ కారం ఉన్న టిఫిన్ తింటాడు. మరోవైపు ముత్యాల రాజు స్టేషన్ లో ఉంటాడు. తనని వదిలేయమని పోలీస్ ని రిక్వెస్ట్ చేస్తాడు అయినా వాళ్లు పట్టించుకోరు. ఆ తర్వాత కమల, శంకర్ వాళ్లు గీత దగ్గరికి వచ్చి ఒక శుభకార్యం గురించి మాట్లాడాలని అంటారు. అయ్యగారు ఇప్పుడు వద్దు ఈరోజు అమావాస్య కదా అని అంజలి అంటుంది. అవునని గీత అంటుంది.
అంజలి దీపావళి గురించి తిథి, నక్షత్రం గురించి చాలా బాగా అందరికీ చెప్తుంది. అన్ని పనులు పూర్తయ్యాయి అమ్మగారు అని అంజలి చెప్తుంటే ఎందుకు అంత సంతోషమని గీత అడుగుతుంది. ఇన్ని రోజులు కుటుంబం అంటే ఏంటో తెలియదు.. ఇప్పుడు మీ మధ్య పండుగ జరుపుకుంటుంటే చాలా హ్యాపీగా ఉందని అంజలి అంటుంది. నువ్వు ఇంట్లో మనిషివి కాదు పనిమనిషివి అని శంకర్ అనగానే అంజలి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




