TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Illu Illalu Pillalu: ఇంట్లో వాళ్లకి సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన నర్మద, ధీరజ్!

Nov 24, 2026 8:45AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -638 లో.....నర్మద కంగారుగా వల్లీ పుట్టింటికి వెళ్లి ఏమైందని అడగగా, వల్లీ ఎంతో సంతోషంగా నర్మదను హగ్ చేసుకుని తన పొట్టపై చేయి పెట్టి తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇంత పెద్ద గుడ్ న్యూస్ ఇంత లేటుగా చెప్తావా అక్క అంటూ నర్మద సంబరపడిపోతుంది. ఈ విషయం మొదట నీకే చెప్పాలని ఫోన్ చేశానని, నువ్వు తర్వాత చేస్తా అన్నావని వల్లీ అంటుంది. అంతేకాదు భర్తకు కాల్ చేస్తే బిజీ వచ్చిందని, కాల్ బ్యాక్ కూడా చేయలేదని అంటుంది. ఇంటికి వెళ్లి చెప్తే ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదని, అందుకే ముందు నీకు చెప్పానని వల్లీ తన మనసులోని భయాన్ని బయటపెడుతుంది. 

అత్తామామలకు చెప్పాలి, అసలే దీపావళి పండగ, ఈ విషయం తెలిస్తే అందరు సంబరపడతారని వల్లీని ఇంటికి రమ్మని బతిమాలుతుంది నర్మద. అయితే వల్లీ మాత్రం ఇప్పుడు వెళ్తే బిడ్డను అడ్డం పెట్టుకుని వచ్చిందని అందరు అనుకుంటారని, తను మారానని గుర్తించి క్షమించిన తర్వాతే వస్తానని చెప్తుంది.ఎవరో ఒకరు అలా అంటే ఆ మాటలు పడలేనని, బావ కూడా క్షమించరని వల్లీ ఆవేదన చెందుతుంది. నువ్వు మారావని నేను నమ్మాను, నేను నమ్మానంటే అందరిని నమ్మించగలనని నర్మద ధైర్యం చెప్పి ఇక్కడే పండగ చేసుకుందామని అంటుంది. వెంటనే నర్మద ధీరజ్ కు కాల్ చేసి ధీరజ్ బాబాయ్ అంటూ సంతోషంగా మాట్లాడుతుంది. ధీరజ్ మొదట కంగారుపడి వదినా అంటే ప్రేమతో గొడవపడి బ్రెయిన్ లెస్ అయ్యావా అని నర్మద సరదాగా అంటుంది. తను కాదు, మీ పెద్ద వదిన వల్లీ ప్రెగ్నెంట్ అని చెప్పగానే ధీరజ్ సూపర్ అంటూ చాలా హ్యాపీ అయిపోతాడు. ఇంట్లో అందరికి సర్ ప్రైజ్ చేద్దామని ఇద్దరు ప్లాన్ చేసుకుని, వల్లీని హాస్పిటల్ కు తీసుకెళ్లి స్కాన్ చేయించి తీసుకొస్తానని చెప్తుంది.

మరోవైపు ప్రేమ పండగ అని ట్రావెల్స్ దగ్గర పని సర్దేసి త్వరగా ఇంటికి వెళ్దామని ధీరజ్ తో చెప్తుంది. పండగ రోజు ఎక్కువ బిజినెస్ చేయాలని ధీరజ్ అన్నా చివరకు ఒప్పుకున్నాడు. ధీరజ్ సంతోషం ఆపుకోలేక ప్రేమను గిరగిరా తిప్పేస్తూ ఇంటికి వెళ్లిన తర్వాత నీకు పెద్ద సర్ ప్రైజ్ ఉందని, చాలా క్రాకర్స్ కొనాలని అన్నాడు. ఇక అంజలి ఇంటి ముందు దీపాలు పెట్టి దీపావళి ప్రారంభించగా చందు స్వీట్స్, క్రాకర్స్ తీసుకుని వచ్చి అంజలిని చూసి ఫిదా అయిపోతాడు. అంజలికి ఇష్టమైన స్వీట్స్ గుర్తుపెట్టుకున్నావా అని అంజలి సంబరపడగా, ఇద్దరూ కలిసి క్రాకర్స్ కాలుస్తూ సంతోషంగా గడుపుతారు. ప్రేమ ఇంటి బయట దీపాలు వెలిగిస్తుంటే ధీరజ్ అందంగా ఉన్నావని పొగడటం, తిరుపతి, సుకన్య క్రాకర్స్ కోసం గొడవపడటం, అమూల్యకు విశ్వ వీడియో కాల్ చేయడం అన్నీ పండగ వాతావరణాన్ని తెచ్చాయి. చివర్లో ధీరజ్ ఇంట్లో అందరికి నర్మద వదిన సర్ ప్రైజ్ ఇస్తుందని చెప్పి అందరిని క్రాకర్స్ కాల్చమనగా, సరిగ్గా అదే సమయంలో వల్లీని తీసుకుని నర్మద ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img