TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Podarillu Serial: మహాని ఆటపట్టించిన చక్రి.. విక్కీ ఏం చేయనున్నాడు!

Nov 24, 2026 8:59AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-268లో...నారాయణ మహాకు సేవలు చేస్తూ పాత బండి వద్దని చక్రితో వెళ్లాలని చెప్తాడు. మరోవైపు మాధవ, మనీషా కాఫీ డేట్ కు వెళ్తే చక్రి ఫాలో అయి వాళ్ల పొదుపు మాటలు విని తల పట్టుకుంటాడు. ఇంటికి వచ్చాక కేశవకు డేట్ గురించి చెప్తుండగా మహా వచ్చి ముగ్గురికి క్లాస్ పీకుతుంది. మాధవ తెచ్చిన బిర్యానీ, మనీషా ఇచ్చిన షర్ట్ చూసి తమ్ముళ్లు ఆటపట్టిస్తే మహా అడ్డుపడి కాపాడుతుంది.

మహా యాక్సిడెంట్ విషయం నారాయణ చెప్పగానే చక్రి, కేశవ, మాధవ కంగారుపడి హాస్పిటల్, బ్యాండేజ్, కారు అంటూ హడావిడి చేస్తారు. మీరు తిడితే అమ్మ తిట్టినట్లు ఉంటుందని కేశవ అనడంతో మహా ఎమోషనల్ అవుతుంది. చక్రి ఆమెకు బ్యాండేజ్ వేసి ఈఎంఐలో కొత్త బండి తీసుకుంటానని చెప్తాడు. ఆ తర్వాత చక్రి మ్యాట్రిమోనీ సైట్ లో కనకతార అనే అమ్మాయి దొరికిందని, మొదటి భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చారని అడుగుతోందని చెప్పి మహాను అసూయపడేలా చేస్తాడు. నిజానికి కోతి ఫొటో చూస్తూ అలా చెప్పి మహాకు తనపై ఇంకా ప్రేమ ఉందని మురిసిపోతాడు.

మరోవైపు ఆఫీసు పని చేస్తున్న మహాను చూసి మీ విక్కీ అర్ధరాత్రి వరకూ పని చేయిస్తున్నాడని చక్రి అంటే, మా విక్కీ చాలా మంచోడని మహా సపోర్ట్ చేస్తుంది. మరుసటి రోజు ఆఫీసులో లక్కీ తన ల్యాప్ టాప్ ఆటోలో మరచిపోవడంతో విక్కీ క్లైంట్ ప్రాజెక్ట్ విషయంలో అందరి ముందే ఆమెను అవమానించేలా తిడతాడు.దీంతో లక్కీ బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img