Ye Devi Varamo Neevu : అంజలికి ప్రపోజ్ చేసిన రాకీ..వరలక్ష్మీ వ్రతంలో అసలు ట్విస్ట్!
Aug 30, 2026 10:22AM
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-50లో ఏం జరిగిందంటే...మనీష్ వాళ్ళు లగేజ్ తో గీత ఇంటికి వస్తారు. గీత కొడుకు గదిలోకి రాకీ వెళ్తాడు. ఒరేయ్ బామ్మర్దీ, అంజలి ఎక్కడరా.. అసలు తన కోసమే నేను ఇక్కడికి వచ్చానని రాకీ అంటాడు. బావా, నువ్వు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నావ్.. అదంతా వదిలేయ్. అమ్మకి తెలిస్తే ఊరుకోదని అతను అంటాడు. అత్త ఉండగా అత్తకి తెలియకుండా నేను సిగరెట్ కాల్చాను.. ఇప్పుడు ఇదొక లెక్కా అని రాకీ అంటాడు. మరోవైపు మనీష్ ని భవిత తన గదిలోకి తీసుకెళ్లి.. బావా, నువ్వు ఈ రూమ్ లో ఉండు.. నేను కృష్ణ రూమ్ లో ఉంటానని చెప్తుంది.
ఆ తర్వాత అంజలి మామిడి తోరణాలు కడుతుంటే, రాకీ వెనకాల నుంచి వచ్చి తన చున్నీ పట్టుకుంటాడు. ఒక్కసారిగా రాకీని చూసి అంజలి భయపడుతుంది. ఏం చేస్తున్నావని అంజలి అడుగుతుంది. నేను నిన్ను మిస్ అయ్యాను అంజలి.. నీకు బాగా అలవాటు అయిపోయాను. అంటే నువ్వు చేసే వంటకి. నువ్వు కావాలి అంజలి.. నిన్ను ప్రేమిస్తున్నాను. నీ సమాధానం రేపు చెప్పు అని రాకీ చెప్పేసి వెళ్ళిపోతాడు. అమ్మో, రాకేష్ తో జాగ్రత్తగా ఉండాలని అంజలి అనుకుంటుంది. ఆ తర్వాత భవిత, కృష్ణ, ప్రీతి ముగ్గురు హాఫ్ సారీ వేసుకొని రెడీ అవుతారు. బావా, మమ్మల్ని ఫోటో దింపమని భవిత అంటుంది. అంజలిని ప్రీతి చూసి మాట్లాడుతుంటే.. ఫోటోస్ దిగుదామంటూ భవిత లాక్కొని వెళ్తుంది. అంజలి, నువ్వు కూడా వాళ్ళలా హాఫ్ సారీ వేసుకొని రా అని మనీష్ చెప్తాడు.
ఆ తర్వాత గీత వరలక్ష్మీ వ్రతం చేస్తుంది. అమ్మమ్మ, నేను అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి, నువ్వే ఏదో ఒకటి చెయ్ అమ్మమ్మ అని రత్నంకి అంజలి చెప్తుంది. ఆ తర్వాత లలితా సహస్రనామం పాడమని చెప్తే అందరూ రాదని అంటారు. మనీష్ చాటు నుండి అంజలి పాడుతుంది. ఎవరు పాడుతున్నారని అందరు అనుకుంటారు.
తరువాయి భాగంలో పని మనుషులందరికి గీత బట్టలు పెడుతుంది. అంజలి కూడా లైన్ లో నిల్చుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Ye Devi Varamo Neevu, Ye Devi Varamo Neevu Today Episode, Ye Devi Varamo Neevu Serial Episode 50, Star Maa Serial, Star Maa Ye Devi Varamo Neevu, Telugu Serial News]


