Home

»

Tv News

Brahmamudi : బిగ్ సీక్రెట్ బయటపెట్టిన రాజు .. లక్కీ తల్లి రేఖ అని తెలిసి ఫ్యామిలీ షాక్!

Aug 30, 2026 11:08AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1124 లో...ఐశ్వర్య మళ్ళీ ఇంట్లో గొడవ మొదలుపెట్టింది. రాజు, ఇందుది దొంగ పెళ్లి అని ఫోన్ వచ్చిందని అబద్ధం చెప్పి అక్షింతలు వేయకుండా పారిపోయాడని అందరి ముందు అరుస్తుంది. అపర్ణ వాడిని వెనకేసుకొచ్చినా శేషు, భ్రమరం మాత్రం ఐశ్వర్య మాటల్లో నిజం ఉందేమోనని డౌట్ పడతారు. ఈరోజు ఎలాగైనా నిజం తేల్చాలని రేఖ కూడా గట్టిగా అంటుంది.

అటు రాజు మాత్రం హాస్పిటల్ లో ఉన్నాడు. సిరి చేయి కదిపిందని.. కళ్ళు తెరిచి మూసిందని నర్స్ చెప్పగానే బాగా ఎమోషనల్ అయిపోతాడు. డాక్టర్ వచ్చి ఇది మంచి సైన్ అని ఇలాగే ట్రీట్మెంట్ చేస్తే తొందరలోనే కోలుకుంటుందని చెప్తాడు. సిరిని చూడాలని రాజు ఆరాటపడితే డాక్టర్ వద్దని ఆమెకు ఒత్తిడి పెరగకూడదని బయటకు పంపిస్తాడు. ఇంటికి రాగానే అందరు రాజు కోసమే వెయిట్ చేస్తుంటారు. ఐశ్వర్య నిలదీస్తుంది‌. అక్షింతలు వేయకుండా ఎక్కడికి వెళ్లావ్.. హాస్పిటల్ కా పోలీస్ స్టేషన్ కా అని రేఖ అంటుంది. నువ్వు డబ్బు కోసం ఇందుని కిడ్నాప్ చేసిన దొంగవి అని రెచ్చగొడుతుంది రేఖ. దాంతో కోపం ఆపుకోలేక పసికందుని విసిరేసిన నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని రాజు అంటాడు.

ఆ మాటతో ఇల్లంతా షాక్ అవుతుంది. రాజు చొక్కా పడతాడు మదన్. లక్కీ అడ్డు వచ్చి మదన్ ని కొడతాడు. అప్పుడే మామా నువ్వు చెప్పు ఈ రేఖ మేడమే మా అమ్మనా అని అడుగుతాడు లక్కీ. భ్రమరం లక్కీని కొట్టి నువ్వు నష్టజాతకుడివి అందుకే నీ అమ్మ నిన్ను వదిలేసింది అంటుంది. వెంటనే రాజు.. వదిలేసింది ఎవరో కాదు మన రేఖ పిన్నినే అని. దాంతో ఏం చేయాలో తెలియక రేఖ కంగారు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Brahmamudi serial, Brahmamudi today episode, Brahmamudi serial latest episode, Brahmamudi Telugu serial, Star Maa Brahmamudi]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com