Godhavari :సింహాద్రిని అరెస్ట్ చేయించిన జానూ.. షాక్ లో నిత్య ఫ్యామిలీ!
Aug 30, 2026 10:16AM
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-98 లో....జాను కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అక్కడికి కొత్తగా ఇన్స్పెక్టర్ అశ్విని వస్తుంది. తనకి స్టేషన్ లో అందరు వెల్ కమ్ చెప్తారు. జానూని చూసి అశ్విని ఎవరు అని కానిస్టేబుల్ ని అడుగుతుంది. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది.. మీరు అవన్నీ పట్టించుకోకండి అని కానిస్టేబుల్ అంటుంటే వాళ్లపై అశ్విని కోప్పడుతుంది. జానూని పిలిచి మాట్లాడుతుంది. కంప్లైంట్ గురించి చెప్పమని అంటుంది. దాంతో జాను జరిగింది మొత్తం చెప్తుంది. మా నాన్నని సింహాద్రి మోసం చేశాడు.. అవన్నీ తట్టుకోలేక మా నాన్న చనిపోయాడని జాను చెప్తుంది. సింహాద్రికి శంకర్ పంపించిన డబ్బుకి సంబంధించిన స్టేట్ మెంట్స్ అన్నీ ఇస్తుంది.
పదా జానూ వెళ్లి ఆ సింహాద్రిని అరెస్ట్ చేద్దామని అశ్విని అనగానే మేడం ఆ సింహాద్రి జోలికి పోవద్దు అని కానిస్టేబుల్ అంటాడు. ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరమని అశ్విని అంటుంది. మరోవైపు నిత్య, సూర్య పెళ్లికి ముందు తంతు జరుగుతుంది. అప్పుడే శారద, మురళి, నందు వస్తారు. వీళ్లెందుకు వస్తున్నారని భువన అంటుంది. వచ్చి భోజనం చేయండి.. జాను ఎక్కడ అని సింహాద్రి అడుగుతాడు. అప్పుడే జానూ పోలీసులను తీసుకొని ఎంట్రీ ఇస్తుంది. సింహాద్రి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని అశ్విని అంటుంది. నేను పెళ్లి ఆపడానికి రాలేదు.. మా నాన్న చావుకి కారణమైన సింహాద్రిని అరెస్ట్ చేయించడానికి వచ్చానని జాను అంటుంది.
ఇప్పుడు నేను కారణం అని సాక్ష్యం ఉందా అని సింహాద్రి అడుగుతాడు. అప్పుడే సింహాద్రి అసిస్టెంట్ ని జాను పిలిచి సాక్ష్యం చెప్పిస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. అతను సాక్ష్యం చెప్తాడు.నాన్న నువ్వు అరెస్ట్ అయితే నేను పెళ్లి చేసుకోను.. నీకు వాళ్లు ఇచ్చాను అంటున్న నలభై లక్షలు ఇచ్చేయ్ అని నిత్య అంటుంది. ఆ తర్వాత జానూని నందు, శారద పక్కకి తీసుకెళ్లి మన డబ్బు మనకి ఇస్తానని అంటున్నారు కదా.. ఇక చాలు అరెస్ట్ వద్దు అని శారద అంటుంది. నాన్న చావుకి న్యాయం జరగాలి అమ్మా అని జాను అంటుంది. తరువాయి భాగంలో శారద వాళ్లకి సింహాద్రి అసిస్టెంట్ ఫోన్ చేసి మీరు ఊళ్లో నుంచి వెళ్లిపోండి.. ఆ సింహాద్రి వదిలిపెట్టడు అని చెప్తాడు. మరోవైపు త్వరగా పెళ్లి జరిపించండి అని పంతులుకి సింహాద్రి చెప్తాడు. మరోవైపు జాను వాళ్లు ఊరి నుంచి వెళ్లడానికి సిద్ధం అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Godhavari Serial, Godhavari Today Episode, Godhavari Episode 98, Star Maa Godhavari, Godhavari Serial Latest Update, Godhavari Telugu Serial, Janu vs Simhadri, Inspector Ashwini Entry, Nithya Surya Marriage]


