.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 67 లో మనీష్, రత్నం ప్లాన్ ఫలిస్తుంది. రోహిత్ తనే స్వయంగా అంజలి దగ్గరికి వచ్చి.. అక్క రాఖీ కట్టు అని అంటాడు. దీంతో అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి తమ్ముడు నువ్వే కట్టమని అంటున్నావా అని అంజలి రాఖీ కడుతుంటే అప్పుడే గీత అటువైపు వస్తుంది. అది చూసిన మనీష్ వెంటనే గీతను మాటల్లో పెట్టి డైవర్ట్ చేస్తాడు. అంజలి రాఖీ కట్టడం పూర్తి చేస్తుంది. అక్క నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు.. ఒక యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయని రోహిత్ అంటే నువ్వు యాభై ఇస్తే అది నాకు యాభై కోట్లతో సమానమని అంజలి ఎమోషనల్ గా అంటుంది.
ఆ తర్వాత దీనికి కారణం మనీష్ బావే అనుకుని అంజలి థాంక్స్ చెప్పడానికి అతని దగ్గరికి వెళ్తుంది. కానీ అంజలి రావడం చూసి కావాలని మనీష్ ఫోన్ మాట్లాడుతున్నట్లు యాక్టింగ్ చేస్తాడు. అప్పుడే అతనికి నిజంగానే ఫోన్ రావడంతో అడ్డంగా దొరికిపోతాడు. నువ్వు చేసిన హెల్ప్ కి చాలా థాంక్స్ అని అంజలి అంటుంటే తనకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మనీష్ ఆటపట్టిస్తాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న భవిత ఇదంతా చూసి.. రీనా చెప్పింది నిజమే..ఇది బావని లాగేసుకుని పోయేలా ఉందని మనసులో అనుకుంటుంది.
మరోవైపు కృష్ణజకు ఉష ఫోన్ లో.. మీరు నిన్న లైవ్ పెట్టారు కదా..అందులో మాకు తెలిసిన ఆవిడ ఉంది. తన గురించి నా కూతురు రేవతి మాట్లాడుతుందని అంటుంది. అప్పుడు రేవతి ఫోన్ తీసుకుని.. మా అంజలి అక్క మీ ఇంట్లో ఉందా అని అడుగుతుంది. ఉందని కృష్ణజ చెప్పగానే.. ప్లీజ్ ఒకసారి అడ్రస్ చెప్పవా అని అడుగుతుంది. కృష్ణజ అడ్రస్ చెప్పబోతుండగానే గీత వచ్చి ఫోన్ లాక్కుని..ఎవరికి పడితే వాళ్లకి అడ్రస్ చెప్తావా అని కోప్పడుతుంది. ఆ తర్వాత గీత ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది.
దీంతో జరిగింది మొత్తం రేవతి చెప్తుంది. మేం ఆశ్రమంలో ఉండేవాళ్లం.. ఇలా విడిపోయాం.. మా అంజలి అక్క తన వాళ్లని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉందని తెలిసిందని రేవతి చెప్పగానే గీత ఫోన్ కట్ చేస్తుంది. తన వాళ్లని వెతుక్కుంటూ అంజలి రావడం ఏంటి, వాళ్ల గురించి నాన్నకి తెలుసని వచ్చిందా అని గీతకు డౌట్ వస్తుంది. తరువాయి భాగంలో.. నీ వాళ్ల గురించి ఇప్పుడు నాకు తెలియాలని అంజలిని గీత నిలదీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Ye Devi Varamoo Neevu, Ye Devi Varamoo Neevu Episode 67, Star Maa Serial, Anjali, Rohith, Manish, Rathnam, Geetha, Revathi, Krishnaja]




.webp)

